అగ్ని మహా పురాణము

189 - అథ శ్రవణద్వాదశీవ్రతమ్

అగ్నిరువాచః-

శ్రవణద్వాదశీం వక్ష్యే మాసి భాద్రపదే సితే

శ్రవణేన యుతా శ్రే ష్ఠా మహతి సా హ్వుపోషితా.

నజ్ఞమే సరితాం స్నానాచ్ఛవణద్వాదశీఫలమ్

బుధశ్రవణసంయుక్త దానాదౌ సుమహాఫలా.

 నిషిద్దమపి కర్తవ్యం త్రయోదశ్యాం తు పారణమ్

ద్వాదశ్యాం చ నిరాహారో వామనం పూజయామ్యహమ్.

ఉదకుమ్ళే స్వర్ణమయం త్రయోదశ్యాం తు పారణమ్

 ఆవాహయామ్యహం విష్ణుం వామనం శబ్ధచక్రిణమ్.

సితవస్త్రయుగచ్ఛన్నౌ ఘటౌ సచ్ఛత్రపాదుకె

 స్నాపయామి జలైః శుద్దెర్విషుణం పఞ్చామృతాదిభి:.

 చత్రదణ్ణధరం విష్ణుం వామనాయ నమో నమః

 ఆర్ఘ్యం దదామి దేవేశః అర్ఘ్యర్షాద్యైః సదార్చితః.

 భుక్తిముక్తి ప్రజాకీర్తి సరైశ్వర్యయుతం కురు

వామనాయ నమో గనం మేనేనాష్టకం శతమ్.

ఓం నమో వాసుదేవాయ శిరః సంపూజయేద్ద రేః

శ్రీధరాయ ముఖం తద్వత్కథే కృష్ణాయ వై నము.

నమః శ్రీపతయే వక్షో భుజౌ సర్వాస్త్రధారిణే

వ్యాపకాయ నమో నాభిం వామనాయ నమః కటిమ్.

 త్రైలోక్యజననాయేతి మేడ్రం జట్టే యజేద్దరే

సర్వాధిపతయే పాదౌ విష్ణోః సర్వాత్మనే నము.

మృతపక్వం చ నైవేద్యం దద్యాద్దధ్యోదనైర్ఘటాన్

రాత్రే చ జాగరం కృత్వా ప్రాతః స్నాత్వా చ సజమే.

గన్దపుష్పాదిభిః పూజ్య వచేతుష్పాక్షులి స్విదమ్

నమో నమస్తే గోవిన్ద బుధశ్రవణసంజ్ఞత.

 అమౌఘసంక్షయం కృత్వా సర్వసౌఖ్యప్రదో భవ

ప్రీయతాం దేవదేవేశ మమ నిత్యం జనార్ధన.

 వామనో బుద్ధిదో దాతా ద్రవ్యస్ట్రో వామనః స్వయమ్

వామనః ప్రతిగృహ్ణతి వామనో మే దదాతి చ.

 ద్రవ్యస్టొ వామనో నిత్యం వామనాయ నమో నమః

ప్రదత్తదక్షిణో విప్రాన్ సంభోజ్యాన్నం స్వయం చరేత్.

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే శ్రవణద్వాదశీ వ్రతం నామ ఏకోననవత్యధిక శతతమోద్యాయః.

