వధ దోష ప్రాయశ్చిత్తము

బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులలో నెవ్వరేకాని అకార్యము (చేయరాని పను) లాచరించినచో ఏమియు ఎక్కువ తక్కువలు పాటింపక వారిచే రాజు ప్రాయశ్చిత్తము లాచరింపజేయవలెను; మోసగించి స్త్రీహత్య చేసినవాడు, శూద్ర హత్యావ్రత మాచరించవలెను; సర్పాది ప్రాణులను తాను చంపజాలక ధనము మొదలగునవి ఇచ్చి చంపించిన ద్విజుడు ఒక్కొక్కటిగా కృచ్ఛ వ్రత ములను ఆచరించి పాపము పోగొట్టుకొనవలయును, పండ్లు ఇచ్చు చెట్లను, పూచు పొదలను, వల్లులను లతలను నరకించినచో నూరు ఋక్కులను జపించవలెను; ఎముకలుగల ప్రాణులను వందలకొలదిగ చంపి నను లేదా చంపించినను బండ్ల కొలదిగ ఆప్రాణుల చర్మాస్థి మాంసాది కమును నింపించి తోలించినను ద్విజుడు శూద్ర హత్యావ్రత మాచరించవలెను. విప్రులకు దానముకూడ చేయవలెను. అస్థిరహిత ప్రాణులను చంపినను లేదా చంపించిన నచో ప్రాణా యామములతోనే శుద్ధియగును, అన్నముల యందును రస ద్రవ్యము లందును ఫల పుష్పము లందును ఉత్పన్నములగు ప్రాణులను చంపి(ంచి)నచో ఘృతప్రాశనముచే శుద్ధుడగును, వన మందు స్వయముగ ఉత్పన్నములగు, దున్ని పండించిన, ఓషధులను అహేతుకముగ నరకినచో ఒక దినము పయోవ్రత మాచరించవలెను; హింసా సముద్భవ పాపము ఈ విధముగ వ్రతము లతో పోగొట్టుకొనవలయును.