యమ ప్రతిమా లక్షణము

విభుడగు యముడు దండపాశధరుడు; మహా మహిషాసురుడు; నల్లని కాటుక రాశివన్నె వంటి వన్నెవాడు; సింహాసన మందు ఉండును; జ్వలించు అగ్నివంటి కన్నులు కలవాడు; అతనికి అన్ని వైపులను మహిషము, చిత్రగుప్తుడు, భయంకరులగు కింకరులు, సౌమ్యమూర్తులగు రాక్షసులు ఉందురు.