ఈశ్వర రువాచః-
సర్వతోభద్రకాన్యష్టమండలాని వదేగుహ ।
శ క్తిమాసాధయే త్ప్రాచీ మిష్టాయాం విషువే సుధీః.
చిత్రాస్వామ్య న్తరేణాథ దృష్టసూత్రేణ వాపునః ।
పూర్వాపరాయతం సూత్రమాస్పాల్య మధ్యతోంఽక యేత్.
కోటిద్వయంతు తన్మధ్యాదంకయే ద్ధక్షిణోత్తరమ్ ।
మధ్యేద్వయం ప్రకర్తవ్యం స్పాలయే దక్షీణోత్తరమ్.
శత క్షేత్రార్ధ మానేన కోణసంపాత మాది శేత్ ।
ఏవం సూతచతుష్కస్య ఫాలనాచ్చ తురస్రకమ్.
జాయతే తత్రకర్తవ్యం భద్ర స్వేదకరం శుభమ్ ।
వసుచ క్తేన్దు ద్విపదే క్షేతే వీథౌచ భాగికా.
ద్వారం ద్విపాదికం పద్మమానాద్ద్వై సక పోలకమ్ ।
కోణబంధ విచిత్రన్తు ద్విపదీం తత్రవ ర్తయేత్ .
శుక్లం పద్మం కర్ణికాతు పీతా చిత్రన్తు కేసరమ్ ।
రక్తావీథీతత్ర కల్ప్యాద్వారంలో కేశరూపకమ్.
రక్తకోణం విధౌనిత్యే నైమిత్తి కేఽబ్జకం శృణు ।
అసంసక్తతు సంసక్తం ద్విదాబ్జం భుక్తిము క్తికృత్.
అసంసక్తం ముముక్షణాం సంసక్తం త త్త్పిదాపృథక్ ।
బాలోయువాచ వృద్ధశ్చ నామతః ఫలసిద్దీదాః.
ఈశ్వరుడు పలికెను. స్కందా ! ఇప్పుడు సర్వతో భద్రములు యను పేరు గల ఎనిమిది మండలమాలను చెప్పెదను. శంకువుతో తూర్పు దిక్కున సాధించి విషువ కాలమున చిత్ర స్వాతి నక్షత్రముని మధ్య యందు గాని లేదా సూత్రము. గ్రహించి తూర్పు నుండి పశ్చిమము వరకు లాగి మధ్యము నందు రెండు కోటులను గుర్తించవలెను, వాటి మధ్య నుండి ఒక దీర్ఘమైన ఉత్తర దక్షిణ రేఖ గీసి రెండు మత్స్యములను నిర్మించి వాటిని దక్షిణోత్తరముల పై ఆస్ఫాలనము చేయవలెను. క్షత పద క్షేత్రము యొక్క అర్ధ మానముచే కోణ సంపాతము చేయవలెను. ఈ విధముగా నాల్గు పర్యాయములు సూత్రమును షేత్రము నందు ఆస్ఫాలనము చేయగా ఒక చతురస్రము ఏర్పడును. దాని నాల్గు హస్తముల శుభకర మగు భద్ర మండలము ఏర్పరుపవలెను. ఎనిమిది పదములచే అన్ని వైపులను విభ క్తములగు ఆరువది నాలుగు పదముల నుండి ఇరువది పదముల గల క్షేత్రమున వెలుపల ఒక వీథిని నిర్మించవలేను. ఈ వీథి ఒక మంత్రమునకు సంబంధించినది. కమల మానముచే రెండు పదముల ద్వారము నిర్మించి దానిని కపోలయుక్తముగ చేయవలెను. కోణ బంధముచే ఆది ఆందముగ నుండవలెను. ఈ విధ ముగ ద్విపదమును ద్వార నిర్మాణము నందు ఉపయోగించవలెను. కమలమును శ్వేత వర్ణముగాను, కర్ణికను పీత వర్ణన గాను, కేసర ములను చిత్ర వర్ణములు గాను, వీథిని రక్త వర్ణముగాను చేయవలెను. ద్వార ములో కప్మా స్వరూపములు నిత్య నైమిత్తిక వీథు లందు కోణము ఎర్రగా వుండవలెను. ఇపుడు పద్మమును గూర్చి వినుము. అసంసక్తము సంస క్షము యని అవి రెండువిధములు. భుక్తి ముక్తి ప్రదము. అసంసక్తము ముముక్షువులకు ఉపయుక్తము బాల యువ. వృద్దములని సంసక్త కమలములు మూడు విధములు. అవి తమ పేర్లననుసరించి ఫలసిద్ధిని ఇచ్చును.
