పుష్కర ఉవాచః
వక్ష్యేంఽతః పుర చిన్తాం చ ధర్మాద్యాః పురుషార్థకాః ।
అన్యోఽన్య రక్షయా తేషాం సేవాకార్యాస్త్రియానృపైః.
ధర్మమూలోఽర్థవిటపస్త థా కర్మఫలోమహాన్ ।
త్రివర్గపాదప స్తత్రరక్షయాఫలభాగ్భవేత్.
కామాదీనాఃస్త్రియో రామ తదర్ధంరత్న సంగ్రహః ।
సేవ్యాస్తా నాతి సేవ్యాశ్చ భూభుజావిషయైషిణా.
ఆహారోమైథునం నిద్రా సేవ్యానాతి హి రుగ్భవేత్ ।
మంచాధికారే కర్తవ్యాః స్త్రియః సేవ్యాః స్వరామికాః.
దుష్టాన్యాచరతేయాతు నాభినన్దతి తత్కథామ్ ।
ఐక్యం ద్విషద్భిర్వ్రజతే గర్వం వహతి చోద్దతా.
చుంబితా మార్ష్టివదనం దత్తం నబహు మన్యతే ।
స్వపిత్యాదౌ ప్రసుస్తాపి తథా పశ్చాద్వి బుద్యతే,
స్పృష్టాదునోతిగా త్రాణి గాత్రం చ విరుణద్దియా ।
ఈషచ్ఛృణోతి వాక్యాని ప్రియాణ్యపిపరాజ్ముఖీ .
నపశ్యత్యగ్రదత్తం తు జఘనం చ నిగూహతి ।
దృష్టే వివర్ణవదనా మితేష్వథ పరాఙ్ముఖీ.
తత్కామితాసు చస్త్రీషు మద్య స్థేవ చ లక్ష్యతే ।
జ్ఞాతమండన కాలాపి నక రోతి చ మండనమ్.
యాసా విరక్తాతాం త్యక్త్వా సానురాగాం స్త్రియం భజేత్ ।
దృష్టైవ హృష్టాభవతి వీక్షితేచ పరాఙ్ముఖీ.
దృశ్యమానా తథాన్యత్ర దృష్టిం క్షిపతి చఞ్చలామ్ ।
తథాప్యుపావర్తయితుం నైవ శక్నోత్య శేషతః.
వివృణోతి తథాఽఙ్గాని స్వస్యా గుహ్యాని భార్గవ ।
గర్హితంచ తథైవాఙ్గం ప్రయత్నేన నిగూహతి.
తద్దర్శనే చ కురుతే బాలాలిఙ్గన చుమ్బనమ్ ।
ఆభాష్యమాణాభవతి సత్యవాక్యా తథైవ చ.
స్పృష్టాపులకితై రఙ్గైః స్వేదేనైవ చ భజ్యతే ।
కరోతి చ తథారామః సులభ ద్రవ్యయాచనమ్.
తతః స్వల్పమపి ప్రాప్య కరోతి పరమాంముదమ్ ।
నామసంకీర్తనాదేవ ముదితా బహు మన్యతే.
కరజాఙ్కాఙ్కితాన్యస్య ఫలాని ప్రేషయత్యపి ।
తత్ప్రేషితం చ హృదయే విన్యసత్యపి చాదరాత్.
ఆలిఙ్గనైశ్చ గాత్రాణి లింపతీవామృతేన యా ।
సుస్తే న్వపిత్యథాదౌ చ తథా తస్య విబుధ్యతే.
