అగ్నిగువాచః-
స్వర్గాది నామలింగోయో హరిస్తం ప్రవదామితే ।
స్వః స్వర్గ నాక త్రిదివాద్యో దివౌద్వే త్రివిష్టపమ్.
దేవాబృందార కా లేజారుద్రాధ్యా గణదేవతాః ।
విద్యాధరోఽప్సరోయక్ష రక్షోగంధర్వ కిన్నరాః।.
పిశాశో గుహక సిద్ధో భుతోఽమి దేవ యోనయః ।
దేవద్విషోఽసురా దాఇత్యాః సుగతః స్యాత్తథాగతః .
బ్రహాత్మ భూః సుర జ్యేష్టో విఘ్నర్నా రాయణోహరిః ।
రేవతీశో హలీరామః కామః పంచశరః స్మరః.
లక్ష్మీః పద్మాలయా పద్మాసర్వః సర్వేశ్వరః శివః ।
క పర్దోఽస్య జటాజూటః పినాకోఽజ గవంధనుః..
ప్రమథాః స్యుః పారిషదామృడానీ చండికాంఽబికా ।
ద్వైమాతురో గజాస్యశ్చ సేనానీ రగ్ని భూర్గుహః..
ఆఖండలః సునాసీర: సుత్రామాచ దివస్పతిః ।
పులోమజాశ చీన్దాణీ దేవితస్యతు వల్లభా.
స్యాత్ప్రాసాదౌ వైజయంతో జయంతః పాకశాసనిః ।
ఐరావతోఽభ్రమాతంగై రావణాభ్రమువల్లభాః।.
హ్రాదినీ వజ్రమస్త్రీసాత్కులిశం భిదురం పవిః ।
వ్యోమయానం విమానోఽస్త్రీ పీయూష మమృతంసుధా.
స్యాత్సుధర్మా దేవసభా సర్గంగా సుర దీర్ఘికా ।
స్త్రియాం బహుష్పప్సరసః స్వర్వేశ్యా ఉర్వశీ ముఖాః.
హాహా హూహూశ్చ గంధర్వా అగ్నిర్వహ్నిర్ధనం జయః ।
జాత వేదాః కృష్ణవర్త్మా ఆశ్రయాశశ్చ పావకః ।.
హిరణ్యరేతాః సప్తార్చిః శుక్ర శ్చైవాశు శుక్షణ। ।
శుచిర ప్తిత్తమౌర్వస్తు వాడవో వడ వానలః.
వ హ్నేర్ద్వయోర్జ్వాల కీలా వర్చిర్హేతిః శిఖాస్త్రియామ్ ।
త్రిషు స్ఫులింగోఽగ్ని కణో ధర్మరాజః పరేతరాట్.
కాలోఽన్తకో దండధర శ్రాద్ధదేవోఽథ రాక్షసః ।
కోణపాస్త్ర పక్రవ్యాదా యాతుధానశ్చ నైఋతిః.
ప్రచేతా వరుణః పాశిశ్వననః స్పర్శనోఽనిలః ।
సదాగతిర్మాతలిశ్వా ప్రాణో మరుత్స మీరణః.
జవోరం హ స్తరసీ తులము క్షిప్ర మరం ద్రుతమ్ ।
సత్వరం చపలంతూర్ణమ విలంబితమాశుచ.
సతతాఽనారతా శ్రాంత సంతతా విరతా నీశమ్ ।
నిత్యానపరతా జస్ర మప్యథాతి శయోభర.
అతి వేల ధృశాత్యర్థాతి మాత్రోద్గాడ నిర్భరమ్ ।
తీవ్రై కాంత నితాంతాని గాడభాడ దృడానిచ.
గుహ్య కేశో యక్షరాజో రాజరాజో ధనాధిపః ।
స్యాత్కిన్నరః కింపురుషస్తురంగ వదనోమయుః.
నిధ్మిర్నాశే విధిర్యోమత్వభ్రం పుష్కర మంబరమ్ ।
ద్ర్యోదవౌ దాంతరిక్షం ఖం కాష్ఠాశాకకుభోదిశః.
ఆభ న్తరం త్వన్తరాలం చక్ర వాలం తు మండలమ్ ॥
తడిత్వా న్వారిదో మేఘ స్తనయిత్ను ర్బలాహకః.
కాదంబనీ మేఘ మాలా స్తనితం గర్జితం తథా ।
శంపా శత హ్రదాహ్రాది న్యైరావత్య: క్షణప్రభా.
తడిత్సౌదామినీ విద్యుచ్చంచలా చపలాఽపిచ ।
స్ఫూర్జథుర్వ జ్రనిర్ఘోషో వృష్టిఘాత స్త్వవగ్రహః.
