మత్స్య మహా పురాణము
బ్రహ్మ ప్రతిమా లక్షణము
బ్రహ్మ కమండలధరుడు, చతుర్ముఖుడు, హంసారూఢుడు లేదా కమలాసనుడు; తామరపూవు లోపలి కాంతితో ఉండు దేహచ్ఛాయ, చతుర్భాహుడు, ఒప్పిదమగు కన్నులవాడు, ఎడమ చేతియందు కమండలువు; కుడి చేతియందు స్రువముండును; మరియొక ఎడమచేత దండమును మరియొక కుడి చేతియందు స్రుక్కు ఉండును, అన్ని వైపుల నిలిచి దేవతలు గంధర్వులు మునులు ఆయనను స్తుతించుచుందురు. శుక్లవస్త్రధరుడు; విభుడు; మృగచర్మధారియైన కావచ్చును; దివ్యయజ్ఞోపవీతి; దగ్గర ఆజ్యస్థాలి - నాల్గు వేదములు ఉండును, ఎడమవైపు నందు సావిత్రి కుడివైపున సరస్వతి యుందురు. ముందు ఋషులుందురు.