ఊరూస్పృశతి చాత్యర్ధంసుప్తం చైనం విబుధ్యతే ।
పుష్కరుడు చెప్పెను : ఇపుడు అంతఃపుర మును గూర్చి చెప్పెదను. ధర్మార్థకామము లను మూడు పురుషార్థము లకు ‘త్రివర్గ’ మని పేరు. వీటిలో ఒకదానిని మరొక దానితో రక్షించుచు రాజు స్త్రీలతో ఈ త్రివర్గమును సేవించవలెను. త్రివర్గము ఒక మహా వృక్షము వంటిది. ధర్మము దాని వేళ్ళు, అర్థ మ శాఖలు, కామము ఫలము. ఆ వృక్షమును మూల సహితముగా రక్షించిన యడలనే రాజు ఫలమును పొందగలుగును. పరశురామా ! స్త్రీలు కామమునకు వశవర్తనులై యుందురు. వారికొరకై రత్నములను సంగ్రహించవలెను. సిషయసుఖములు కోరు రాజు స్త్రీలను సేవించవచ్చును గాని ఆతిగా చేయగూడదు. ఆహారనిద్రా-మైథునములు మూడింటి యందును అతిగా ప్రవర్తింపరాదు. అట్లు చేసినచో రోగము లుత్పన్నము లగును. తనపై అనురాగముగల స్త్రీలను మాత్రమే తన మంచము మీదకి రానియ్యవలెను. దురాచార వంతురాలు తన భర్తను గూర్చి సంభాషణమును గూడ రుచింపనిదియు, అతని శత్రులతో కలియునదియు, ఆతీగర్వవంతు రాలును, ముద్దు పెట్టుకొన్నపుడు ముఖమును తుడిచి వేయునదియు లేదా కడుగుకొను నదియ, భర్త ఇచ్చిన వస్తువులపై ఆదరము చూపనిదియు, భర్త కంటే ముందుగనే నిద్రించి ఆతడు లేచిన తరువాత లేచునదియు, స్పృశించగా శరీరమున కంపింపచేయునదియు, ప్రతి అవయవమునందును ఆవరోధము కల్పించునదియు, భర్త పలుకు ప్రియవాక్యములను సరిగా వినక పరాజ్ముఖురాలుగా ఉండునదియు, ఎదుటకు వచ్చి, ఏదైన వస్తువు ఇచ్చినపుడు దానిని చూడనిదియు, తన జఘనమును పూర్తిగా ఆచ్చాదించుటకును, భర్త స్పృశించుటకు వీలుకాకుండునట్లు చేయుటకును ప్రయత్నించునదియు, భర్తను చూడగానే ముఖము ముణుచుకొనునదియు, ఆతని మిత్రుల విషయమున వైముఖ్యము చూపునదియు, ఆతడేమే స్త్రీలను ప్రేమించుకో వారి విషయమున ఔదాసీన్యము చూపునదియు, శృంగారించుకొను సమయమునందు కూడ శృంగారించుకొననిదియు అగు శ్రీ విరక్తురాలని అర్థము. అట్టి స్త్రీని పరిత్యజించి ఆనురక్తురాలిని సేవించవలెను. అనురాగపతియైన శ్రీ భర్తను చూడగనే సంతోషముతో వికసితముఖి యగును. మరొక వైపు ముఖమున్నను నేత్రాంతములతో ఆతనిని చూచుచు.డును భర్త తనను చూచుచున్నపుడు తన చంచలదృష్టిని కొంచెము మరొక వైపు తిప్పుకొనును, కాని పూర్తిగా త్రిప్పుకొనదు. ఆప్పుడప్పుడు తన గుప్తాంగములను కూడి చూపుచుండును. తన శరీరములో ఆసుందర మైన అంశమేదైన ఉన్నచో దానిని ప్రయత్న పూర్వకముగ కప్పికొనును. భర్తను చూచుచు చంటిపిల్లవాని ఆంనము చేసికొని ముద్దు పెట్టుకొనును. సంభాషణలో పాల్గొనుచు సత్యమునే పలుకును. భర్త స్పర్శ కలగగనే ఆమే అవయవములపై రోమాంచము, స్వేదము కలుగుచుండును. అతి సులభములైన వస్తువులను మాత్రమే అడుగును. ఆతడేంత చిన్న వస్తువునిచ్చినను చాల సంతసించును. ఆతని పేరు వినగవే ఆనందపరవశురాలై చాల ఆవరించును. భర్తకు తన వ్రేళ్ళ, ఆనవాలు పడిన పండ్లు పంపు చుండును. ఆతని నుండి వచ్చిన వస్తువు అదరముతో గ్రహించి దానిని వక్షఃస్థలము నందుంచుకొనును. తన ఆలింగనముచే భర్త శరీరమునందు ఆమృతలేపము చేయుచున్నట్లుండును. భర్త నిద్రించిన పిమ్మట నిద్రించును. ఆతని కంటే ముందుగనే మేల్కొనును. ఆతని ఊరువులను స్పృశించి నిద్ర నుండి మేల్కొల్పును.
