అగ్ని మహా పురాణము

25 - అథ వాసుదేవాదిమంత్ర ప్రదర్శనమ్

నారద ఉవాచః -

వాసుదేవాదిమంత్రణాం పూజ్యానాం లక్షణం వదే

 వాసుదేవః సజ్కరణః ప్రద్యుమ్న నిరుద్దక  

నమో భగవతే చాదౌ ఆ ఆ అం అః, సబీజకాః

 ఓజ్కారాద్యా నమోస్తాశ్చ నమో నారాయణ స్తతః.

 నారదుడు పలికెను :-

పూజ్యము లైన వాసుదేవాది మంత్రముల లక్ష్మణము చేప్పేదను. ఆదియందు “నమో భగవతే” అను పదములో కలవి, అ, ఆ, అం, అః అను బీజాక్షరములతో కూడినవి. ఓంకారము. ఆది యందు కలవి, 'నమః' అనునది అంతమందు కలవి ఆయిన “వాసుదేవ' 'సతికరణ' ప్రద్యుమ్న' 'అనిరుద్ద' అను పదములచే “ఓం ఆ నమో భగవతే వాసుదేవాయ” ఓం ఆ నమో భగవతే సంకర్షణాయ” “ఓం అం నమో భగవతే ప్రద్యుమ్నాయ” “ఓం అః నమో భగవతే అనిరుద్దాయ” అను మంత్రము లేర్పడును. పిమ్మట “ఓం నమో నారాయణాయ” అను మంత్రము.

ఓం తత్సద్ర్బహ్మణే చైవ ఓం నమో విష్ణవే నమః

ఓం కౌం ఓం నమో నరసింహాయ వై నమః.

 ఓం భూర్బగవతే వరాహాయ నరాధిపాః

 జపారుణహరిద్రాభా నీలశ్యామలలోహితాః.

మేఘాగ్ని మధుపిజ్జాభా వల్లభా నవ నాయకాః

ఆజ్గాని స్వరబీజానాం స్వనామాక్షైర్యథాక్రమమ్. 

హృదయాదీని కల్పేత విభకేస్త స్త్రవేదిభిః

వ్యజ్ఞనాదీని బీజాని తేషాం లక్షణమన్యథా.

“ఓం తత్సద్భ్రహ్మణే నమః” “ఓం నమో విష్ణవే నమః” “ఓం క్రైం ఓం నమో భగవతే నరసింహాయ నమః”. “ఓం భూర్బగవతే వరాహాయ నమః” (ఇవి మంత్రములు). జపా పుష్పము వలే అరుణమైన రంగు పసుపువంటి రంగు నీల - శ్యామల - లోహిత వర్ణములు, మేఘ - అగ్ని - మధువుల వంటి రంగులు, పింగవర్ణము గల తొమ్మండుగురు నరాధిపులు వీటికి నాయకులు. తంత్రవేత్తలు విభజించిన విధముగ స్వరరూపము లైన బీజాక్షరములకు ఆయా మంత్రము లందలి నామములను చివర చేర్చి హృదయాద్యంగములను కల్పించవలేను. వ్యంజనాది బీజాక్షరముల లక్షణము వేరుగా ఉండును.

 దీర్ఘన్వరైస్తు భిన్నాది నమోనా నస్థితాని తు

అఙాని హ్రస్వయుక్తాని ఉపాజ్గానీతి వర్జ్యతే.

'నమః' అనునది అంతము నందు గల మంత్రముల మధ్య దీర్ఘ స్వరములతో గూడి యున్న వ్యంజనములు ఆంగము అనియు, హ్రస్వస్వరములతో కూడినవి ఉపాంగము లనియు చెప్పబడును.

విభక్తనామవర్ణానస్థితం బీజాత్మము త్తమమ్

దీక్షప్రస్వైశ్చ సంయుక్తం సాజ్గోపాజ్గస్వరైః క్రమాత్. 