పద్మ క్షేత్రేతు సూత్రాణి దిగ్విదిక్షు వినిక్షిపేత్ ।
వృత్తాని పంచకల్యాణీ పద్మ క్షేత్ర సమానితు.
ప్రథమే కర్ణికా తత్ర పుష్కరైర్నవ భిర్యుతా ।
కేసరాణి చతుర్వింక ద్వితీయేఽథ తృతీయ కే.
దలసంధిర్గజ కుంభనిభా న్తర్యద్దలా గ్రకమ్ ।
పంచమే వ్యోమరూపన్తు సంసక్తం కమలం స్మృతమ్.
ఆనంసక్తం దలాగ్రేతు దిగ్భాగై ర్వి స్తరాద్భజేత్ ।
భాగద్వయ పరిత్యాగాద్వస్వం శైర్వర్తయేద్దలమ్.
సంధి విస్తర సూత్రేణ తన్మూలా దంజయేద్దలమ్ ।
సవ్యాపసవ్య క్రమేణైవ వృద్ధ మేత ద్భవేత్తథా.
అథవాసంధి మధ్యాత్తు భ్రామయే దర్దచంద్రవత్.
సంధి ద్వయాగ్ర సూత్రంహ బాలపద్మం తథాభ వేత్.
సంధి సూత్రార్ధమానేన పృష్ఠతః పరివర్తయేత్ ।
తీక్ష్ణా గ్రంతు సువాతేన కమలం ముక్తిభు క్తిదమ్.
ముక్తవృద్ధౌచ వశ్యాదౌ బాలం పద్మం సమానకమ్ ।
నవనాథం నవహస్తం భాగైర్మంత్రాత్మ కైశ్చతత్.
మధ్యేఽబ్జం పట్టికాబీజం ద్వారేణాబ్జస్యమానతః ।
కంఠోప కంఠముక్తాని తద్బాహ్యే వీథికా మతా.
పంచభాగాన్వితా సాతు సమంతాద్దశ భాగికా ।
దిగ్విదిక్ష్వష్ట పద్మాని ద్వారపద్మం సవీథికమ్.
తద్బాహ్య పంచపదితా వీథికాయత్ర భూషితా ।
పద్మవద్ద్వార కంఠన్తు పదికం చౌష్టకంఠకమ్.
కపోల పదికం కార్యం దిక్షు ద్వారత్రయం స్ఫుటమ్ ।
కోణబంధం త్రిపట్టంతు ద్వీపట్టం వజ్రవద్భవేత్.
మద్యన్తు కమలం శుక్లం పీతం ర క్తం చ నీలకమ్ ।
పీతశుక్లాంచ ధూమ్రంచ రక్తం పీతంచ ముక్తిదమ్.
