మత్స్య మహా పురాణము
యక్షిణీ క్షేత్రపాల ప్రతిమా లక్షణములు
యక్షిణిని సిద్ధులును అసురులును సేవించుచుందురు; ఆమెకు రెండు పార్వ్వము లందును రెండు కలశము లుండును. తోరణమందు దేవదానవులును నాగులును ఉందురు; నాగులకు బొడ్డునకు దిగువను సర్పాకృతియు అంతకు పై భాగమున మానవాకృతియు ఉండును. వారికి రెండేసి నాలుకలు కల ఫణులు ఎన్నో ఉండును. పిశాచులు రాక్షసులు ఇట్టి వారందరును రౌద్రవీకృత రూపులు.
క్షేత్రపాలుడు జటాయుక్తుడు వికృతముఖుడు; దిగంబరుడు; కుక్కలు, నక్కలు అతనిని సేవించుచుండును; శిరః కేశములతో అవృతమగు కపాల మాతని ఎడమ చేతను దక్షిణ హస్త మందు అసుర క్షయకారిణియగు శక్తియు ఉండును.