నారద ఉవాచః-
అగ్ని కార్యం ప్రవశ్యామి యేన స్యాత్సర్వకామభాక్ ।
చతుర భ్యధికం వింశమజ్ఞులం. చతురనకమ్.
సూత్రేణ సూత్రయిత్వా తు క్షేత్రం తావఛనీత్సమమ్।
ఖాతస్య మేఖలాః కౌర్యాస్త క్యా చై వాజులద్వయం
సత్త్వాడిసంజ్ఞా పూర్వాషాఢ్వాదశాబ్ధులముచ్ఛితా ।
ఆష్ట్రాజులా ద్వ్యజులాథ చతుర జులవిస్తృతా.
యోనిర్దశాబ్దులా రమ్యా షట్ చతుర్ద్వ్యజులాగ్రగా ।
క్రమాన్ని మా తు కర్తవ్యా పశ్చిమాశావ్యవస్థితా.
ఆశ్వత్థపత్రసదృశీ కిఙ్చాత్కుణే నివేశితా ।
తుర్యాజులాయతం నాలం పజ్చదశాజ్గులాయతమ్.
మూలంతు త్ర్యజ్గులం యోన్యా అగ్రం తస్యాః షడజ్గులమ్ ।
లక్షణం చైకహ స్తస్య ద్విగుణం ద్వికరాదిషు.
నారదుడు పలికెను -
ఆన్ని కోరికలను తీర్చు ఆగ్నికార్యమును చెప్పెదను. ఇరవై నాలుగు అంగుళముల చతురస్ర క్షేత్రమును సూత్రముతో కొలచి సమముగా అంతలను సమముగా త్రవ్వవలెను. ఆ విధముగా త్రవ్వినదానికి రెండంగుళములు విడచి మేఖలలు (ఒడ్డాణము వంటి కట్లు) చేయవలెను. సత్వము మొదలగు పేర్లు గల ఆ మేఖలలు పూర్వాభిముఖములు గాను, పండ్రెండు అంగుళములు ఎత్తు కలవిగ ఉండవలెను. ఒకటి ఎనిమిది అంగుళముల విస్తారము కలది, రెండవది రెండు అంగుళముల విస్తారము కలది, మూడవది సొలుగు అంగుళముల విస్తారము కలది అయి ఉండవలెను. పది అంగుళిముల రమ్యమైన యోని ముందు వైపు వరుసగా ఆరు.నాలుగు. రెండు అంగుళములు ఎత్తు ఉండవలెను. పడమట నున్న దానిని క్రమముగా లోతుగా నుండునట్లు చేయవలెను. రావి ఆకు ఆకారములో నున్న దానిని కొద్దిగా కుండములోనికి చేర్చి నిర్మింపవలెను. దాని నాళము నాలుగు, ఐదు, పది అంగుళాల పొడవు ఉండవలెను. ఆ యోనియొక్క మూలము మూడు అంగుళములు, దాని ఆగ్రము ఆరు అంగుళములు ఉండవలెను. ఏకహస్త కుండలక్షణము ద్విహస్త కుండాదుల విషయమున రెట్టింపు అగుచుండును.
ఏకత్రిమేఖలం కుణ్డం వర్తులాది వదామ్యహమ్ ।
కుణ్డార్దే తు స్థితం సూత్రం కోడే యదతిరిచ్యతే.
తదర్ధం దిశి సంస్థాప్య భ్రామితం వర్తులం భవేత్ ।
ఒక మేఖల, మూడు మేఖలలు గల వర్తులాదికుండములను గూర్చి చెప్పెదను. కుండము యొక్క ఆర్ధమునందు సూత్రము నుంచగా కోణమునందు మిగిలిన ఆ సూత్రములోని ఆర్ధమును దిక్కునందుంచి త్రిప్పినచో ఆది వర్తుల మగును.
కుణ్డార్ధం కోణభాగార్ధం దిశా చోత్తరతో బహి.
పద్మాకారే దలాని సురేఖలాయాం తు వర్తులే.
పూర్వపశ్చిమతో యత్నాల్లాళ్ఛయిత్వా తు మధ్యతః।
సంస్థాప్య భ్రమితం కుఱ్ఱమర్ధచన్దం భవేచ్ఛుభమ్.
కుండార్ధమును మించిన కోణభాగార్ధమును బయట ఉత్తరభాగమున పెంచి పూర్వపశ్చిమముల వైపు బైటకు చాపి మధ్యమునందు ఉంచి సూత్రము త్రిప్పినచో ఆర్ధచంద్రాకార మైన శుభకర మైన కుండము ఏర్పడును. పద్మాకార మైన వర్తులగుండమునందు మేఖలయందు దలము లుండును.
