అగ్ని మహా పురాణము

29 - అథ సర్వతోభద్రమణ్డలవిధిః

నారద ఉవాచః-

సాధకః సాధయేన్మంత్రం దేవతాయతనాది కే

శుద్దభూమౌ గృహే ప్రాచ్యే మణ్డలే హరిమీశ్వరమ్.

చతుర శ్రీకృతే క్షేత్రే మణ్డలాదీని వై లిఖేత్

రసబాణాకో షేమ సర్వతోభద్రమాలిఖేత్

షట్త్రింశతోష్ణకైః పద్మం పీఠం పక్ష్యా బహిర్భవేత్

ద్వాభ్యాం తు వీథికా తస్మార్ద్వాభ్యాం ద్వారాణి దిక్షు చ.

సాధకుడు దేవాలయాదులలో మంత్రసాధన చేయవలెను. తూర్పు గృహమునందు శుద్దమైన భూమిపై, మండలమునందు, ప్రభు వైన హరిని స్థాపింపవలెను. చతురశ్రముగ చేసిన క్షేత్రము మీద మండలాదులను వ్రాయవలెను. రెండు వందల ఏబదియారు (256), కోష్టములలో సర్వతోభద్రమండలమును గీయవలెను. ముప్పదియారు కోణములతో పద్మము గీయవలెను. పీఠము పంక్తికి వెలుపల ఉండవలెను. దానినుండి రెండింటిచేత వీథియు, రెండింటిచే దిక్కులలో ద్వారములును నిర్మించవలెను.

 వర్తులం భ్రమయిత్వా తు పద్మ క్షేత్రం పురోదితమ్

పద్మార్ధే భ్రమయిత్వా తు భాగం ద్వాదశకం బహిః.

విభజ్య భ్రమయేచ్ఛేషం చతుః క్షేత్రం తు వర్తులమ్

వెనుక చెప్పిన పద్మ క్షేత్రమును వర్తులముగా త్రిప్పి, పద్మార్ధమునందు ద్వాదశ భాగము బైట త్రిప్పి, మిగిలిన క్షేత్రమును నాలుగుగా విభజించి, వర్తులముగా చేయవలెను.

ప్రథమం కర్ణికా క్షేత్రం కేసరాణాం ద్వితీయకమ్.

తృతీయం దలనందీనాం దలాగ్రాణాం చతుర్థకమ్

మొదటిది కర్ణిక యొక్క క్షేత్రము. రెండవది కేసరముల క్షేత్రము. మూడవది దలసంధుల క్షేత్రము. నాల్గవది దలాగ్రముల క్షేత్రము.

ప్రసార్య కోణసూత్రాణి కోణదిజ్మధ్యమం తతః.

నిధాయ కేసరాగ్రే తు దలనందీంస్తు లాఞ్చ యేత్

పాతయిత్వాథ సూత్రాణి తత్ర పత్రాష్టకం లిఖేత్

దలసన్య నరాలం తు మానం మద్యేనిధాయ తు

దలాగ్రం థామయేత్రే న తదగ్రే తదనన్తరమ్.

తదన రాలం తర్పార్శ్వే కృత్వా బాహ్యక్రమేణ చ

 కేసరే తు లిఖేద్వౌ ద్వౌ దలమధ్యే తతః పునః.

 పద్మలమ్మైతత్సామాన్యం ద్విషట్కదలముచ్యతే

కర్ణికార్దేన మానేన ప్రాక్సంస్థం భ్రామయేత్ క్రమాత్.

తత్పార్శ్వే భ్రమయోగేన కుణ్డల్యః షడృవస్తి హి

ఏవం ద్వాదశ మత్స్యాః స్యు థ్వీషట్కదలకం చ తైః.

కోణస్థానములనుండి, కోణములకు ఎదురుగా ఉన్న మధ్యభాగ మువరకును దారము లాగి, కేసరముల ఆగ్రములం దుంచి దలముల సంధులను గుర్తింపవలెను. పిమ్మట దారమును క్రిందికి జార్చి, ఎనిమిది దలముల పద్మమును గీయవలెను. దలముల సంధుల మధ్యమునందు ఎంత ఎడ ముండునో అంత ఎడమునందు అగ్రభాగమున, దలాగ్రములను గీయవలెను. వాటి నుధ్యమానమును వాటి పార్శ్వమునం దుంచి బాహ్య క్రమమున ఒక్కొక్క దలముపై రెండేసి కేసరములు గీయవలెను. ఇది పద్మముయొక్క సామాన్యలక్షణము. ఇపుడు ద్వాదళ కమల లక్షణము చెప్పబడు చున్నది. కర్ణిక యొక్క అర్ధమానమును తూర్పు దిక్కు. వేపు దార ముంచి క్రమముగా అన్ని వైపుల త్రిప్పవలేను. ధాని పార్శ్వమునందు చేసిన భ్రమణముచే ఆరు కుండలుల చిహ్న ములు, పండ్రెండు మత్స్యముల చిహ్నములు ఏర్పడును. వీటిచే ద్వాదశ దల కమలమేర్పడును.