ఆగ్ని దేవుడు చెప్పెను:- ఇప్పుడు భాద్రపదశుక్ల పక్షమున చేయబడు “శ్రవణద్వాదశీ”వ్రతమును గూర్చి చేప్పేడను. శ్రవణనక్షత్రయుక్త మైన చో ఈ ద్వాదశి శ్రేష్టమైనది. ఉపవాసము చేసినచో గొప్ప ఫలము నిచ్చును. శ్రవణ ద్వాదశినాడు నదీసంగమస్నానపం విశేషఫలప్రదము. బుధవార శ్రవణ నక్షత్రములు కలిసిన ద్వాదశినాడు చేయు దానాదులు గొప్పఫలముల నిచ్చును. త్రయోదశినాడు నిషిద్ధ మైనను ఈ ప్రకముయొక్క పారణము త్రయోదశినాడు చేయవలెను.” “నేను ద్వాదశినాడు ఉపవాస మండి జలపూర్ణ కలశము పైనున్న సువర్ణనిర్మిత వామనమూర్తి ని పూజించి వ్రతపాఠణము త్రయోదశినాడు చేసెదను” అని సంకల్పించవలెను.  రెండు శ్వేతవస్త్రములు ధరించినవాడును, ఛత్రపాదుకాధారియ, శంఖ చక్రములు ధరించినవాడును అగు వామనుని కలశముపై ఆవాహనము చేయుచున్నాను “ఛత్రదండాలంకృతు డగు విష్ణువును పంచామృతములతోను, శుద్ధజలములతోను  స్నానము చేయించుచున్నాను. వామనునకు నమస్కారము. “ఆర్ఘ్యమునకు తగువారిచేతను, ఇతరుల చేతను పూజితుడవగు ఓదేవేళా! నీకు అర్ఘ్యము సమర్పించుచున్నాను. నాకు భోగ- మోక్ష- సంతాన - యశః - పరమెశ్వర్యాదుల నిమ్ము” ‘వామనాయ నమః’ అను మత్రముతో గంధద్రవ్యములు సమర్పించి ఈ మంత్రముతోనే నూట ఎనిమిది హోమములు చేయవలెను. ఈ క్రింది విధముగ సర్వాంగపూజ చేయ వలెను. ఓం నమో వాసుదేవాయ శిరః పూజయామి. శ్రీధరాయ మః ముఖం పూజయామి. కృష్ణాయ నమః కణ్ణంపూజయామి. శ్రీపతయే నమః వక్షస్థలం పూజయామి. సర్వాస్త్రధారిణే నమః భుతో పూజయామి. వ్యావకాయనమః నాభిం పూజయామి. వామనామ నమః కటిం పూజయామి. త్రైలోక్యజననాయ నమః మేడ్రం పూజయామి. సర్వాధిపతయే నమః జట్టే పూజయామి సర్వాత్మనే నమః పాదౌ పూజయామి”. పిదప వామనునకు మృతపక్వ పదార్థము నైవేద్యము దధ్యోదపూర్ణ పాత్రమును సమర్పించవరిమ. రాత్రియందు జాగరము చేసి ప్రాతః కాలమున సంగమమునందు స్నానము చేయవలెను. పిదప గంధపుష్పాదులతో పూజించి ఈ విధముగా ప్రార్థించుచు పుష్పాంజలి సమర్పించవలెను- “ఓబుధుడు, శ్రవణుడు అను పేర్లు గల గోవిందా! నీకు నమస్కారము, నమస్కారము. నాపాపములన్నీ తొలగించి సమస్త సౌఖ్యములను ఇమ్ము. దేవదేవేశ్వరా! జనార్ధనా! నే నిచ్చిన ఈ పుష్పాంజలిచే నర్వదా ప్రసన్నుడవు కమ్మ.” పిదప పూజాద్రవ్యము లన్నియు ఈ క్రింది వీధముగా చెప్పుడు బ్రాహ్మణునకు దానము చేయవలెను. “వామనుడే బుద్ధి నిచ్చువాడు. వామనుడే దాత. ఈ ద్రవ్యములలో ఉన్న వాడు వామనుడే. వామనుడే దీనిని గ్రహించుచున్నాడు. వామనుడే ఇచ్చుచున్నాడు. వామనుడు అన్ని ద్రవ్యములందును ఉన్నాడు. వామనరూప డగు విష్ణువునకు నమస్కారము.” పిదప బ్రాహ్మణులకు భోజనము పెట్టి తాను భోజనము చేయవలెను.

ఆగ్ని మహాపురాణమునందు శ్రవణద్వాదశీవ్రత మను నూట ఎనుబది తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.