స్కంద ఉవాచః
విభక్తి సిద్దరూపంచ కాత్యాయన వదామితే ।
ద్వేవిభక్తీ సుప్తిజశ్చ సుపః సప్తవిభక్తయః.
సుఔజసితి ప్రథమా ఆమౌట్ శసో ద్వితీయా ।
టాభ్యాంభిసితి తృతీయా జేభ్యాంభ్యసశ్చ తుర్ధ్వపి.
జసిభ్యాంభ్యసః పంచమీస్యాత్ జసోషామితిషష్ఠ్యపి ।
జిఓస్సుబితి సప్తమీస్యాత్స్యుః ప్రాతిపదికాత్పరా:.
ద్వివిధం ప్రాతిపదికం హ్యజ స్తంచ హల న్తకమ్ ।
ప్రత్యేకం త్రివిధం తత్స్యాత్పుంమాంస్త్రీచ నపుంసకమ్.
దర్శ్యన్త నాయకా స్తేషా మనుక్తానాంచ వీర్యతః ।
పృక్షః సర్వోఽథ పూర్వశ్చ పథమశ్చ ద్వితీయకః.
తృతీయః ఖండపావహ్నిః సభాపతి రహర్పతిః ।
పటుర్నా గ్రామణీంద్రశ్చ ఖలపూర్మిత్ర భూః స్వభూః.
సుశ్రీ సుధీః పితా బ్రాతా నా కర్తా క్రోష్టు నప్తృకౌ ।
సురారా గౌ స్తథా ద్యౌ గ్లౌః స్వరాన్తాః పుంసినాయకాః।.
సువా క్త్వ కృషత్సమ్రాట్ జన్మభాక్ చ సురాడపి ।
ఆపో మరుద్బవన్ దీవనవాంశ్చ మమవాన్సిబన్.
భగవానఘవానర్వా వహ్ని మత్సర్వవిత్పుపృత్ ।
సుసీమాకుండి రాజా చళ్వా యుహమఘవాతథా.
పూషాసుకర్మా యజ్వా చ సువర్మా చ సుధర్మణా ।
ఆర్యమా వృత్రహా పంథాః సుకకుదాది పంచచ.
ప్రశాన్సుతాంశ్చ పంచాద్యాః సుగీః సురాః సుపూరపి ।
చంద్రమాః సువచాః శ్రేయాన్విద్వాఁశ్చోశనసాసహ.
పేచివాన్ గౌరనంగా న్గోధుజ్మిత్ర ద్రుహౌశ్వలిట్ ।
స్త్రియాంజియా జరాబాలా ఏడకా సహవృద్ధయః.
క్షత్రియా బహరాజాచ బహదామాఽథ బాలికా ।
మాయా కౌముదగంధాచ సర్వాపూర్వా సహాన్యయా.
ద్వితీయాచ తృతీయాచ బుద్ధిః స్త్రీ శ్రీర్నరీ సుధీః ।
భవన్తీ చైవ దీవ్యన్తీ భాతీ బాంతీ చ యాన్త్యపి.
శృణ్వతీ తుదతీ కర్త్రీతదన్తీ కుర్వతీ మహి ।
రుంధతీ క్రీడతీ దాంతీ పాలయంతీ సురాణ్యపి.
గౌరీ పుత్రవతీ నౌశ్చ వధూర్ధేవతయా భువా ।
తిస్రోద్వేకతి వర్షాభూః స్వనా మాతావరాచగౌః.
నైర్వాక్త్వ క్ప్రాచ్యవాచీతి తిరశ్చీన ముదీచ్యపి ।
శరద్విద్యుత్సరిద్యోషి దగ్ని విత్సస్యదా దృషత్.
యైషాసా వేదవిత్సం విదృష్వీరాజ్ఞీ త్వయామయా।
సీమాపంచాదయో రాజాధూః పూశ్చైవ దిశోగిరా.
చతస్రో విదుషీ చైవ కేయం దిగ్దృక్బతాదృశీ ।
ఆసౌస్త్రియాం నాయకాశ్చ నాయకాశ్చ నపుంసకే.
కుండం సర్వం సోమ పంచ దధి వారి ఖటవ్వథ ।
మధుత్రపు కర్తృ భర్తృ అతిభర్తృ పయః పురః.
