మత్స్య మహా పురాణము
ఇంద్ర ప్రతిమా లక్షణము
ఇంద్రుడు సహస్రనయనుడై మత్తగజముపై నుండును. విశాల వక్షోవదనయుతుడు. సింహమునకువలె మూపులు కలవాడు. మహాభుజుడు. కిరీట కుండలధరుడు. బలిసిన పెద్ద భుజములును పెద్ద కన్నులును కలవాడు. వజ్రమును కలువపూవును ధరించినవాడు; నానాభరణ భూషితుడు; దేవగంధర్వ పూజితుడు - అప్సరోగణ సేవితుడు, పార్శ్వములందు ఛత్ర చామర ధారిణులగు స్త్రీలుందురు; లేదా సింహాసనగతుడు గంధర్వ గణసేవితుడుగానైన ఇతని చూపవచ్చును; ఇతని ఎడమవైపున ఉత్పల ధారిణియగు ఇంద్రాణి (శచీదేవి) యుండును.