ఆగ్ని పలికెను. స్వర్గాదినామములు లింగముగ కల హరిని గూర్చి చెప్పెదను. స్వస్ స్వర్గ. నాక, త్రిదివ, ద్యో దివ్, (పుం, స్త్రీ.) త్రివిష్ట పమ్, = స్వర్గము. దేవాః, వృందారకాః లేఖాః = దేవతలు, రుద్రులు మొదలగు వారు గణ దేవతలు. విద్యాధరకి అప్సరాః, యక్షకి, రక్షః గందర్వ: కిన్నరః పశాచః, గుహ్యకః, సిద్ధ, భూతః - వీరందరు దేవయోనులు, దేవద్విషః, అసురాః దైత్యాః = దైత్యులు. సంగతః, తథా గతః = బుద్ధుడు బ్రహ్మ ఆత్మ భూ, సురజ్యేష్ఠ = బ్రహ్మ, విష్ణు, వారాయణః, హరిః = విషువు. రేవతీశః, హలీ, రామః, = బల రాముడు, కామః, పంచశరః స్మరః = మన్మథుడు, లక్ష్మీ, పద్మాలయా, పద్మా, = లక్ష్మి శర్వః, సర్వేశ్వరః, శివః = శివుడు, ఇతని జటా జూటమునకు కపర్ద యని పేరు. పినాకిః, అజగవమ్ ఈ రెండును ఈతని ధనుస్సునకు పేర్లు. శివుని పారిషదులకు ప్రమథాః అని పేరు. మృడానీ, చండికా, ఆంబికా = పార్వతి ద్వైమాతురః, గజాస్యః= గణపతి, సేవానీకి, అగ్నిభూః గుహః = కుమారస్వామి. ఆఖండల సునాశీరః, సుత్రామా, దివస్పతిః, = ఇంద్రుడు ఆతని భార్యకు పులోమజా శచీ, ఇందాజీ, యని పేరు. ఆతని ప్రాసాదము వైజయంతమ్. ఆతని కుమారుడు జయంతుడు ఐరావతః, అభ్రమాతంగః, ఐరావణః; అభ్రము వల్లభః = ఐరావతము ప్రోదినీ, వజ్రం. (పుం, న) కులిశమ్, ఖదురమ్, పవి=వజ్రాయుధము వ్యోమయానం, విమాన (పుం వ) = విమానము. పీయూషం, అమృతమ్, సుధా = అమృతము. సుధర్మా-దేవ సభా; స్వర్గంగా సుర దీర్చి కా= స్వరలోక గంగ, అప్సరన్ శబ్దము శ్రీలింగము వందును నిత్య బహువచనము నందును వుండును. ఊర్వశి మొదలగువారు స్వర్గలోక వేశ్యలు. హా హా ఉహుశీ, వీరు గంధర్వులు, అగ్ని, వహ్నిః, ధనంజయః, జాత వేదాః. కృష్ణవర్తి, ఆయాశః, భావకః, హిరణ్య రేలాః, శుక్రః, ఆశుశుక్షణిః శుచిః, అప్పిత్తమ్ = అగ్ని; ఔర్వ, వాడవః వడవానలు=వడవాగ్ని; అగ్ని యొక్క జ్వాలలు బోధించు జ్వాల కీలక బ్దములు రెండు లింగములందును వుండును. ఆర్చికి హేతికి శిఖా, (స్త్రీ)=జ్వాలలు. స్ఫు లింగ పుం స్త్రీన = అగ్ని కణము. ధర్మరాజుకి, పర తరాట్ కాలః, హంతక:. దండధరః, శ్రాద్ధదేవః=యమును: రాక్షస, - కోణప - ఆసప, - క్రవాద - యాతుధావ - నైఋతి =రావసు, ప్రచేతన్ - వరుణ - పాశీ = వరుణుడు శ్వసనకి - స్పర్శనః, - అనిలః - సదాగతిః, - మాతరిష్వన్ - ప్రాణః - మరుత్ - సమీరణః వాయువు, జవ - రంహన్ - తరస్ - వేగము - లము, - &ప్రమ్, - ఆరం, - ద్రుతమ్, - సత్వరం, - చపలం - తూర్ణం - అవి లంబితయ్ - ఆక=శ్రీఘముగా; సతత, - ఆవారత - ఆశ్రాంత - సంతత - ఆవిరత - అనిశ - నిత్య - అనవరత ఆజస= ఎల్లప్పుడును. అతి శయః, భరః=అతిశయము, అతివేల, - భృశ . అత్యర్థ . అతిమాత్ర - ఉద్దాడ . నిర్భర - తీవ్ర - ఏకాంత - నితాంత - గాఢ - బాడ - దృఢ = మిక్కిలి; . గుహ కేకః, యక్షరాజకి, రాజరాజః - ధనా దీప= కుబేరుడు. కిన్నరః - కింపురుషః - తురంగవదనః - మయుః - ఇవి సమానార్థకముణ. నిధిః - శేవధిః= నిధి, వ్యోమ, - అథ - పుష్కర - అంబర . ద్యో - దివ్ - అంతరిక్ష - ఖ=ఆకాశము, కాష్ఠా . ఆశా . కుకుభ్ . దీశ్ =దిక్కులు. - అభ్యంతరమ్ - అంతరాళమ్ - చక్రవాళము - మండలమ్=మండలము. తటిత్వత్ - వారిద, మేమ - స్తనయిత్ను , - ఐలాహకమేఘము. కాదంబనీ, మేఘమాలా= మేఘ పంక్తి - స్తనీతం - గర్జితమ్=ఉరుము; శంపా - శతహ్రద - హ్రాదినీ - ఐరావతీ - క్షణప్రభా - తడిత్ - సౌదామినీ - విద్యుత్ - చంచలా చపలా= మెరుపు స్ఫూర్జథుః - వజ్రనిర్ఘోషః=ఉరుము, అవగ్రహః ఆనగా వర్షా భావము.
ధారా సంపాత ఆసారః శ్రీ కరఒంఽబుకణాః స్మృతాః ।
వర్షపలస్తుక రకామేఘచ్ఛన్నేఽహ్ని దుర్దినమ్.
ఆంతర్ధా వ్యవధాపుంసిత్వ న్తర్ధి రపహరణమ్ ।
ఆపిధానతిరోధాన పిధానాచ్ఛా దనానిచ.