పఞ్చపత్రాభిసిద్ధ్యర్థం మత్స్యే కృత్వైవమజ్ఞకమ్

వ్యోమరేఖా బహిఃపీఠం తత్ర కోష్ఠాని మార్జయేత్.

త్రీణి కోణేషు పాదార్థం ద్విద్వికాన్యపరాణి తు

 చతుర్ధిక విలిప్తాని పత్రకాణి భవన్యుత.

తతః ప జిద్వయం దిక్షు వీథ్యర్థం తు విలాపయేత్

ద్వారాణ్యాశాసు కుర్వీత చత్వారి చతసృష్వపి.

పంచదలాదుల నిర్మాణమునకు కూడ ఈ విధముగనే మత్స్యచిహ్నములచే కమలములు నిర్మించి ఆకాశ రేఖకు బైట నున్న పీఠభాగమునందలి కోష్టములను తుడిచివేయవలెను. . పీఠభాగము యొక్క నాలుగు కోణములలో మూడేసి కోష్టకములను ఆ పీఠముయొక్క నాలుగు పాదాలుగా కల్పింపవలెను. నాలుగు దిక్కులందును మిగిలిన రెండేసి జోడులను, అనగా నాలుగు కోష్టకములను, తుడిచి వేయవలెను. అవి పీఠమునకు పాదాలుగా ఏర్పడును. పీఠము వెలుపల నాలుగు దిక్కులలో ఉన్న రెండు రెండు పంక్తులను తుడిచివేసి వీథి ఏర్పరుపవలెను.. . పిమ్మట నాలుగు దిక్కులందును నాలుగు ద్వారములు ఏర్పరుపవలెను.

ద్వారాణాం పార్శ్వతః శోభా ఆష్టౌ కుర్యాద్విచక్షణః

తత్పార్శ్వ ఉపశోభాస్తు తావత్యః పరికీర్తితాః.

సమీప ఉపశోభానాం కోణాస్తు పరికీర్తి తా

చతుర్దిషు తతో ద్వే ద్వే చింత యన్మధ్యకోష్ఠకైః.

చత్వారి బాహ్యతో మృణ్యాదేకై కం పార్శ్వయోరపి

 శోభార్థం పార్శ్వయోశ్రీణి త్రీణి లుమ్పేద్దలస్య తు.

తద్వద్విపర్యయే కుర్యాదుపశోభాం తతః పరమ్

కోణస్యాన రహిస్త్రీణి చింత యేద్విర్విభేదతః.

విద్వాంసుడు, ద్వారముల పార్వభాగములందు ఎనిమిది శోభాస్థానములను, వాటి పార్శ్వభాగములందు ఉపశోభాస్థానములను, ఏర్పరుపవలెను. శోభలు ఎన్ని యో ఉపశోభలు కూడ అన్ని యే ఉండును. ఉపశోభల సమీపమునం దుగ్న స్థానములకు కోటాము అని పేరు. పిమ్మట నాలుగు దిక్కులందును మధ్యనున్న రెండేసి కోష్టములను, వాటి బాహ్య పంక్తిలోని, మధ్యకోష్టములను ద్వారనిర్మాణమునకై ఉపయోగింపవలెను. వాటి నన్నింటిని కలిపి తుడిచివేయగా వాలుగు ద్వారము లేర్పడును. ద్వారముయొక్క రెండు పార్శ్వములందలి క్షేత్రమునకు వెలుపల నున్న పంక్తియందలి ఒక్కొక్క కోష్టమును, లోపలి పంక్తియందలి మూడు మూడు కోష్ఠములను శోభానిర్మాణార్థమై తుడిచి వేయవలెను. శోభాపార్శ్వ భాగమునందు ఇందులకు విపరీతముగ చేయుటచే అనగా క్షేత్రమునకు వెలుపల నున్న పంక్తియందలి మూడు మూడు కోష్టములను, లోపలనున్న పంక్తి యందలి. ఒక్కొక్క కోష్టమును తుడిచివేయగా ఉపశోభలు నిర్మింపబడును. పిమ్మట కోణమునకు లోపల, వెలుపల నున్న మూడు మూడు కోష్టముల భేదమును తుడిచివేసి ఒకటిగా చేసి చింతనము చేయవలెను.

