అగ్ని మహా పురాణము

297 - ఆథ విషహృన్మంత్రౌషధమ్

అగ్ని రువాచః

ఓం నమోభగవతే రుద్రాయఛింద ఛింద విషం జ్వలిత పరశుపాణయేచ

నమోభగవతే పక్షి రుద్రాయ దష్టకం ఉత్థాపయ ఉత్థాపయ దష్టకం కంపయకంపయ జల్ప యజల్పయ

సర్పదష్టముత్థాపయ లలలల బంధబంధమోచయమోచయ

 వరరుద్రగచ్ఛగచ్ఛ వధ వధ త్రుటత్రుటబుక బుక భీషయభీషయ ముష్టినా

సంహర విషం ఠఠ.

పక్షి రుద్రేణ హవిషం నాశ మాయాతి మంత్రణాత్

ఓం నమో భగవతే రుద్ర నాశయ విషం స్థావర జంగమమ్.

కృత్రిమా కృత్రిమ విషమునవిషం నాశయ నానావిషం

దష్టక విషం నాశయ ధమధమధమవమవమ మేఘాంధకార

ధారావర్ష నిర్విషీభవ సంహరసంహరగచ్ఛగచ్ఛ ఆవేశయ ఆవేశ యవిషో

త్థాపన రూపం మంత్రాన్తా ద్విష ధారణమ్.

ఓంఓం క్షి పక్షిపస్వాహా.

ఓం హ్రం హ్రీం  ఖీం సః ఠం ద్రౌం హ్రీం ఠః.

జపాదినా సాధితస్తు సర్పాన్బధ్నాతి నిత్యశః.

 ఏక ద్విత్రి చతుర్బీజ: కృష్ణ చక్రాంగ పంచకః

గోపీజన వల్లభాయ స్వాహా సర్వార్థ సాధకః.

ఓం నమో భగవతే రుద్రాయ ప్రేతాధిపతయే గుత్త్వగుత్త్వ

గర్జగర్జ భ్రామయభ్రామయముంచముంచముహ్యముహ్య కటకటఆవిశ

ఆవిశ సువర్ణ పతంగ రుద్రోజ్ఞాపయతి ఠఠ.

 పాతాలక్షోభమంత్రోఽయం మంత్రణాద్విషనాశనః

దంశ కాహిదంశే సద్యో దష్టః కాష్ఠ శిలాదినా.

విషశాంత్యై దహేద్దంశం జ్వాలకోకనదాదినా

శిరీష బీజపుష్పార్క క్షీర బీజక టుత్రయమ్.

విషం వినాశ యేత్పానలేపనే నాంజనాదినా

శిరీష పుష్పస్వరస భావితం మరిచం సితమ్.

పాననస్యాంజ నాద్యైశ్చ విషం హన్యాన్న సంశయః

కోషాత కీవచా హింగు శిరీషార్క పయోయుతమ్.

కటుత్రయం సమేషాంభో హరేన్న స్యాదినా విషమ్

రామ ఠేక్ష్వాకు సర్వాంగ చూర్ణం నస్యా ద్విషాపహమ్.

ఇంద్రబలాగ్నికం ద్రోణం తులసీ దేవికాసహా

తద్రసాక్తం త్రికటుకం చూర్ణం భక్ష్యం విషాపహమ్.

పంచాంగం కృష్ణపంచమ్యాం శిరీషస్య విషాపహమ్ .

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే విషహృన్మంత్రౌషధ కథనంనామ సప్తనవత్యధిక ద్విశతతమోఽధ్యాయః.  

అగ్ని దేవుడు పలికెను. “ఓం నమోభగవతే రుద్రాయ” మొదలు పరశుపాణయే" వరకును వున్న మూలోక్త మంత్రము “నమోభగవతే పక్షి రుద్రాయ” మొదలు "విషం ఠఠ వరకునువున్న మూలో మౌ మంత్రము చేతను సర్ప దష్టుని అభి మంత్రించినచో వాని విషము తొలగిపోవును. "ఓం నమోభగవతే రుద్ర" మొదలు "ద్రౌం హ్రీం – ఠః" వరకును వున్న మూలోక మంత్రమును జపించి మంత్ర సిద్ధిపొందిన వాడు నిత్యము సర్పములను బంధించగలడు. ఒక రెండు మూడు, నాలుగు టీజములుకలదియు కృష్ణ చక్రముచే ఆంగ పంచకముగల గోపీజనవల్లభాయ స్వాహాయను మంత్ర మును స్వూరసాధకము. 'ఓం నమోభగవతే రుద్రాయ" మొదలు "జాపయతి ఠఠ" వరకును వున్న మూలోక్త మంత్రమునకు పాతాళ క్షోభ మంత్రమని పేరు. ఈ మంత్రముతో అభిమంత్రించినచో విషము తొలగిపోవును. సర్పము కాటువేసినపుడు మండుచున్న కష్టముతో గాని, కోలుకున్న ళ్లతోకాని అగ్ని జ్వాలతోగాని కోక నదముతో గాని, కర చిన స్థానమున కాల్చినచో విషము ఉపశమించును. శిరీష వృక్ష బీజములు పుష్పములు, ఆర్క క్షీరము బీజము, కటుత్ర యము వీటిని త్రాగించినను పైన పూసినను కాటుక పెట్టినను విషము నశించును. కిష పుష్పర సముతో భావనచేసిన తెల్లని మరిచము పానవశ్య, ఆంజనాది రూపమున నిచ్చినచో విషమును నశింపచేయును. సందేహములేదు. కోశాతకీ వచా హింగు శిరీష, ఆర్కక్షీర - త్రికటు మోషాఁభస్సులను నశ్యాది రూపమున విచ్చినచో విషము నశించును. రామళ ఇక్ష్వాకు సర్వాంగ ముల చూర్ణము నశ్యముగా ఇచ్చినచో విషమును తొలగించును. ఇంద్రబల, అగ్నికము ద్రోణము తులచి కవిక సహ, వీటిర సములో త్రికటు చూర్ణము కలిపితిన్నచో విషము నశించును, కృష్ణపంచమినాడు తీసుకుని వచ్చిన శరీష పంచాంగము విషనాశకము 

అగ్ని మహాపురాణమున విషహృన్మంత్రౌషధమను రెండువందల తొంబదియేడవ అధ్యాయము సమాప్తము.