మత్స్య మహా పురాణము
వినాయక మూర్తి లక్షణము
వినాయకుడు గజముఖుడు, త్రిలోచనుడు, లంబోదరుడు, చతుర్భుజుడు, సర్పయజ్ఞోప వీతధారి; చేటలవంటి చెవులు, పెద్దతుండము, ఏకదంతము, పెద్దకడుపు కలవాడు; ఒక కుడిచేతియందు తన దంతమును, రెండవ చేతియందు కలువపూవును ధరించును. ఒక ఎడమ చేతియందు లడ్డులు (ఉండ్రాలు) రెండవదానియందు గండ్రగొడ్డలిని ధరించును; శరీరము చాల పెద్దది యగుటచే ముఖము చిన్నదిగా కనబడును; బలిసిన భుజమూలములు పాదములు చేతులు కలవాడు; శుద్ధి, బుద్ధిఅను భార్యలతో కూడినవాడు; క్రింది భాగమున ఎలుకయుండును.