అగ్ని మహా పురాణము

380 - అథాద్వైత బ్రహ్మవిజ్ఞానమ్

అగ్ని రువాచః

అద్వైత బ్రహ్మవిజ్ఞానం వక్ష్యే యద్భరతోఽగదత్

శాలగ్రామే తపశ్చక్రే వాసుదేవార్చనాదికృత్. 

మృగే సంగాన్మృగో భూత్వాహ్య న్తకాలే స్మరన్మృగమ్

జాతిస్మరో మృగ స్త్యక్త్వా దేహయోగాత్స్వతోఽభవత్.

 అద్వైత బ్రహ్మభూతశ్చ జడవల్లో కమాచరత్

 క్షత్తాఽసౌవీర రాజస్య విష్టియోగ మమన్యత.

  ఉవాహ శిబికామస్య క్షత్తుర్వచన చోదితః

గృహీతో విష్టినాం జ్ఞానీ ఉవాహాత్మ క్షయాయతమ్.

 యమౌజడగతిః పశ్చాద్యేత్వన్యే త్వరితం యయుః

 శీఘ్రాన్ శీఘ్రగతీన్దృష్ట్వా అశీఘ్రం తంనృపోఽబ్రవీత్ .

అగ్ని దేవుడు పలికెను. భరతుడు చెప్పిన ఆద్వైత బ్రహ్మ విజ్ఞానమునుగూర్చి చెప్పెదను. పూర్వము భరతుడను రాజు సాలగ్రామ క్షేత్రమున వాసుదేవాది పూజ చేయుచు తపస్సు చేసెను. ఒక మృగమునందు ప్రేమచే మరణసమయమున ఆ మృగమునే స్మరించుచు మరుజన్మమున మృగముగా పుట్టెను. కాని ఆజన్మలో పూర్వజన్మ స్మృతి వుండెను. అందుచే స్వయము గనే ఆ దేహమును విడిచి మరియొక జన్మ ఎత్తెను ఆ ద్వైత బ్రహ్మ జ్ఞానము కలవాడు మూ డుడ:వలే లోకమున సంచరించెను. సౌవీర దేశ రాజు ఆతనిని విష్టిగా నియమించేను. ఆతని ఆజ్ఞ ప్రకారము భరతుడు ఆతని పల్లకిని మోసెను. ఆతడు జ్ఞాని యైనను ప్రారబ్ధ క్షయము కొరకై విష్టిగా గ్రహింపబడి పల్లకి మోసెను. ఇతరులు శీఘ్రముగ నడచుచుండిరి. వారు తీవ్ర ముగ నడచుటను. ఇతడు మందముగా నడచుటను చూసి రాజు పలికెను.

రాజోవాచః

కిం శ్రాంతోఽస్యల్ప మధ్వానం త్వయోడా శిబి కామమ

 కిమాయాస నహోనత్వం పీవానసినిరీక్ష్యతే. 

బ్రాహ్మణ ఉవాచః

నాహంపీ వాసవై వోడా శిబికా భవతో మయా

న శ్రాఒతోఽస్మి నవాయాసోవోడ వ్యోస్మి మహీపతే.

  భూమౌపాదయుగం తస్థౌ జంఘేపాదద్వయేస్థితే

ఊరూజంఘాద్వయావస్థౌ తదాధారం తథోదరమ్.

వక్షః స్థలం తథా బాహూ స్కంధౌ చోదరసంస్థితౌ

 స్కంధస్థితేయం శిబికామమభావోఽత్ర కింకృతః.

 శిబికాయాం స్థితం చేదం దేహంత్వదుప లక్షితమ్

 తత్రత్వ మహమప్యత్ర ప్రోచ్యతే చేద మన్యథా. 

అహంత్వంచ తథాఽన్యేచ భూతై రుహ్యామ పార్థివ

గుణప్రవాహా పతితో గుణవర్గోహి యాత్యయమ్.

 కర్మవశ్యా గుణా శ్చైతే నత్త్వాద్యాః పృథివీపతే

ఆవిద్యా సంచితం కర్మతచ్చా శే షేషు జన్తుషు. 

