వసిష్ట ఉవాచః-
మత్స్యాదిరూపిణం విష్ణుం బ్రూహి సర్గాదికారణమ్ ।
పురాణం బ్రహ్మ చాగ్నేయం తథా విష్ణోః పురా శ్రుతమ్.
వశిష్టుడు పలికెను : మత్స్యారూపములను ధరించినవాడును, - సృష్ట్యాదులకు కారణ మైనవాడును అగు - విష్ణువును గూర్చి చెప్పుము. పూర్వము విష్ణువునుండి వినిన విధమున ఆగ్నేయపురాణమును గూర్చి యు, బ్రహ్మను గూర్చియు (లేదా ఆగ్నేయ పురాణరూప మగు వేదమును) చెప్పుము.
అగ్ని రువాచః-
మత్స్యావతారం వ క్ష్యేహం వసిష్ఠ శృణు వై హరేః।
ఆవతారక్రియా దుష్టనష్ట్యై సత్పాలనాయ హి.
ఆగ్ని పలికెను : వసిష్ణా! విష్ణువు ధరించిన మల్స్యావతారమును గూర్చి చెప్పెదను; వినుము అవతారములు ధరించుట దుష్టనాశము కొరకును, శిష్టపాలనముకొరకును జరుగుచుండును కదా ?
ఆసీదతితకల్పానే బ్రాహ్మా నైమిత్తికో లయః।
సముద్రోవప్లుతా సత్ర లోకా భూరాదికా మునే.
ఓ మునీ గడచిన కల్పము చివర బ్రహ్మ నిద్రించుట. ఆను నిమిత్తముచే ప్రలయ మేర్పడెను. అపుడు భూలోకాదు లన్ని యు సముద్రములో మునిగిపోయినవి.
మనుర్వైవస్వత స్తే పే తపో వై భుక్తిముక్తయే ।
ఏకదా కృతమాలాయాం కుర్వతో జలతర్పణమ్.
తస్యాజ్ఞాల్యుద కే త్యల్పో మత్స్య ఏకోభ్యపద్యత।
వైవస్వతమనువు భుక్తిముక్తుల నపేక్షించి తపస్సు చేసెను. ఒకనా డాతడు కృతమాలా నదిలో జలతర్పణము చేయుచుండగా ఆతని దోసిలిలోని జలములో ఒక చిన్న చేపపిల్ల కనబడెను.
క్షేప్తుకామం జలే ప్రాహ న మాం శివ నరోత్తమ.
గ్రాహాదిభ్యో భయం మేఒత్ర తచ్చుత్వా కలశేఽ క్షీపత్ ।
ఆ రాజు దానిని నీటిలో పడవేయ దలచుచుండగా అది ఆతనితో “మహారాజా ! నా కీ జలములో మొసళ్ళు మొదలగువాటినుండి భయ మున్నది. అందుచే దీనిలో పడవేయకుము” అని పలికెను. ఆది విని ఆతడు దానిని కలశములో ఉంచెను.
స తు వృద్ధః పునర్మత్స్యః ప్రాహ తం దేహి మే బృహత్.
స్థానమేతద్వచః శ్రుత్వా రాజాథోదఞ్చ క్షీపత్ ।
ఆ మత్స్యము పెద్దదిగా అయి రాజుతో “నాకొక పెద్ద స్థానము నిమ్ము” అని పలికెను. రా జా మాట విని దానిని చెదలో ఉంచెను.
తత్ర వృద్ధోబ్రవీద్భూవం పృథుం దేహి వదం మనో.
సరోవరే పునః క్షిప్తో వవృదే తత్రమాణవాన్ ।
ఊచే దేహి బృహత్ స్థానం ప్రాకి వచ్చామ్బుదౌ తతః.
అచట పెద్దదై ఆ రాజుతో ఇట్లనెను : “ఓ ! మనుచక్రవర్తీ ! నాకు విశాల మైన స్థానము నిమ్ము.” పిమ్మట దానిని సరస్సులో ఏడువగా ఆది ఆ సరస్సు ప్రమాణము వంటి ప్రమాణము గలదిగ పెరిగెను. “నా కింకను పెద్దదైన స్థానము నిమ్ము” అని పలుకగా దాని నాతడు సముద్రములోనికి విడచేను.
లక్షయోజనవి స్తీర్ణః గణమాత్రేణ సోభవత్ ।
మత్స్యం తమద్భుతం దృష్ట్వా విస్మితః ప్రాబ్రవీన్మనుః.
ఆది క్షణమాత్రమున లక్షయోజనముల ప్రమాణము గలదిగా పెరిగెను. అద్భుత మైన ఆ మత్స్యమును చూచి, మనువు ఆశ్చర్యము చెంది ఇట్లు పలికెను.
