పుష్కర ఉవాచః-
పరదారపరద్రవ్య జీవహింసాది కే యథా ।
ప్రవర్తతే నృణాం చిత్తం ప్రాయశ్చిత్త స్తుతి స్త థా.
విష్ణవే విష్ణవే నిత్యం విష్ణవే విష్ణవే నమః ।
నమామి విష్ణుం చిత్రస్థమహఙ్కారగతిం హరిమ్.
చిత్తస్థమీశమవ్యక్త మనన్త మపరాజితమ్ ।
విష్ణుమీడ్యమ శే షేణ హ్యనాదినిధనం విభుమ్.
విష్ణుశ్చితగతో యన్మే విష్ణుర్బుద్ధిగతశ్భ యత్ ।
యచ్చాహజారగో విష్ణుర్వద్విష్ణుర్మయి సంస్థితః.
కరోతి కర్మభూతో.సౌ స్థావరస్య చరస్య చ ।
తత్పాపం నాశమాయాలు తస్మిన్నేవ హి చిన్తితే.
ధ్యాతో హరతి యత్పాపం స్వప్నే దృష్టస్తు భావనాత్ ।
తము పేన్తమహం విష్ణుం ప్రణతార్తిహరం హరిమ్.
జగత్యస్మి న్ని రాధారే మజమానే తమస్యధః ।
హస్తావలమ్బనం విష్ణుం ప్రణమామి పరాత్పరమ్.
సర్వేశ్వరేశ్వర విభో పరమాత్మన్న ధోక్షజ ।
హృషీ కేశ హృషీ కేశ హృషీ కేశ నమోస్తు తే.
నృసింహానన గోవిన్ద భూతభావన కేశవ ।
దురితం దుష్కృతం ధ్యాతం శమయాఘం నమోఽస్తు తే.
యన్మయా చి నితం దుష్టం స్వచిత్తవశవర్తినా ।
ఆకార్యం మహదత్యుగ్రం తచ్ఛమం నయ కేశవ.
బ్రహ్మణ్య దేవ గోవిన్ద పరమార్థ పరాయణ ।
జగన్నాథ జగద్ధాతః పాపం ప్రశమయాచ్యుత.
యథాపరా హై సాయా హే మధ్యా హే చ తథా నిశి ।
కాయేన మనసా వాచా కృతం పాపమజానలా.
జానతా చ హృషీ కేక పుణరీకాక్ష మాధవ ।
నామత్రయోచ్చారణతః స్వప్నే యాతు మమ క్షయమ్.
శారీరం మే హృషీ కేక పుణరీ కాక్ష మాధవ ।
పాపం ప్రకమయాద్య త్వం వాకృతం మమ మాధవ,
యద్భుజ్ఞాన్యత్స్వపం స్తిష్ఠనచ్ఛష్ణోగ్రద్యదా స్థితః ।
కృతవాన్ పాపమద్యాహం కాయేన వచసా గిరా.
యత్స్వల్పమపి యర్దూలం కుయోనినర కావహమ్ ।
తద్యాలు ప్రశమం సర్వం వాసుదేవానుకీర్తనాల్.
వరంబ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం చ యత్ ।
తస్మిన్ ప్రకీర్తితే విష్ణో యతాపం తత్ ప్రణశ్యతు.
యత్ర్పాప్య న నివర్తనే గన్దస్పర్శాదివర్జితమ్ ।
సూరయ స్తత్పదం విష్ణోస్తత్సర్వం శమయత్వఘమ్.
పాపప్రణాశనం స్తోత్రం యః పఠేచ్ఛృణుయాదపి ।
శారీ రై ర్మాన సైర్వాగైః కృతైః పాపైః ప్రముచ్యతే.
సర్వపాపగ్రహాదిభ్యో యాతి విష్ణోః పరం పదమ్ ।
తస్మాత్పా పే కృతే జప్యం స్తోత్రం నర్వాఘమర్దనమ్.
ప్రాయశ్చిత్తమమౌఘానాం స్తోత్రం వ్రతకృతే వరమ్ ।
ప్రాయశ్చిత్తైః స్తోత్రజపైర్ర్వతై ర్నశ్యతి పాతకమ్.
తతః కార్యాణి సంసిద్ధ్యేతాని వై భుక్తిముక్తయే.
ఇత్యాదిమహాపురాణే ఆగ్నేయే సర్వపాప ప్రాయశ్చిత్తే పాపనాశనస్తోత్రం నామ ద్విస ప్తత్యధిక శతతమోధ్యాయః.