కమల క్షేత్రము నందు దీక్ విదిక్కుల వైపు సూత్ర విన్యాసము చేసి పద్మ క్షేత్ర సమములగు ఐదు వృత్తములను విర్మించవలెను. ప్రథమ వృత్తము నందు నాలుగు పుష్కరములు గల కర్ణి కయు రెండవ దాని యందు ఇరువది నాలుగు కేసరములు, మూడవ దాని యందు గజ కుంభ సదృశములగు దళ సందులు నాల్గవ వృత్తము నందు దశాగ్ర భాగములు పంచమ వృత్తము నందు ఆకాశ మాత్రమూ వుండును. ఇది సంసక్త కమలము. అసంసక్త కమలమున దళాగ్ర భాగము నందున్న దిక్కల భాగము నందున్న దిక్కుల భాగముల విస్తారము ననుసరించి రెండు భాగములు విడచి ఎనిమిది రాగములతో దళములు ఏర్పరుప వలయును. సంధి విస్తార సూత్రముతో దాని మావముననుసరించి దళములను రచించ వలయును. దీని యందు ఎడమ నుండి, గుడికి ఏర్పరచ వలయును. లేదా సంధి మధ్య నుండి ఆర్ధ చంద్రాకారముగా త్రిప్పవలెను. లేదా రెండు సంధుల ఆగ్రము నందున్న సూత్రమును అర్ధ చంద్రాకారముగ త్రిప్పవలెను. అపుడు బాల పద్మము ఏర్పడును. సంధి సూత్రము యొక్క అగ్ర భాగము నుండి పృష్ఠ భాగము వైపు సూత్రము త్రిప్పవలెను. యది తీష్ణోగ్ర భాగ మగు యువ సంజ్ఞక కమలము. భుక్తి ముక్తి ప్రదము. ముక్తినుద్దేశించి చేయు ఆరాధనము నందు వృద్ధ కమ లమును వశీకరణాదులందు బాల పద్మ మును ఉపయోగించవలెను. నవనాథ కమల చక్రము ఎనిమిది హస్తముల ప్రమాణము కలదై యుండును. దాని యందు మంత్రాత్మకములగు తొమ్మిది భాగములుండును. దాని మధ్య భాగమున కమల ము ఏడును. కమల మానానుసారముగ పట్టిక వీథి ద్వారము యొక్క ఏడు కంఠము, ఉపకంఠములు నిర్మించవలెను. ఐదు భాగముల వీథి యుండును. దాని నలువైపుల పది భాగముల స్థానముండుమ. దాని ఎనిమిది దిక్కులందు ఎనిమిది కమలములున్న వీథి సహితమగు ఒక ద్వార పద్మము వుండును. దాన బాహ్య భాగమున లతా దివిభూషిత మగు ఐదు పదముల వీథి యుండును. ద్వార కంఠము నందు కమలముండును. ద్వారము యొక్క ఓష్ణ కంఠ భాగములు ఒక్కొక్క పదము నందుండును. కపోల భాగము ఒక పదముండును. మూడు దిక్కులందును మూడు ద్వారములు స్పష్టముగా వుండును. కోణ ఐంధము నందు మూడు పట్టములు రెండు పదముల వజ్ర చిహ్న ముండును. మధ్య కమలము శుక్ర వర్ణము. మిగిలిన దిక్కుల కమలములు పూర్వాదిక్రమమున పీత, రక్త, నీల, పీతి, శుక్ల ధూమ్ర రక్త పీత వర్ణములై యుండును. ఈ కమల చక్రము ముక్తి దాయకము.
పూర్వాదౌక మలాన్యష్ట శివవిష్ణ్వాదికం జ పేత్ ।
ప్రాసాద మద్యతోఽభ్యర్చ్య శక్రాదీనబ్జ కాదిషు.
ఆస్త్రాణి బాహ్యవీథ్యాస్తు విష్ణ్వాదీ నశ్వమేధభాక్ ।
పవిత్రారోహాణా దౌచ మహా మండల మాలిఖేత్.
ఆష్టహస్తం పురా క్షేత్రం రనపక్షైర్వి వర్తయేత్ ।
ద్విపదం కమలం మధ్యే వీథికా పదికాతతః.
దిగ్విదిక్షు తతోఽష్టౌచ నీలాబ్జాని వివర్తయేక్ ।
మధ్యపద్మ ప్రమాణేన త్రింశతృద్మాని తానితు.
దలసంధి విహీనాని నీలేందీవర కాణి చ ।
తత్పృష్ఠే వది కావీథీ స్వస్తి కాని తదూర్ద్వతః.
ద్విపదాని తథాచాష్టౌ కృతిభాగ కృతానితు।
వర్తయేత్స్వ స్తికా స్తత వీథికా పూర్వవద్భహిః.
ద్వారాణి కమలంయద్వ దుపకంఠ యుతానితు ।
రక్తం కోణం పీతవీథీ నలంపద్మంచ మండలే.
