మత్స్య మహా పురాణము
విరక్త - రక్త - లక్షణము
రాజుకూడ తన క్షేమమును కోరుకొనినచో తన భృత్యులలో తన యందు రక్తుడెవడో విరక్తుడెవడో గురుతించి విరక్తుని విడువవలెను; రక్తునిచేతనే సేవావర్తనము చేయించవలెను, విరక్తుడగు భృత్యుడు తన ప్రభువునకు నాశమును శత్రుపక్షమునకు అభ్యుదయమును కలిగించును; ఆశను పెంచును; ఫలనాశము కలిగించును.