మత్స్య మహా పురాణము
కుండ మండప వేదుల లక్షణము
ఋషులు సూతునితో ఇట్లనిరి. సూతా! ఈ దేవతల ఉత్తమమగు ప్రతిష్ఠావిధిని కుండ మండప వేదుల ప్రమాణములను ఏమియు వదలక యథాక్రమమునను యథాన్యాయముగను అనగా శాస్త్ర సంప్రదాయానుసారముగను యుక్తియుక్తముగను తెలుపుము అన సూతుడు వారికి ఇట్లు చెప్పెను. మీరు అవి తెలిసికొన జిజ్ఞాసువులయియున్నారు కావున ఉత్తమమగు ప్రతిష్టా విధానమును కుండ మండప వేదికల లక్షణమును కూడా యథా శాస్త్ర విధానానుసారముగ తెలిపెదను.