ఏవం షోడశకోష్ఠం స్యా దేవమన్యత్తు మణ్డలమ్

 ద్విషట్కభాగే ష ట్త్రిం శత్పదం పద్మం తు వీథికా.

ఏకా ప జ్క్తిః పరాభ్యాం తు ద్వారశోభాది పూర్వవత్

ద్వాదశాబ్ధులిభిః పద్మ మేకహస్తే తు మణ్డలే.

ద్విహస్తే హస్తమాత్రం స్యాద్వృద్ధ్యా ద్వారేణ వా చరేత్

అపీఠం చతురస్రం స్యాద్దీకరం చక్రపఙ్కజమ్.

పద్మార్థం నవభిః ప్రోక్తం నాభిస్తు తిసృభిః స్మృతా

ఆష్టాభిస్వరకాన్ కుర్యాన్నే మిం తు చతురజ్గులైః.

త్రిధా విభజ్య చ మేత్రమన రాభ్యామథాక్కయేత్

ప్చూనరసిద్ధ్యర్థం తేష్వాస్ఫాల్య లిఖేదరాన్.

ఇందీ వరదలాకారానథవా మాతులుజ్గువత్

పద్మపత్రాయతాన్వాపి లిఖేదిచ్చానురూకత.

భ్రమయిత్వా బహర్నే మావరసశ్యన రే స్థితః

భ్రా మమేదరమూలం తు సన్దిమద్యే వ్యవస్థితః.

ఆరమధ్యే స్థితో మధ్యమరణిం భ్రామయేత్సమమ్

ఏవం సశ్యన రాః సమ్యజ్ముతులుజ్గనిభాః సమాః.

ఇంతవరకును పదునారేసి కోష్టములతో ఏర్పడు రెండువందల ఏబది ఆరు కోష్టములు గల మండలము వర్ణింప బడినది. ఇతర మండలసీర్మాణము కూడ ఈ విధముగనే చేయవచ్చును. పండ్రెం డేసి కోష్టములచే నూటనలభై నాలుగు కోష్టకముల మండలము ఏర్పడును. దానిలో కూడ మధ్య నున్న ముప్పదియారు పదముల (కోష్టవల)చే కమల మేర్పడును. దీనిలో వీథి ఉండడు. ఒక - పంక్తి పీఠమునకై ఏర్పరుపబడును. మిగిలిన రెండు వంక్తులచే, వెనుక చెప్పిన విధమున, ద్వారభలు కల్పింపబడును. ఒక హస్తము ప్రమాణము గల మండలమునందు కమల క్షేత్రము పండ్రెండు అంగుళముల ప్రమాణముతో నుండును. రెండు హస్తముల ప్రమాణము గల మండలమునందు కమల స్థానము ఒక హస్తము వెడల్పు-పోడవులతో నుండును. ఈ విధముగా ప్రమాణమును పెంచుచు ద్వారాదులతో మండలనిర్మాణము చేయవలెను. రెండు హస్తముల ప్రమాణము గల పీఠరహీత మగు చతురస్రమండలమునందు చక్రాకారకమలమును నిర్మించవలెను. పద్మార్థము తొమ్మిది అంగుళము లుండును. నాభి మూడు అంగుళములు. ఎనిమిది అంగుళముల ఆకులు, సోలుగు అంగుళముల నేమి ఏర్పరుపవలెను. క్షేత్రమును మూడు భాగములుగ విభజించి, మరల లోపలినుండి ఒక్కోక్కదానిని రెండేసి భాగములు చేయవలెను. లోపల నున్న ఐదు కోష్టములను తుడిచివేసి వాటిపై ఆకులు నిర్మింప వలెను. ఈ ఆకులు ఇందీవరదకాకారములో గాని, మాతులింగ ఫలాకార ములో గాని, కమలదళాకారములో గాని ఉండవచ్చును. లేదా వాటి ఆకారమును తమ ఇచ్చ ప్రకారము చేయవచ్చును. ఆకుల సంధుల మధ్యదారముంచి, దానిని వెలుపల నున్న నేమి (చక్రాంతము) వరకు లాగి, నాలుగు వైపుల త్రిప్పవలెను. ఆకుయొక్క సంధియందు దారమునుంచి దాని మూలభాగమును తిప్పవలెను. ఆకు మధ్యస్థానమునందు . దారము ఉంచి ఆ మధ్యభాగము నలువై పులకును సమముగా దారము త్రిప్పవలెను. ఈ విధముగా త్రిప్పగా మాతులుంగాకారము గల ఆరు లేర్పడును.

