మత్స్య మహా పురాణము
మహా వరాహ ప్రతిమా లక్షణము
మహా వరాహమూర్తిని వివరింతును. ఇతడు పద్మహస్తుడు గదాధరుడు; తీక్ష్ణములగు కోరలును, ఉగ్రమగు ముట్టెయు ముఖమును కలిగి, ఎడమమోచేయి భూదేవిపై నుంచును; ఆమెను తన కొనకోరతో పైకెత్తుచుండును; ఆమె జితేంద్రియయై చేతులందు కలువలు కలిగి విస్మయములో కన్నులు వికసించి పైభాగమందు ఉండునట్లు నిర్మించవలెను, ఆమె కుడిచేయి తనకటిపై నుండును; అతనిని చుట్టునున్న లోకపాలురు స్తుతించుచుందురు.