ఆత్మా శుద్దోఽక్షరః శాన్తో నిర్గుణః ప్రకృతేః పరః

 ప్రకృత్య పచయో నాస్య ఏకస్యాఖిల జన్తుషు. 

యదానాపచయ స్తస్య తదానాప చయోనృప

 తదా పీవానసీతి త్వంక యా యుక్త్యాత్వ యేరితమ్.

 భూజంఘాపాద కట్యూరు జఠరాదిషు సంస్థితా

శిబి కేయం తథాస్కంధే తదాబావ నమ స్త్వయా.

 తదన్య జంతుభిర్భూప శిబికోత్థాన కర్మణా

శైలద్రవ్య గృహోత్థాపి పృథివీ సంభవోపివా. 

యథా పుంసః పృథగ్భావః ప్రాకృతైః కరణైర్నృష

సోడవ్యః సమహాభారః కతరోనృపతేమయా.

 యద్ద్ర వ్యాశిబికా చేయం తద్ద్రవ్యో భూతసంగ్రహః

 భవతోమేఽఖిలస్యాస్య సమత్వేనోప బృంహితః.    

రాజు ఇట్లనెను. ఓయీ ! నీవు నా పల్లకి కొంచెము దూరమే మోసితివి. ఇతరోనే అలసిపోతివా ! నీవు చూచు టకు బలిసివున్నావు. శ్రమకు ఓర్చజాలవా ! బ్రాహ్మణుడు పలికెను. నేను బలిసిలేను, నేను నీ పల్లకి మోయుట లేదు. నేను అలసిపోలేదు నాపైన భార మేమియులేదు. నేల పై రెండు పాదములున్నవి. వాటిపై పిక్కలున్నవి. వాటిపై రెండు తొడలున్నవి వాటిపై ఉదరము దానిపై వక్షస్థలము, దాని పై భుజములు, వున్నవి. ఆ భుజముల పై ఈ పల్లకి వుంచబడి నది. ఆట్టి పరిస్థితులలో నాకేమి సంబంధమున్నది. నీది అను చెప్పబడు ఈ శరీరము పల్లకిలో వున్నది. నీవు ఆక్కడ వున్నావని, నేను ఇచట నున్నా నని చెప్పుట ఇదంతయు మిథ్యా. నిన్ను, నన్ను , అందరిని, కూడి, పంచ భూతములు మోయుచున్నవి. పంచభూతములు గుణ ప్రవాహములో పడి కొట్టుకొని పోవుచున్నవి. సత్త్వాది గుణములు కర్మాధీనములు. కర్మ అవిద్యా సంచితము. ఇది అన్ని జీవులందు వున్నది. ఆత్మ శుద్దము, అక్షరము, భ్రాంతము నిర్గుణము, ప్రకృతి, అతీతము, అన్ని ప్రాణులయందు ఒకే ఆత్మవున్నది. దానికి వృద్ధి కాని ప్రస్తముకాని లేవు. ఆట్టి పరిస్థితులలో నీవు బలిసివున్నావు అని ఏయి ని బట్టి నీవు పలికినావు. పృథివీ, పాదములు, కాళ్ళు, కటి, ఊరువులు, ఉదరము, మొద లగు వాటి పైనను స్కంధమునందును. వున్న పల్లకి నాకు భారమైనచో ఆది నీకు కూడ భారమే. ఇది ఇతర ప్రాణుల విషయమున కూడ సమానమే. కేవలము, పల్లకిని మాత్రమే కాక జీవులు పర్వతము అను, వృక్షములను, గృహములను, పృథ్యాదులను, వాటి భారమును కూడ తన నెత్తి పై వేసికొనినాడు. రాజా ప్రకృతి జన్యములను సాధనముల కంటే పురుషుడు సర్వధాభిన్ను డైన పుడు నేను భరించవలసిన భారమేమున్నది. ఏ పదార్థముతో ఈ పల్లకి తయారు చేయబడినదో ఆ పదార్థము తో బే నీయొక్క నాయొక్క సకల ప్రాణులయొక్క శరీరములు నిర్మింపబడినవి. ఆద్రవ్యములచేతనే అందరికిని వృద్ధి ఏర్పడినది.

