మత్స్య మహా పురాణము
కుబేర ఈశాన ప్రతిమా లక్షణము
కుబేరుడు హారకేయూర కుండలాలంకృతుడు. చిత్రాంబరధరుడు. శుభరూపుడు. గదా హస్తుడు. వరదుడు కిరీటధారి; నరులను పూన్చిన విమానమందుకాని మేషముపైకాని ఉన్నట్లు నిర్మించవలయును. ఇతడు గుహ్యక పరివృతుడు; పీనవర్ణుడు; మహోదరుడు మహాకాయుడు అష్టనిధులతో కూడినవాడు, ధనములతో వ్యగ్రహస్తులగు గుహ్యకు అనేకులు ఇతనిని కొలుచు చుందురు. ఈశానుడు తెల్లనివాడు తెల్లనికన్నులవాడు, త్రిశూలపాణి త్రిలోచనుడు వృషభ వాహనుడు.