మత్స్య మహా పురాణము
కశ్యపగోత్ర ప్రవరాను కీర్తనము
మత్స్య జనార్దనుడు వైవస్వత మనువునకిట్లు చెప్పెను. మరీచి ప్రజాపతి (ఋషి) పుత్రుడగు కశ్యపుని సంతతివారగు గోత్ర ప్రవర్తక ఋషులను పేర్కొందును, వీరిలో
మొదటి వర్గమువారు: ఆశ్రయణులు, మేఘలు, కిరీటకాయనులు, ఉదగ్రజులు, మాఠరులు (వినయమే తమ లక్షణముగా గల) భోజులు, శాలాహలేయులు, కౌరిష్టులు, కన్యకులు, అసురాయణులు (మందాకిని యందలి) మృగయులు, శ్రుతయులు, భీరు (భౌత) పాయనులు, దేవయానులు, గోమయానులు, ఛాయాభయులు, కాత్యాయనులు, శాక్రాయణులు, బర్హిర్యోగులు, గదాయనులు, భవనంది మహాచక్రి, దాక్షపాయనులు, యోధయానులు, కార్తివులు, హస్తిదానులు, వాత్స్యాయనులు, నికృతిజులు, ఆశ్వలాయనులు, ప్రాగాయణులు, పౌలమావి, అశ్వవాతాయని, కౌబేరకులు, శ్యాకారులు, అగ్ని శర్మాయనులు, మేషపులు, కైకరసపులు, తులభ్రువులు, ప్రాచేయులు, జ్ఞాన సంజ్ఞేయులు ఆగ్నులు, ప్రాసేవ్యులు, శ్యామోదరులు, వైవశపులు, ఉద్భలాయణులు, కాష్ఠులు, హారిణులు, మారీచులు, అజిహాయనులు, అగ్నులు, ప్రాసేవ్యులు, శ్యామోదరులు, వైవశపులు, ఉద్భలాయణులు, కాష్ఠులు, హారిణులు, మారీచులు, అజిహాయనులు, ఈ ఋషుల వర్గముల (గోత్రముల వారల)కు వత్సా(త్స)రుడు కశ్యపుడు, నిధ్రువుడు అనువారు ప్రవరఋషులు: ఈ గోత్రములవారు పరస్పరము వివాహ సంబంధములు చేసికొనరాదు.