దుర్గమందుండవలసిన వృక్షములు మొదలగునవి

జీవకమము, ఋషభము, కాకోలము, అమలకి, ఆటరూషకము, శాలపర్ణి, పృశ్ని (ష్ఠి) పర్ణి, ముద్ద, పర్ణిమాష, పర్ణి మేదా జాతి ఓషధులు రెండు, శారిబా జాతి మూలికలు రెండు, బలాజాతి ఓషధులు మూడు, వీర, శ్వనంతి, వృష్య, బృహతి, కంటకారిక, శృంగి, శృంగాటకి, ద్రోణి, వర్సాభూ, దర్భరేణుక, మధుపర్ణి, విదారి, మహాక్షీర, మహాతపస్, ధన్వనము, సహదేవ, కటుక, ఏరండకము విషము (ఒక మూలిక) పర్ణి, శతాహ్వ, ద్రాక్ష, ఫల్గు; ఖర్జూరము, అతిమధుర, శుక్ర, అతిశుక్ర, కాశ్మరి, ఛత్ర, వీరిణి చెరకు, చెరకు నుండి ఉత్పన్న వస్తువులు ఫణితము మొదలగునవి సింహి, సహదేవి, విశ్వేదేవ, అశ్వరోధకము, మధుకము, పుష్పహంస, శతపుష్ప, మధూలిక, శతావరి, మధుకా, పిప్పలము తాళము ఆత్మగుప్త, కట్పల, దార్వికా, రాజశీర్షకి, రాజసర్షపములు, ధాన్యాకము, ఋష్యప్రోక్త, ఉత్కట, కాలశాకము, పద్మబీజము, గోవల్లి, మధువల్లిక, శీతపాకి, కుబేరాక్షి, కాకజిహ్వ, ఉరుపుప్పిక, పర్వతము, త్రవుసము, గుంజాతకము, పునర్నవ, కశేరువు, కారువు, కాశ్మీరీ, వల్య, సాలూకము, కేసరము, సుంకు ఉండెడి అన్ని ధాన్యములు అన్ని పశు మృగజాతుల పాలు, తేనె, మజ్జిగ, తైలములు, మజ్జ, వస, నేయి, నీపము, అరిష్టకము, అక్టోటము, వాతామము, సోమబాణక (బాదా)ము ఈ మొదలగు మధుర (తీయని) గణమునకు చెందిన ఓషధీ, రస జాతి ద్రవ్యములును. దాడిమము, ఆమ్రాతకము, తింత్రిణీకము, ఆమ్లము, వేతనము, భవ్యము, కర్కంధువు, లకుచము, కర మర్దకము రూపకము, బీజపూరకము, కండూరము, మాలతి, రాజబంధుకము, రెండుతెగల కోలకముల పత్రము రెండుతెగల ఆమ్లాతముల పత్రములు, పారావతము, నాగరకము, ప్రాచీనోళకము, కపిత్థము, ఆమలకము, చుక్రఫలము, దంథశఠ ఫలము, జంబూ ఫలము నవనీతము సౌవీరము కలుషోదకము, సుర, ఆసవము, మద్యములు, మండము, తక్రము, దధి, మొదలగు తెల్లని ఆమ్ల(పుల్లని) గణమునకు చెందిన పదార్థములును.

సైంధవము, ఉద్భిదము, పాథేయము, పాక్యము, సాముద్రలోమకము, కుప్యము, సౌవర్చలము, బిల్వము, బాలకేయము, యవాహ్వకము, ఔర్వము, క్షారము, కాలభస్మము-ఈ మొదలగు లవణ గణ పదార్థములును.

