గ్రహయజ్ఞ విధానము

నృపులు గ్రహయ్యలక్షహోమ, కోటిహోమములు సర్వపాప ప్రణాశనమగునవి ఎట్లు జరుపవలయునో జనార్దనా! సవిస్తరముగ చెప్పుము అన మత్యుడిట్లు చెప్పెను. రాజా! ప్రాసంగి కముగా ఇప్పుడు నీకు, నీవడిగినది తెలిపెదను. ధర్మ ప్రసక్తుడును ప్రజాహితైషియునగు రాజు లక్షహోను సమన్వితమగు గ్రహయజ్ఞము జరుపవలెను.

దానికై నదీసంగమమందో దేవాలయముల ముందో సమప్రదేశమున దైవజ్ఞులను, గురువులను, ద్విజులను తోడుగ తీసికొనిపోయి భూపరీక్ష చేయవలెను. అచట గుంటలు మిట్టలు. లేని హస్తప్రమాణ చతురస్రముగా కుండము త్రవ్వవలెను. ఇది అయుత హోమరూపసాధారణ గ్రహయ్యమునకు; లక్షహోమమున దీనికి ద్విగుణమును కోటి హోమమున చతుర్గుణముగాను ఉండవలయును; సరిసంఖ్యతో అనగా ఎనిమిదిమంది - వేదపారగులగు ఋత్విజుల నియమించి "వలెను, వారాకాలమున కందమూల ఫలదధిక్షీరాహారులై యుండవలయును, వేదిక యందు వివిధ రత్నములను వేయవలెను; దానిపై ఇసుకతో కప్పవలెను; అగ్నిని ప్రజ్వలింపజేసి హోమము జరుపవలెను; గాయత్రీ మంత్రములో పదివేలు 'మానస్తోకే' మంత్రములో ఆరువేలు గ్రహదేవతాక మంత్రములతో ముప్పదివేలు 'విష్ణుదైనత్య' మంత్రములతో నాలుగువేలు కూశ్మాం దములతో ఐదువేలు, కుసుమములతో పదునారు వేలు, బదరీ సమిధలతో పదివేలు, శ్రీ దేవతాక మంత్ర ములతో పదునారువేలు, ఇంద్ర దైవత్య మంత్రములలో ఐదువేలు హవనము చేయవలెను. (10+6+30+4+5+16+10+14+5=100 వేలు) ఇది ఐన తరువాత యజమానుడు హిరణ్య సహిత షోడశ మంగళ కుంభముల జలముతో పవిత్ర స్నానమాచరించ వలెను. ఇట్లు జరిపినచో శాంతియగును.

ఈ విధముగా జరిపినచో గ్రహపీడా సముద్భవములగు ఉపద్రవములు అన్నియు శమిం చును; శాంతి పరిపూర్తికై హోమానంతరము దక్షిణలు ఈయవలెను; ఈయబడునది కావుననే దక్షిణయని వ్యవహారము; కావున సర్వప్రయత్నముతో శక్తివంచన లేక దక్షిణలు ఈయవలెను. ఈయవలసినవి: ఏనుగులు, గుర్రములు, రథములు, యానములు (బండ్లు పాలకీలు మొదలగు నవి) భూములు, పంచలు జతలు, ఎద్దులు, గోవులు మొదలగునవి; ఇది మాసకాలము జరిపినచో ముగియునది; ఇట్లు నీకు లక్షహోమ విధానము తెలిపితిని ఇక కోటిహోమ విధానము తెలిపెదను వినుము; గంగాతటయమునాతట సరస్వతీతీర నర్మదాతీర దేవికా తీరములందిది జరుపవలెను; దీనికై పదునారు మంది ఋత్విజులను నియమిం చవలెను, సర్వహోమములును ముగియగనే విప్రునకు ధనమీయవలెను; దీనికై ఋత్విజులతోను, ఆచార్యునితో అధ్వర్యునితో పురోహితునితోను కూడి సంవత్సర కాలము సాగించు దీక్షను గ్రహించవలయును; ఈ దీక్షను చైత్రమాసమునగాని, కార్తీక మాసమునగాని స్వీకరించవలెను. ఇది ఇట్లు ప్రతివర్షమందును జరిపినను జరుపవచ్చును; ఈ దీక్షాకాలమున యజమానుడు పాలు, పండ్లు మాత్రము ఆహారముగా గ్రహించుచుండవలెను; హోమమునకై యవలు, పరి ధాన్యము, మినుములు, తిలలు, అవలు, పలాశ, సమిధలు, వసుధార ఉపయోగించవలెను; బ్రాహ్మణులకు భోజనము-ప్రథమ మాసమున క్షీరభోజనము, రెండవ నెలలో సర్వకార్యార్థ సాధనియగు పులగము, మూడవనెలలో సంయాపము గోధుమ రవ్వతో వండిన పాల అన్నము), నాల్గవ నెలలో లద్దులు, ఐదవ నెలలో పెరుగన్నములు, ఆరవనెలలో సక్తుభోజనము, ఏడవనెలలో అపూపములు అరగా అప్పములు బూరెలు అరిసెలు, ఎనిమిదవ నెలలో నేతిబూరెలు, తొమ్మిదవ నెలలో షష్టికము (రెండు నెలల పంట వరి) అరి బియ్యపు అన్నము, పదవ నెలలో షష్టికయవల అన్నము జరగా యవల పిండి రొట్టె, పదునొకండవ నెలలో మినుము, మినువ గారెలు మొదలగు పిండి వంటలతో కూడి భోజనము, పండ్రెండవ నెలలో అన్ని కోరికలను తృప్తిపరచు షడ్రసోపేత భక్త సహిత భోజనము పెట్టించవలయును.