పూర్వాది దిక్కులందు ఎనిమిది కమలములను శివ విష్ణ్వాది దేవతలను పూజించవలెను. శివ విష్ణ్వాదులను ప్రాసాద మధ్యకమల మందు పూజించి పూర్వాది కమలముల పై ఇంద్రాది దేవతలను పూజించవలెను. బాహ్య వీథి యందు ఆ దేవతల హస్త్రమును విష్ణ్వాదులను పూజించినవాడు ఆశ్వమేధ ఫలము పొందును. పవిత్రారోహణాదు లందు మహా మండలము ఏర్పరుపవలేను. ఎనిమిది హస్తముల పొడవైన క్షేత్రమును ఇరువది ఆరుచే విభజించి మధ్యనున్న పదద్వయము నందు కమలమును తనకు తర్వాత ఒక పదమున వీథిని దిగ్విదిక్కులందు ఎనిమిది నీలకమలములను నిర్మించవలెను. మధ్య నున్న కమలము మావముతో, మొత్తము ముప్పది పద్మములు నిర్మించవలెను. వాటికి దళ సంధులు వుండకూడదు. అవినీలేండీ వర ములు దాని పృష్టమున ఒక పాదము వీథియు, దాని పైన స్వ క్రిక చిహ్నము ఏర్పరుచవలెను. పిదప బాహ్య భాగమున వీథికయు ద్వారములు కమలములు ఉపకంటములు అన్నియు వుండవలెను. కోణముల రక్త వర్ణముబు. వీథిపీత వర్లము. మండల మధ్య కమలము నీల వర్ణము అయి వుండవలెను. విచిత్ర వర్ణములు గల స్వస్తికాది మండలములు సకల కామ ప్రదములు.
స్వస్తికాది విచిత్రంచ సర్వకామప్రదం గుహ ।
పంచాబ్జం పంచహస్తం స్యాత్సమంతాద్దశ భాజితమ్.
ద్విపదం కమలం వీథీ పట్టికాదిక్షుపంకజమ్ ।
చతుష్కం పృష్ఠతో వీథిపదికా ద్విపదాన్యథా.
కంఠోషకంఠ యుక్తాని ద్వారాణ్యబ్జన్తు మధ్యతః ।
పంచాబ్జమం డలే హ్యసిన్సితం పీతంచ పూర్వకమ్.
వైడూర్యాభం దక్షిణాబ్జం కుందాభం వారుణం కజమ్ ।
ఉత్తరాబ్జన్తు శంఖాభమన్యత్సర్వం విచిత్రకమ్.
పంచాబ్జ మండలము ఐదు హస్తము క్షేత్రమను అన్ని వైపుల నుండి పదిచే విభజించి నిర్మించవలెను. రెండు పదములు కమలము, దాని బాహ్య భాగమున వీథి, పట్టికా, మరల నాల్గు దిక్కులందును నాలుగు కమలము వాటి పృష్ణ భాగమున వీథి వుండవలెను. దానిని ఏక పదములందు గాని పద ద్వయమునందు గాని నిర్మించవలెను. కంఠోప కంఠములు గల ద్వారములు వాటి మధ్య భాగమున కమలములు వుండవలెను. ఈ పంచావ్లి మండల మున పూర్వ దిక్కు నందున్న కమలము శ్వేత వర్ణము, పీత వర్ణము ఆయి వుండును. దక్షిణ కమలము వైడూర్య వర్ణము, పశ్చిమ కమలము శ్వేత వర్ణము ఉత్తర కమలము శంఖ తుల్య వర్ణము. మిగిలినవన్నియు విచిత్ర వర్ణములు ఆయి వుండును.
సర్వకామప్రదం వక్ష్యేదళహస్తన్తు మండలమ్ ।
వికారభ క్తన్తు ర్యాశ్రం ద్వారన్తు ద్విపదం భవేత్.
మధ్యేపద్మం పూర్వవచ్చవిఘ్న ధ్వంసం వదామ్యథ ।
చతుర్హ స్తం పరంకృత్వా వృతంచైవ కరద్వయమ్.
