మత్స్య మహా పురాణము
పతితసంసర్గ ప్రాయశ్చిత్తము
పతితులతో కూడిన దోషమునకు ప్రాయశ్చిత్తము తెలిపెదను వినుము. అనగా పతితునిచే యజ్ఞమో అధ్యయనమో చేయించుట వానితో వివాహ సంబంధాదికము చేయుట కలిసి ప్రయా ణించుట చేసినవాడు తానును పతితుడగును. ఏదోషముచే పతితుడగు వానితో వీనికి సంసర్గము కలిగెనో ఆ దోషమునకు ఆచవలసిన ప్రాయశ్చిత్తము ఈడుతడు ఆచరించిన పాప పరిహారమగును.