కపిత్ధ చూర్ణయోగేన తథాదద్నః స్రజామునే.
ఘృతం సుగంధి భవతి దుగ్ధైః క్షిప్తైస్తథాయ వైః।
భోజ్యస్య కల్పనై వం స్యాద్గంధయుక్తిః ప్రదర్శ్యతే.
శాచమాచమనం రామ తథైవ చ విరేచనమ్ ।
భావనా చైవ పాకశ్చ బోధనం ధూపనం తథా.
వాసనం చైవ నిర్దిష్టం కర్మాష్టక మిదం స్మృతమ్ ।
కపిత్ధ బిల్వజంబ్వామ్ర కరవీరకపల్లవైః.
కృత్వోదకంతు యద్ద్రవ్యం శోధితం శోధనం తుతత్ ।
తేషామభావే శౌచంతు మృగదర్బామ్బసాభ వేత్.
నఖం కుష్ఠం మనం మాంసీ స్పృక్క శైలేయజంజలమ్ ।
తథైవ కుఙ్కుమంలాక్షా చందనాగురునీరదమ్.
సరలం దేవకాష్ఠంచ కర్పూరం కాన్తయా సహ ।
వాలః కుందురుకశ్చైవ గుగ్గులుః శ్రీనివాసకః.
సహసర్జర సేనై వం ధూప ద్రవ్యైక వింశతిః ।
ధూపద్రవ్యగణాదస్మాదేక వింశాధ్యథేచ్ఛయా.
ద్వే ద్వేద్రవ్యేసమాదాయ సర్జభాగైర్ని యోజయేత్ ।
నఖపిణ్యాక మలయైః సంయోజ్యమధునాతథా.
ధూపయోగాభవన్తీహ యథావత్స్వేచ్చయాకృ తాః ।
త్వచం నాడిం ఫలం తైలం కుంకుమం గ్రంథిపర్వకమ్.
శై లేయం తగరం క్రాన్తాం చోలం కర్పూర మేవచ ।
మాంసీం సురాంచ కుష్ఠంచ స్నానద్రవ్యాణి నిర్దిశేత్.
ఏతేభ్యస్తు సమాదాయ ద్రవ్యత్రయమథేచ్ఛయా ।
మృగ దర్పయుతం స్నానం కార్యం కందర్ప వర్ధనమ్.
త్వఙ్ము రాగలదై స్తుల్యైర్వాలకార్ధసమూయుతైః ।
స్నానముత్పల గంధస్యాత్సత్తెలం కుంకుమాయతే.
జాతీపుష్ప సుగంధి స్యాత్తగరార్ధేన యోజితమ్ ।
సద్వ్యామకం స్యాద్వకులై సుల్య గంధిమనోహరమ్.
మంజిష్ఠా తగరం చోలం త్వచం వ్యాఘ్రనఖం నఖమ్ ।
గంధపత్రం చ విన్యస్య గంధతైలం భ వేద్ధ్రువమ్.
తైలం నిపీడితం రామ తిలైః పుష్పాది వాసితైః ।
వాసనాత్పుష్పసదృశం గంధేనతు భవేద్ధ్రువమ్.
ఏలాలవంగ కంకోలజాతీ ఫలనిశాకరాః ।
జాతీ పత్రికయా సార్థం స్వతంత్రా ముఖవాసకాః.
కర్పూరం కుంకుమంకాన్తా మృగదర్పం హరేణుకమ్ ।
కంకోలై లా లవంగం చ జాతీ కోశకమేవ చ.
త్వకృత్రం త్రుటిముస్తౌ చలతాం కస్తూరికాంతథా ।
కంటకాని లవంగస్య ఫలపత్రేచ జాతితః.