కో భవాన్నను వై విష్ణుర్నారాయణ నమోస్తుతే।
మాయయా మోహయని మాం కిమర్థం త్వ జనార్ధన.
“నీ వెవరవు ? నీవు నిజముగ విష్ణుమూర్తివే. నారాయణా ! నీకు నమస్కారము. జనార్దనా ! మాయచేత నీవు నన్నీ విధముగ ఏల మోహ పెట్టుచున్నావు ?”
మనునోక్తో ఒబ్రవీన్మత్స్యో మనుం వై పాలనే రతమ్ ।
అవతీర్ణో భవాయాస్య జగతో దుష్టనష్టయే.
మను ఏ విధముగా పలుకగా ఆ మత్స్యము ప్రజలను పాలించుట యందు (లేదా తనను రక్షించుటయందు) ఆసక్తి గల ఆతనితో ఇట్లనెను - “ఈ జగత్తును నిలుపుటకును, దుష్టులను నశింపచేయుటకును అవతరించినాను”.
సప్తమే దివసే త్వబ్దిః ప్లావయిష్యతి వై జగత్ ।
ఉపస్థితాయాం నావి త్వం బీజాదీని విధాయ చ.
స వర్షిభిః పరివృతో నిశాం బ్రాహ్మీం చరిష్యసి ।
ఉపస్థిత స్య మే శృజ్గే నిబధ్నీహి మహాహినా.
“(నేటినుండి) ఏడవ దివసమున సముద్రము ఈ జగత్తును ముంచివేయును. ఆపుడు నీదగ్గరకు వచ్చిన నావలో బీజములు మొదలగువాటిని ఉంచుకొని, సప్తర్షి సమేతుడవై బ్రహ్మ నిద్రించు రాత్రి అంతయు సంచరించగలవు. నేను నీ దగ్గరకు వచ్చినపుడు ఆ నావను పెద్ద సర్పముతో నా కొమ్మునకు కట్టి వేయుము”.
ఇత్యుక్త్వానర్ధదే మత్స్యో మనుః కాలప్రతీక్షకః।
స్థితః సముద్ర ఉద్వేలే నావమారురు హే తదా.
ఇట్లు వలికి మత్స్యము అంతర్ధానము చెందెను. మనువు ఆ కాలమునకై నిరీక్షించుచు ఉండెను. సముద్రము గట్టు దాటి పొంగగా అపుడు నావను ఎక్కెను.
ఏకశృజ్గదరో మత్స్యో హైమో నియుతయోజనః ।
నావం బబన్ద తచ్ఛృజ్గే మత్స్యాఖ్యం చ పురాణకమ్.
శుశ్రావ మత్స్యాత్పాపఘ్నం సంస్తువన్ స్తుతిభిశ్చ తమ్ ।
ఒక కొమ్ముగల, పదివేల కోట్ల యోజనములు గల బంగారు మత్స్యము (వచ్చెను). దాని కొమ్మునకు నావను కట్టెను. ఆ మత్స్యమును స్తోత్రములచే స్తుతించుచు, పాపములను తొలగించు మాత్స్యపురాణమును ఆ మత్స్యము చెప్పగా వినెను.
బ్రహ్మవేదప్రహర్తారం హయగ్రీవం చ దానవమ్.
ఆవరీద్వేదమన్రాద్యానాలయామాస కేశవః।
ప్రాప్తే కల్పేఽఒథ పోరా హే కూర్మరూపోథభవద్దరి.
ఇత్యాదిమహాపురాణే ఆగ్నేయే మత్స్యావతారో నామ ద్వితీయోధ్యాయః.
కేశవుడు బ్రహ్మ నుండి వేదములను అపహరించిన హయగ్రీవు డను దానవుని సంహరించి వేద మంత్రాదులను రక్షించేను. పిమ్మట వారాహకల్పము రాగా హరి కూర్మావతారము ధరించెను.
అగ్ని మహాపురాణములో మత్స్యావతారమను ద్వితీయాధ్యాయము సమాప్తము.
Summary of chapter 2 of the Agni Purāṇa is as follows:
This chapter narrates the sacred episode of the Matsya avatāra, wherein Bhagavān appeared as a great fish to protect the Veda-s from the demon Śaṅkhāsura and to guide Manu safely through the cosmic deluge. The fish first appeared in the palm of Manu's hands as a tiny creature, then grew to fill successive vessels — a jar, a well, a lake, the ocean — before revealing its divine form. Bhagavān commanded Manu to build a great vessel and place upon it the seven ṛṣi-s, seeds of all plants, and pairs of all creatures. After slaying Śaṅkhāsura and recovering the Veda-s, Bhagavān towed Manu's vessel to safety on the peaks of the Himālaya. The episode is presented as the primordial act of cosmic preservation from which all subsequent creation unfolds.