మత్స్య మహా పురాణము
వరుణ వాయు ప్రతిమా లక్షణము
వరుణుడు పాశహస్తుడు, మహాబలుడు, శంఖస్పటిక సమాన వర్ణుడు, తెల్లని హారములతో వస్త్రములతో కప్పబడిన వాడు, మత్స్యాసన మందుండును. కిరీటమును భుజకీర్తులును ధరించి యుండును. వాయువు ధూమ్రవర్ణుడు; మృగ (జింక) వాహనుడు; పలువన్నెల వింతగొలుపు వస్త్రములు ధరించి యుందును; యువకుడు; మృగాధి రూఢుడును వరదుడును పతాకల (చిరు జెండాల)తోను ధ్వజముల (పెద్ద జెండాల తోను కూడియుండును.