ప్రాక్ప్రత్యక్ చతిర్యగుదగ్జగజ్జాగ్రత్తథా శకృత్ ।
సుసంపచ్చ సుదండీహ ఆహః కించేదమిత్యపి.
షట్ సర్పిః శ్రేయశ్చత్వారి ఆదోఽన్యే హీదృశాః పరే ।
ఏతేభ్యః ప్రథమాద్యాశ్చస్యుః ప్రాతిపదికాత్పరాః.
ధాతుప్రత్యయ హీనం యత్స్యాత్ప్రాతి పదికంతుతత్ ।
ప్రాతిపదికాత్వ్య లింగార్థ వచనే ప్రథమాభవేత్.
సంబోధనే చ ప్రథమా ఉక్తేకర్మణి కర్తరి ।
కర్మయత్క్రియతే తత్స్యాద్ద్వితీయా కర్మణిస్మృతా.
క్రియతే యేనక రణం కర్తాయశ్చ కరోతిసః ।
అనుక్తే తిజ్కృత్తద్దితే స్తృతీయా కరణే భవేత్.
కార కేక ర్తరి చ సాసం ప్రదానే చతుర్థ్యపి ।
యస్మైదిత్సాం ధారయతే సంప్రదానం తదీరితమ్.
ఆపాదానం యతోఽ దేతి ఆదత్తేచ భయం యతః ।
ఆపాదానే పంచమీస్యాత్స్వ స్వామ్యాదౌచ షష్ట్యపి.
ఆధారో యోఽధికరణం విభక్తిస్తత్ర సప్తమీ ।
ఏకార్థే చై కవచనం ద్వ్యర్థేద్వివచనం భవేత్.
బహుషు బహువచనం సిద్దరూపాణ్యథోవదే ।
వృక్షః సూర్యోమ్ళు వాహోఽర్కో హేరవే హేద్విజాతయః.
విప్రౌ గజాన్మ హేంద్రేణ యమాభ్యామనలైః కృతమ్ ।
రామాయ మునివర్యాభ్యాం కేభ్యో ధర్మాద్ధరౌరతి.
శరాభ్యాం పుస్తకేభ్యశ్చ అర్థ స్వేశ్వర యోర్గతిః ।
బాలానాం సజ్జనే ప్రీతిర్హ సయోః కమలేషచ.
ఏవం కామమ హేశాద్యాః శబ్దజ్ఞేయాశ్చ వృక్షవత్ ।
సర్వేవిశ్వేచ సర్వస్మై సర్వస్మాత్క తరోమతః.
సర్వేషాం స్పంచవిశ్వస్మిన్ శేషం రూపంచ వృక్షవత్ ।
ఏవంచోభయ కతరకతమాన్య తరాదయః.
పూర్వే పూర్వశ్చ పూర్వ స్మై పూర్వస్మాత్సు సమాగతః ।
పూర్వేబుద్ధిశ్చ పూర్వస్మిన్ శేష రూపన్తు సర్వవత్.
ఏవంపరావరాద్యాశ్చ దక్షిణో త్తర కాంతరాః ।
అపరాశ్చాదరోనేమాః ప్రథమా ప్రథ మేఽర్కవత్.
ఏవం చరమాశ్చ తయాఆల్పార్థానేమ ఆదయః ।
ద్వితీయ స్మై ద్వితీయాయ ద్వితీయస్మాద్ద్వితీయకాత్.
ద్వితీయస్మిన్ద్వితీయే చ తృతీయశ్చ తథాఽర్కవత్ ।
సోమపాః సోమపౌజ్ఞేయౌ సోమపాః సోమపాం వ్రజ.
కిలాతపౌ సోమపశ్చ సోమపాత్సోమ పే దద ।
సోమపాభ్యాం సోమపాభ్యః సోమపః సోమపౌకులమ్.
ఏవం కీలాలపాద్యాః స్యుః కవిరగ్ని స్తథాఽరయః ।
హేతవే కవిమగ్ని తాన్హరీ న్యాత్సకినా హృతమ్.
రవిభ్యాం రవిభిర్దేహి వహ్నయేయః సమాగతః
ఆగ్నేరగ్నోస్తథా గ్నీనాం కవౌక వ్యోః క విష్వఽథ.
ఏవం సుసృతి రభ్రాన్తిః సుకీర్తిః సుధృతి స్తథా ।
నఖాసఖాయౌ సఖాయః హేసఖే వ్రజసత్పతిమ్.
