మత్స్య మహా పురాణము
ప్రాసాద పతనాది దుర్నిమిత్త శాంతి
గద్గురు అగ్రితో ఇట్లు చెప్పెను, మేదలును పురద్వారములును బురుజులును ద్వారములును -ప్రాకారములును మహాగృహములును గట్టిగ ఉన్నవియు, ఆకస్మికముగ పడుట రాజమృత్యు సూచకములు; దిక్యులు ధూళులతో, పొగలతో అకారణముగ వ్యాప్తమయినను ఆదిత్యచంద్ర తారలు వివర్ణములయినను రాష్ట్ర భయమును సూచించును. రాక్షసులు కనబడుట బ్రాహ్మణులు తమ ధర్మము తప్పుట, ఋతు ధర్మములు వ్యత్యాసమందుట, జనులు అపూజ్యులను పూజించుట, నక్షత్రములు ఎడమెడముగా కనబడుట మహాభయ సూచకములు, ధూమకేతువులు కనబడుట, చంద్ర సూర్య గ్రహణములు తరచుగుట, చంద్ర సూర్య మండలములు రంధ్రముతో కనబడుట, గ్రహనక్షత్ర వైకృతము స్త్రీలు అకారణముగ అధికముగ కలహించుట బాలురు బాలురతో కలహించుచు కొట్టుచుండుట, ఉచితక్రియలు జరుగక విచ్ఛిన్నములగుట, శాంత్యాది కర్మము లందు హోమము చేయుచుండగా అగ్నిజ్వలించకపోవుట, చీమలును మాంసాహారి మృగ వక్ష్యాదులను ఉత్తరముగా పోవుచుండుట, నిండు కడవలు ఆకారణముగా కారుట, హవిస్సు లుప్త మగుట, అన్ని వైపుల నుండియు శుభవాక్కులు వినబదకుండుట, జనులలో జలుబు బాధ ఎక్కువగుట, అకారణముగ నవ్వులు అరపులు అధికమగుట, దేవబ్రాహ్మణులను సరిగా ఆదరిం చక పోవుట, వాద్యములను మ్రోగించగా అవి సరిగా మ్రోగక పోవుట, జనులు గురువులను, మిత్రులను ద్వేషించుట, శత్రువులను పూజించుట, బ్రాహ్మణులను సుహృదులను మాన్యులను అవమానించుట, శాంతికృత్య మంగళకృత్య హోమ కృత్యముల విషయమున నాస్తికతా భావము. ప్రబలులు ఇట్టివి రాజమరణమును దేశనాశమును రాజునకు నాశమును సూచించును. మృత్యువు దాపురించినచో రాజును బ్రాహ్మణులను ద్వేషించును, బ్రాహ్మణులకు తాను ద్వేష్యుదగును, వారి ధనములు హరించును, వారిని చంపగోరును, పనులు పడినప్పుడును వారిని తలచుకొనడు. వారు యాచించినచో కోపించును. వారిని నిద్రించుతో సంతోషించును. ప్రశంసించినచో మెచ్చడు. - నొచ్చుకొనును; జనులపై క్రొత్త క్రొత్త పద్యలు వేయును, ఇట్టి సందర్భములలో బ్రాహ్మణ దంపతుల అర్చించవలెను; బ్రాహ్మలు సంతర్పణములును దేవతా బలులును జరుపవలయును. సజ్జనులను విప్రులను పూజించవలయును - వారికి దానమీయవలెను బ్రాహ్మణులకు గోమన రత్నగ్యహ దానములు చేయవలయును హోమములును దేవతా పూజలును జరుపవలయును. దీనిదే దోషశాంతి యగును.