అబ్జోజైవాతృకః సోమోగ్లౌర్ముగాంకః కలానిధిః ।
విదుః కుముదబంధుశ్చ బింబోఽస్త్రీమండలం త్రిష.
కలాతు షోడశోభాగో భిత్తం శకలఖండ కే ।
చంద్రికా కౌముది జ్యోత్స్నా ప్రసాదస్తు ప్రసన్నతా.
లక్షణం లక్ష్మకం చిహ్నం శోభాకాంతిర్ద్యుతిశ్చవిః ।
సుషమ పరమా శోభాతుపారస్తుహినం హిమమ్.
అవశ్యాయస్తు నీహారః ప్రాలేయః శిశిరోహిమః ।
నక్షత్రమృక్షం భంతారా తారకాప్యుడు వాస్త్రియామ్.
గురర్జీవ ఆంగిరస ఉశనా భార్గవకవిః ।
విధుంతుద స్తమోరాహుర్లగ్నం రాశ్యుదయః స్మృతః.
సప్తర్షయో మరీచ్యత్రి ముఖాశ్చిత్ర శిఖండినః ।
హరిదశ్వ బ్రధ్నపూషద్యుమణిర్మి హీరోరవిః.
పరివేషస్తు పరిధిరుప సూర్యకమండలే ।
కిరణోఽస్త్ర మయూఖాంశు గభస్తిఘృణి ఘృష్ణయః.
భానుః కరోమరీచిః శ్రీపుంసయోర్ధీధితి స్త్రియామ్ ।
స్యుః ప్రభారుగ్రుచి స్త్వీడ్భా భాశ్చ విద్యుతి దీప్తయః.
రోచిః, శోచిరుభేక్లీ బే ప్రకాశోద్యోత ఆతపః ।
కోష్ణం కవోష్ణం మందోష్ణం కదుష్ణం త్రిషుతద్వతి.
తిగ్మం తీక్ష్ణం ఖరం తద్వద్దిష్టోఽనేహాచ కాలకః ।
మస్రోదినాహానీ చైవసాయసంధ్యా పితృప్రసూః.
ప్రత్యూషోఽఽహర్ముఖం కల్యముషః ప్రత్యూషసీ ఆపి ।
పాహ్ణాపరాహ్ణ మధ్యాహ్ణ త్రిసంధ్య మథశర్వరీ.
యామీ తమీ తమిస్రాన జ్యోత్స్నీ చంద్రికయాన్వితా ।
ఆగామి వర్తమానా హర్యుక్తాయాం విశిపక్షిణీ.
ఆర్థరాత్ర నిశీథాద్వౌ ప్రదోషోరజనీ ముఖమ్ ।
సపర్వసంధిః ప్రతిపత్పంచ దశ్యోర్యదంతరమ్.
పక్షాంతౌ పంచదశ్యౌద్వే పోర్ణమాసీతు పూర్ణిమా ।
కలాహీనే సానుమతిః పూర్ణేరాకా నిశాకరే.
అమావాస్యా తమావస్యా దర్శః సూర్యేందు సంగమః ।
సాదృష్టేందుః సినీవాలీ సానష్టేందు కలాకుహూః.
ధారా వర్షమునకు ఆసారః అని పేరు. శ్రీకరః = నీటి బిందువులు. వర్షోపలః - కరకా= వడగళ్ళు. దుర్దినమ్= మేమములు కప్పిన దివసము. అంతర్ధా - వ్యవధా - ఆంతర్థి (పుం) ఆపవారణ - ఆపిధాన - తిరోధాన - పిధాన . ఆచ్చాదన = ఆచ్చాదనము. ఆబ్జ - జై వాతృక - సోమ - గ్లౌ - మృగాంక - కళానిధి - విధు - కుముదబందు= చంద్రుడు. బింబః - (పం. నం) మండలము. (పుం శ్రీన) = మండలము పదహారవ భాగమునకు కళ యని పేరు. బిత్త - శకల - ఖండక - ఖండము - చంది - కౌముదీ - జ్యోత్స్నా= వెన్నెల; ప్రసాదః = పసన్నత్వము. లక్షణమ్ లక్మ కమ్ . చిహ్నం = చిహ్నము. శోభా - కాంతి - ద్యుతి - ఛవి - కాంతి - పరుమ శోభ-సషమ. తుషార - తుహిన - హిమ = మంచు - సన్నని మంచునకు అవ్యయః, నీహారః అని పేర్లు. ప్రాలేయః - శిశిరః . పామః =ఇవి కూడ నీహార మునకు పేర్లు. వక్షత్ర . ఋక్ష - భ - రారా - తారకా ఉడు - న = నక్షత్రము. గురుః - జీవః . ఆంగి రసః= గురుడు. ఉశవాః - భార్గవః = కవి = శుక్రుడు. విదుంతుదశి . తమకి - రాహుః = రాహువు. లగ్నం=రాః యొక్క ఉదయము. మరీచి, అత్రి మొదలగు వారు