వ్యజ్ఞానానాం క్రమో హ్యేష హృదయాది ప్రక్ల ప్రయే

 స్వబీజేన స్వనామా నైర్విభక్తాన్యజనామభిః.

 యుక్తాని హృదయాదీని ద్వాదశాక్తాని పఞ్చతః

 ఆరభ్య కల్పయిత్వా తు జపేత్సద్ధానురూపతః.

దీర్ఘ ప్రస్వములతో కూడినదియు, సాంగోపాంగ స్వరములతో కూడినదియు, విభజింపబడిన నామాక్షరము ఆంతమునందు ఉన్న దియు అగు బీజాక్షరము ఉత్తమ మైనది. హృదయాది కల్పనమునకు వ్యంజనముల క్రమ మిది - తన నామము అంతము నందు గల ఆంగ నామములచే విభ క్తము లై స్వబీజాక్షరముతో కూడిన, ఐదు మొదలు పండ్రెండు వరకును ఉన్న హృదయాదులను కల్పించి సిద్ధికి అనుగుణముగా ఉండునట్లు జపించవలెను. 

హృదయం చ శిరశ్చూడా కవచం నేత్రమస్త్రకమ్

 షడజ్గాని తు బీజానాం మూలస్య ద్వాదశాబ్ధకమ్.

 హృచ్ఛిరశ్చ శిఖా చైవ హస్తా నేత్రే తథోదరమ్

పృష్ఠ బాహూరు జానూంశ్చ జజ్ఘే పాదౌ క్రమాన్న్యసేత్ .

హృదయము, శిరస్సు, శిఖ, కవచము, నేత్రము, అస్త్రము అను ఈ ఆరును  బీజముల ఆంగములు. హృదయము. శిరస్సు, శిఖ, హస్తముయి, నేత్రములు, ఉదరము, పృష్టభాగము, బాహువులు, ఊరువులు, మోకాళ్ళు పిక్కeo, పాదములు ఈ పండ్రెండును మూలమునకు ఆంగ ములు. క్రమముగా వీటి అన్నింటిపై న్యాసము చేయవలెను.

 కం టం పం శం వైన తేయః ఖం ఠం ఫం షం గదానుజః

గం డం బం సం పుష్టిమన్తో ఘం డం భం హం శ్రియై నమః.

వం శం మం క్షం పాఇ్చజన్యం ఛం తం పం కౌస్తుభాయ చ

 జం ఖం వం సుదర్శనాయ శ్రీవత్సాయ సం వం దం చం లం.

“కం టం పం శం వే నతేయాయ నమః” “ఖం ఠం ఫం, షం గదానుజాయ నమః” గం డం బం సం పుష్టి మన్తాయ నమః”. ఘం థం థం హం శ్రియై నమః” వం శం మం క్షం పాఇ్చజన్యాయ నమః” “ఛం తం పం కౌస్తుభాయ నమః” “జం ఖం వం సుదర్శనాయ నమః” “సం వం దం చం లం శ్రీవత్సాయ నమః”.

ఓ ధం వం వనమాలాయై మహానన్తాయ వై నమః

నిర్బీజపదమన్రాణాం పదై రజ్గాని కల్పయేత్.

ఓం ధం వం వనమాలాయై నమః “మహానక్తాయ నమః” బిజరహితము లైన పదములు గల మంత్రములకు పదములచేతనే అంగములను కల్పింపవలెను.

జాత్యన్తర్నా మసంయు కెరృదయాదీని పఞ్చధా

ప్రణవం హృదయాదీని తతః ప్రోక్తాని పశ్చిధా.

నామసంయుక్తములును, జాత్యంతములును ఆగు పదములచే, హృదయాది పంచకన్యాసమును చేయవలెను. ప్రణవము, పిమ్మట ఐదు హృదయాదులును చెప్పబడినవి.

ప్రణవం హృదయం పూర్వం పరాయేతి శిరః శిఖా

నామ్నాత్మ నా తు కవచ మస్త్రం నామా న్తకం భవేత్.

