మత్స్య మహా పురాణము
రాజధర్మము
ఆకస్మికముగా జరుగు ప్రకృతి విపరీతములు (ప్రాకృతికోపద్రవములు) ఉత్పాతములు; వీనినే అద్భుతములు-ఆశ్చర్యకరములగు అసాధారణ సంఘటనలు - వ్యవహరింతురు. ఇవి 1. భౌమములు-భూమితో సంబంధించినవి; 2. అంతరిక్షములు-అంతరిక్షముతో సంబంధించినవి; 3. దివ్యములు-నక్షత్రగ్రహాది జ్యోతిర్గోళములతో సంబంధించినవి - అని మూడు విధములు కేశవా! దివ్యములు అంతరిక్షములు భౌమములు నను మూడు విధములగు మహో త్పాతములలో నేవి యేవి సంభవించినపుడు ఏ ఏ శాంతులు జరుపవలెనని శాస్త్రము విధించు చున్నదో తెలియ వేడెదననిన మత్స్యుడు మనువుతో ఇట్లనెను. నీకికమీదట వివిధములగు అద్భుతములును ఉత్పాతములును సంభవించినపుడును విశేషించి భౌమాంతరిక్ష దివ్యముల నబడు ఇవి సంభవించినపుడును ఏయే శాంతి విధించబడినదో తెలిపెదను వినుము; పరులను జయించి వారి సంపదల తాను అందగోరువాడును పరులకంటె తానధికుడుగా నుండగోరు వాడును ఇతరులు తన విషయమున తన రాజ్య విషయమున చేసిన అభిచార క్రియలకు పాత్రుడయిన వాదును శత్రువులు నశింపజేయదలచిన వాడును మహాభయములు సంప్రాప్తించినవాడు జరుపవలసిన శాంతికి 'అభయా' శాంతి అనిపేరు; ఇది అంతరిక్షాత్సా తములను శమింప జేయునది.
రాజయక్ష్మ వ్యాధి (క్షయవ్యాధి) చే బాధలు పడువాడును, గాయములతో బాధనందుచు కృశించినవాడును, యజ్ఞముల నాచరింపగోరువాడును, 'సౌమ్యా శాంతిని ఆచరించుట ప్రశస్తము; భూకంపములు, అన్నపుకొరత, అతివృష్టి, అనావృష్టి, మిడుతల భయము, పిచ్చివాండ్రు వలనను, దొంగల వలనను, ఉపద్రవములు కలిగినచో 'వైష్ణవీ' శాంతి చేయవలెను; పశుసర మరణము, భూతదాహము సంభవించినచో 'రౌద్రీ' శాంతి తగును; వేదనాశము నాస్తిక వృద్ధి అపూజ్యులను పూజించుట జరుగునపుడు 'బ్రాహ్మీ' శాంతి ఉచితము, రాజ్యాభిషేక సమయమందును పరచక్ర భయము కలుగునపుడును స్వరాష్ట్రమున కల్లోలము లేర్పడునపుడును శత్రువధార్ధమును 'రౌద్రీ''' శాంతి చేయవలెను; మూడు దినములకు అధిక కాలము రూక్షమును, సర్వప్రాణులకు సహింప రానిదియు అగు గాలి వీచుచున్నపుడును వాత వ్యాధులు చెలరేగినపుడును 'వాయవ్యా' శాంతి చేయవలెను; అనావృష్టి భయ- వృష్టివికార జలాశయ వికారములు కలుగునపుడు 'వారుణి' శాంతి జరుపవలెను; శాపభయము కలుగుచో 'భార్గవీ' శాంతి, ప్రసవములందు విపరీతములు (వికృత శిశుజననము ఒక ప్రాణి కడుపున మరియొక ప్రాణి జననము) సంభవించుచో, 'ప్రాణా 'పత్య శాంతి' ఉపస్కర (పనిముట్ల) వికృతి సంభవించినచో 'స్వ' శాంతి, బాలుర క్షేమమునకై ''కౌమారీ' శాంతి అగ్ని వైకృతము జరిగినపుడును, ఆజ్ఞాభంగములు భృత్య నాదికము జరుగునపుడు 'అగ్నేయీ శాంతి జరుపవలెను.