పుష్కరుడు చెప్పెను : మానవుల మనస్సు పరభార్యాపరధన జీవహింసాదులయందు ప్రవర్తించునపుడు విష్ణస్తుతియే ప్రాయశ్చిత్తము. సర్వదా విష్ణువునకు నమస్కారము. చిత్త మునం దున్నవాడును, అహంకారమునకు గతి యైన వాడును, హరియు, ఈశుడును, అవ్యకుడును, అపరాజితుడును అగు విష్ణువును నమస్కరించుచున్నాను. ఏ కారణమువలన విష్ణువు నా మనస్సులో నున్నాడో, నా బుద్ధిలో నున్నాడో, నా అహంకారములో నున్నాడో, నాలో ఉన్నాడో, స్థావరజంగమాత్మ ప్రపంచముయొక్క కర్మ ఆ కర్మగా నుండి చేయుచున్నాడో, ఆ కారణమువలన ఆ విష్ణువునే చింతించుటచే పాపము నశించుగాక ఏ కారణమువలన ధ్యానము చేయగానే పాపమును హరించునో, భావనాబలమువలన స్వప్న మునందు కనబడునో అట్టి ఉపేంద్రుడును ప్రణతార్తి హరుడును అగు విష్ణువును నమస్కరించుచున్నపుడు హస్తావలంబనము నిచ్చు పరాత్పరుడైన విష్ణువును నమస్కరించుచున్నాను. ఓ సర్వేశ్వరేశ్వరా! విభూ పరమాత్మా! అధోక్షజా! నీకు నమస్కారము. నృసింహా! అనంతా! భూతభావనా! భూతేశా! హృషీ కేశా! నీకు నమస్కారము. నృసింహా! అనంతా! భూతభావనా! భూతేశా! కేశవా! నేను దుష్ట వాక్కు పలుకుటచేతను, చేడు కార్యములు చేయుట చేతను, చెడు ఆలోచనలు చేయుటచేతను కలిగిన పాపమును శాంతింప చేయుము. నీకు నమస్కార మగుగాక. కేశ వా! నా చిత్తమునకు లొంగిపోయిన నేను చేసిన దురాలోచనలను ఉగ్ర మైన దుష్కార్యమును, నశింపచేయుము. బ్రహ్మణ్య దేవా! గోవిందా! పరమార్థపరాయణా! జగన్నాధ జగత్పషకా! అచ్యుతా! వా పాపమును శాంతింపచేయుము. హృషీ కేశా! పుండరీకాక్షా! మాధవా! తెలిసికాని, తెలియక గాని నేను అపరాహమునందును, సాయాహ్నమునందును, మధ్యాహ్నమునందును రాత్రియందును మనోవాక్కాయములచే చేసిన పాపము నీ నామ మాత్రోచ్చారణముచే నా స్వప్నమునందే నశించిపోవుగాక. హృషీ కేశా! పుండరీకాక్షా! మాధవా! శరీరమునకు సంబంధించినది గాని, వాక్కు చేత చేసినది గాని అయిన నా పాపమును శమింపచేయుము. భుజించుచు గాని, నిద్రించుచు గాని, నిలచి గాని, మెలకువగా నుండి గాని, నే నీ రోజున మనోవాక్కాయములచే చేసిన పాపమును నశింపచేయుము. పాపజన్మలు నరకము ఇచ్చు స్వల్ప మైనను అధిక మైనను నా పాపము వాసుదేవనామకీర్తనమువలన శమించుగాక, పరబ్రహ్మ స్వరూపుడును పరమ స్థానమును, పరమపవిత్రుడును అగు విష్ణువు కీర్తింపబడగనే సమస్త పాపము నశించుగాక! గంధస్పర్శాదివర్జితమగు ఏ విష్ణు పదమును పొందిన పండితులు మరల వెనుకకు రారో అట్టి విష్ణుపదము సకలపాపములను నశింపచేయుగాక. ఈ పాప ప్రణాశనస్తోత్రమును చదివినవాడును, విన్న వాడను, మనోవాక్కాయజన్యము లగు పాపములనుండి విముక్తుడగును. సర్వపాప పునఃప్రాయశ్చిత్తాని గ్రహాలు నుండి గూళ్ల విముక్తు డై శ్రీ మహా విష్ణువు యొక్క ఉత్త మనమును చేరును. అందువలన పాపము చేసినపుడు స్వఘనాశకమగు ఈ స్తోత్రమును జపించవలెను. వ్రతము నిమిత్తమై కూడ ఇది శ్రేష్టము. పాపము ప్రాయశ్చిత్త ములచేతను స్తోత్రజపము చేతను వ్రతము చేతను నశించును. అపి స్ము ఓ సిద్దినిమిత్తమై చేసిన కర్మలు భుక్తి ముక్తి ప్రదములగును.
అగ్ని మహాపురాణమునందు సర్వపాపప్రాయశ్చిత్త ముర పాపశ స్తోత్ర మను నూటడెబ్బది రెండవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 172 of the Agni Purāṇa is as follows:
Puṣkara presents a Viṣṇu-stotra declared to be the most powerful expiation for those whose minds have turned toward the sins of coveting another's wife, another's wealth, and causing harm to living beings. The prayer addresses Viṣṇu as the one who abides within citta, buddhi, and ahaṃkāra, invoking his forms as Hṛṣīkeśa, Puṇḍarīkākṣa, and Mādhava. All sins committed through body, speech, and mind across all hours of the day and night are declared dissolved by sincere recitation of this stotra. The chapter closes with the assurance that whoever reads or hears this pāpapraṇāśana-stotra attains Viṣṇu's supreme state.