మత్స్య మహా పురాణము
నక్షత్ర గణనము
ఇట్లే గృహపు పొడవు, వెడల్పులను పరస్పరము గుణించగా వచ్చిన చదరపు హస్తముల సంఖ్యను ఎనిమిదిచే గుణించి ఇరువది ఏడింటిచే భాగించగా (పొ€ X వె X E) / 27 వచ్చు శేషమును నక్షత్ర మందురు; ఈ నక్షత్ర సంఖ్యను ఎనిమిదిచే భాగించగా వచ్చు శేషమును వ్యయమందురు, ఇట్లు గణన చేయగా వచ్చిన ఆయవ్యయములలో ఆయ మధికమగుట గృహస్వామికి శుభమును ఇచ్చును; అని భగవానుడగు హరి చెప్పెను. ద్విజవర్యులను ముందుంచుకొని పూర్ణకుంభమును దధి అక్షతలు మామిడి చివుళ్ళు పుష్పములు ఫలములు తీసికొని శోభాయమానముగా బయలుదేరిపోయి విప్రులకు హిరణ్య వస్త్రాదికమునిచ్చి మాంగల్యమును, శాంతియు కలుగవలెనను తలపుతో గృహస్వామి నూతన గృహమున ప్రవేశించ వలయును.
గృహ్యోక్త కల్ప విధానానుసారముగ గృహవాస్తు శాంతి విధానమున హోమమును బలి కార్యమును నిర్వర్తించ వలయును; బ్రాహ్మణ శ్రేష్ఠులను భక్ష్యభోజ్యములతో తృప్తినందించ వలయును; శుక్ల వస్త్రములతో గృహమున ప్రవేశించవలయును.