కటకం చ ఫలం రామ కార్షికాణ్యుపకల్పయేత్ ।
తచ్చూర్ణేఖదిరం సారం దద్యాత్తుర్యంతు వాసితమ్.
సహకారరసేనాస్మాత్కర్తవ్యా గుటికాః శుభాః ।
ముఖన్యస్తాః సుగంధాస్తాముఖరోగ వినాః నాః.
పూగం ప్రక్షాళితం సమ్యక్పంచ పల్లవ వారీణా ।
శ క్త్వాతు గుటికా ద్రవ్యైర్వాసితం ముఖవాసకమ్ .
కటుకం దన్తకాష్టంచ గోమూత్రే వాసితం త్య్రహమ్ ।
కృతంచ పూగవద్రామ ముఖ సౌగంధికారకమ్.
త్వక్పథ్యయోః సమావంశౌ శశిభాగార్ధసంయుతౌ ।
నాగవల్లీ సమోభాతి ముఖవాసో మనోహరః.
ఏవం కుర్యాత్సదా స్త్రీణాం రక్షణం పృథివీపతిః ।
న చాసాం విశ్వసేజ్జాతు పుత్రమాతుర్విశేషతః ।
న స్వ పేత్త్ప్రిగృహే రాత్రౌ విశ్వాసః కృత్రిమోభవేత్.
ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే స్త్రీరక్షాదికామశాస్త్రం నామ చతుర్వింశత్యధిక ద్విశతతమోఽధ్యాయః॥
పరశురామా! పెరుగుమీగడలో కొంచెము కపిత్తచూర్ణము కలపగా తయారగు నేతివాసన చాల ఉత్తమమైనది. నెయ్యి, పెరుగు మొదలైనవాటితో యవలు, గోధుమలు మొదలైనవాటి పిండి కలుపగా ఉత్త మములై న ఖాద్యపదార్థములు తయారగును. ఇపుడు వివిధద్రవ్యముల గంధమును కలిగించు విధానము చెప్పెదను. శాచము, ఆచమనము, విరేచనము, భావన, పాకము, బోధనము, ధూపనమః, వాసనము అని ఎనిమిది విధములగు కర్మలు చెప్పబడినవి. కపిత్తము, బిల్వము, నేరేడు, మామిడి, కరవీరము-వీది పల్లవములచేత శుద్ధము చేసిన నీటితో ఏ వస్తువులైనను కడిగి, పవిత్రమగునట్లు చేసినచో దానికి ‘శాచనము’ అని పేరు ఈపల్లవ సులు లభించనిచో నీళ్ళతో కస్తూరి కలిపి వాటితో కడిగినచో శుద్ధియగును. నఖ-కూట - ఘన - జటామాంసీ - స్ప్ప క - శైలేయజ - జల - కుంకుమ - లాక్షా - చందన - అగరు - నీరద - సరం దేవదారు - కర్పూర - కాంతా - వాల-కందురుక - గుగ్గులు - శ్రీనివాస - కరాయలములను ఇరువదియొక యొక్క ద్రవ్యములు ధూపద్రవ్యములు. ఈ ఇరువది పదార్థము లో ఏవై నరెండు తీసికొని, వాటిలో కరాయసము కలిపి, వారిలో నఖము, తేలక ఒక పిండి, మజయచందన చూర్ణము చేర్చి తే కలుపవలెను. ఈ విధముగా ఇష్టానుసారము యథాస్త్రముగా కలిపి ద్రవ్యము లతో ధూపయోగములు తయారగును. త్వచా - నాడీ - ఫం - తై ల - కేసర - గ్రంథి పర్వ - శై.ను - తగర విష్ణుక్రాంలా టోల - కర్పూర - జటామాంసీ - మురా - కూటకములు స్నానోపయుక్త ద్రవ్యములు వీటిలో ఇష్ట మువచ్చిన మూడు ద్రవ్యములు తీసికొని కస్తూరికలిపి, ఇవన్ని యు కలిపిన జలముతో స్నానము చేసినచో కామవృద్ధికలుగును త్వచా - మురా - నలము ను సమానమైనపాళ్ళలో తీసికొని, వీటిలో సగము సుగంధదాల కలిపి, వీటితో స్నానము చేసినచో శరీరమునుండి కమలగంధమువంటి గంధము వచ్చును వీటితో తైలముకూడ పూసికొని స్నానము చేసినచో శరీర మురంగు