బాహుదణ్డప్రమాణస్తు హోమార్థం కారయే త్సృచమ్.
సప్తపశ్చాజ్ఞులం వాపి చతురస్రం తు కారయేత్ ।
త్రిభాగేన భవేద్ధర్తం మధ్యే వృత్తం సుశోభనమ్.
తిర్యగూర్ధ్వం సమం ఖాత్వా బహిరర్గం తు శోధయేత్ ।
అజ్ఞులస్య చతుర్థాంశం శేషార్ధార్ధం తథానతః.
ఖాతస్య మేఖలాం రమ్యాం శేషార్దేన తు కారయేత్।
కణం త్రిభాగవిస్తారమజుష్టకసమాయతమ్.
సార్ధమణుష్ఠకం వా స్యాత్తదగ్రే తు ముఖం భవేత్ ।
చతురజ్ఞుల విస్తారం పజ్ఛాులమథాపి వా.
త్రికం ద్వ్యజులకు తత్యాన్మధ్యం తస్య సుశోభనమ్ ।
ఆయామ స్తత్సమ స్తస్య మధ్య నిమ్నః సుశోభనః.
సుషిరం కణదేశ స్యాద్వి కేద్యావతనీయసి ।
శేషం కుణ్డం తుక ర్తవ్యం యథారుచి విచిత్రితమ్.
హోమము చేయుటకై చేయి ప్రమాణము లేదా పండ్రెండు అంగుళముల ప్రమాణము గల సృక్కును చేయించ వలెను. దాని మూలభాగము చతురస్రముగా ఏడు లేదా ఐదు అంగుళములు ఉండవలెను. దాని మధ్యయందు త్రిభాగమును అంద మైన, వర్తులాకార మైన గర్త ము గొయ్యి) ఉండవలెను. ఆడ్డముగా, పై భాగమున సమముగా ఆ గర్తము నిర్మించి పైన ఆర్ధాంగుళ భాగమును శోధించవలేను. (చెక్కి నున్నగా చేయవలెను). నాల్గవ వంతు అంగుళమును, మిగిలిన అర్దములో ఆర్ధమును కూడ శోధించవలెను. మిగిలిన ఆర్ధముచే గర్త మునకు రమ్య మైన మేఖలను ఏర్పరుపవలెను. త్రిభాగ విస్తారము కలదియు, అంగుష్ఠ మంత ఆయత మైనదియు ఆగు కంఠమును చేయవలెను. దాని అగ్రమునందు నాలుగు లేదా ఐదు అంగుళముల ప్రమాణము గల ముఖ ముండవలెను. దాని మధ్యము ఆరు అంగుళముల ప్రమాణ ముండవలెను. దాని ఆయామము కూడ అంతయే ఉండి మధ్యమున పల్లమై ఆందముగా ఉండవలెను. దాని కంఠదేశమునందు చిటికెనవ్రేలు ప్రవేశించు నంత రంధ్ర ముండవలెను. మిగిలిన కుండము (సుక్కు ముఖము) ఆభిరుచి ననుసరించి విచిత్రముగ చేయవలెను.
స్రువం తు హస్తమాత్రం స్యాద్రణ్డ కేన సమన్వితమ్।
వటుకం ద్వ్యజ్ఞులం వృత్తం కర్తవ్యం తు సుశోభనమ్.
గోపదం తు యథా మగ్నమల్పపజ్కే తథా భవేత్ ।
సువము దండముతో సహా చేయి పొడ వుండవలెను. కొంచెము పంకమునందు ఆవు పాదము దిగిన లోతు ఎట్లుండునో ఆ విధముగా ఆంద మైన, రెండు అంగుళముల వృత్తము చేయవలెను.
ఉపలిప్య లిఖేదేఖామణులాం వజ్రనాసికామ్.
సౌమ్యాగ్రాం ప్రథమాం తస్యాం రేఖే పూర్వముఖే తయోః।
మధ్యే తీవ్ర స్తథా కుర్యాద్దక్షిణాది క్రమేణ తు.
ఆగ్ని కుండమును ఆలికి, ఆంగుళము ప్రమాణము గల వజనాసికాలేఖను గీయవలెను. ఆది ఉత్త రాగ్ర మగు మొదటి రేఖ. దాని పై పూర్వాభిముఖము లైన రెండు రేఖలు గీయవలెను. వాటి మధ్య దక్షిణాదిక్రమమున మూడు రేఖలు గీయవలెను.