అశ్వములకు వికృతి ఏర్పడినపుడు అవి శమించుటకై 'గాంధర్వీ' శాంతియు, గణముల యందు వికృతి ఏర్పడినపుడు అది శమించుటకును రాజ్యమును వృద్ధి నందించుకొన కోరినపుడును 'అంగీరసే' శాంతియు, పిశాచాది భయము శాంతించుటకై నైరృతి' శాంతియు, అపమృత్యుభయమును దానిని సూచించు దుస్స్వప్నములును నరకభయమును సంభవించునపుడు'అమ్మా' శాంతియు ధన నాశమునందు 'కాబేరీ' శాంతియు, వృక్షము లందును ధనము నందును, వైకృత మేర్పడినపుడును భూమి నధికముగా కోరినపుడును, 'పార్టీవీ' శాంతియు, పగలు గాని రాత్రియందుకాని మొదటి జామునను హస్త స్వాతీ చిత్రా పునర్వసు అశ్విని, ఉత్తర ఫల్గుని, మృగశిర, నక్షత్రములందును, ఉత్పాతములు సంభవించినచో 'వాయవ్యా శాంతిని దినరాత్రి ద్వితీయ యామమునందును పుష్యమి కృత్తిక, విశాఖ, మఖా, భరణీ నక్షత్రము అందును ఉత్పాతములు సంభవించినచో 'ఆగ్నేయీ' శాంతిని పగటి యందుగాని రాత్రి యందు గా మూడవ జామునను రోహిణి, శ్రవణము, ఉత్తరాభాద్ర, ధనిష్ఠ, జ్యేష్ఠ, అనూరాధ ఈ నక్షత్రము లందును ఉత్పాతములు సంభవించినచో 'ఇంద్రీ' శాంతిని పగటియందుకాని రాత్రి యందుగాని నాల్గవజామునను ఆశ్లేష, రేవతి, ఆర్ద్ర, ఉత్తరాభాద్ర, శతభిషము, మూల ఈ నక్షత్రములందును ఉత్పాతములు సంభవించినచో 'వారుణీ' శాంతిని జరుపవలెను. రవి మంద లపు అంచులందు ఉత్పాత నిమిత్తములు కనబడినచో (అభయా-సౌమ్యా) రెండు శాంతులు జరుపవలయును. నిమిత్తములు కనబడనపుడు మాత్రమే శాంతి జరుపవలయును. కవచములు శిరస్త్రాణములు మొదలగు రక్షణ సాధనములు ధరించిన వీరునకు యుద్ధమున బాణము మొదలగు ఆయుధ)పు డెబ్బలు తగులునట్లే ధర్మాత్ములై ఆవశ్యకములయిన శాంతులు జరుపు కొనుచుండు రాజుల రాజ్యములందు ఉత్పాతాదులు భయములును పీడలును ఉండవు.
దేవా! అద్భుతములు కనబడినచో వాని వలన కలుగు ఫలమును వానికి జరుపవలసిన శాంతిని నాకు బాగుగా తెలియునట్లు లెస్సగా ప్రవచింపుము. ఏలయన-నీవు ఆయా విషయము లను బాగుగ చెప్పగలవారిలో ఉత్తముడవు అనిన మనువునకు మత్స్యరూపుడగు జనార్ధను డిట్లు చెప్పెను; ఈవిషయమున సర్వధర్మ తత్త్వవేత్తలలో ఉత్తముడుగు మహాతపస్వి వృద్ధగరుడు అత్రికి చెప్పిన దానినే నీకు తెలిపెదను, మనురాజా! పూర్వము సరస్వతీనదీ ప్రవాహ (తీర) మున లెప్పుడా కూర్చుందిన మునిజనప్రియుడుగు గడ్డుని, మహాతేజస్వీయగు అత్రి ఇట్లు అడిగాను: సర్వర్ణోత్తముడవగు గర్గా! జనులో నగరములో రాజులో నశించుటకు పూర్వ రూపములు. (నాశము సూచించు నిమిత్తములు) ఏవియో నాకు చెప్పుము, అనగడ్డుడిట్లనెను. జనుల అవచా. రముచే దేవత లాగ్రహింతురు, దానిచే ఉపద్రవములు జరుగును, నిమిత్తములు, దివ్య ములు, అంతరిక్షములు, భౌమములునని మూడు విధములు, గ్రహనక్షత్రముల యందు కనబడు వికృతి. దివ్యము; (ద్యులోక సంబంధి:) ఉల్కలు పడుట దిక్కులు మండునట్లు కనబడుట గంధర్వ నగ రములు (పట్టణములవంటివి మేఘమండలమున కనబడుట) వికృతములగు వానలు ఈ మొదలగునవి అంతరిక్షములు, భూమిపై నుండు చరస్థిర ప్రాణి పదార్థ జాతమందు కనబడు వికారములు భౌమములు, భూకంపములు జలాశయముల వికారము కూడా భౌమమే, భౌమా. ద్భుతములవలన కలుగు ఫల మల్చము, అదియు త్వరగ కలుగదు, ఆభ్రం(అంతరిక్ష) నిమిత్తములు మధ్యమ (కొంచెమెక్కువగా ఫలమిచ్చును; అదియు శాంతులచే శమించును. ఇదికాక దివ్యా ద్భుతములు కనబడిన ఏడు దినములకు లోగా శుభకరమగు (వికృతులులేని) వాన కురిసినచో ఆ అద్భుతము దుష్ఫలితము నీయజాలదు, దివ్యాద్భుతములకు శాంతి జరుపనిదే దాని దుష్పలము శమించదు; దానిచే అది కనబడిన మూడు సంవత్సరములకు లోగా రాజుకో ప్రజలకో పురద్వార మందో రాజ పురోహితునితో రాజపుత్రులతో కోశమునతో వాహనములతో హాని సంభవించును.