ముందుగా ప్రణవముచే హృదయమును, 'పరాయ' అని శిరస్సును, పేరుతో శిఖను. ఆత్మ చేత కవచమును, నామా న్తముతో అస్త్రమును విన్యసించవలెను.

ఓం పరాస్తాది స్వనామాత్మా చతుర్ద్యన్తోనమో నకః

ఏక వ్యూహాది షడ్వింశ వ్యూహాత్త స్యాత్మనో మనుః.

ఓంకారము ఆదియందు గల నామాత్మక పదమునకు చివర నమః చేర్చి నామాత్మక పదమును చతుర్థ్యంతము చేసి చెప్పవలేను. ఏక వ్యూహము మొదలు ఇరువదియారవ వ్యూహము వరకును ఇది సమానము.

కనిష్ఠికాది కరాగ్రేషు ప్రకృతిం దేహ కే ర్చయేత్

 పరాయ పురుషాత్మా స్యాత్ ప్రకృత్యాత్మా ద్విరూపక.

 ఓం పరాయగ్న్యాత్మనే చ వస్వరౌ చ ద్విరూపకః

అగ్నిత్రిమూర్తా విన్యస్య వ్యాపకం కరదేహయోః.

వాయ్వర్కౌ కరశాఖాసు సవ్యేతరకరద్వయే

 హృది మూర్తి తనావేష త్రివ్యూ హే తుర్యరూప కే.

కనిష్ఠిక మొదలైన కరాగ్రములందు దేహము పై ప్రకృతిని అర్చించవలెను. పరమ పురుషాత్మయే పరుడు. ప్రకృత్యాత్మ ద్విరూపము. “ఓం పరాయగ్న్యాత్మనే నమః” ఇది వ్యాపక మంత్రము. వసు - అర్క - అగ్నులు త్రివ్యూహాత్మక మార్హులు. ఈ మూడింటిపై అగ్ని న్యాసముచేసి కరదేహములపై వ్యాపకమును విన్యసించి, ఆంగుళుల యందును, సవ్యాపసవ్య హస్తములయందును, హృదయమునందును, మూర్తియందును, తుర్యరూప మగు త్రివ్యూహ మైన తనువునందును వాయ్వర్కులను విన్యసించవలెను.

 ఋగ్వేదం వ్యాపకం హస్తే అజ్గులీషు యజుర్న సేత్త

లద్వయేథర్వ రూపం శిరో హృచ్చరణాంతిగమ్.

  ఆకాశం వ్యాపకం న్యస్య కరే దేహే తు పూర్వవత్

 అజ్గులీషు చ వాయ్వాది శిరో హృద్గుహ్యపాద కే

వ్యాపక మైన ఋగ్వేదమును హస్తమునందును, ఆంగుళులపై యజుర్వేదమును, రెండు అర చేతులలో అథర్వ మును శిరోహృదయచరణములయందు సామవేదమును పంచవ్యూహమునందు ఆకాశమును విన్యసించి కరములందును, దేహము, నందును అంగుళీ - శిరో - హృదయ - గుహ్య - పాదములందును వాయ్వాదికమును పూర్వము చెప్పినట్లు న్యసించవలెను.

వాయుర్ధ్యోతిర్జలం పృథ్వీ ప్చవ్యూహః సమీరితః

 మనః శ్రోత్రం త్వగ్దృగ్జిహ్వా ఘ్రాణం షడ్వ్యూహ ఈరితః

వాయువు, అగ్ని, జలము, భూమి (ఆకాశము). వీటి సముదాయము పంచవ్యూహము మనస్సు, శ్రోత్రము, త్వక్కు, నేత్రము, జిహ్వ, ఘ్రాణము వీటి సముదాయము షడ్వ్యూహము.

వ్యాపకం మానసం న్యస్య తతోజ్గుష్ఠాతః క్రమాత్

మూర్దాస్యహృద్దుహ్యపత్సు కథితః కరణాత్మకః.