అలంకృత్వా మూర్తి మతీం క్షిపేదగ్నిం హరిం స్మరన్.
ఏవముల్లిఖ్య చాభ్యుశ్య ప్రణవేన తు మస్త్రవిత్।
విష్టరం కల్పయేతే న తస్మిన్ శక్తిం తు వైష్ణవీమ్.
మంత్రవేత్త ఈ విధముగా రేఖలు గీసి, ప్రణవ ముచ్చరించుచు నీళ్ళు చల్లి, ఓంకారము నుచ్చరించుచు - పీఠమును కల్పించి దానిపై మూర్తి మతి యగు వైష్ణవీశక్తి ని అలంకరించి, విష్ణువును స్మరించుచు అగ్ని ని ఉంచవలెను.
ప్రాదేశమాత్రాః సమిధో దత్త్వా పరిసముహ్య తమ్.
దర్బైస్త్రిధా పరిస్తీర్య పూర్వాదౌ తత్ర పాత్రకమ్ ।
ఆసాదయేదిద్మవహ్ని భూమౌ చ స్రుక్ స్రువద్వయమ్.
జానెడు పొడవు గల సమిధల నుంచి ఆ అగ్నిని ప్రజ్వలింపచేసి పూర్వాదిదిక్కులందు దర్భలు మూడు విధములుగా (చుట్టూ) పరచి, వాటి పై పాత్రను, ఇద్మ మును వహ్నిని సమీపమున నుండు నట్లు చేసి సుక్కును, స్రువమును భూమిపై ఉంచవలెను.
ఆజ్యస్థాలీం చరుస్థాలీం కుళాజ్యం చ ప్రణీతయా ।
ప్రోక్షయిత్వా ప్రోక్షణీం చ గృహీత్వా పూర్వ వారిణా.
పవిత్రాన్తర్షి తే హస్తే పరిస్రావ్య చ తజ్ఞలమ్।
ప్రాజ్నీ త్వా ప్రోక్షణిపాత్రం జ్యోతిరగ్రే నిధాయ చ.
తదద్భిస్తిశ్చ సంప్రోక్ష్య ఇద్మం విన్యస్య చాగ్రతః ।
ప్రణీతాయాం సపుష్పాయాం విష్ణుం ధ్యాత్వోత్త రేణ చ.
ఆజ్యస్తాలీమథాజ్యేన సంపూర్యా గ్రే నిధాయ చ ।
సంప్లవోత్పవనాభ్యాం తు కుర్యాదాజ్యస్య సంస్కృతిమ్.
అఖణ్డితాగౌ నిర్గర్భౌ కుశా ప్రాదేశమాత్రకౌ।
తాభ్యాముత్తానపాణిభ్యామజ్గుష్ఠానామి కే నతే.
ఆజ్యస్థాలిని, చరుస్థాలిని, కుశాజ్యమును ప్రణీతచే ప్రోక్షించి, ప్రోక్షణిని గ్రహించి దానిని. నీటితో నింపి, ఆ నీటిని పవిత్రముచే కప్పబడిన హస్తమునందు జారవిడచి, ప్రోక్షణిపాత్రమును తూర్పుగా తీసికొని వెళ్ళి, దానిని . అగ్ని కి ఎదురుగా ఉంచి, దానిని ఉదకముచే మూడు సార్లు-ప్రోక్షించి, ఎదుట నుంచి ఉత్తరమున పుష్పలముతో కూడిన ప్రణీత పై విష్ణువును ధ్యానించి, ఆజ్యపాత్రను ఆజ్యముతో నింపి ఎదుట ఉంచి, తెగని చిగుళ్లు గల, గర్భము లేని జానెడు పొడవైన రెండు కుశ ములను వెల్లగితల చేయబడిన హస్తములచే బొటనవేలితోను అనామిక తోను పట్టుకొని, వాటిని నేతిలో ఇటు నలు త్రిప్పినేతిని సంస్కరించవలేను.
ఆజ్యం తయోస్తు సంగృహ్య ద్విర్నీ త్వా త్రిర వాజ్క్షి పేత్ ।
సుక్ర్సువౌ చాపి సంగృహ్య లాభ్యాం ప్రక్షిప్య వారిడా.
ప్రత్యు దర్బైః సంమృజ్య పునః ప్రక్షాల్య చైవ హి।
నిష్టప్య స్థాపయిత్వా తు ప్రణవేనైవ సాధకః.