సప్తర్షులు. చితశిఖండినః అని పేరు. హరిదశ్వ - బ్రధ్న - పూష - ద్యుమణి మిహిర, రవి = సూర్యుడు. పరివేషః - పరిధిః . సూర్యుని చుట్టు కట్టిన మండలము. కిరణ . ఉశ్ర - మయూఖ - అంతు . గభస్తి - మృణి . మృష్ణా - భాను - కర - మరీచి . ప) దీధితి= కిరణము (స్త్రీ) - ప్రధా . రుచి. త్విడ్ - భా . ఆభా - ఛవి - ద్యుతి - దీప్తి - రోచిస్ - వ శోచిస్ (న) = కాంతి. ప్రకాశ . ద్యోత . ఆతప . ఎండ - కోష్ణ - కవోష్ణ - మందోష్ణ - కదుష్ణ = కొంచెము వేడి. కొంచెము వేడి కలది అన అర్థమున త్రిలింగ ములు. తిగ్మ - తీక్ష్ణ - కర = తీక్ష్ణము. దిష్ట - అనేహ - కాల - కాలము, మస్రః = రాత్రింబవళ్ళు; సాయం సంధ్యా - పితు ప్రసూః = సాయంకాల సంధ్యా. ప్రత్యూషః . అహర్ముఖం - కల్యం . ఉషః - ప్రత్యుషః = ప్రాతః కాలము. ప్రాష్ట్ర అపరాష్ట్ర - మధ్యాహ్నములకు త్రిసంధ్యము అని పేరు. శర్వరీ - యామి - తమీ = రాతి; తమిసా = చీకటి రాత్రి; జ్యోత్స్ని వెన్నెలరాత్రి. రాబోవు పగలు జరుగుచున్న పగలు కలసిన రాత్రికి “పక్షిణీ” అని పేరు. ఆర్థ రాత - నాశీథ = అర్థరాత్రి - ప్రదోషః = సాయంకాల ప్రారంభము. ప్రతిప త్తునకును, పూర్ణిమ అమావాస్యలకు ఈ మధ్యనున్నది పర్వ సంధి. రెండు పక్షాంత తిథులకు పంచదశి అని పేరు. పౌర్ల మాసీ - పూరిమా = పూర్ణిమ. చంద్రుడు ఒక కళ తక్కు వున్న చో ఆ పూర్ణి మా “అనుమతి” పూర్ణచంద్రుడున్నది “రాకా” అమావాసా, అమావసా. దర్శః - సూర్యేందు సంగమః= ఆమావాస్య చంద్రుడు కనబడినది - సిని వాలీ, చంద్రకళ లేనిది - కుహూః, సంవర్త - ప్రళయ - కల్ప - క్షయ - కల్పాంత = ప్రళయము.
సంవర్తః ప్రలయః కల్పః క్షయః కల్ఫాన్త ఇత్యపి ।
కలుష వృజినై నోఽఘమంహో దురితదుష్కృతమ్.
స్యాద్ధర్మ మస్త్రియాం పుణ్య శ్రేయసీ సుకృతం వృషః।
ముత్ర్పీతిః ప్రమోదోహర్షః ప్రమోదామోదసమ్మదాః.
స్యాదానన్ద థురానందః శర్మ శాత సుఖానిచ : ।
శ్వః శ్రేయసం శివం భద్రం కల్యాణం మంగళం శుభమ్.
భావుకం భవికంభవ్యం కుశలం క్షేమమస్త్రియామ్ ।
దైవం దిష్టం భాగధేయం భాగ్యం స్త్రీనియతిర్విధిః.
క్షేత్రజ్ఞ ఆత్మాపురుషః ప్రధానం ప్రకృతిః స్త్రీయామ్ ।
హేతుర్నా కారణం బీజంనిదానం త్వాదికారణమ్.
చిత్తంతు చేతోహృదయం స్వాన్తం హృన్మానసంమనః ।
బుద్ధిర్మనీషాధిషణాధీః ప్రజ్ఞా శేముషీ మతిః.
(పేక్షోపలబ్ధిశ్చిత్సం విత్ప్రతిజ్ఞప్తి చేతనాః ।
దీర్దారణావతీ మేధాసంకల్పః కర్మమానసమ్.
సంఖ్యావిచారణా చర్చావిచికిత్సాతు సంశయః ।
ఆధ్యాహార స్తర్క ఊహ: సమౌనిర్ణయ నిశ్చయౌ.
మిథ్యాదృష్టిర్నా స్తిక తా భాంతిర్మిథ్యా మతిర్భ్రమః ।
అంగీకారాభ్యు పరమప్రతిశ్రమ సమాధయః.
మోక్షేధీర్జాన మన్యత్ర విజ్ఞానం శిల్పశాస్త్రయోః ।
ముక్తి: కైవల్య నిర్వాణ శ్రేయోనిః శేయసామృతమ్.