వీథికా హస్తమాత్రన్తు స్వస్తికై ర్బహు భిర్వృతా ।
హస్తమాత్రాణి ద్వారాణి దిక్షువృత్తం సపద్మకమ్.
పద్మాని పంచశుక్లాని మధ్యేపూజ్యశ్చ నిష్కలః ।
హృదయాదీని పూర్వాదౌ విదీక్ష్వస్త్రాణి వై జయేత్.
ప్రాగ్వచ్చపంచ బ్రహ్మాణి బుద్ద్యాధార మతోవదే ।
శతధాగే తిథి ఖాగేపద్మం లింగాష్టకందిశి.
మేఖలాభాగ సంయుక్తం కంఠం ద్విపదికం భవేత్ ।
ఆచార్యో బుద్ధిమాశ్రిత్య కల్పయేచ్చలతాదిక మ్.
చతుః షట్పంచ మాష్టాదిఖాక్షి ఖాద్యాదిమండలమ్।
ఖాకీన్ధు సూర్యగం సర్వంఖాక్షి చైవేన్దు వర్ణనాత్.
చతుర్వింశదధికాని చతుర్దశ శతానిహి ।
మండలాని హరేః శంభోర్దేవ్యాః సూర్యస్యస న్తిచ.
దశసప్త విభక్తేతు లతాలింగోద్భవం శృణు ।
దిక్షు పంచలయం చైకం త్రయం పంచచలోపయేత్.
ఊర్ధ్వగే ద్విపదే లింగమందిరం పార్శ్వకోష్ఠయోః ।
మధ్యేనద్విపదం పద్మమథచైకం చ పంకజమ్.
లింగస్య పార్శ్వయోర్బద్రే పదద్వార మలోపనాత్।
తత్పార్శ్వ శోభాః షడ్ లోప్యలతాః శేషా స్తథాహరేః.
ఊర్ధ్వం ద్విపదికం లోప్య హా రేర్భద్రాష్టకం స్మృతమ్ ।
రశ్మిమాన సమాయుక్త వేదలోపాచ్చ శోభితమ్.
పంచవింశతకం పద్మం తతః పీఠమపీఠకమ్ ।
ద్వయం ద్వయం రక్షయిత్వా ఉపశోభా స్తథాష్టచ.
దేవ్యాది ఖ్యాపకం భద్రం బృహన్మధ్యేపరం లము ।
మధ్యే నవపదం పద్మం కోణేభద్ర చతుష్టయమ్.
త్రయోదశ పదం శేషం బుద్ఘ్యాదారన్తు మండలమ్ ।
శతపత్రం షష్ట్యధికం బుద్ధ్యాదారం హరాదిషు.
ఇత్యాది మహావురాణే ఆగ్నేయే మండల నిరూపణం నామ వింశత్యధిక త్రిశతత మోఽధ్యాయః.
సర్వ కామ ప్రదమగు దశ హస్త మండలమును చేప్పెదను. దానిని వికార సంఖ్యచే అన్ని వైపుల విభక్తము చేసి చతురస్ర క్షేత్రము ఏర్పరుచ వలెను. రెండేసి పదముల ద్వారముండును. పూర్వము నందు చెప్పిన చక్రము నందువలె దీని మధ్య భాగమున కమలముండును. ఇపుడు విఘ్న ధ్వంస చక్రము చెప్పెదన. నాల్గు హస్తముల పురము ఏర్పరచి దాని మధ్య రెండు హస్తముల గోళాకార చక్రము ఏర్పరుచవలెను. అన్ని వైపుల నుండి స్వస్తిక చిహ్న వృత మగు హస్త ప్రమాణము గల వీథి యుండును. ఒక్కొక్క హస్తమున నాలుగు వైపుల ద్వారమాలు ఏర్పంచ వలెను. నాలుగు దిక్కు లందు, కమలాంకితములగు వృత్తములుండును. ఈ చక్రమున శ్వేత వర్ణములగు ఐదు కమలములు వుండును. మధ్యవర్తి కమమున నిరాకారుడగు పరమాత్మను పూజించవలెను. పూర్వాది దీక్కులందు హృదయాద్యంగ ములను విదిక్కులందు హస్తములను పూజించవలెను. సద్యోజాతాది పంచ బ్రహ్మ మయ ముఖములను గూడ పూజించవలెను. ఇపుడు బుద్ధ్యా ధార చక్రమును చేప్పెదను. నూరు పదముల క్షేత్రమున పధ్య యందున్న పదునైదు పదములో ఒక కమలము అంకితము చేసి ఎనిమిది దిక్కులందును ఒక్కొక్క శివ లింగమును ఉంచవలెను. రెండు పదములలో మేఖలా భాగ సహిత మగు కంఠము రచించవలెను. ఆచార్యుడు తన బుద్ధి సహాయముతో లతాదులను ఏర్పరుపవలెను. నాలుగు, ఆరు, ఐదు, ఎనిమిది ఇత్యాది సంఖ్యలో వున్న కమలములతో మండము ఏర్పడును. ఇరువది ముప్పది కమలములున్నది కూడ వుండును. 