మత్స్య మహా పురాణము
శివ - నారాయణ ప్రతిమా లక్షణము
ఈమూర్తియందు వామార్ధమందు మాధవుడును దక్షిణార్ధమునందు శూలపాణియు ఉండును; కృష్ణుని బాహు ద్వయమునకు మణికేయూరములు భూషణములు; శంఖ చక్రములు హస్తద్వయ మందుండును; శాంతమూర్తి; అంగుళులు కొంచెమెర్రనివి; కృష్ణుని (గదాధారి) పాణి యందు చక్రమునకు మారుగ గదనైన ఉంచవచ్చును; కటివామార్ధము భూషణములతో ఉజ్ట్వజలమును పీతాంబరయుక్తమును అగును; చరణములందు మణిభూషణములు; ఇక దక్షిణార్ధమందు జటా భారమును, అర్ధచంద్రా లంకరణమును, భుజంగ హారవలయమును, వరద దక్షిణ హస్తమును, త్రిశూలహస్తమును, సర్పయజ్ఞోపవీతమును; కటియందు (దక్షిణార్ధమున) చర్మాంబరమును, మణిరత్నములతోను నాగముతోను విభూషితమగు పాదమును నుండును.