సఖాయంచ సఖాయౌచ సఖీన్సఖ్యాగతోదద ।
సఖ్యేసఖ్యుశ్చ సఖ్యుశ్చ సఖ్యోః శేషః కవేరివ.
పత్యాపత్యేచ పత్యుశ్చ పత్యుః పత్యో స్తథాఽగ్నివత్ ।
ద్వౌద్వౌద్వాభ్యాం ద్విత్వాద్య రేద్వయోర్ద్వయోః.
త్రయస్త్రింశ్చ త్రిభిస్త్రిభ్యస్త్రయాణాంచ త్రిషక్రమాత్ ।
కవివత్కతి కతీతి శేషం బహువచనం స్మృతమ్.
నీర్ని యాచ నియోహేనీ: నియం నియౌనియోనియా ।
నీభ్యాం నీభిర్నియే నీభ్యః నియాం నియినియో స్తథా.
సుశ్రీ : సుధీః ప్రభృతయోగ్రామణీః పూజయేద్దరిమ్ ।
గ్రామణ్యౌ గ్రామణ్యో గ్రామణ్యం గ్రామణ్యా గ్రామణీభిః .
గ్రామణ్యోర్గ్రామణ్యా మేవం సేనానీ ప్రముఖా సుభూః ।
సుభువౌచ స్వయం భూవః స్వయంభువం స్వయం భువః.
స్వయంభువా స్వయంభువి ఏవం ప్రతి భువాదయః ।
ఖలపూః ఖలప్వౌ శ్రేష్ఠౌ ఖలప్వంచ ఖలప్విచ.
ఏవం శరప్ర ముఖాః స్యుః క్రోష్టాకోష్టార ఈరితాః ।
క్రోష్టోఅ,శ్చ క్రోష్టునా క్రోష్ట్రా క్రోష్టూనాం క్రోష్టరీదృశమ్.
పితాపితరౌ పితర: హేపితః పితరౌ శుభౌ ।
పితౄన్పితుః పితుః పిత్రోః: పితౄణాం పితరీదృశమ్.
ఏవం భ్రాతాచ జామాతృ ముఖౌనృణాం నృణాం తథా ।
కర్తా కర్తారో కర్తృశ్చ కర్తృణాం కర్తరీదృశమ్.
పితృవచ్చైవ ముద్గాతా స్వసానాత్ప్రాదయః స్మృతాః ।
సురాః సురాయౌసరాయః సరాయంచ సరాయ్యపి.
గౌః గావౌ గంగాగ వాచ గోర్గ వోచ్చ గవాం గవి ।
ఏవం దౌగ్ర్లోశ్చాపి తథాస్వరాన్తాః పుంసినాయకాః.
సువాక్సుదాచౌ సువాచా సువాగ్భ్యాంచ సువాక్ష్వపి ।
ఏవం దిక్ప్రముఖాః ప్రాజ్చపాంచౌ ప్రాంచశ్చ భోవ్రజ.
పాగ్భ్యాం పాగ్భిః పాచాంచ ప్రాచిచ పాజ్షుపాజ్ఞ్వపి ।
ఏవహ్యుదజ్దీ చీవా సమ్యజ్ ప్రత్యక్ సమీచ్యపి.
తిర్యజ్ తిరశ్చః సధ్ర్యజ్ చ విష్వద్ర్యజ్ పూర్వవత్స్మృతాః ।
ఆదద్యజ్ దముయగం స్యాత్తథా ముముయ జీరితః.
ఆదద్యంచౌ హ్యముద్రీచం అదద్యగూభ్యాంచ పూర్వవత్ ।
తత్త్వతృట్ తత్త్వతృషాచ తత్వతృ ఙ్భ్యాంసమాగతః.
తత్త్వతృషి తత్త్వతృట్ సు ఏవంకాష్ఠ తడాదయః ।
భిషక్ భిషగ్భ్యాం భిషజి జన్మభాగాదయ స్తథా.
మరున్మరుద్భ్యాం మరుతిఏవం శత్రుజిదాదయః ।
భవాన్భవన్తౌ భవతాం భవం శ్చైవ భవత్వపి.
మహాన్మహన్తౌ మహతా మేవం భగవదాదయః।
ఏపం మమవాన్మ ఘవన్తౌ అగ్ని చిచ్చానిచిత్యపి.