 తచ్చ్రుత్యోవాచ రాజా తం గృహీత్వాంఘ్రీ క్షమాప్యచ

ప్రసాదం కురుత్య క్త్వేమాం శిబి కాంబ్రూహిశృణ్వతే

 యో భవాన్యన్ని మి త్తం వాయదాగమన కారణమ్.  

బ్రాహ్మణ ఉవాచః

 శ్రూయతాం కోహమిత్యేత ద్వక్తుం నైవచ శక్యతే

ఉపభోగ నిమి త్తంచ సర్వత్రాగమన క్రియా. 

సుఖ దుఃఖోప భోగౌతు తౌదేశాద్యుప పాదకౌ

ధర్మాధర్మోద్బవోభోక్తుం జంతుర్దేశాది మృచ్ఛతి.

 రాజోవాచః

యోఽస్తి సోహమితి బ్రహ్మన్కథం వక్తుం సశక్యతే

ఆత్మన్యేష నదో పాయ శబ్దోహ మితివై ద్విజ.

  బ్రాహ్మణ ఉవాచః

శబ్దోహమితి దోషాయ నాత్మన్యేష తథైవ తత్ !

ఆనాత్మనాత్మ విజ్ఞానం శబ్దోవా బ్రాన్తి లక్షణ. 

యదా సమస్త దేహేషు పుమానేకో వ్యవస్థితః

తదాహికో భవాన్కో హమిత్యే తద్వీపలం వచః

  త్వం రాజా శిబికా చేయం వయం వాహః పురః సరాః

 అయం చ భవతో లోకోన సదేత న్నృపోచ్యతే.

 వృషోద్దారు తతశ్చేయం శిబికా త్వదధిష్ఠితా

కావృక్ష సంజ్ఞా జాతాస్య దారుసంజ్ఞాథవా నృప.

  వృక్షారూడో మహారాజో నాయంవదతి చేతనః

 న చ దారుణి సర్వస్త్వాం బ్రవీతి శిబికా గతమ్.

 శిబికాదారు సంఘాతో రచనాస్థితి సంస్థితః

ఆన్విష్యతాం నృప శ్రేష్ఠ తద్భేదే శిబికా త్వయా.

 పుమాంస్త్రీ గౌరయం వాజీ కుంజరో విహర స్తరుః

దేహేషు లోక సంజ్ఞేయం విజ్ఞేయా కర్మ హేతుషు.

  జిహ్వా బ్రవీత్యహమితి దంతోష్ఠౌతాలుకం  నృప

ఏతేనాహం యతః సర్వే వాజ్ నిష్పాదన హేతవః.

 కిం హేతు బిర్వ దత్యేషా వాగేవాహమితి స్వయమ్

 తథాపి వాజ్ఞా హమేత దు క్తం మిథ్యానయుజ్యతే.

 పిండః పృథగ్యతః పుంసః శిరః పాయ్వాది లక్షణః

తతోఽహమితి కుత్త్రైతాం సంజ్ఞాం రాజన్క రోమ్యమ్.

 యదన్యోఽస్తి పరః కోపిమత్తః పార్థివస త్తమ !

తదేమోహమయం చాన్యోవక్తు మేవమషీష్యతే.

 పర మార్ధ భేదోన నాగోన పశుర్నచ పాదపః

శరీరాశ్చ విభేదాచ్చయ ఏతేకర్మయోనయః.

యస్తురాజేతి యల్లో కే యచ్చరాజభటా త్మకమ్

 తచ్చాన్యచ్చ నృపేత్యస్తు న సత్సమ్పగ నామయమ్.

 త్వం రాజాసర్వ లోకస్య పితుః పుత్రోరిపోరిపుః

పత్న్యాః పతిః పితాసూనోః కస్త్వాం భూపవదామ్యహమ్.

త్వం కి మేతచ్చిరః కిన్న శిర స్తవ తథోదరమ్

 కిము పాదాదికం త్వంవై తవతత్కిం మహీపతే.

