మత్స్య మహా పురాణము
దేవతార్చా వికారోపశాంతి
గన్గుడు అత్రితో ఇట్లు చెప్పెను, దేవాలయములందలి అర్చామూర్తులు (దేవతా విగ్రహ ములు) విశేషముగా నృత్యము చేయును; వణుకును, ప్రజ్వలించును; గట్టిగా అరచును, ఏడు చును; చెమర్చును; నవ్వును, లేచును; దుఃఖించును, పరుగెత్తును, ఊదును; విరుగును, కదలును, ఆయుధముతో కొట్టును; తలలు వంచుకొని నిలుచును; ఒక చోటినుండి మరియొక చోటికి కదలును, అగ్నిని, పొగను నూనెను (జిడ్డును), రక్తమును, వమను క్రక్కును, ఈ విధములగు వికారములు దేవాలయములందో బ్రాహ్మణుల ఇండ్లయందో కనబడును; అట్టి చోటులందు.. నివాసము విడువవలయును, వీనిచే రాజునకయినను వ్యసనము (ఆపద) కలుగును - దేశమునకైన నాశము కలుగును, ఇట్టి ఉత్పాతములు దేవతల జాతరలందు కనబడుచో దేశము నకు భయము కలుగును; ఆ భయములు హర్మ్యములందు బ్రహ్మవలనను, పశువులకు రుద్రుని వలనను, నృపులకు దేవసేవకుల వలనను కృప స్త్రీలకు దేవతా స్త్రీల వలనను, అపదలు ఈ ఉత్పాతముల ఫలముగా కలుగును, గ్రహాదులయందు కలుగు ఉత్పాత దర్శనములు వాసుదేవుని వలన కలుగును; దేవతార్చా మూర్తులందు ఈ వికారములు కనబడి నపుడు వేదవేత్తయగు పురోహితుడు అమూర్తిని స్నానమాడించి వస్త్ర గంధ భూషణాదులతో కప్పివేయవలెను; అలంకరించవలెను; గంధమాల్య అన్నాది సంపదలతో అర్చన చేయవలెను. తరువాత మధుపర్క ముతో (తేనెతో కలిపిన గోక్షీరముతో) మూర్తిని సేవించవలెను; ఆ దేవతా సంబంధి మంత్రములతో యధావిధిగ స్థాలీపాకము జరిపి ఆ చరువుతో ఎదహోరాత్రములు హెచ్చరికతో హోమము చేయవలెను. ఈ ఏడు దినములును విప్రులును తేనె అన్నపానములు దక్షిణలూ - వీనితో పూజించ వలెను; ఎనిమి దవ దినమున విప్లలకు గోధదానములు జరుపవలయును; దీనిచే ఉుద్రవ ములు శాంతించును.