విభజ్య సప్త ధా చేత్రం చతుర్దశకరం సమమ్

ద్విధా కృతే శతం హ్యత షజ్ఞవత్యధిని తు.

కోష్టకాని చతుర్బి నైర్మధ్యే భద్రం సమాలిఖేల్,

పరితో విసృజేప్వీథ్యై తథా దీతు సమాలిఖేత్

కమలాని పునర్వీత్యై పరితః పరిమృజ్య తు,

ద్వే ద్వే మధ్యమకోషే తు గ్రీవార్ధం దీక్షు లోపయేత్.

చత్వారి బాహ్యతః పశ్చాత్తేజి త్రీజీ తు తోపయేత్

గ్రీవా పార్శ్వే బహి స్వే కా శోభా సా పరికీర్తి తా.

విసృజ్య బాహ్యకోణేషు సప్తానశ్రోణి మార్జయేత్

మణ్డలం నవభాగం స్యాన్న వవ్యూహం హరిం యజేత్ .

పఞ్చవింశతికవ్యూహం మజ్ఞలం విశ్వరూపకమ్

ద్వాత్రింశద్ధస్తకం క్షేత్రం భక్తం ద్వాత్రింశతాసమమ్.

ఏవం కృతే చతుర్వింశత్యధికం తు సహస్రకమ్

 కోష్ఠకానాం సముద్దిష్టం మధ్యే షోడశకోష్ఠకైః.

భద్రకం పరిలిఖ్యాథ పార్శ్వే పత్తి విమృజ్య తు

 తతః షోడశభిః కోష్టైర్దిక్షు భద్రాష్టకం లిఖేత్ .

పదునాలుగు హస్తముల క్షేత్రమును ఏడు భాగములుగ విభజించి, మరల రెండేసి భాగములుగా విభజింపవలెను. లేదా - తూర్పునుండి పశ్చిమము వర కును, ఉత్తరమునుండి దక్షిణము వరకును పదునై దేసి సమాన రేఖలు గేయవలెను. ఇట్లు చేయుట చే నూటతొంబదియాను కోష్టము లేర్పడును. వీటిలో మధ్య నున్న నాలుగు కోష్టములచే భద్రమండలము ఏర్పరుపవలెను. దాని నాలుగు వైపుల వీథికొరకై స్థానము విడువవలెను. మరల అన్నీ దిక్కులందును కమలములు గీయవలెను. ఆ కమలముల నాళ వైపులందును వీథికొరకై ఒక్కొక్క కోష్ఠమును తుడిచివేయవలెను. పిమ్మట, మధ్య మన్న రెండేసి కోష్టములను కంఠభాగముకోరకే తుడిచివేయవలెను. పిమ్మట వెలుపల నున్న నాలుగేసికోష్టములలో మూడు మూడు కోషములను తుడిచివేయవలెను. వేలుపల నున్న ఒక్కొక్క కోషమును కంఠస్థానపార్శ్వమునందు మీగల్చవలెను. దానికి ద్వారశోభ యని పేరు.

వెలుపల నున్న కోణములలో ఏడింటిని మినహాయించి లోపల నున్న మూడేసి కోషములను తుడిచివేయవలెను. దానికి ‘నవనాలము” లేదా “నవనాభమండలము” అని పేరు. దాని తొమ్మిది నాభుల యందు, నవవ్యూహరూపు డైన శ్రీహరిని పూజింపవలెను. ఇరువదియైదు వ్యూహముల మండలము విశ్వవ్యాపి యైనది. ముప్పది రెండు హస్తముల చేత్రమును, ముప్పది రెండుచేతనే సమముగా విభజింపవలెను. అనగా పైనుంచి క్రిందికి ముప్పదిమూడు రేఖలు గీసి, అడ్డముగా కూడ ముప్పదిమూడు రేఖలు గీయవలెను. ఈ విధముగ ఒక వెయ్యి ఇరువదినాలుగు కోషములు, ఏర్పడును. వాటిలో మధ్య నున్న పదునారు కోష్టకములతో “భద్రమండలము” ను నిర్మింపవలెను. మరల నాలుగు ప్రక్కల నున్న ఒక్కొక్క పంక్తిని విడువవలెను. పిమ్మట ఎనిమిది దిక్కులందును పదునారు కోష్ఠకములచే ఎనిమిది భద్రమండలములు ఏర్పరుపవలేను. దీనికి “భద్రాష్టకము” అని పేరు.