కుంకుమవర్ణ సదృశముగ నుండును. పైన చెప్పిన ద్రవ్యములు సగముపాటు, తగరముకూడ కలిపినచో శరీర మునుండి చమేలిపువ్వు వాసన వంటివాసనవచ్చును. వాటిలో ద్వ్యామకమను ఓషధికూడ కలిపినచో మౌ సిరి ఇవ్వవాసన వచ్చును. నువ్వులనూనెలో మంజిష్ఠ తగ ర - చోల - త్వచా - వ్యా ఘరఖ - బ - గంధపతములను ఓషధులు కలపగా ముచిసువాసనగల తైలము తయారగును. తిలలను సుందరపుష్పముతో వాసితము చేసి వాటిని ఆడించిచేసిననూనే ఆ పుష్పములవలే సుగంధముగలదగును. ఏలకులు, లవంగాలు, కాకోలము, జాజికాయ, కర్పూరము - వీటిలో ఏదై న ఒకటి జోజపతితో కలిపి నమ నినచో ముఖము సుగంధమగును. కర్పూర - కేసర - కాంతా - కస్తూరీ - మేడపల - కబాబచీర - ఏలా - లవంగ - జా-సుపు - పగ - త్వక్పత్ర - త్రుటి - మోథా - లతా - కస్తూరీ - లవంగ కంటక - జాయఫల - జాయపత్ర - కటుకఫలములను ఒక్కొక్క డబ్బెత్తు చొప్పున కలిపి, చూర్ణముచేసి, దానిలో నాల్గవవంతు వాసితమైన ఖైరసారము కలిపి మామిడిర సముతో అందముగా మాత్రలుచేసి ముఖమునందుంచుకున్నచో ముఖరోగములన్నియు తొలగిపోవును. వేనుక చెప్పిన ఐదుపల్లవముల జలముతో పోక చెక్కను కడిగి, యథాశక్తి గా పైనచెప్పిన మాత్రలకుపయోగించు ద్రవ్యములతో వాసితము చేసినచో ఆస్ ముఖమును సుగంధయుక్త ము చేయును. కటకమును పొంతన క మును మూడు దినములు గో మూత్రమునందు తడిపి ఉంచినచో అది పోక చెక్కవలెనే ముఖమును సుగంధితము చేయును. త్వచారణ్యహర్రే లను సమానమే. ఏళ్ళలో గ్రహించి, దానిలో సము కర్పూరమ కలిపి నోటిలో ఉంచుకొనినచో లాంబూలంధము వచ్చును. ఈ విధముగా రాజు తన సుగంధాది గుణములచే స్త్రీలను వశము చేసుకొని సర్వదావారిని రక్షించవలెను. వారినెన్నడును విశ్వసింపరాదు ప్రధానము పుత్రుని తల్లిని ఎన్నడును. విశ్వసింపరాదు. రాత్రి అంతయు స్త్రీ గృహమున నిద్రింపరాదు. ఆమెచూపిన విశ్వాసము కృత్రిమము కావచ్చును.
అగ్నిహహాపురాణమునందు రాజధర్మకథనమను రెండువందల ఇరువదినాల్గవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 224 of the Agni Purāṇa is as follows:
The ritual of Śrāddha, performed for the appeasement and elevation of departed ancestors (pitṛ-s), is described in detail. Agni explains the three types of Śrāddha — nitya, naimittika, and kāmya — and the days most auspicious for their performance, especially the Pitṛ-pakṣa fortnight. The proper manner of inviting qualified brāhmaṇas, the preparation of the piṇḍa, and the offering of tila and water (tarpana) are prescribed. The chapter teaches that neglect of Śrāddha brings misfortune to seven generations.