పరాశర వంశము

గౌరపరాశరులు: కాండర్షభుడు వాహనపుడు, జైహ్మ్యాపుడు భౌమతాపనుడు గోపాలి- ఐదుగురు; నీలపరాశరులు: ప్రపోహయులు, వాహ్యమయులు, ఖ్యాతేయులు, కౌతుజాతులు, హర్వశ్వి-ఐదుగురు; కృష్ణపరాశరులు: కార్షాయణులు, కపిముఖులు, కాకేయస్థులు, జపాతులు, పుష్కరుడు-ఐదుగురు; శ్రా(అ)విష్ఠాయనులు వాతేయులు స్వాయష్టులు ఉపయులు ఇషీకహస్తులు- వీరైదుగురు శ్వేతపరాశరులు; పాటికుడు వాదరిస్తంభులు, క్రోధనాయనులు, క్షామి-ఈ ఐదుగురును శ్యామ పరాశరులు; స్వల్పాయనులు, వార్షాయణులు, తైతేయులు, యూథపులు, తంతి - ఈ ఐదుగురును ధూమ్ర పరాశరులు; అన్ని వర్గముల పరాశరులకును పరాశరుడ శక్తి వసిష్ఠుడు ప్రవర ఋషులు; ఈ గోత్రములు వారెవ్వరును పరస్పరము వివాహ సంబంధములు చేసికొనరాదు. సూర్య సమప్రభావులగు ఈ పరాశర గోత్రఋషుల నామస్మరణము చేసినంత మాత్రముననే నరుడు పాపముక్తుడగును.