గృహమును పెంచుట

మొదట ఒక అమరికలో గృహ నిర్మాణము చేసిన తరువాత దానిని మరల పెంచుట మంచిది కాదు; ఒకవేళ పెంచుచో అన్ని దిక్కులకును పెంచవలయును; తూర్పునకు మాత్రము పెంచినచో వైరవృద్ధి; దక్షిణమునకు పెంచినచో మృత్యువు; పడమటకు పెంచినచో ధననాశము; ఉత్తరమునకు పెంచినచో సంతాపము; ఆగ్నేయ వృద్ధి అగ్నిభయదము; నైరృతవృద్ధి శిశు నాశకరము, వాయవ్య వృద్ధి వ్యాధి ప్రకోపకరము; ఈ శాన్యవృద్ధి సంతాన హానికరము.