 ఆదిమూర్తిస్తు సర్వత్ర వ్యాపకో జీవసంజ్ఞితః

వ్యాపక మైన మానసమును విన్యసించి పిమ్మట క్రమముగా అంగుష్టాచుందును, శిరస్సు, ముఖము, హృదయము, గుహ్యప్రదేశము, పాదములు - వీటి యందును న్యాసము చేయవలెను. ఇది “పరమాత్మకవ్యూహన్యాసము”. ఆదిమూర్తి అగు జీవుడు సర్వవ్యాపకుడు.

భూర్భువః స్వర్మహర్జన స్తపఃసత్యం చ సప్తధా.

కరే దేహే న్య సేదాద్యమజ్గుష్టాదిక్రమేణ తు

భూః, భువః, సువః, మహః, జనః, తప, సత్యం అను ఈ ఏడింటిని ముందుగా కరమునందును, దేహము, నందును అంగుష్ఠాది క్రమమున విన్యసించవలెమ.

 తలసంస్థ సప్తమశ్చ లో కేతో దేహ కే క్రమాత్.

దేశ శీతలాటాస్యహృద్దుహ్యా జ్ఘ్రిషు సంస్థితః

ఏడవది తలములం దుండును. లోకేశు డైన దేవుడు దేహమునందు క్రమముగా - శిరస్సు, లలాటము, ముఖము, హృదయము, గుహ్యము, పాదములు - వీటియందు ఉండును.

అగ్నిష్టోమ స్తథోక్టస్తు షోడశీ వాజపేయకః.

 అతిరాత్రోప్రోర్యామశ్చ యజ్ఞాత్మా సప్త రూపక

అగ్నిష్టోమము, ఉర్థము, షోడశి, వాజ పేయమ, ఆ.నాక్రము, ఆప్తోర్యామము అని యజ్ఞాత్మ సప్తరూపములు కలది .

ధీరహం మనః శబ్దశ్చ స్పర్శరూపరసాస్త త.

గనో బుద్ధిర్వ్యాపకం తు కరే దేహే న్య సేత్ర్కమాల్

న్య సేదజ్ఘ్రౌ చ తలయోః కే లలాటే ముఖే హృది.

నాభౌ గుహ్యే చ పాదౌ చ అష్టవ్యూహః పుమాన్ స్మృతః

ధీ, అహంకారము, మనస్సు, శబ్దము, స్పర్శ - రూప - రసములు, గంధము, వ్యాపకమైన బుద్ధి వీటిని క్రమముగా కరమునందును, దేహమునందును విన్యసించవలేను. పాదములు, తలములు, శిరస్సు, లలాటము, ముఖము, హృదయము, నాభి, గుహ్య ప్రదేశము, పాదము వీటిపై విన్యసించవలెను. జీవుడు అష్టవ్యూహు డని చెప్పబడినాడు.

జీవో బుద్దిరహజారో మనః శబ్దో గుణానిలః.

రూపం రసో నవాత్మాయం జీవ ఆజ్ఞుష్ఠకద్వయే

 తర్జన్యాక్రమాశ్చేషం యావద్వాతుప్రదేశినీమ్.

 దేహే శిరోలలాటాస్యహృన్నా భీగుహ్యజానుము

పాదయోశ్చ దశాత్మాయ మింద్రో వ్యాపీ సమస్థితః.

  ఆఱుష్ఠద్వయ కే వహ్ని నర్జన్యాదౌ పరేషు

 చ శిరోలలాటవషు హృన్నా భిగుహ్యజానుమ. 

పాదయోరేదశాత్మా మనః శ్రోత్రం త్వగేవ చ

చతుర్జిహ్వా తథా ప్రణం వాక్పాణ్యజిక్చ పాయు చ.

 ఉపస్థం మానసో వ్యాపీ శ్రోత్రమజ్ఞుషక ద్వయే

తర్జన్యాదిక్రమాదష్టావతిరిక్తం తలద్వయే.

