శ్రీ భగవానువాచః-
సముదాయేన దేవాదేః ప్రతిష్ణాం ప్రవదామి తే।
లక్ష్మ్యాః ప్రతిష్ఠాం ప్రథమం తథా దేవీగణస్య చ
పూర్వవత్సకలం కుర్యాన్మణలస్నా పనాదికమ్।
భద్రపీఠే శ్రియం న్యస్య స్థాపయేదష్ట వై ఘటాన్.
మృతేనాభ్యజ్య మూలేన స్నాపయేత్ప్చగవ్యకై।
హిరణ్యవర్ణాం హరిణీం నేత్రే చోన్మీలయే చ్ఛియాః.
తాం మ ఆవహ ఇత్యేవం ప్రదద్యాన్మధురత్రయమ్।
అశ్వపూర్వేతి పూర్వేణ తాం కుమ్బేనాభి షేచయేత్.
కాంసోస్మితేతి యా మేన పశ్చిమేనాభి షేచయేత్।
చన్దాం ప్రభాసాము చ్చార్యాదిత్యవర్ణేతి చోత్త రాత్.
ఉ చైతు మేతి వాగ్నేయాత్తుత్పిపాసేతి నైరృతాత్।
గన్జద్వారేతి వాయవ్యాం మనసః కామమాకూతిమ్.
ఈశనాసకంబై వరః సౌవర్ణకర్దమాత్ ।
ఏకాశీతిఘటైః స్నానం మన్రోణాపః సృజన్ క్షితిమ్.
హయగ్రీవుడు చెప్పేను : ఇపుడు సామూహికరూపమున దేవతాదిప్రతిష్టను గూర్చి చెప్పెదను. మొదట లక్ష్మీస్థాపన గూర్చియు, పిదప ఇతర దేవతాస్థాపన గూర్చియు చెప్పెదను. మండప అభిషేకాదు లన్నియు వెనుకటి అధ్యాయములలో చెప్పినట్లే చేయవలెను. పిమ్మట భద్రపీఠమును లక్ష్మిని స్థాపించి ఎనిమిది దిక్కులందను ఎనిమిది కలశలు స్థాపించవలెను. దేవీప్రతిమకు ఆజ్యము పూసి, మూలమంత్రము చదువుచు, పంచగవ్యములతో స్నానము చేయించవలెను. “హిరణ్యవర్ణాం హరిణీమ్” ఇత్యాదిమంత్రము చదువుచు నే తములను తెరువవలెను. “తాం మ ఆవహ” అను మంత్రము చదివి దేవికి తేనె, నెయ్యి, పంచదార సమర్పింపవలెను. 'ఆశ్వపూర్వామ్' ఇత్యాదిమంత్రముతో తూర్పున నున్న కలశ తో స్నానము చేయించవలెను. “కాంసోస్మితామ్” ఇత్యాదిమంత్రముతో దక్షిణకలశ జలముతోను, “చక్జాం ప్రభాసామ్” ఇత్యాదిమంత్రముతో పశ్చిమకలశ జలముతోను, “ఆదిత్యవర్ణే” ఇత్యాదిమంత్రముతో ఉత్తరకలశ జలముతోను “ఉపైతు మాం ఇత్యాదిమంత్రముతో ఆగ్నేయక లశ జలముతోను, “క్షుత్పిపాసామలామ్” ఇత్యాదిమంత్రముతో నైరృతికలశ జలముతోను, “గస్థద్వారాం” ఇత్యాదిమంత్రముతో వాయవ్యకోణ కలశ జలముతోను, “మన సః కామమాకూతిమ్” ఇత్యాది మంత్రముతో ఈశాన్యకలశ జలముతోను, లక్ష్మీదేవికి అభిషేకము చేయవలెను. “కర్దమేన ప్రజాభూతా” అను మంత్రము చదువుచు సువర్ణకలశ జలముతో దేవి శిరస్సుపై అభిషేకము చేయవలెను. “ఆపః సృజను” ఇత్యాదిమంత్రముతో ఎనుబది యొక్క కలకలతో శ్రీదేవి ప్రతిమకు స్నానము చేయించ వలెను.
ఆర్ద్రాం పుష్కరిణీం గందైరార్ద్రామిత్యాది పుష్పకైః।
తాం మ ఆవహమన్తోణ్మయ ఆనన్దబచాఖిలమ్.
శ్రయస్తీ యేన శయ్యాయాం శ్రీసూకే న చ సన్నిధిమ్।
లక్ష్మీబీజేన చిచ్ఛక్తి విన్యస్యాభ్యర్చయేత్పునః.