ఋతు స్వభావము ననుసరించి కనబదు అద్భుతములు కొన్ని కలవు, అందు శుభము లయినవి తెలిపెదను; వినుము, వసంత ఋతువున పిడుగులు పదుట భూకంపములు సంధ్యల యందలి ఉరుములు, పరివేషములు, ధూళి ధూమ వ్యాప్తి, ఆర్కోదయాస్తమయములు, ఎర్రగ నుందుట చెట్ల నుండి నూనెలు, జిగురులుకారుట, చెట్లు అధికముగ కాయుట, పండ్లు, పందుట -గోపల్లి, మధు (తేనె) వృద్ధి-ఇవి శుభావహములు, గ్రీష్మస్తువున ఉల్కాపాతములు రవి చంద్ర మండలములు కపిల వర్ణములగుట అగ్ని లేక మంటలు-భూమి (బ్రిడ్డలగుట (చీలుట) గాలి, ధూళి, దుమారము, సంధ్యాకాంతులు, తారలు, పూరేకుల కాంతితో కనబడుట, ఆకాశము కల్లోలిత సముద్రమువలె కనబడుట, జలాశయముల యందలి నీరు ఎందుట-ఇవి శుభావహములు; వర్షర్తువునందు ఇంద్రధనుస్సులు, పరివేషములు, మెరపులు, ఉల్కలు, అధికమగుట, కొమ్ములుగల ప్రాణులును, పందులును వణుకుటయు, ఒదలు పొరలించు కొను టయు, ఉత్సాహముతో ధ్వనులు చేయుటయు, భూమి ఉబ్బుట పెల్లలు విరిగిపడుట, నడు లందును, బావులందును, చెలమలందును, చెరువులందును, సరస్సులందును నీరు అధికముగా. కదలి అదుటయు, వస్తువులు నీటిపై తేలియాడుటయు, కొట్టుకొని పోవు చుండుటయు. శుభములు, హేమంతరువునందు చల్లని గాలులు, మంచు అధికమగుట, మృగములు, పక్షులు గట్టిగ ధ్వనిచేయుట, రక్షోభూత పిశాచములు కనబడుట అమానుష వాక్కు వినబడుట దిక్కులును. ఆకాశవన పర్వతములును ధూమాంధకార వ్యాప్తములగుట వన పర్వతములాకాశముతో కలిసినట్లు కనబడుట సూర్యోదయాస్తమయములు ఎక్కువ భేదముతో వ్యత్యాసముతో కనబచుట్ట- ఇవి శుభావహములు; శరదృతువునందు దేవ స్త్రీ, గంధర్వ రూపములును విమానములును. మొదలగు అద్భుతములు ఆకాశమున కనబదుట గ్రహ నక్షత్ర తారలధికముగా కనబదుట అమానుష వాక్కు వినబడుట వనములందును పర్వత సానువు లందును గీతవాదిత్ర ధ్వనులు: వినబడుట, సన్యవృద్ధి రసోత్పత్తి-ఇవి శుభకరములు; శిశిర ఋతువు నందు హిమపాతముతో పెనుగాలులు వికృత రూపములు కనబదుట ఆకాశము కాటుకవలె నల్లనై కనబడుట, వింజర వర్ణముతో ఉల్కలు తారలు రాలుట, మానవ స్త్రీల యందును, గోపులు, మేకలు, అశ్వములు, జింకలు, పక్షులు-వీనియందును విచిత్ర గర్భోత్పత్తి, సత్రాంకుర లతల యందు వింతమార్పులు శుభకరములు; ఇట్టి ఋతు స్వభావమునకు విరుద్ధములగు అద్భుతములు కనబడినచో వెంటనే 'శ్రీఘ్రముగా రాజు దీని అశుభ ఫలమును శమింపజేయు శాంతిని జరిపించవలయును.