తతోఽపి ప జ్త్కిం సంమృజ్య తద్వత్ షోడశ భద్రకమ్

లిఖిత్వా పరితః పజ్త్కిం విమృజ్యాథ ప్రకల్పయేత్.

ద్వారద్వాదశకం దిషు త్రీణి త్రీణి యథాక్రమాత్

షడ్భిశ్చ పరిలుప్యానర్మధ్యే చత్వారి పార్శ్వయోః.

చత్వార్యనర్బహిర్డ్వే తు శోభార్థం పరిమృజ్య తు

ఉపద్వార ప్రసిద్ద్యర్థం త్రిణ్యన్త పఞ్చ బాహ్యతః.

పరిమృజ్య తథా శోభాం పూర్వవత్పరికల్పయేత్

వహ్ని కోణేషు సప్తాస్తస్రాణి కోష్ఠాని మార్జయేత్.

పజ్ఞ్చవింశతిక వ్యూ హే పరంబ్రహ్మ యజేచ్ఛుభీ

మధ్యే పూర్వాదితః పద్మే వాసుదేవాదయః క్రమాత్.

వరాహం పూజయిత్వా చ పూర్వపద్మే తతః క్రమాత్

వ్యూహాన్ సంపూజయేత్తావద్యావత్ షటింకరో భవేత్.

యథోక్షం వ్యూహమఖిలమేకస్మిన్ పజ్కజే క్రమాత్

యష్టవ్యమితి యత్నేన ప్రచేతా మన్యధ్వరమ్.

సత్యస్తు మూర్తి భేదేన విభక్తం మన్యతేచ్యుతమ్

చత్వారింశత్కరం క్షేత్రం హ్యుత్తరం విభజైత్రమాత్.

ఏకైకం సప్తధా భూయస్తథై కైకం ద్విధా పునః

చతుష్టష్యత్తరం సప్త శతాన్యేకసహస్రకమ్.

కోష్టకాసాం భద్రకం చ మధ్యే షోడశ కోష్టకైః

పార్శ్వే వీథిం తతశ్చాష్టభద్రాణ్యథ త వీథికామీ.

షోడశాబ్దాన్యథో వీథీ చతుర్వింశతిపజ్కజమ్

వీథీపదాని ద్వాత్రింశత్ పజివీథిజన్యథ.

చత్వారింశత్త తో వీథీ శేషపజీత్రమేణ చ

ద్వారలోషణ స్యుర్ధిషు మధ్యే విలోప్య చ.

ద్విచతుష్టత్త్వారసిద్ధ్యే చతుర్దిషు విలోపయేత్

పత్రీజ్యేకకం బా హ్యే శోభపద్వారసిద్ధయే.

ద్వారాణాం పార్శ్వయోనః షడ్వా చత్వారి మధ్యతః

ద్వే ద్వే లు ప్యేదేవమేవ షడ్ భవన్యుపశోభికాః.

ఏకస్యాం దిశి సఙ్యాః స్యుశ్చతస్రః పరిసంఖ్యయా

ఏకైకస్యాం దిశి త్రీణి ద్వారాణ్యపి భవన్యుత.

 పఞ్చ పఞ్చ చ కోణేషు పజ్త్కౌ పజ్త్కౌ క్రమాత్సృజేత్

కోష్టకాని భవేదేవం మర్యేష్టం మణ్డలం శుభమ్.

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే సర్వతోభద్రమణ్డలాధి విధిర్నా మోవత్రింశోధ్యాయః.