 సమస్తావయవేభ్య స్త్వం పృథగ్భూతో వ్యవస్థితః

 కోహమిత్యత్ర నిపుణో భూత్వా చిన్తయ పార్థివ.  

ఆ మాట విని రాజు ఆతని పాదములు స్పృశించి క్షమాపణను కోరి ఇట్లు పలికెను. నన్ను అనుగ్రహించుము. ఈ పల్లకిని విడిచి నీవు ఎవ్వరవో - ఇట్లు ఎందుకు వచ్చినానో చెప్పుము అని ప్రార్థించెను బ్రాహ్మణుడు పలికెను. రాజా ! వినుము. నేను ఫలానావాడను అని చెప్పుట అశక్యము. కర్మ ఫలమును అనుభవించుట కే అందరును వచ్చుచుందురు. సుఖ దుఃఖోప భోగము కొరకై విభిన్న దేశ కాలాదులను పొందుచుందురు. ధర్మా ధర్మ ఫలములను అనుభవించు కై జీవుడు ఆయా దేశములను పొందు చుండును. రాజు పలికెను. ఏది వున్నదో అది నేను అని చెప్పుటలో దోషమేమున్నది. అహం అనుశబ్దమును తన విషయమున ప్రయోగించుట దోషము కాదు కదా బ్రాహ్మణుడు పలికెను. తన విషయమున ఆహమ్ అను శబ్దమును ప్రయోగించుటలో దోషము లేదు. అని నీవు చెప్పినది సత్యమే. కాని ఆనాత్మ విషయమున “అహం” శబ్దమున ప్రయోగించి దానిని ఆత్మగా భావించుట భ్రాంతియే. సమస్త దేహము నందును వున్న ఆత్మ ఒక్కటియే యైనపుడు నీ వెవ్వరు నే నెవ్వరు మొదలగు వచనములకు అర్థము లేదు. నీవు రాజువు. ఇది పల్లకి. మేము దీనిని మోయు వారము. ఎదుట నడచు వారు నీ పరివారము. ఈ లోకము నీది. ఈ విధముగ చేప్పుట సత్యము కాదు. చెట్టు నుండి వచ్చిన కర్రతో చేసిన యీ పల్లకిని నీవు ఎక్క యున్నావు. రాజా! ఈ పల్ల కికి వుండవలసిన వృక్ష మను పేరు కర్ర అను పేరు ఏమై పోయినది అని చెప్పుము. ఇక్కడున్న వారెవరును మహారాజు చెట్టుపై ఎక్కినాడు అని కాని కట్టెపై ఎక్కినాడు అని కాని ఆనుట లేడు. పల్లకి ఎక్కినట్లు చెప్పుచున్నారు. ఒక విధముగ కూర్చిన కర్రల సముదాయమున కే “శిబిక “ అని పేరు. రాజా ! కర్రల కంటే వేరుగా పల్లకి ఎక్కడ వున్నదో వెతికి చూడుము. ఇతడు పురుషుడు, ఈమె , ఇది యెద్దు. ఇది గుర్రము, ఇది ఏనుగు, ఇది వృక్షము, ఇది పక్షి అని ఈ విధములగ కర్మ జనితములగు భిన్న భిన్న శరీరములకు వేర్వేరు నామములు ఆరోపింపబడుచున్నవి. ఇవన్నీ లోకము కల్పించిన పేర్లు. జిహ్వ అహం అని అనుచున్నది. దంతములు ఓష్ఠములు తొలువు కంఠము మొదలగునవి కూడ ఉచ్చరించుచున్నవి. కాని “వి యేమియు అహం కాదు. ఇవి కేవలము శబ్ధో చ్చారణ సాధన మాత్రములు ఈ జిహ్వ ఆహం అని యేకారణముచే చెప్పుచున్నది? జిహ్వ ఆహం అని చెప్పుచు పలుకుచు నేను అహం కాదు అని ఆగను. మిథ్య కాదు. శిరస్సు పాయ్యాదులు మొదలగు అవయవముల రూపములలో నున్న శరీరము పురుషుని కంటే సర్వధా భిన్న సం. అందుచే ఏ ఆవయవమును నిర్దేశించుటకు నేను అహం శబ్దమును ప్రయోగింతును? నా కంటే భిన్నమైన మరొక తత్వమున్నచో ఇది నేను, ఆ భిన్నము అని చెప్పుటకు వీలు వుండును. కాని వాస్తవమున పర్వత, పశు, పాద పాది భేదము, సత్యము కాదు. శరీర దృష్టిచే కనబడు భేదములన్నియు కర్మ జన్యములు. లోకములో ఇతడు రాజు. ఇతడు భటుడు మొదలగు విధమున చెప్పు భేదము లెవ్వియు నిర్వికార సతములు కావు. నీవు సకల లోకమునకు రాజువు. నీ తండ్రికి కుమారుడవు. నీ శత్రువునకు శత్రువు. నీ భార్యకు భర్తవు. నీ కుమారునకు తండ్రి. ఇన్ని పేర్లుడగా నిన్ను ఏ పేరుతో పిలువవలెను. ఈ శిరస్సు నువ్వా ! ఈ శిరస్సు నీదై నట్లే ఈ ఉదరము కూడ నీదే. అందుచే ఉద రము నువ్వా. ఈపాదాద్యవయవములలో ఏదై న ఒకటి నువ్వా ! కానిచో ఇవన్నియు నీవెట్ల నవి మహారాజా ! నీవు ఈ అవ యవము? కంటే కన్నుడవు. కావున వీటి నుండి వేరుబడి వా స్తవమున నేను ఎవరిని అని చక్కగా ఆలోచించుము. 

