మత్స్య మహా పురాణము
రాజధర్మము-వృక్షోత్పాత శాంతి
ఏ పట్టణముల యందు వృక్షములు దేవప్రేరణచే ఏర్పును నవ్వుచు కనబడునో, మాటి మాటికి రసమును విడుచునో, రోగమును గాలియు లేకయే కొమ్మలు పడునో, పండ్లు పండునో, కొమ్మల నడుమనే పూయునో, కాయునో, పాలను నూనెను, నుధ్యమును రక్తమును కార్చునో, రోగములు లేకయే ఎండునో, ఎండినవి మరల చిగుర్చునో, మొలకెత్తునో, పడినవి లేచినవి. పడునో అచట కలుగు పరిణామమును ఫలమును తెలిపెద వినుము. చెట్టు ఏడ్చుటచే వ్యాధులు ప్రజలును, నవ్వినచో దేశమున కలవరములు కలుగును, కొమ్మలు పడుటచే యోధులు పడెదరు; చిన్న వయసు చెట్లు పూచినచో బాలురు మరణింతురు, కొమ్మల నడుమ పూయుటచే రాష్ట్రమున జనులలో కలహములు చీలికలు కలుగును, పాలుకాని నూనె కాని కార్చినచో కరవు లేర్పడును, మద్యము కార్చినచో వాహనముల నాశము, రక్తము కార్చినచో యుద్ధము సంభవించును, తేనెకార్చినచో వ్యాధులు, నీరు కార్చినచో అనావృష్టి కలుగును రోగములు లేకయే చెల్లిందినచో దుర్భిక్షమును, ఎండినవి చిగిర్చినచో అన్నమును, వీర్యమును తగ్గుటయు జరుగును. పడినవి. లేచినచో రాష్ట్రపు చీలికలతో భయ మేర్చదును ఉన్నచోటినుండి కదలిపోయినచో చేశ భంగమగును. వృక్షములు మండినను ఏడ్చినను ధనక్షయమగును. ఇట్టి వృక్షములను శత్రువులు, పూజించినచో ఈ వృక్షము లున్న రాజ్యపు రాజునకు సర్వస్వనాశమగును. పుష్ప ఫలములందు వైకృతము అనగా అస్వాభావిక లక్షణములు కల్గినచో రాజు మరణించును. ఇట్టివే మరేవయిన - వృక్షోర్వాతములు సంభవించినను ఎచ్చరికతో గమనించి అవృక్షమును మరుగు పరచి గంధం మాల్యములతో అలంకరించవలయును, పాపశాంతికై చెట్టుపై గొడుగు నిలుపవలెను; శివనకు పశువును అర్చించవలెను, 'రుద్రేభ్య" అనుచు ఆరు హోమములను జరిపి రుద్ర మంత్రములు. జపించ వలయును. తేనెతో నేతితో కూడిన పాయసముతో విప్రుల పూజించి వారికి బంగారు దాన మీయవలెను; హరుని గీత నృత్యములతో అర్పించవలయును; ఇట్లు పాపనాశ మగును.