త్రివిక్రమ ప్రతిమా లక్షణము

త్రివిక్రమమూర్తి బ్రహ్మాండములను ఆక్రమించుచు తీవ్ర రూపముతో నుండును; అతడు తన ఎత్తిన పాదమును ఒకబాహువుతో పట్టుకొనియుండును; అందే క్రింది భాగమందు ఎడమ చేత కమండలువు ధరించిన వామనుని నిర్మించ వలయును; అతనిచేత చిన్న గొడుగుండును; అతడు దీన ముఖుడు; అతని పార్శ్వమందు జలభృంగారము ధరించి బలి యుండును; ఈ దేవుడు ఆ బలిని బంధించుచుండును; అతని దగ్గరనే గరుడుడుండును.