తచ్చ్రుత్వోవాచ రాజాత మవధూతం ద్విజంహరిమ్,

రాజోవాచః

శ్రేయోఽర్థముద్యతః ప్రష్టుం కపిలర్షి మహంద్విజ

 తస్యాంశః కపిరిర్షే స్త్వం మత్కృతే జ్ఞానదోభువి.

జ్ఞానవీచ్యుద ధేర్యస్మాద్యచ్చ్రేయ స్తచ్చ మేవద.   

బ్రాహ్మణ ఉవాచః

భూయః పృచ్ఛతి కింశ్రేయః పరమార్థం నపృచ్ఛసి

శ్రేయాంస్య పరమార్థాని ఆ శేషాణ్యేవ భూపతే.

 దేవతారాధనం కృత్వా ధన సంపత్తి మిచ్ఛతి

పుత్రానిచ్ఛతి రాజ్యంచ శ్రేయ స్తస్యైవకింనృప. 

వివేకినస్తు సుయోగః శ్రేయో యః పరమాత్మనః

 యజ్ఞాదికా క్రియానస్కాన్నాస్తి ద్రవ్యోపప త్తితా.

 పరమార్థా త్మనోరోగః పరమార్థ ఇతీష్యతే

ఏకో వ్యాపిస మః శుద్దో నిర్గుణః ప్రకృతేః పరః. 

జన్మవృద్ధ్యాదిరహిత ఆత్మా సర్వగతోఽవ్యయః

పరంజ్ఞాన మయోఽసంగి గుణజాత్యారి భిర్విభుః.

నిదాఘ ఋతుసంవాదం వదామి ద్విజతంశృణు

ఋతుర్బహ్మ సుతోజ్ఞానీ తచ్చిష్యోఽభూత్పుల స్త్యజః.

 నిదామః ప్రాప్తవిద్యోఽస్తాన్న గరే వై పురేస్థితః

 దేవికాయా స్తటే తంచ తర్కయామాసవై ఋతుః.

  దివ్యేవర్ష సహస్రేఽగాన్ని దాఘమవలోకితుమ్

 నిదాఘో వైశ్వదేవాన్తే భుక్త్వాన్నం శిష్యమబ్రవీత్.

భుక్త్యన్తే తృప్తిరుత్పన్నా తష్టిదా సాఽక్షయా యతః. 

ఋతు రువాచః

 క్షుదస్తి యస్య భుక్తేఽన్నే తుష్టిర్ర్బహ్మణ జాయతే

నమేక్షుదభవ త్తృప్తి: కస్మాత్త్వం పరిపృచ్ఛసి.

