అగ్ని మహా పురాణము

276 - అథ ద్వాదశ సంగ్రామాః

ఆగ్ని రువాచః

కశ్యపో వసుదేవోఽభూద్దేవకీ చాదితిర్వరా

దేవక్యాం వసుదేవాత్తు కృష్ణోఽభూత్తపసాన్వితః.

ధర్మసంరక్షణార్థాయ హ్యధర్మహరణాయచ

సురాదేః పాలనార్థంచ దైత్యాదేర్మథనాయచ.

రుక్మిణీసత్యభామాచ సత్యానాగ్నజితీ ప్రియా

సత్యభామా హరేః సేవాగాంధారీ లక్ష్మణా తథా.

మిత్రవిన్దాచ కాలిన్దీదేవీ జాంబవతీ తథా

సుశీలాచ తథామాద్రీ కౌసల్యావిజయాజయా.

ఏవమాదీని దేవీనాం సహస్రాణితు షోడశ

ప్రద్యుమ్నాద్యాశ్చ రుక్మిణ్యాం భీమాద్యాః సత్యభామయా.

జాంబవల్యాంచ సాంబాద్యాః కృష్ణస్యాసం స్తథాపరే

శతంశతసహస్రాణాం పుత్రాణాం తస్యధీమతః.

ఆశీతిశ్చ సహస్రాణి యాదవాః కృష్ణరక్షితాః

ప్రద్యుమ్నస్యతు వైదర్భ్యా మనిరుద్ధోరణప్రియః.

అనిరుద్ధస్య వజ్రాద్యాయాదవాః సుమహాబలాః

తిస్రః కోట్యోయాదవానాం షష్టిర్లక్షాని దానవాః.

మనుష్యేబాధకాయేతు తన్నాశాయ బభూవసః

కర్తుంకర్మవ్యవస్థానం మనుష్యేజాయతే హరిః

అగ్నిదేవుడు పలికెను : కశ్యపమహర్షి వసుదేవుడుగను స్త్రీలలో శ్రేష్ఠరాలగు ఆదితి, దేవకిగను అవతరించిరి వారికి శ్రీకృష్ణుడు కుమారుడుగ అవతరించేను. మహాతపశ్శాలియగు శ్రీకృష్ణుడు ధర్మమును రక్షించుటకు ఆధర్మమును ఆంతముచేయుటకు దేవతాదులమ పాలించుటకు దైత్యాదులను మర్ధించుటకు అవతరించెను. రుక్మిణి సత్యభామ, నాగ్నచిత్ కుమార్తెయగు సత్య వీరకృష్ణునకు ప్రియమైన భార్యలు. సత్యభామ ఆయనకు ఆరాధ్యదేవి. గాంధారి - లక్ష్మణ- మిత్ర వింద - కాళింది - జాంబవతి - సుశీల - మాద్రి - కౌసల్య – విజయ - జయ మొదలగు పరహారువేలమంది స్త్రీలు శ్రీకృష్ణుభార్యలు, రుక్మిణి యందు ప్రద్యుమ్నాడు మొదలగు వారును, జాంబవతియందు సాంబుడు మొదలగు వారును, జన్మించిరి. మొత్తము ఆ శ్రీకృష్ణునకు ఒకకోటి ఎనభైవేల పుత్రులుండిరి. సకల యాదవులును శ్రీకృష్ణునిచే రక్షింపబడిరి. ప్రద్యుమ్న నకు విదర్భ రాజకుమారియందు యుద్ధప్రియుడగు అనిరుద్ధుడు పుట్టెను. ఆనిరుద్ధునకు వజ్రాదులు కుమారులుగ పుట్టిరి. యాదవులందరును మహాబలవంతులు మొత్తము వారిసంఖ్య మూడుకోట్లు. ఆసమయమున ఆరువది లక్షల దానవులు మనుష్యులుగా పుట్టి లోకులను హింసించుచుండిరి. వారిని నశింపచేయుటకే శ్రీ కృష్ణుడు ఆవతరించెను. కర్మమర్యాద రక్షకులకై కూడ అవతరించెను

దేవాసురాణాం సంగ్రామా దాయార్థం ద్వాదశాభవన్

 ప్రథమోనారసింహస్తు ద్వితీయో వామనోరణః.

సంగ్రామస్త్వథ వారాహశ్చతుర్థోఽమృతమంథనః

తారకామయ సంగ్రామః షష్ఠోహ్యాజీవకోరణః.

త్రైపురశ్చాంధకవధో నవమో వృతఘాతకః

జితోహాలా హలశ్చాథ ఘోరః కోలాహలో రణః.

హిరణ్యకశిపోశ్చోరో విదార్వచనఖైః పురా

నారసింహోదేశపాలః ప్రహ్లాదం కృతవాన్నృపమ్.

దేవాసురే వామనశ్చ చ్ఛలిత్వా బలిమూర్జితమ్

మహేంద్రాయ దదౌరాజ్యం కాశ్యపోఽదితిసంభవః.

వరాహస్తు హిరణ్యాక్షం హత్వాదేవాన పాలయత్

ఉజ్జహార భువంమగ్నాం దేవదేవైరభిష్టుతః.

మంథానం మందరం కృత్వానేత్రం కృత్వాతువాసుకిమ్

సురాసురైశ్చ మథితం దేవేభ్యశ్చామృతందదౌ.