కలుష - వృజివ - ఏనస్ - అఘ - ఆంహన్ - దురిత - దుష్కృత = పాపము. ధర్మ (పుం న) పుణ్య - శ్రేయస్ - సుకృత - వృష = పుణ్యము. ముత్ - ప్రీతి - ప్రమద - హర్ష - ప్రమోద - ఆమోద-సరమద. ఆనందదు. ఆనంద - శర్మ - శాత - సుఖ = ఆనందము. స్వ శ్రేయసం - శివం - భద్రం - కల్యాణం - మంగళం - భావుకం - భవికఎ . భవికం . భవ్యం . కుశలం - మేమం - (పుం. వ.) = క్షేమము. దైవం - దిష్టం - భాగ రేయ - భాగ్యం - నియతిః - విధిః = దైవము. క్షేత్రజ్ఞః - ఆల్మా - పురుషః = జీవుడు. ప్రధానం - ప్రకృతికి = ప్రకృతి, హేతుః (పుం) కారణం - బీజం - హేతువు. నిదానం = ఆదికారణము. చిత చేతన్ - హృదయ - స్వాంత - హృత్ - మానస - మనస్ = మనస్సు. బుద్ధిః - మనీషా - ధిషణా - ధీః - ప్రజ్ఞా శేముషీ – మః - ప్రేక్షా - ఉపలబ్ధి - చిత్ - సంవిల్ . ప్రతిపత్ - జ్ఞప్తి - చేతనా = బుద్ధి. ధారణా శక్తి గల బుద్ది మేధ. మానసిక కర్మ సంకల్పము. సంఖ్యా - విచారణా - చర్చా = విచారణ. విచికిత్సా - సంశయః = సంశయము. అధ్యాహార కి . తర్కః. ఊహః = ఊహ - నిర్ణయ నిశ్చయ కోశేష స్వర్గపాతాలాధివర్గానిర్ణయము. మిధ్యా దృష్టి - వాస్తికతా = నాస్తికత్వము. భ్రాంతికి - మిథ్యా మతిః - భ్రమ, ఆగీకాథ . అభ్యుషగమ - ప్రతిశ్రమ - సమాధి = అంగీకారము. జ్ఞానం = మోక్ష బుద్ధి. విజ్ఞానం - శిల్ప శాస్త్ర జ్ఞానము. ముక్తి , కై వల్య - నిర్వాణ - శ్రేయస్ . నియన్ - అమృత . మోక్ష - అపవర్గ = మోక్షము. అజ్ఞానం - ఆవిద్యా - అహంమతిః = అజ్ఞానము,
మోక్షోఽపవర్గోఽథాజ్ఞానమవిద్యాహమ్మతిః స్త్రియామ్ ।
విమర్ధోత్థే పరిమలో గందే జన మనోహరే.
ఆమోదః సోఽతినిర్హారీ సురభిర్ఘృఆణ తర్పణః ।
శుక్ల శుభ్ర శుచి శ్వేత విశద శ్వేత పాడరాః।
అవదాతః సితో గౌరో వలక్షో ధవలోఽర్జునః ।
హరిణః పాండురః పాండురీషత్పాండుస్తు ధూసరః.
కృష్ణే నీలాసిత శ్యామకాలశ్యామల మేచకాః ।
పీతోగౌరో హరిద్రాభః పాలాశో హరితోహరిత్.
రోహితో లోహితోర క్తః శోణః కోకనదచ్చవిః.
అవక్తరాగ స్త్వరుణః శ్వేతర క్తస్తు పాటలః.
శ్యావఃస్యాత్కపిశో ధూమ్రధూమలౌ కృష్ణలోహితే ।
కడారః కపిలః పింగ పిశంగౌక ద్రుపింగలౌ.
చిత్రం కిర్మీర కల్మాషశబలై తాశ్చ కర్చు రే ।
వ్యాహార ఉక్తిర్లపిత మపభంశోఽప శబ్దకః.
తిజ్సుబ న్తచయోవాక్యం క్రియావాకార కాన్వితా ।
ఇతిహాసః పురావృత్తం పురాణం పంచలక్షణమ్.
ఆఖ్యాయికోపలబ్దార్థా ప్రబంధః కల్పనాకథా ।
సమాహారః సంగ్రహస్తు ప్రవహ్లికా ప్రహేళికా.
సమస్యాతు సమానార్థా స్మృతిస్తు థర్మసంహితా ।
ఆఖ్యా హ్వే చాభిధానంచ వార్తావృత్తాంత ఈరితః.
హూతిరాకారణాహ్వాన ముఫన్యాసస్తు వాజ్మ ఖమ్ ।
వివాదోవ్యవహారః స్యాత్ప్రతి వాక్యోత్తరేసమే.
ఉపోద్ఘాత ఉదాహారోహ్యథ మిథ్యాభిశంసనమ్ ।
అభిశాపోయశః కీర్తిః ప్రశ్నః పృచ్చానుయోగకః.
విమర్దము వలన కలిగిన సువాసన పరిమళము. అది జనమనోహరముగా వుండును. ఎక్కువ ఆనందము కల్గించు నది ఆమోదము. ప్రణమునకు తృప్తి నిచ్చునది . సురభి - శుక్ల - శుక్ర, శుచి, శ్వేత - విశద - స్యేత, పాండర - అవదాత - సిత - గౌర - వలక్ష - ధవళ - అర్జున - హరిణ - పాండుర - పాండు = తెలుపు, తెల్లని. ధూసరః = కొంచెము తెల్ల గా మన్నది కృష్ణ - నీల - అసిత - శ్యామ - కాల - శ్యామల - మేచక = నలుపు నల్ల ని. పీత - గౌర - హరిద్రాభ = పసుపు వచ్చని, పాలాశ్ - హరిత - హరిత్ = ఆకుపచ్చని, రోహిత లోహిత - ర క్ష - ణ - కోకనదచ్ఛవి= ఎరుపు, ఎర్రనీ, అరుణః = అంతగా ఎర్రని కానిది, పాటలః = తెలుపు ఎరుపు రంగులు కలది. శ్యావః . కపిశః = కపి శవర్ణము కలది. ధూమ - దూమల - కృష్ణ లోహితము. కడారః . కపిల - పింగః . కద్రుః – పిశంగః. పింగళ = పింగళ వర్ణము కలది. చిత - కిర్మీర - కల్మాష - శబల - ఏత - కర్బుర = చిత్ర వర్ణము కలది. వ్యాహారః. ఉక్తికి లపితం = సంభాషణము. అపéంక = ఆప శబ్దము. తిజ్ఞ న సుబంతముల సముదాయము లేదా కార కాన్వితమగు క్రియ వాక్యము. ఇతిహాస - పురావృత - పురాణ - పంచ లక్షణ = పురాణము. సత్యమైన కథ కలది ఆఖ్యాయికా. కల్పిత ప్రబం ధము కథా. సమహార - సంగ్రహః = సముదాయము. ప్రవల్లికా- ప్రహేళికా = ఈ రెండును సమానార్థకములు. సమస్యా సమాసార్థ = ఈ రేండును సమానార్థకములు. స్మృతీః - ధర్మ సంహితా = ధర్మ శాస్త్రము. ఆఖ్యా.ఆహ్వ - అభిధాన = పేరు. హూతి . ఆకారణా - ఆహ్వాన = పిచుట. ఉపవ్యాసః - వాజ్మణము = వాక్రంథము. వివాదః - వ్యవహారః = వివాదము. ప్రతివాక్య - ఉ త్తర = ఈ రెండును సమానార్థకములు. ఉపోద్ఘాతః - ఉదాహారః = సమానార్థకములు. అభి కాప= అనగా మిథ్యాభిశంసనము యశః= కీర్తిః, పర్యాయములు. ప్రశ్నకి . పృచ్ఛా - అనుయోగకః = పర్యాయములు.
ఆమ్రేడితం ద్విస్త్రరుక్తం కుత్సానిందేచ గర్హణే ।
స్యాదాథాషణ మాలాపః ప్రలాపోఽనర్ధకంవచః.
ఆనులాపో ముహుర్భాషా విలాపః పరిదేవనమ్ ।
విప్రలాపో విరోధో క్తిః సంతాపోభాషణం మిథః.
సుప్రలాపః సువచన మపలాపస్తు నిహ్నవః ।
రశతీ వాగకల్యాణీ సంగతం హృదయం గమమ్.
అత్యర్థమధురం సాన్త్వమబద్ధం స్యాదనర్థకమ్ ।
నిష్ఠురాశ్లీ ల పరుషం గ్రామ్య వై సూనృత ప్రియే.
సత్యం తథ్యమృతం సమజ్ నాదనిస్వాననిస్వనాః ।
ఆరవారావ సంరావ విరావా అథమర్మరః.
స్వనితే వస్త్రపర్ణానాం భూషణానాంతు శింజితమ్ ।
వీణాయా నిక్వణః క్వాణః తిరశ్చాంవాశితంరుతమ్.
కోలాహలః కలకలో గీతంగాన మిమేసమే ।
స్త్రీప్రతిశుత్ప్రతి ధ్వానే తంత్రీకంఠాన్ని షాదకః.
కాకలీతు కలేసూక్ష్మే ధ్వనౌతు మధురాస్పుటే ।
కలోమంద్రస్తు గంభీరే తారోఽత్యుచ్చైః స్త్రీయాస్త్రిషు.
సమన్వితలయస్త్వేక తాలో వీణాతు వల్లకీ ।
విపంచీ సాతుతంత్రీభిః సప్తభిః పరివాదినీ.
తతంవీణాదికం వాద్యమానద్దం మురజాదికమ్ ।
వంశాదికంతు సుషిరం కాంస్యతాలాదికం ఘనమ్.
చతుర్విధమిదం వాద్యం వాదిత్రాతోద్య నామకమ్ ।
మృదంగా మురజా భేదా స్త్వంఖ్యాలింగ్యోఽర్ధ కాస్త్రయః.
స్యాద్యశః పటహోడక్కా భేర్యామానక దుందుభిః ।
ఆనకః పటహోభేదా ఝుర్ఘ రీ డిండిమాదయః.
మర్ధలః ప్రణవస్తుల్యో క్రియామానంతు తాలకః ।
లయః సామ్యం తాండవస్తు నాట్యం లాస్యంచ నర్తనమ్.
తౌర్య త్త్రికం నృత్యగీత వాద్యం నాట్యమిదం త్రయమ్ ।
రాజాభట్టారకోదేవః సాభి షేకాచ దేవ్యపి.
శృంగార వీర కరుణాద్భుత హాస్యభయానకాః।
బీభత్స రౌద్రేచ రసాః శృంగార : శుచిరుజ్జ్వలః.
ఉత్సాహవర్ధనోవీరః కారుణ్యం కరుణాఘృణా ।
కృపాదయా బొనుకంపాఽప్యనుక్రోశోఽప్యథోహసః.
హాసో హాస్యంచ బీభత్సం వికృతం త్రిష్విదం ద్వయమ్ ।
విస్మ యోఽద్బుత మాశ్చర్యం చిత్రమప్యథ భైరవమ్.
ధారుణం భీషణం భీష్మం ఘోరం భీమం భయానకమ్ ।
భయంకరం ప్రతిభయం రౌద్రంతూగ్రమమీత్రిషు.
చతుర్దశదరత్రాసౌ భీతిర్బీః సాధ్వసం భయమ్ ।
వికారోమానసో భావోనుభావో భావబోధనః.