 క్షు తృష్ణే దేహధర్మాఖ్యే న మమైతే యతో ద్విజ

పృష్టోహం యత్త్వయా బ్రూయాం తృప్తిర స్యైవమేసదా.

 పుమాన్సర్వగతో వ్యాపీ ఆకాశవదయం యతః

ఆతోఽహం ప్రత్యగాత్మా స్మీత్యేతదర్థేభవేత్కథమ్. 

సోఽహంగన్తా చాగన్తానైక దేశ నికేతనః

త్వం చాన్యో న భవేన్నాపి నాన్య స్త్వత్తోఽస్తి వాప్యహమ్.

మృన్మయం హి గృహం యద్వన్మృదా లిప్తం స్థిరీభవేత్

 పార్థివోఽయం తథా దేహః పార్థివైః పరమాణుభిః.

 ఋతుర స్మితవాచార్యః ప్రజ్ఞాదానాయతే ద్విజ

 ఇహాగతోఽహం యస్యామి పరమార్థ స్తవోదితః. 

ఏక మేవమిదం విద్ది న భేదః సకలం జగత్

 వాసుదేవాభిధేయస్య స్వరూపం పరమాత్మనః.   

ఆ మాటలు విని ఆరాజు భగవత్స్వరూపుడగు ఆ అవధూత బ్రాహ్మణునితో ఇట్లనెను. ఓ బ్రాహ్మణోత్తమా ! నేను శ్రేయస్సున కోరి కపిల మహర్షి వద్ద ఉపదేశము పొందుటకై వెళ్లుచున్నాను. నీవు కూడ కపిల మహర్షి యొక్క అంశమే. నాకు జ్ఞానమునిమ్ము. జ్ఞానరూపమగు మనోసాగరమును చేరుటచే శ్రేయస్సును కలుగు ఉపాయము చెప్పుము. బాహ్మణుడు పలికెను. ఇంకను ! శ్రేయస్సే కావలెనని అడుగుచున్నావు కాని పరమార్థ తత్త్వమేమని ఆడుగుటలేడు. రాజా! నీవనుకొనని శ్రేయస్సులన్నియు ఆ పరమార్థములే. మానవుడు దేవతారాధన చేసి ధన సంపత్తి ని పుత్రులను రాజ్యమును పొందకోరుచున్నాడు. రాజా నీవే చెప్పుము. అదియే ఆతనికి శ్రేయస్సు, వివేక వంతునకు పరమాత్మ ప్రాప్తి యే శ్రేయస్సు. యజ్ఞాది క్రియగాని ద్రవ్యసిద్ధి కాని, అతనికి శ్రేయస్సు కాదు. పరమాత్మ జీవాత్మల ఏకత్వమే పరమార్థము. ఏకము వ్యాపి, సమము, శుద్ధమ, నిర్గుణము, ప్రకృతి అతీతము, జన్మ వృద్ధ్యాది రహితము సర్వగతము, వికార రహి తము జ్ఞానమయము ఆసంగము గుణజాల్యాది రహితము సర్వశక్తముడైన ఆత్మయొక్క జ్ఞానమే పరమార్థము. ఇపుడు నిదాఘు నకను ఋతువునకును జరిగిన సంవాదమును చెప్పెదను వినుము. బ్రహ్మసుతుడగు ఋతువు మహాజ్ఞాని. పులస్త్యనందను డగు నిదాఘుడు ఆతనికి శిష్యుడే విద్యలు నేర్చి పిదప దేవికా” నదీ తటమున ఒక నగరము లో నివసించుచుండెను. ఋతువు తన శిష్యుని వాసస్థానమును తెలుసుకొనేను. వెయ్యి దివ్య వరము దాటిన పిమ్మట ఋతువు నిదాఘుని చూచు టకు వెళ్లెను, ఆసమయమున నిదాఘుడు వైశ్వ దేవానంతరము భుజించి తన శిష్యులతో ఇట్లు పలుకుచుండెను. భోజనా నంతరము నాకు తృప్తి కలిగినది. అక్షయ తృప్తి నిచ్చునది భోజనమే. ఋతవు పలికెను. ఓ బ్రాహ్మణా ! ఆకలి గొన్న వానికే భోజనానంతరము తృప్తి కలుగును. నాకెన్నడును ఆకలియే కలుగలేదు. నన్ను తృప్తి ని గూర్చి ఎదు కడుగు చున్నావు. ఆకలి దప్పికలు దేహ ధర్మములు కాని, నాకు సంబంధించినవి కావు. నీవు ఆడిగినావు కాన చెప్పు చున్నాను. నాకు సర్వదా తృప్తి యున్నది. ఆత్మ ఆకాశ మువలే సర్వవ్యాప్తము. ఆత్మయే నేను. అందుచే నీవు ఎక్క డి నుండి వచ్చుచున్నావు? అను ప్రశ్నకు అవకాశములేదు. నేను వేళ్ళు పొడను కాను. వచ్చువాడను కాను. ఒక ప్రదేశము వున్న వాడను కాను. మట్టితో కట్టిన ఇల్లు మట్టి పూయుటచే గట్టిపడినట్లు ఈ పార్థివ దేహము పార్థివ పరమాణువులచే గట్టి అద్వైత బ్రహ్మ విజ్ఞానమ్ పడుచుండును. నీవు నాకంటే భిన్ను డవు కాదు. నేను నీకంటే భిన్నుడనుకాను. ఓ బ్రాహ్మణా ! నేను ఆచార్యుడనైన ఋతువును. నీకు జ్ఞానోపదేశము చేయుటకై వచ్చితిని. ఇప్పుడు వెళ్లేదను. నీకు పర మార్థతత్వమును ఉపదేశించితిని. ఈ ప్రపంచమంతయు ఏకైక వాసుదేవనామక పరమాత్ముని స్వరూపమని తెలిసికొనుము. దీనిలో భేదము ఏ మాత్రములేదు.    