దాని తరువాత నున్న ఒక పంక్తి చెరిపి వేపి మరల వెనుకటి వలె పదునారు భద్రమండలములు వ్రాయవలెను. పిమ్మట అన్ని ప్రక్కలను ఉన్న ఒక్కొక్క ప్రక్తి చేరిపివేసి ఒక్కొక్క దిక్కున మూడేసి చొప్పున పండ్రెండు ద్వారములు నిర్మింపవలెను. వెలుపల నున్న ఆరు కోష్టములు తుడిచివేసి మధ్యభాగము యొక్క పార్శ్వభాగములందలి నాలిగింటిని తుడిచివేయవలేను. మరల, శోభానిర్మాణమునకై లోపల నున్న నాలుగు కోష్టములను, వెలుపల నున్న రెండు కోష్టములను తుడిచివేయవలెను. పిమ్మట ఉపద్వారము తీర్పడుటకై లోపల నున్న శూడు కోష్ఠములను, వెలుపల నున్న ఇదు కోష్టములను తుడిచివేయవలెను. పిమ్మట, వెనుక చెప్పిన విధమున శోథ నిర్మింపవలెను. కోణములలో వెలుపల నున్న ఏడు కోష్ట్రములను, లోపలనున్న మూడు కోష్ట్రములను తుడిచివేయవలెను. ఈ విధముగ ఏర్పడిన పంచవింశతివ్యూహమండలములోపల నున్న కమలకర్ణిక పై పరమాత్మను పూజింపవలెను. మరల తూర్పు మొద లైన దిక్కులలో నున్న కమలములపై క్రమముగా వాసుదేవాదుల పూజ చేయవలెను. పిమ్మట తూర్పున నున్న కమలము పై భగవంతు డగు వరాహమూర్తిని పూజించి క్రమముగా ఇరువదిఐదువ్యూహముల పూజచేయవలెను. ఇరువదియారవ తత్వమైన పరమాత్మునిపూజ సంపన్న మగువరకును ఈ క్రమము జరుగవలెను. ఒకేమండలముపై అన్నివ్యూహము పూజనుక్రమముగా చేయవలెననిప్రచేతసుని మతము. కాని సత్యా చార్యుని మతము ప్రకారము మూ ర్తిభేధమును బట్టి పరమాత్ముని వ్యక్తిత్వము నందు భేదమేర్పడును గాన విభిన్న మూర్తుల పూజ వేడివేరుగా చేయవలెను.

నలుబది హస్తముల మండలమును అడ్డగీతలు గీసి క్రమముగా విభజింపవలెను. మొదట ఒక్కొక్కదానికి ఏడేసి భాగములు చేయవలెను. మరల ఒక్కొక్కదానిని మూడేసి భాగములు చేసి, వాటిని గూడ రెండేసి భాగములు చేయవలెను. ఈ విధముగ ఒక వెయ్యి ఏడువందల అరువదినాలుగు (1764) కోష్టకము ఏర్పడును. మధ్య నున్న , పదునారు కోష్టకములతో కమలమును నిర్మింపవలెను. పార్శ్వభాగమున వీథి నిర్మించవలేను. పిమ్మట ఎనిమిది భద్రములు, వీథులు నిర్మింపవలెను. పిమ్మట పదునారుదలముల కమలమును వీథినినిర్మింపవలేను, పిమ్మట క్రమముగ ఇరువదినాలుగు దలముల కమలము, వీథి, ముప్పది రెండు దళముల కమలము, వీథి, నలుబదీ దళముల కమలము, వీథీ నిర్మింపవలేను. పిమ్మటమిగిలిన మూడుపంక్తులచే ద్వారములు, శోథలు, ఉపభలు, నిర్మింపవలెను.సర్వదిశల మధ్యభాగమునందు ద్వారసిద్ధి కొరకై రెండు నాలుగు, ఆరు కోష్టకములు తుడిచివేయవలెను. దానిబాహ్యభాగమునందు శోభా.పద్వారము లేర్పడుటకై ఐదు కోష్టములు, మూడు కోషములు తుడిచివేయవలెను. ద్వారముల పార్శ్వములందు, లోపలి వైపున, క్రమముగ ఆరు కోషములు, నాలుగు కోష్టములు తుడిచివేయవలెను. మధ్య నున్న రెండు రెండు కోష్టములు కూడ తుడిచివేయవలెను. ఈ విధముగ ఆరు ఉపథలు ఏర్పడును. ఒక్కొక్క దిక్కునందు నాలుగేసి, శోభలు, మూడేసి ద్వారములును ఉండును. కోణములలో ఒక్కొక్క పంక్తిలోని ఐదేసి కౌష్టములు విడువవలెను. అవి కోణము లగును. ఈ విధముగ చేయగా కావలసిన సుందరమైన మండల మేర్పడును.

ఆగ్నేయమహాపురాణమునందు సర్వతోభద్రమండలాది విధి యను ఇరువదితొమ్మిదవ అధ్యాయము సమాప్తము.