పిప్పలి, పిప్పలివేరు, చిత్రకము, నాగరము, కుబేరము, మరిచకము, శిగ్రువు, భల్లాతకము, సర్షపములు కుష్ఠము, అజమోద, కిణిహి, హింగువు, మూలకము, ధాన్యకము, కారవీ, కుంజికా, యాజ్యా, సుముఖా, కాలమాలికా, ఫణిజ్జకము, లశునము భూన్తృణము, సురసము, కాయస్థా, వయస్థా, హరితాళము, మనశ్శిల, అమృత, రుదంతీ, రోహిషము, కుంకుమము, జయ, ఏరం డము, కాండీరము, నల్లకీ, హంజికా- ఈ మొదలగు పిత్తజనక పదార్థములును ఇటువంటివేయగు (పిత్తజనక) ప్రాణులు మూత్రములును తరచుగా పచ్చనివి యును సూక్ష్మములగు ఫలములును సూక్ష్మైలా హింగు పత్రము ఈ మొదలగు కటుక గణపు (కారపు) ద్రవ్యములును రాజు తన పురమునందు సేకరించి ఉంచుకొనవలయును.

ముస్తము చందనము హ్రీబేరము కృతమూలకము దారవము, హరిద్ర, నలదము, ఉశీరము, నక్తమాలము, కదంబకము, దూర్వ, వటోలము, కటుకా, దీర్ఘత్వక్, పత్రకము, వచా, కిరాతతిక్తము, భూనింబము, విష, అతివిష, తాళీన పత్రము, తగరము, సప్తవర్ణము, వికంకతము, కాకోదుంబరికా, దివ్యా, సురోద్భవా, షడ్గ్రంథా రోహిణి, మాంసి, పర్పటము, దంతికా, రసాంజనము, భృంగరాజము, పతంగి, వరిపేలవము, దున్స్పర్శ, గురుణి, కామా, శ్యామాకము, గంధనాకులి, రూపపర్ణి, వ్యాఘ్రనఖము, మంజిష్ఠా, చతురంగుల, రంభ, అంకురా, స్పీతా, తాలాస్పోతా, హరేణుకా, వైత్రాగ్రము వేతనము, తుంబీ, విషాణి, లోధ్రమంజరి, మాలతి, కరకృష్ణా, వృశ్చికా, జీవితా, పర్పటము, గళూ (గుడూ)చీ ఈ మొదలగు తిక్త (చేదు) గణ పదార్థములును.

అభయా రెండుతెగల అమలకములు విభీతకము, ప్రియంగువు, ధాతకీ పుష్పము, మోచా, అర్జునము, ఆసనము, అనంతా, స్త్రీ, తువరికా, స్యోనాకము కట్పలము, భూర్జ పత్రము, శిలాపత్రము, పాటలా, పత్రలోమకము, సమంగా, త్రివృతా మూలము, కార్పాసము, గైరికాం జనము, తిందుకము, తేనెమైనము, కుంభీకా, తెల్ల కలువ, నల్ల కలువ, న్యగ్రోధము, ఉదుం బరము, అశ్వత్థము, కింశుకము శింశుపా, శమీ, ప్రియాలము, పీలుకా, సారి శిరీషము, పద్మకము, బిల్వము, అగ్ని మంథము, ప్లక్షము, శ్యామాకము, వ(బ), చఘనము, రాజాధనము, కరీరము, ధాన్యకము, ప్రియకము, కంకోలము, అశోకము, బదరము, కదంబము, రెండు జాతుల ఖదిరము. ఈచెప్పిన జాతులపత్రములు సారములు వేళ్ళు పూవులు మొదలగు కషాయ (వగరు) గణ పదార్థములును రాజు తన రాజధానీ పురమందు సేకరించి ఉంచుకొనవలయును; ఇతరులను చంపుటకును వికలాంగులుగా చేయుటకును ఉపయుక్తములగు పురుగులను మార్గములందు బాధ కలిగించు వాయువులను పొగలను విషములను శమింపజేయు సాధనము లను పుష్టి వృద్ధికర పదార్థములను కళావిదులగు పురుషులను రాజు యత్న పూర్వకముగా తన రాజధాని యందుంచుకొన వలయును; కుభృత్యులను, పాపశీలురగు జనులను భీతు(రు)లను క్రుద్ధులను, ప్రమత్తులను, అవమానితులగు వారిని రాజు తన పురమందు ఉండనీయరాదు; ఇట్లు రాజెల్లప్పుడును యంత్రములు, ఆయుధములు, అట్టాలములు (బురుజులు) సర్వ ధాన్యములు, సర్వౌషధౌషధులు, వణిగ్జనులు నిండినదై సురక్షితమగు దుర్గమందు రాజు నివసించవలయును.