ఋతుర్ వర్ష సహస్రాన్తే పున స్తన్న గరం యమౌ

 నిదాఘం నగర ప్రాన్తే ఏకాన్తే స్థితమబ్రవీత్.  

 నిదాఘ ఉవాచః

భో విప్రజనసంవాదో హహానేష నరేశ్వర 

ప్రతివీక్షః పురం రమ్యం తేనాత్ర స్థీయతే మయా.  

 ఋతు రువాచః

నరాధిపోఽత్ర కతమః కతమశ్చేతరోజనః

 కథ్యతాం మే ద్విజ శ్రేష్ఠ త్వమభిజ్ఞో ద్విజోత్తమ.

 యోఽయం గజేంద్ర మున్మ త్తమద్రిశృంగ సముత్థితమ్

 అధిరూఢో నరేంద్రోఽయం పరివార స్తథేతరః.

గజోయోఽయమదో బ్రహ్మన్ను పర్వేష స భూపతిః

 ఋతురాజో గజః కోఽత్ర రాజా చాహనిదాఘకః.

ఋతుర్ని దాఘ ఆరూడో దృష్టా న్తం పశ్యవాహనమ్

 ఉపర్యహం యథా రాజా త్వ మధః కుంజరో యథా.

ఋతుః ప్రాహ నిదాఘం తం కతమస్త్వా మహంవదే

ఉక్తో నిదాఘస్తం నత్వా ప్రాహమే త్వం గురుర్ధ్రువమ్.

నాన్యస్మాద్ద్వైత సంస్కార సంస్కృతం మానసం తథా.

 ఋతుః ప్రాహ నిదాఘం తం బ్రహ్మజ్ఞానాయ చాగతః

 పరమార్థం సారభూత మద్వైతం దర్శితం మయా. 

 బ్రాహ్మణ ఉవాచః

నిదాఘోఽప్యుపదేశేన తేనాద్వైత పరోఽభవత్

సర్వభూతాన్యభేదేన దదృశే స తదాత్మని.

అవావ ముక్తిం జ్ఞానాత్స తథా త్వం ముక్తిమాప్స్యసి

 ఏకః సమస్తం త్వంచాహం విష్ణుః సర్వగతోయతః.

పీతనీలాది భేదేన యథైకం దృశ్యతే నభః

భ్రాంతి దృష్టిభిరాత్మాపి తథైకః స పృథక్ పృథక్ . 