ఆగ్ని చిత్స్యేవ మేవాన్యద్వేద విత్తత్త్వ విత్త్వపి ।
వేదవిదా మేవ మన్యద్యః నమస్తేన సర్వవిత్.
రాజారా జానౌ రాజ్ఞః రాజ్ఞి రాజనిరాజన్ ।
యజ్వాయజ్వాన స్త ద్వత్కరీ దండీచ దండినౌ,
పంథా పంథానౌచ పథః పథిభ్యాం పథి చేద్దశమ్ ।
మంథా ఋభుక్షాః: పథ్యాద్యాః పంచ పంచచ పంచభిః.
ప్రతాన్ ప్రతానౌ ప్రతాన్భ్యాం ప్రతాంశ్చ సుశర్మణః ।
కః కేన సర్వవత్కేతేషు అయంచేమే ఇమాన్నయః ।
ఆనేన చాభ్యామభిశ్చ ఆ స్మై చైభ్యః స్వమస్యచ.
అనయో రేషా మేషు స్యాచత్వారశ్చతుర స్తథా ।
చతుర్ణాంచ చతుర్ష్వస్తి సుగీః శ్రేష్ఠః సుగీర్ష్వపి.
సుద్యౌః సుదివౌ సుద్యుభ్యాం విజ్ విశౌవిట్ సుయాదృశః।
యాదృగ్భ్యాంచైవ విడ్బ్యాం చ షట్ షట్ షణ్ణాంచ షట్స్వపి.
సువచాః సువచసా చ సువచోభ్యామథేదృశమ్ ।
హేసమచో హే ఉషనన్ను శనా వౌశనస్యపి.
పుదంశా అనేహా హేవిద్వాన్విద్వాంశ్చ ఉత్తమాః ।
విదు షేనమో విద్వద్భ్యాం విద్వత్సుచ బభూవివాన్.
ఏవంచ పేచివాన్శ్రేయాన్శేయాంసౌశ్రయస స్తథా।
ఆనీ అమూ ఆమౌ శ్రేష్ఠా ఆముం ఆమూనిహామునా
అమీభిరము ష్మై వాముష్మాదముష్యవాఽము యో స్తథా ।
అమీషామముష్మిన్ని త్యేవం గోధుగ్భిరాగతః.
గోధుక్ష్విత్యేవ మన్యేఽపి మిత్ర ద్రుహామిత ద్రుహా ।
మితద్రుగ్బ్యాం మితద్రుగ్భిరేవం చిత్తదృహాదయః.
స్వలిట్ స్వలి జ్భ్యోం స్వలిహి అనడ్వా ననడుత్సుచ ।
అజంతాశ్చ హలన్తాశ్చ పుంసథోఽథ స్త్రీయాంవదే.
ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే సుబ్విభ కి సిద్దరూప నిరూపణం నామైక పంచాశ దధిక త్రిశతతమోఽధ్యాయః.
స్కందుడు చెప్పెను. కాత్యాయనా! విభక్తి సిద్ధ రూపములను చేప్పెదను. సప్పులు, తీజులు, అని విభక్తులు రెండు విధములు. సప్పులలో విభక్తులుండును. నుఔజస్, ప్రథమ. ఆ: ఔట్ కన్ ద్వితీయ, టాభ్యాం భిన్, తృతీయ, జే, భ్యాండ్యన్ చతుర్థి, జసి, భ్యాం, భ్యస్, పంచమి, జన్, ఓన్, ఆమ్, షష్టి, జి, ఓ, సుప్, స ప్రమీ; అజంత ములు హల నములు అని ప్రాతిపదికములు రెండు విధములు. అవి మరల, పులింగ స్త్రీలింగ నపుంసక లింగముని మూడేసి విధములు. పులింగాది శబ్దములలో ప్రధానమైన వాటిని చెప్పుచున్నాను. ఇక్కడ చెప్పబడని వాటికి వృషాదిశబ్దములు నాయక ములు; వీటిలో వృక్షః సర్వశి, పూర్వః ప్రథమ, ద్వితీయ, తృతీయ, ఖడ్గపాకి, వహ్నిః, సఖా, పతి, అహర్పతి. పలు, (పుంలిం) గ్రామణీః, ఇంద్రః, ఖఃపూ. మిత్రభూః, స్వరూ, సుశ్రీ, సుధీః, పితా, భార్రా? (పుంలిం) కర్తా, క్రోష్ట్రా, నప్తా, సురా, రాః; గౌః, ద్యౌః గౌః ఈ ఆజంత శబ్దము పుంలింగమునందు నాయక శబ్దములు సువాక్, త్వక్, మొదలుక్వలిట్ వరకు వున్నవి హలంత శబ్దము. జాయా శబ్దము మొదలు అసౌవరకును వున్న వి శ్రీలింగ మున నాయక శబ్దపులు. కుండమ్ మొదలు ఆదఃవరకును వున్నవి (మూలో క్తములు) నపుంసకలింగ వాయకశబ్దములు. ఈ శబ్దములకు ప్రథమా విభక్తి ప్రత్యయములు ప్రాతిపదికకు పరముగ వచ్చును. ధాతుప్రత్యయ భిన్నమైనది. ప్రాతిపది కము. ప్రాతిపదికకు స్వార్థము లింగము బోధించుటకు ప్రథమ వచ్చును. సంబోధనము నందునుకూడ ప్రథమవచ్చును. కర్మ కర్త ఉక్తములై నపుడు కూడ ప్రథమవచ్చును. కర్మ అనగా చేయబడునది. కర్మకు ద్వితీయవచ్చును. దేనిచే చేయ బడునో అదిక గణము; చేయువాడు కర్త; తీజ్ కృత్తద్ధితములచే అను క్షమైనపుడు తృతీయ వచ్చును. కర్తృ కారకమునకు తృతీయ వచ్చును. సంప్రదానమునకు చతుర్థి ఎవనికి ఇవ్వవలెనని ఇచ్చయింతురో దానికి సంప్రదానము అని పేరు. దేని నుండి ఒకటి వేరగునో దేనినుండి ఒకటి గ్రహింపబడునో దేని వలన భయమో, దానికి ఆపాదానము అని పేరు. ఆపాదా వసు నకు పంచమీ వచ్చును. స్వస్వామ్యాది సంబంధమునందు షష్టి వచ్చును. ఆధారమునకు ఆధికరణమని పేరు. దానికి సప్తమి వచ్చును. ఒక వస్తువును బోధించునపుడు ఏకవచవము, రెండు వస్తువులను బోధించుటకు ద్వివచనము, ఆనేకమైన వస్తువులను బోధించుటకు బహవనము వచ్చును. ఇపుడు సిద్దరూపములు చెప్పెను. “వృక్షః, సూర్యః” మొదలు కమలేమ వరకు ఆయా శబ్దముల కొన్ని సిద్ధరూపములు ఇవ్వబడినవి. కామమహేళ.. మొదలగు శబ్దములు కూడ వృక్ష శబ్దమువలె రూపము లుండును. సర్వే, విశ్వే, సర్వస్మై, సర్వస్మాల్, సర్వేషామ్, ఇత్యాది ప్రథమాది బహు వచనము తప్ప ఈ శబ్దముల రూపములు వృక్షశబ్దముల రూపముల వలె ఉండును. ఉఠయ, కతర, కతమ, ఆక్యత రాదులు కూడ ఇట్లే. ఈ విధముగా "పూర్వే పూర్వాశ్చ మొదలగు ఆనడుత్సు వరకు ఆయార అజంత హలన శబ్దములకు, పుంలింగమునందు కొన్ని విభక్తులలో సిద్ధరూపము లివ్వబడినవి. ఇపుడు స్త్రీనింగరూపములు చెప్పెదను.
ఆగ్ని మహాపురాణమున సుబ్వి భక్తి సిద్ధరూపనిరూపణమను మూడువందల యేబది ఒకటవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 352 of the Agni Mahā Purana is as follows:
The feminine (strīliṅga) nominal paradigms are set out. Ā-stem feminines (ramā, jarā, sarvā) are declined in full, followed by i-stem feminines (buddhi), long-ī-stem feminines (nadī, kumārī), the exceptional śrī, the consonant-stem feminines vāc and dṛṣad, and the ū-stem jambū. The phonological alternations that occur at case-junctions in feminine stems — sandhi with the vibhakti endings, the softening of final consonants before voiced endings — are demonstrated through worked examples. The complete feminine declension as presented here forms the second panel of the triptych of ajanta declension alongside the masculine and neuter sections.