12120 కమ రిములున్న సంపూర్ణ మండము కూడ వుండును. 120 కమలములు మండలము కూడ కనబడుచున్నది. విష్ణు, శివ దేవీ సూర్యులకు 1440 మండము లుండును. పది హేడు పదములతో పది హేడు పదములను విభజించినవో 288 పదము లగును. ఈ మండము నందు “లతాలింగము” ఎట్లు ఉద్భవించునో చెప్పెదను. వినుము. ఒక్కొక్క దిక్కు యందు ఐదు, మూడు, ఒకటి, మూడు, ఐదు పదములను తుడిచి వేయవలేమ. పైన నున్న రెండు పదములతో లింగము పార్శ్వము నందున్న రెండేసి కోష్టములతో నుందిరము ఏర్పడును. మధ్యనున్న రెండు పదములో కమలము మరల మరియొక కమ లము ఏర్పడును. లింగ పార్శ్వ భాగము లందు రెండు భద్రనులు ఏర్పడును. ఒక పదమున ద్వార ముండును. దానిని తుడిచి వేయకూడదు. ఆ ద్వార పార్శ్వము లందు ఆరేసి పదములను తుడిచి వేయగా ద్వార శోథ ఏర్పడును. మిగిలిన పదములందు శ్రీహరికి లతలు ఏర్పడును. పైనున్న రెండు పదములను తుడిచి వేయగా విష్ణువునకు భద్రాష్టకము ఏర్పడును. మరల నాల్గు పదములను తుడిచి వేయగా రశ్మి మానాయుక్త మగు శోభా స్థానమేర్పడును. ఇరువది ఐదు పదములచే పద్మము, పిదప పీఠము, ఆపీఠము రెండేసి పదములను వుంచగా ఎనిమిది ఉప శోభలు ఏర్పడును. దేవ్యాది సూచిక మగు భద్ర మండలము మధ్య విస్తృతముగను. ప్రాంత భాగమున లఘువుగను వుండును. మధ్య తొమ్మిది పదముల కమల మేర్పడును. నాల్గు కోణములందున నాలుగు భద్ర మండలములు ఏర్పడును. మిగిలిన పదమూడు పదములలో బుద్ఘ్యాధా రమండలము ఏర్పడును. దీని యందు నూట ఆరువది పదములుండును. బుద్ద్యాధార మండలము శివాది దేవతారాధనకు ప్రశస్తములు.
అగ్ని మహా పురాణమున మండల నిరూపణ మను మూడు వందల ఇరువదవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 321 of the Agni Purāṇa is as follows:
Annual horoscopy (varṣaphala) is described: at the exact solar return moment each year, a new chart (varṣapraveśa) is cast, and the lord of that year (varṣeśa) and the sixteen tājika yogas — hayyāja, iṭthaśāla, naṣṭa, ishrāfa, and others — are evaluated to predict events in the coming year. The muntha (an annually progressing sensitive point) and the five tahvīl sub-lords are explained as additional layers of annual prediction. The chapter demonstrates the integration of the solar year with the natal chart, showing how the varṣaphala tradition enriches rather than replaces the natal reading.