ఆమ్రేడితం = రెండు మూడుసార్లు చెప్పినది. కుత్సా - నిందా - గర్హణ = నింద. ఆలాపః = మాటలాడుట. ప్రలాప. = అనర్థ వచనము. అనులాపః = మాటి మాటికి చెప్పుట. విలాపః = ఏడ్పు. విప్రలాపః = విరోధ వచనము. స్వలాపః = పరస్పర భాషణము. సుప్రలాప = మంచి మాట. అపలపః = కప్పిపుచ్చుట. రుషతీ = అమంగళ వాక్కు. సంగతం = హదయంగ మమైనది. స్వాంత్వం = మిక్కిలి మధురమైనది. ఆబద్ధం = అర్థము లేని మాట. నిష్ఠుర - ఆశ్లీల - పరుష =గ్రామ్యము. సూనృతం = ప్రియ వాక్కు. సత్యం - తథ్యం - ఋతం = సత్యమైన మాట. సాద - నిస్వాన - నిస్వన - ఆరవ - ఆరావ - సంరావ విరావ = ధ్వని. మర్మరః= వస్త్ర పర్ణాదుల ధ్వని. సింజితం = అలంకారమైన ధ్వని. నిక్వణః - క్వాణ 82 వీణాధ్వని. ఋతం = తిర్యగ్టఁతువ్వు కూత. కోలాహల 8 - కలకల • = పర్యాయ పదములు. గీతం - గానం - పర్యా: ప్రతికృత్ =(స్త్రీ) ప్రతిధ్వని. నిషాదకః = త్వతీ కంఠ ధ్వని, కాకలీ = సూక్ష్మము. మధురము అయిన ధ్వని. కలి = మధురము అస్ఫుటమైన ధ్వని. మంద్ర = గంభీరము. తారః = అత్యుచ్య ధ్వని. ఈ మూడు పద ములు మూడు లింగములలో పుండును. ఏక తాలః = పాటతో కలిసిన లయ. వీణా - వల్ల కీ - పిపంచీ - పర్యా. పరి వాదినీ = ఏడు తీగల వీణ తతం = వీణాది వాద్యము. ఆనద్దం = మురజాది వాద్యము. సుషిరం= వంశాది వాద్యము. మనం = కాంశ్య తాలాది వాద్యము. ఈ నాలుగు విధములైన వాద్యములకు వాదిత్రం, అతోద్యం అని పేరు, మృదంగాః - కోశమ స్వర్గసాతాలాది వర్గా మురజాకి = పర్యా. అంక్య - ఆలింగ్య - ఆర్ధక = ఈ మూడును ముర జ భేదములు. యశః, పటహః - డక్కా = పర్యా. ఆనక దుందుభిః= భేరి; ఆవక'- పటహః = పర్యా, ఝుర్ఝరీ - డిండిమాదులు పటహ భేదములు. మర్ధలః = పణవః= పర్యా. సంగీత క్రియామావమునకు తాలకము అని పేరు. లయః - సామ్యం = పర్యా. తాండవం - నాట్యం - లాస్యం. - నర్తనఁ = పర్యా. నృత్య, గీత, వాద్యములు, మూడింటికీని తౌర్య త్త్రికం నాట్యము యని పేరు. భట్టారకః - దేవః = రాజు. దేవీ = రాజ్యాభిషేకము పొందిన రాణి. శృంగార - వీర - కరుణ - అద్బుత - హాస్య - భయానక - బీభత్సరౌద్రమణలు, రసములు. శృంగారః = శుచిః - ఉజ్జ్వలః = పర్యా. కృత్స్నః - వర్ధవః - వీరః = పర్యా, కారుణ్య - కరుణా - ఘృణా - కృపా - దయా - ఆనుకఁపా - అను క్రోశ - పర్యా.హసః - హాసః - హాస్యం = పర్యా. బీభత్సం - వికృతం = పర్యా. విస్మయ - అద్భుత - ఆశ్చర్య - చిత్ర = పర్యా. భైరవ - దారణ - భీషణ - భీష్మ ఘోర - భీమ - భయానక - ప్రతిభయ = సమానార్థకములు. రౌద్ర , ఉగ్ర = పర్యా. పైన చెప్పిన పదునాలుగు పద ములు మూడు లింగములలో నుండును దర - లాస - భీకి - భీ . సాధ్వస - భయ = పర్యా, మానసిక వికారమునకు భావమని పేరు. ఖవమును బోధించునది అను భావము.
గర్వోఽభిమానోఽహంకారో మానశ్చిత్త సమున్నతిః ।
ఆనాదర: పరిభవః పరిభావ స్తిర స్త్క్రియః.
వీడా లజ్జత్రపాహ్రీః స్యాధభిభి ధ్యానం మనే స్పృహా ।
కౌతూహలం కౌతుకంచ కుతుకంచ కుతూహలమ్.
స్త్రీణాం విలాస వివ్వోక విభ్రమా లలితం తథా ।
హేలాలీలేత్యమీ హావాః క్రియాః శృంగార భావజాః.
ద్రవ కేళి పరిహాసాః క్రీడాలిలాచ కూర్ధనమ్ ।
స్యాదాచ్ఛురితకం హాసః సోత్ప్రాసః సమనాక్స్మితమ్.
అధోభువన పాతాలం చ్చిద్రంశ్వభ్రం వపాసుషిః ।
గర్తా వటౌ భువిశ్వ బ్రే తమిశ్రుతిమిరం తమః.
సర్పః పృదాకుర్భుజగో దంద శూకోబిలేశయః ।
విషం క్ష్వేడశ్చ గరళం నిర యోదుర్గతిః స్త్రియామ్.
పయః కీలాలమమృతముదకం భువనం వనమ్ ।
భంగస్తరంగ ఊర్మిర్వా కల్లో లోల్లోలకౌచతౌ.
పృషన్తి బిందు పృషతాః కూలం రోధశ్చ తీరకమ్ ।
తోయోత్థితం తత్పులినం జంబాలం పంకకర్ధమౌ.
జలోచ్ఛ్వాసాః పరీవాహా: కూపకాస్తు విదార కాః ।
ఆతర స్తరపణ్యం స్యాద్ధ్రోణీ కాష్ఠాంబు వాహినీ.