ప్రతి మాసమందును బ్రాహ్మణులకు (ఋతిమాలకు దక్షిణ ఇవ్వవలెను, యజమాను దును, ఋతులతో కూడి అహతవాసనుడై అనగా చించని జత వస్త్రములు అనగా దోవతులు అతను చించక ఒకదానిని కట్టువర్ధముగాను రెండవ దానిని ఉత్తరీయముగాను అమర్చికొని. ధరించిన వాడు అయి నా కాలము హోమము చేయవలెను. ఇవి ఇంద్రాది దేవతా ప్రీతికరమును సర్వకామ ప్రదమును; ఇట్లు సర్వదేవతోద్దేశకమగు ఈ యజ్ఞమును జరిపి పశువిశసన పూర్వకముగా అగ్నిష్టోమమును సర్వదానాది పూర్వకముగా జరుపవలయును; ఇట్లు యథావిధిగా జరుపుచు నూరేసి హవనముల కొకసారి పూర్ణాహుతి జరుపవలెను; వేయి హవనములు కాగానే ద్విగుణ దక్షిణల నీయవలెను; ఇట్లు లక్షహోమములు ముగియు వరకు చేయవలెను. తుదకు ఋత్విజులు పురోదాశమును సిద్ధపరచి దానితో దేవతోద్దేశమున హవనము జరుపవలయును. యజమానుడును మానవ యోగ్యములగు హవిష్యాన్నములతో జితేంద్రియుడై యుండి ద్విజులను దేవతలను అర్చించి ప్రీతినందించవలెను; తరువాత పితరులు నర్చించి శాస్త్రోక్త విధానమున పిండప్రదానము జరుపవలయును; ఇట్లు హోమసమాప్తి కాగానే బ్రాహ్మణులకు (ఋత్విజులకు) దక్షిణలు సమృద్ధిగా ఈయవలెను. తరువాత సరియగు తులచేయించి దానికి రెండువైపులను రెండు ఉట్టులను వ్రేలాడదీయవలయును; రాజు తాను బంగారుతో తులలో తూగి తన భార్యను వెండితో తూకము చేయించవలయును; ఈ ధనమును దానము చేయవలయును; వెందిగాని, బంగారుగాని లక్ష నాణెములు ఈతులా భారము నందు ఉండునట్లు యథాశక్తిగ ఇతర ద్రవ్యముల నైన తూకముచేసి దానమీయవలెను; రాజు తనకున్నది అంతయు (సర్వస్వము) నైన ఈయవచ్చును. దీనిచే రాజసూయ యాగఫలము లభించును; ఇట్లు యథావిధానముగ లక్షహోమ కోటి హోమములు జరిపి ఆ ఋత్విగాది బ్రాహ్మణులకు వీడ్కోలు ఇచ్చి పంపవలయును. యజ్ఞాంతమున వుండరీకాక్షుడును సర్వ యజ్ఞేశ్వరుదును నగు హరిప్రీతినందుగాక! అను మంత్రము నుచ్చరించవలయును. అతడు తుషుడైనచో జగత్తు సంతుష్టమగును, అతడు ప్రీతినం. దించబడినవాడైనచో జగము ణితమగును, దైవహేతుభములును, మానుష హేతుకములు నగు. సర్వోత ఘాతములందును జరుపవలసిన శాంతి విధానము ఇది, నీకు తెలిపిన ఈ యజ్ఞ మాచరించినచో సుకృత మాచరించిన వాడగును; జన్మమరణముల గూర్చివాని కృతాకృతములను "నేను ఏ పుణ్యమాచరించితిని -ఏ పుణ్యమాచరించలేదు అను విషయమును గూర్చికాని విచా రించ-శోకించి-పనిలేదు, సర్వతీర్థ స్నానముచేతను సర్వయజ్ఞ ఆచరణముచేతను కలుగు పరమంతయు ఈ గ్రహయజ్ఞాశ్రయము (ఆయుత హోమలక్షహోమ, కోటి హోమములలో లభించును.