 ఉత్త మాజ్ఞలలాటాస్య హృన్నా భావథ గుహ్య కే

 ఊరుయుగ్మే తథా జజ్ఘా గుల్పపాదేషు చ క్రమాత్.

జీవుడు, బుద్ధి, అహంకారము,  మనస్సు, శబ్దము, గుణము, వాయువు, రూపము, రసము అని జీవుడు సవాత్మకుడు. అంగుష్ఠద్వయము నందు జీవుని, మిగిలిన వాటిని తర్జని మొదలు వామప్రదేశిని వరకును విన్యసించవలెను. దేహము పై, శిరస్సు, లలాటము, ముఖము, హృదయము, నాభి, గుహ్యము, మోకాళ్ళు, పాదములు వీటిపై విన్యసించ వలెను. దశాత్మకుడగు ఈ జీవుడు వ్యాపకుడుగా చెప్పబడుచున్నాడు. అంగుష్ఠద్వయమునందును, తర్జన్యాదులయందును, శిరోలూట, ముఖ, హృదయ, నాభి, గుహ్య, జాను, పాదములందును విన్యసించవలెను. మనః, త్ర, చతుర్, జిహ్వా, ఫ్రణ, వాక్, పాణీ, పాద, పాయు, ఉపస్థరూపమున ఏకాదశాత్మను డగు ఈ జీవుని శ్రోత్రమునందును, అంగుష్ట ద్వయము నందును, తర్జని మొదలు ఎనిమిదింటియందును, మిగిలిన తలద్వయమునందును విన్యసించవలెను. మనస్సు వ్యాపకము. అట్లే దేహముపై క్రమముగా శిరో, లలాట, ముఖ, హృదయ, నాభి, గుహ్య, ఊరుద్వయ, జంఘా, (పిక్కలు) గుల (చీలమండలు), పాదములపై విన్యసించవలెను.

 విష్ణుర్మధుహరశ్చైవ త్రివిక్రమకవామనౌ

శ్రీధరోథ హృషీ కేశః పద్మనాభ స్తథైవ చ.

 దామోదరః కేశవశ్చ నారాయణస్తతః పరః

మాధవశ్చాథ గోవిందో విష్ణుర్వె వ్యాపకం న్య సేత్. 

అజ్గుష్టాదౌ తలాదౌ చ పాదే జానుని వై కటౌ

శిరః శిఖోరః కట్యాస్య జానుపాదాభిష న్య సేత్.

 ద్వాదశాత్మా పంచవింశః షడ్వింశ వ్యూహకస్తథా

విష్ణువు, మధుహరుడు, త్రివిక్రముడు, వామనుడు, శ్రీధరుడు, హృషీ కేశుడు, పద్మనాభుడు, దామోదరుడు, కేశవుడు, నారాయణుడు, మాధవుడు, గోవిందుడు అని, ద్వాదశాత్ముడు. వీటిలో విష్ణువును వ్యాపకునిగా విన్యసించి, మిగిలిన వారిని అంగుష్టాదులండును, తలాదులందును, పాదమునందును, జానువునందును, కటియందును, శిరస్సు, శిఖ, ఉరస్సు, కటి, ముఖము, జానువు, పాదము మొద లైన వాటియందును విన్యసించవలెను. పంచవింశవ్యూహములుకలవాడును, షడ్వింశ వ్యూహములు కలవాడును, ఎట్లనగా,

 పురుషో ధీరజ్కారో మనశ్చిత్తం చ శబ్దకః.

తథా స్పర్మో రసో రూపం గన్ధః శ్రోత్రం త్వచస్తథా

చక్షుర్జిహ్వా నాసికా చ వాక్చ పాణ్యంఘిశ్చ పాయవ.

ఉపస్థో భూర్జలం తేజో వాయురాకాశ మేవ చ

పురుషం వ్యాపకం న్యస్య అబ్దుషాదౌ దశ న్యసేత్.

 శేషాన్ హస్త తలే న్యస్య శిరస్యథ లలాట కే

ముఖహృన్నా భిగుహ్యోరుణాన్వంమౌ కరణోద్గతౌ. 

