మత్స్య మహా పురాణము
ప్రసవోత్పాత శాంతి
గర్గుడు అత్రితో ఇట్లు చెప్పెను. స్త్రీలకు అకాలమందు ప్రసూతి జరిగినను కాలాతీతముగా ప్రసూతి ఐనను వికృత ప్రసవమయినను, అమానుష ప్రాణులును, నోరు మొదలగునవి లేనివారు, వ్యసనములతో కూడినవారు, హీనాంగులు అధికాంగులు కలిగినను, పశుపక్షి సరీ నృపాదులకు ఇట్లు వికృత ప్రసవమయినను ఆ దేశమునకును, ఆ స్త్రీలున్న కులమును నాశమగును, రాజు ఆ మాతా శిశువులను స్వరాష్ట్రము నుండి వెడలగొట్టవలెను. తరువాత స్త్రీలను పూజించవలెను; బ్రాహ్మణులకును కోరినవెల్ల ఇచ్చి పూజించి తృప్తి పరచవలయును; దీనిచే ఈ దోపము శాంతించును.