తారకామయసంగ్రామే తదా దేవాశ్చపాలితాః

నివార్యేంద్రం గురూన్దేవాన్దా నవాన్సోమవంశకృత్.

విశ్వామిత్ర వసిష్ఠాత్రి కవయశ్చరణే సురాన్

అపాలయన్తే నిర్వార్య రాగద్వేషాది దానవాన్.

పృథ్వీరథే బ్రహ్మయనురీతస్య శరణోహరిః

దదాహతీపురం దేవపాలకో దైత్యమర్ధనః.

గౌరీం జిహిరుణా రుద్రమంధకే నార్దితం హరిః

అనురక్తశ్చ రేవత్యాం చక్రేచాండాసురార్ధనమ్.

ఆపాంఫేన మయోభూత్వా దేవాసురరణే హారన్

వృత్రం దేవహరంవిమ్ణ్దరేవ ధర్మానపాలయత్.

శాల్వాదీన్దానవాఞ్జిత్వా హరిః పరశురామకః

అపాలయత్సురాదీంశ్చ దుష్టక్షత్రం నిహత్యచ.

హాలాహలం విషందైత్యం నిరాకృత్య మహేశ్వరాత్

భయంనిర్ణాశ యామాస దేవానాం మధుసూదనః.

దేవాసురేరణే యశ్చదైత్యః కోలాహలోజితః

పాలితాశ్చసురాః సర్వేవిష్ణునా ధర్మపాలనాత్.

రాజానోరాజపుత్రాశ్చ మునయోదేవలాహరిః

యదుక్తం యశ్చనైవోక్త మవతారాహరేరిమే.

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే ద్వాదశసంగ్రామనామ షట్సప్తత్యధిక ద్విశతతమోధ్యాయః.

దేవాసురుల మధ్యదాయ భాగముకొరకై పండ్రెండు యుద్దములు జరిగెను. నారసింహము వామనము వారాహ సంగ్రామము, అమృతమంథనము, తార మయ సంగ్రామము, ఆజీవకము, జిత్ హాలహలము, ఘోర కోలాహలము. అను పేర్లతో ప్రసిద్ధమైనవి. పూర్వము నరసింహుడు హిరణ్యకశిపు వక్షమును చీల్చి ప్రహ్లాదుని రాజుగాచేసెను. మరల దేవాసురుల యుద్ధ సమయమున వామనుడుగా అవతరించి కాశ్యప ఆదితి పుత్రుడై, బలిని వంచించి ఇంద్రువకు రాజ్యమును ఇచ్చెను. వరాహమూర్తియై హిరణ్యాక్షునిచంపి దేవతలను రక్షించి మునిగిపోయిన భూమిని ఉద్దరించి దేవాధిదేవులచే స్తుతింపబడెను. దేవాసురులు కలసి మంథరాచలమును కవ్వముగను, వాసుకిని, త్రాడగ నుచేసి సముద్రము మథించి ఆమృతమును తీసిరి. అపుడు శ్రీ మహావిష్ణువు అమృతమును దేవతలకు ఇచ్చివేసెను. లారకా మయ సంగ్రామమునందు బ్రహ్మదేవుడు ఇంద్రబృహస్పతులు దేవరాదానవులను యుద్దము నుండి నివారించి దేవతలను రక్షించి సోమవంశ మును స్థాపించెను. ఆజీవక యుద్ధమున విశ్వామిత్ర వశిష్ట ఇత్యాది ఋషులు, రాగద్వేషాప్ దానవులను నివారించి దేవతలను పాలించిరి. శివుడు పృథ్విరథముగా రథమునకు వేదరూపములగు ఆశ్వములను కట్టి దానిని అధిష్టించేను. అపుడు శ్రీ మహావిష్ణువు బ్రహ్మను సారథిగ తీసుకొనిన ఈశ్వరునకు శరణమొసగి తాను బాణమై త్రిపుర దాహమును చేసెను. అంధకాసురుడు గౌరిని అపహరించుటకై రుద్రునకు కష్టమును కలిగించగ, రేవత్యనురక్తుడగు శ్రీహరి ఆ ఆసురుని సంహరించేను. దేవాసురయుద్ధమునందు విష్ణువువృత్ర సంహార మునకై నీటి నురుగుగా ఏర్పడి ఇంద్రుని వజమున లగ్న మయ్యెను. ఈ విధముగ ఇంద్రుని దేవధర్మమును పాలించి దేవతలను కష్టములనుండి విడిపించెను విష్ణువు పరశురామావతారమును ధరించి - శాల్వాదిదానవులను జయించి క్షత్రియులను నశింపచేసి దేవతాదులను రక్షించెను. మధుసూదనుడు హాలహల విషరూపమున ఆవిర్భవించిన దైత్యుని శంకరునిచే నశింపచేసి దేవతాభయమును శమింపచేసెను. దేవాసుర సంగ్రామమున కోలాహలడను దైత్యుని జయించి మహావిష్ణువు ధర్మమునుపాలించి సకలదేవతలను రక్షించెను. రాజులు రాజకుమారులు మునులు దేవతలు ఎల్లరును మహావిష్ణు స్వరూపులే. నేను ఇక్కడ పేర్లు చెప్పినవారును చెప్పనివారును కూడ మహావిష్ణు అవతారములే.

అగ్ని మహాపురాణమున ద్వాదశ సంగ్రామములను రెండువందల డెబ్బదియారవ అధ్యాయము సమాప్తము.