 అగ్ని రువాచః

ముక్తింహ్య వాప భీవతో జ్ఞానసా రేణ భూపతిః

 సంసారాజ్ఞాన వృక్షారిజ్ఞానం బ్రహ్మేతి చింతయ.

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే ఆద్వైత బ్రహజ్ఞానం నామాశ్త్యధిక త్రిశతతమోఽధ్యాయః. 

పిదప వెయ్యి సంవత్సరముల తరువాత ఆ నగరముకు వెళ్ళిన ఋతువు నగర ప్రాంతమున ఏకాంత ప్రదేశము నందు వున్న నిదాఘుని చూచి ఇట్లనెను. నీవు ఏకాంతస్థానమున వున్నా వెందులకు నిదాఘుడు ! పలికెను, ఓ బ్రాహ్మణ మార్గమున ఎక్కువ జనసమ్మర్థము వున్నది. ఇపుడు రాజు సుందరమైన తన నగరములోనికి ప్రవేశించుచున్నాడు. అందుచే నేనిచ్చట ఆగియున్నాను. ఋతువు పలికెను. వీరిలో రాజు ఎవ్వరు? సామాన్యులెవ్వరు? నీకు తెలియును. కాన చెప్పుము, నీదాఘుడు పలికెను. మదించియున్న పర్వత శిఖర సదృశమగు గజేంద్రమును అధిష్టించియున్న వాడు నరేంద్రుడు. ఆతనిని చుట్టియున్న వారు ఇతర పరివారము. క్రిందనున్నది గజము. దానిపైననున్న వాడు రాజు. ఋతువు పలికెను. వీరిలో రాజు ఎవరు? గజము ఏది ? నిదాఘుడు చెప్పెను. సరే చెప్పెదను. అని పలుకుచు నిదాఘుడు ఋతువు పైకి ఎక్కి ఈ దృష్టాంతము ద్వారా తెలుసుకొనుము. పైనున్న నేను రాజు వంటివాడను. నాక్రింద నీవు ఏనుగువలె నిలచియున్నావు, ఋతువు పలికెను. నేనెవ్వరు? నీవు ఎవ్వరవని ఆందును. ఈ విధముగ పలుకగనే నిధాముడు నమస్కరించి సత్యముగ నీవు నా గురువు. ఏలననగా ! ఈ విధముగా ఆద్వైత సంస్కార సంస్కృతమగు మనస్సు కలవారు ఎవ్వరును లేరు! ఋతువు పలికెను, నీకు బ్రహ్మజ్ఞానము ఉపదేశించుటకై వచ్చితిని. పరమార్థము, సొర ము ఐన ఆద్వైతమును బోధించితిని. బ్రాహ్మణుడు పలికెను. ఆ ఉపదేశముపొంది నిదాఘుడు కూడ ఆద్వైత జ్ఞాని అయ్యెను. సమస్త ప్రాణులను, తనకంటే ఆభిన్న ములుగా చూచేను. అజ్ఞానమువలన ముక్తిని పొందెను. నీవు కూడ ఆట్లే ముక్తిని పొందేదవు. నీవు నేను ఈ సర్వ జగత్తు అంతయు ఏకమాత్రము వ్యాపకము ఆగు విష్ణు స్వరూపము. ఒకే ఆకాశము పీతలీలాది భేదములతో వేర్వేరుగా కనబడునట్లు భ్రాంత దృష్టి కలవారికి ఒకే ఆత్మ వేర్వేరు వేరుగ కన్పట్టును. అగ్ని దేవుడు పలికెను. ఆరోజు ఈ జ్ఞాన సారమును పొంది సంసారమునుండి ముక్తి పొందేను. అజ్ఞాన మయమగు సంసార వృక్షమునకు బ్రహ్మ జ్ఞానమే ఖడ్గము అని నిరంతరము చింతనము చేయుము. 

ఆగ్ని మహాపురాణమున ఆ ద్వైత బ్రహ్మ విజ్ఞానమను మూడు వందల ఎనుబదవ ఆధ్యాయము సమాప్తము.