కలుషశ్చావిలోఽచ్ఛస్తు ప్రసన్నోఽథ గభీర కమ్ ।
ఆగాధం దాశ కైవర్తౌశంబుకా జలశుక్తయః.
సౌగంధికంతు కహ్లారం నీలమిందీవరం క జమ్ ।
స్యాదుత్పలం కువలయం సితేకుముద కైర వే.
శాలూక మేషాం కందః స్యాత్పద్మం తామర సం క జమ్ ।
నీలోత్పలం కువలయం ర క్తం కోక నదం స్మృతమ్.
కరహాటః శిఫాకందం కింజల్క: కేసరోఽస్త్రియామ్ ।
ఖనిః స్త్రీయామాకరః స్యాత్చా దాః ప్రత్య న్తపర్వతాః.
ఉపత్యకాద్రే రాసన్నా భూమిరూర్ధ్వ మధిత్యకా ।
స్వర్గ పాతాల వర్గాద్యా ఉక్తా నానార్థకాంచ్ఛృణు.
ఇత్యాది మహా పురాణే ఆగ్నే యే శబ్దకోశే స్వర్గాది వర్గ నిరూపణం నామ షష్ట్యధిక త్రిశతత మోఽధ్యాయః.
గర్వ - అభిమాన . అహంకార =పర్యా. చిత్తమునకు ఉన్నతి మానము. అనాదర - పరిభవ - పరీభావ - తిరస్క్రియా = పర్యా. వ్రీడా - లజ్జా - త్రపా - హెరెః . పర్యా. ధనమునందు ఆసక్తి అభిధ్యానము; కౌతూహల - కౌతుక కుతుక . కుతూహల = ప్య. విలాస - బిబ్బోక - విభ్రమ - లలిత - హేలా - లీలా - అనునవి శృంగార భావము వలన కలిగిన స్త్రీ చేష్టల. వీటికి హావములు అని పేరు. ద్రవ - కేళి - పరిహాస - క్రీడా - లీల - కూర్ధనఇవి క్రీడ పరిహాసవాచకములు. ఇతరులను పరిహసించుట అచ్ఛురితక ము. స్మితం_చిరునవ్వు. అధోభువన . పాతాళ = ఏర్యా. ఛిద్ర - స్వభ్ర - వపా . శుషి =ఛిద్రము. గర్త - అవట . భూపిమైన గొయ్యి, తమిశ్రం . తిమిరం . తమః=పర్యా. సర్ప - పృ దాకు . భుజగ - దందరూక . బిలేశయ . సర్పము. విషం - శ్వేడకి . గరళం=విషము. నీరయః - దుర్గతి=నరకము. పయన్ . కిలారి – అమృత - ఉదక - భువన - వన - జలము. భంగ - తరంగ - ఊర్మి - కల్లోల - ఉల్లోలజతరంగములు. పృషత్ . బిందు - జల బిందువులు. కూల - రోధన్ . తీరమ్ = ఒడ్డు నీటినుండి బయట పడినది పులినము. జంబాం • పంక - కర్దము = బురద. పరీవాహా=పొరలు చున్న నీరు- కుపక - విదారక - జలాశయములలో నిలిచియున్న నీరు. ఆతరః= నది దాటించుటకు ఇచ్చుధనము. దోణీ_కర్రతో చేసిన తొట్టే. కలుషః= ఆవిలః = కలుషమైనది. అచ్చ - ప్రచన్న కీ = స్వచ్చమైవది. గభీరకం . అగాధంలో చైనది. దాశః - క్రైవర్త=పల్లెవాడు. శంబూకాః = నత్తగుల్లలు. సౌగంధిక . కహోర= శ్వేతకమలము ఇందీవరం_నీల కమలము. ఉత్పలం . కువలయం=కవ. కుముద . కైరవ= తెల్లకలువ; వీటి కందమునకు శాలూకము అని పేరు. పద్మం - తామర సం - కంజం = పద్మము. కువలయం - నీలోత్పలం = పర్యా.. కోకనదం = ఎర్రకలువ. కరహాటకి- శిఫా - కందం = పద్మలత యొక్క దుంప. కింజరీః - కేసరః = పర్యా, ఖనిః . ఆకరః = పర్యా. పాదాః = దగ్గర నున్న చిన్న పర్వతములు. ఉపత్యకా = పర్వతమునకు దగ్గరనున్న భూమి. అధిత్యకా = పర్వత ముపై నున్న భూమి. స్వర్గ పాతాళ వర్గాదులు చెప్పబడినవి. నానార్థకములను వినుము.
అగ్ని మహాపురాణమున శబ్దకోశము నందు స్వర్గాదివర్గ నిరూపణమను మూడువందల అరువదవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 361 of the Agni Purāṇa is as follows:
The complete vocabulary of Sanskrit indeclinables (avyayas) — particles, adverbs, and conjunctions that do not change their form with gender, number, or case — is catalogued. The meanings of the primary indeclinables are given: ā (up to, from), ku (question/deprecation), ati (beyond), prati (toward, against), iti (thus — the quotation marker), bata (alas), alam (enough, sufficient), nanu (indeed, surely), kaccit (whether), nūnam (certainly), svasti (well-being). Temporal indeclinables — adya (today), hyaḥ (yesterday), śvaḥ (tomorrow), tadā (then), sarvadā (always), and others — are listed with their semantic range. The chapter serves as a practical guide for understanding the connective tissue of Sanskrit prose and verse.