శ్రీసూక్తేన మణ్డ పేథ కుణ్డేష్వబ్దాని హోమయేత్।
కరవీరాణి వా హుత్వా సహస్రం శతమేవ వా.
గృహోపకరణాస్తాది శ్రీసూకేనైవ చార్పయేత్ ।
తతః ప్రాసాదసంస్కారం సర్వం కృత్వా తు పూర్వవల్.
మన్రోణ పిజ్జికాం కృత్వా ప్రతిష్టానం తతః క్రియః ।
శ్రీసూకేన చ సాన్నిధ్యం పూర్వవత్పత్యృచం జపేత్.
చిచ్ఛక్తిం బోడయిత్వా తు మూలాత్సాన్నిధ్యకం చరేత్ ।
భూస్వరవసగోన్నాది గురవే బహ్మణేర్పయేత్.
ఏవం దేవ్యోఒ ఖిలాః స్థాప్య రాజ్య స్వర్గాదిభాగ్భవేత్।
ఇత్యాటిమహాపురాణే ఆగ్నేయే లక్ష్మీస్థాపనం నామ ద్విషష్టిత మోధ్యాయః.
పిమ్మట “ఆర్దాం పుష్కరిణీమ్” ఇత్యాదిమంత్రముతో గంధ మర్పించి, “ఆర్గాం యః కరిణీమ్ ఇత్యాదిమంత్రముతో పుష్పమాల సమర్పింపవలెను. పిమ్మట “తాం మ ఆవహ జాతవేదః” ఇత్యాదిమంత్రముతోను, “ఆనన్దః” ఇత్యాదికములతోను మిగిలిన ఉపచారము లన్నియు సమర్పింపవలెను. 'శ్రాయల్లీ' ఇత్యాదిమంత్రము చదువుచు శయ్యపై పరుండ పెట్టవలెను. శ్రీసూక్తము పఠించుచు సంనిధీకరణము చేసి, లక్ష్మీబీజముతో (శ్రీం) చిచ్ఛక్తి విన్యాసము చేసి మరల పూజింపవలెను. పిదప శ్రీసూక్తముతో మండపము పై నున్న కుండములో కమలములతో గాని, కరవీర పుష్పములతో గాని వెయ్యి లేదా వంద హోమములు చేయవలెను. గృహోపకరణాది సమ స్తపూజాసామగ్రి మొదటి నుండియు శ్రీసూక్తమంత్రములతోడనే సమర్పింపవలెను. వెనుకటి వలె ప్రాసాదమునకు సంస్కారము చేసి, లక్ష్మికి పిండికానిర్మాణము చేయవలెను. పిమ్మట పిండిక పై లక్ష్మిని ప్రతిష్ఠ చేసి, శ్రీసూక్తముతో సంనిధీకరణము చేయుచు వెనుకటి వలె శ్రీ సూక్తమునందలి ఒక్కొక్క ఋక్కును జపించవలెను. మూలమంత్రముచే చిచ్చక్తిని జాగృత మొనర్చి మరల సంనిధీకరణము చేయవలెను. పిమ్మట ఆచార్యునకు, బ్రహ్మకు, ఇతర ఋత్విక్కులకు, బ్రాహ్మణులకు భూ సువర్ణ-వస్త్ర-గోదానాదులు చేయవలెను. ఈ విధముగ అందరి దేవులను స్థాపించినవాడు-రాజ్య-స్వర్గాదులను పొందును.
శ్రీ అగ్ని పురాణమునందు లక్ష్మీస్థాపన మను అరువది రెండవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 62 of the Agni Purāṇa is as follows:
The sixty-second chapter describes the specific ritual procedure for installing the image of Bhagavān's consort, Lakṣmī. The eight-directional kalaśa arrangement is prescribed, with each kalaśa assigned to a specific aspect of Lakṣmī's power — Ādi Lakṣmī, Dhana Lakṣmī, Dhānya Lakṣmī, Gaja Lakṣmī, Santāna Lakṣmī, Vīra Lakṣmī, Vijaya Lakṣmī, and Vidyā Lakṣmī. The installation mantras are drawn primarily from the Śrī-sūkta, the Vedic hymn that celebrates Lakṣmī as the embodiment of the earth's abundance. The ciccakti-nyāsa — the infusion of the goddess's consciousness-power into the image — and the specific dhyāna-śloka describing her golden form seated on a lotus, holding lotus flowers, attended by elephants pouring water over her, are given. The chapter affirms that installing Lakṣmī alongside Bhagavān is installing the principle of śrī — auspiciousness, fertility, abundance — in the world.