పాదౌ జాన్వోరుప స్టే చ హృదయే మూర్ద్ని చ క్రమాత్

పరశ్చ పురుషాత్మాదౌ షడ్వింశే పూర్వవత్ పరమ్,

పురుష-ధీ-అహంకార-మనస్-చిత్తశబ్దస్పర్శ-రస రూప-గంధ-శోత్ర-త్వక్-చక్షుర్ -జిహ్వా-నాసికా-వాక్-పాణిపాద-పాయు-ఉపస్థ-భూజలతేజస్-వాయు- ఆకాశములు పంచవింశతివ్యూహము. పురుషుని వ్యాపకునిగా విన్యసించి, పదింటిని అంగుష్టాదులందును, మిగిలిన వాటిని హస్త తలమునందును విన్యసించవలెను. పిమ్మట శిరస్సు, లలాటము, ముఖము, హృదయము, నాభి, గుహ్యము, ఊరువులు, జానువులు, పాదములు, దశేంద్రియములు, పాదములు, జానువులు, ఉపస్థ, హృదయము, శిరస్సు.వీటిపై క్రమముగా విన్యసించవలెను. షడ్వింశవ్యూహమునందు పురుషాత్మకు ముందు పర రూపము ఉండును. మిగిలినదంతయు వెనుక చెప్పినట్లే.

సంచిన్య మణ్డలై కే తు ప్రకృతిం పూజయేద్బుధః

పూర్వయామ్యావ్యసౌమ్యేష హృదయాదీని పూజయేత్.

 అస్త్రమగ్న్యాదికోణేషు వైనతేయాదిపూర్వవత్

దిక్పాలాశ్చ విధిస్త స్య త్రివ్యూ హేగ్నిశ్చ మధ్యతః. 

పూర్వాదిదిగ్ధలా వాసై రాజ్యాదిభిరలజ్కృతః

కర్ణికాయాం నాభసశ్చ మానసః కర్ణికాస్థితః.

పండితుడు ఒక మండలము పై ప్రకృతిని ధ్యానించి పూజింపవలెను. పూర్వ-దక్షిణ-పశ్చిమ-ఉత్తర దిశలందు హృదయాదులను పూజింప వలెను. అగ్న్యాది కోణములందు అస్త్రమును, వైనతేయాదులను, దిక్పాలులను పూర్వమునందు వలెనే పూజింపవలెను. త్రివ్యూహమునందు అగ్ని మధ్యమం దుండును. పూర్వాది దిక్కులందు దలములం దున్న దేవతలతో కూడ రాజ్యాధ్యలంకృతుడై కమల కర్ణికయందు నభోరూపుడగు, మాన సాత్మ (అంతరాత్మ) ఉండును.

విశ్వరూపం సర్వస్థిత్యై యజేద్రాజ్య జయాయ చ

సర్వవ్యూ హై సమాయుక్త మజ్గై రపి చ పఞ్చభిః. 

గరుడాద్యైస్త థేన్గాద్యైః సర్వాన్ కామానవాప్నుయాత్

 విష్వక్సేనం యజేన్నా మా వై బీజం వ్యోమసంస్థితమ్.

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే వాసుదేవాదిమంత్రప్రదర్శనం నామ పఞ్చవింశోధ్యాయః

ఈ విఖముగ సర్వవ్యూహములతోను, గరుడాదిపంచాంగములతోను, ఇంద్రాదులతోను కూడిన విశ్వరూపుని లోకస్థితినిమిత్తము, రాజ్యజయముకొరకును పూజింపవలేను. సమస్త కామములను పొందును. ఆకాశమునం దున్న బీజమును స్మరించుచు విష్వక్సేనుని పేరుతో పూజించవలెను.

అగ్ని మహాపురాణములో వాసుదేవాదిమంత్ర ప్రదర్శనరూప మగు ఇరువదియైదవ అధ్యాయము సమాప్తము.