అగ్ని మహా పురాణము

101 - అథ ప్రాసాదప్రతిష్ఠా విధిః

 ఈశ్వర ఉవాచః-

ప్రాసాదస్థాపనం వక్ష్యే తచైతన్యం స్వయోగతః

శుక నాసాసమాప్తా తు పూర్వవై ద్యాశ్చ మధ్యతః.

ఆధారశక్తితః పద్మే విన్యస్తే ప్రణవేన చ

స్వర్ణాద్యేకతమోద్భూతం పశ్చిగవ్యేన సంయుతమ్.

మధుక్షరయుతం కుమ్బం న్య స్తరత్నా దీపక్బాకమ్

సర్వస్త్రం గన్గలి పం చ గన్తవత్సుష్పభూషితమ్.

శ్రీ చూతాదిపల్లవానాం చ కృతి కృత్యం చ విన్య సేత్

పూరి కేణ సమాదాయ సకలీకృతవిగ్రహః.

సర్వాత్మాభిన్న మాత్మానం స్వాణునా స్వా శ్రమారుతః

ఆజ్ఞయా బోధయేచ్ఛమౌ రేచ కేన తతో గురుః.

ద్వాదశాక్షాత్సమాదాయ స్ఫురద్వహ్నికణోపమమ్

నిక్ష పేత్కుమృగర్భే చ న్య స్తతస్రాతివాహికమ్,

విగ్రహంతద్గుణానాం చ బోధకం చ కలాదికమ్

డౌన్తం వాగీశ్వరం తత్తు వాతం తత్ర నివేశయేత్.

తత్ర నాడీర్ధశప్రాణానిక్ట్రియాణి త్రయోదశ

తదధిపాంశ్చ సంయోజ్య ప్రణవాద్యైః స్వనామభిః.

శ్రీ స్వకార్యకారణల్వేన మాయాశ నియామి కాః

విద్యేశాస్ ప్రేరకాన్ శమ్భుం వ్యాపినం చ సుసమ్బరై .

అజ్ఞాని చ వినిక్షిప్య నిరుంధ్యాద్బోధముద్రయా

సువర్ణాద్యుద్భవం యద్వా పురుషం పురుషానుగమ్.

పళ్చాగవ్యకషాయాద్యైః పూర్వవత్సంస్కృతం తతః

శయ్యాయాం కుమ్బమార్ష్య ధ్యాత్వా రుద్రముమాపతిమ్.

తస్మింశ్చ శివమ నేణ వ్యాపక త్వేన వీన్య సేత్

సన్నిధాన్య హోమం చ ప్రోక్షణం స్పర్శనం జపమ్.

సాన్నిధ్యబోధనం సర్వం భాగత్రయవిభాగతః

విధాయైవం ప్రకృత్య నే కుమ్బే తం వినివేశ యత్.

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే ప్రాసాద ప్రతిష్టావిధానం నామ ఏకశ తతమోధ్యాయః.

పరమేశ్వరుడు పలికేను ; స్కందా! నే నిపుడు ప్రాసాడ (దేవాలయ ప్రతిష్టావిధి చేప్పెదను. దానియందు చైతన్యసంబంధమును చూపుచున్నాను. దేవాలయమునందలి శుక నాసము సమాప్తియగు చోటపూర్వవేదిమధ్యభాగమునందు ఆధార్చ శని భావించి ప్రణవమంత్రముతో కమలమున్యాసము చేయవలెను. దాని పైన సువర్ణదీధాతువులలో ఏదైన ఒక దానితో చేసిన కలశను స్థాపించవలెను. దానిలో పంచగవ్యములు, మధువు, పాలు, రత్నములు, మొదలగు ఐదు శస్తువులు ఉంచ వలెను. కలశ పై గంధము పూసి, వస్త్రముచే కప్పి, సుగంధపుష్పములతో వాసితము చేసి, చూతాదిపంచవృక్షముల పల్లవము లచే దాని ముఖమును ఆచ్చేదీంచవలెను. హృదయముత్రముతో హృదయకమలభావన చేయుచు ఆ కలశను అచట స్థాపించ వలేను. పిదప గురువు పూరక ప్రాణాయామముతో శ్వాసను లోనికి గ్రహించి, శరీరమతో సకలీకరణక్రియ చేయవలెను. స్వమంత్రముతో కుంభక ప్రాణాయామము ద్వారా ప్రాణవాయువును లోపల ఆవరుద్దము చేయవలెను. ఈశ్వరుని అనుమతితో సర్వోత్మాభిన్న మొన జీవచైతన్యమును జాగృతము చేయవలెను, రేచక ప్రాణాయామముతో ప్రజ్వలించుచున్న అగ్నికణము వలె నుండు జీవ చైతన్యమును ద్వాదశాంతస్థానమునుండి గ్రహించి, కలశములో స్థాపించి, దానియందు అతివాహికశారీరచ్యాసము. చేసి, దాని గుణములను బోధించు కాలాదీకమును, ఈశ్వరసహితము అగు పృధ్వీపర్వంతతత్త్వ సముదాయమును దాని, యందు వివేకింపచేయవలెను. పదమూడు ఇంద్రియములను, తదధిపతులను నామమాత్రముతోకలక పై స్థాపించి,ప్రణవను మొదట చేర్చిన నామముత్రములతో పూజించవలెను. తమతమ కార్యములు చేయించు మాయాపాక నియామీక లను ప్రేరకులగు విద్యేక ఉలను, సర్వవ్యాపియగు నీవనీ తమమంత్రములతో న్యాసముచేసి హజించవలెను. సకల అంగముల న్యాసముచేసి అవరోధినీము ద్రతో వాటి విన్నింటిని నిరోధించవచ్చు. లేదా సువర్గాదిధాతువులతో ఒక మానవాకృతి నిర్మించి, దానిని పంచగవ్యములతోను, కషాయద్రవ్యములతోను శుద్ధి చేసి శయ్యపై కూర్చుండబెట్టి ఉమాపతి యైన రుద్రుని ధ్యానించుచు, శివపుత్రముతో ఆ పురుష శరీరమునందు వ్యాపకరూపమున ఆ శివుని న్యాసము చేయవలెను. శివసాన్నిధ్యముకోర తై హోమ-ప్రోక్షణ-స్పర్శ-జపములు చేయవలెను. సునిధాపనము రోధకము మొదలగు సకలకార్యములను భాగత్రయవిభాగపూర్వకముగ చేయవలెను. ఈ విధముగ ప్రకృతిపర్యంతవ్యాసము నకు సంబంధించిన న్యాసవిధానము పూర్తి చేసి ఆ పురుషుని కలశములో స్థాపించవలేను.

ఆగ్ని మహాపురాణమునందు ప్రాసాదప్రతిష్ణావిధానమను నూటఒకటవ అధ్యాయము సమాప్తము.