ప్రణవాదినమానేన పశ్చాద్దోమం సమాచరేత్ ।
వాటి ఆజ్యమును సంగ్రహించి, రెండు పర్యాయములు తీసి, మూడు పర్యాయములు - క్రిందికి చిమ్మవలెను. వాటితో సుక్రువములను గ్రహించి, నీటిచే తడిపి, వెచ్చచేసి, దర్బలచేత తుడిచి, మరల కడిగి, వెచ్చచేసి, ఓంకారము నుచ్చరించుచు క్రింద ఉంచి, సాధకుడు, పిమ్మట ఓంకారము మొదట ఉచ్చరించుచు, చివర 'నమః' అని అనుచు పిమ్మట హోమము చేయవలెను.
గర్బాధానాదిక ర్మాణి యావదంశవ్యవస్థయా.
నామానం వ్రతబస్ధాన్తం సమావర్తావసానకమ్ ।
అధికారావసానం వా కుర్యాదజ్జావసానతః.
గర్భాధానాది కర్మలను ఆ యా అంశముల వ్యవస్థ చక్కగా పాటించుచు, అంగముల ననుసరించి, నాకంత ముగా గాని, సమావర్తాంతము గాని, అధికారాంతము గాని చేయవలెను.
ప్రణవేనోపచారం తు కుర్యాత్సర్వత్ర సాధకః।
అజ్గైర్హోమస్తు కర్త వ్యో యథావిత్తానుసారతః.
సాధకుడు అన్నింటను ఓంకారముతో ఉపచారము చేయవలెను. ధనలోభము చేయకుండగా అంగహోమములు చేయవలెను.
గర్భాధానం తు ప్రథమం తతః పుంసవనం స్మృతమ్।
సీమన్తోన్నయనం జాతకర్మ నామానప్రాశనమ్.
చూడాకృతిం వ్రతబంధం వేదవ్రతాన్య శేషతః ।
సమావర్తనం పల్న్యా చ యోగశాఖాధికారకః.
గర్భాధానము, పుంసవనము, సీమస్తోన్నయనము, జాతకర్మ నామకరణము, అన్నప్రాశనము, చౌలము, వ్రత బంధము (ఉపనయనము), సమస్త మైన వేదవతాలు (నాలుగు), స్నాతకము, వివాహము, ఆధికారకము అను సంస్కారము లను వరుసగా చేయవలెను.
హృదాదీక్రమతో ధ్యాత్వా ఏకైకం కర్మ పూజ్య చ ।
అష్టావష్టౌతు జుహుయాత్రపతిక ర్మాహుతిః పునః.
ప్రతికర్మయందును హృదయాదాక్రమముచే ధ్యానించి, ఒక్కొక్క కర్మను పూజించి, మరల - ఎనిమిదేసి ఆహుతు లను హోమము చేయవలెను.
పూర్ణాహుతిం తతో దద్యాత్ స్రుచా మూలేన సాధకః।
వోషడంతేన న మంత్రేణ ప్లుతం సుస్వరముచ్చరన్.
సాధకుడు నౌషట్ చివర గల మంత్రమును చక్కగా ప్లుతస్వరముతో ఉచ్చరించుచు సుక్కు మొదటి భాగముతో పూర్ణాహుతి ఇవ్వవలెను.
విష్ణోర్వహిం తు సంస్కృత్య అర్పయేద్వైష్ణవం చరుమ్ ।
ఆరాధ్య స్థబ్దిలే విష్ణుం మంత్రాన్ సంస్మృత్య సంశ్రయేత్.
విష్ణువునకై వహ్నిని సంస్కరించి వైష్ణవ మైన చరువును అర్పించవలెను. స్థలిడిలముమీద విష్ణువును పూజించి, మంత్రములను స్మరించుచు ఆశ్రయించవలెను.
ఆసనాదిక్ర మేణైవ సాబ్ధావరణముత్త మమ్।
గగ్గపుష్పైః సమభ్యర్చ్య ధ్యాత్వా దేవం సురోత్తమమ్.
ఆధాయేద్మమథాభరావాజ్యావన్నీ శసంస్థితా।
వాయవ్యనైరృతాశాదిప్రవృతౌ తు యథాక్రమమ్.
ఆజ్యభాగౌ తతో హుత్వా చక్షుషీ దక్మిణోత్త రే।
మధ్యేథ జుహుయా త్సర్వమంత్రైకర్చాక్రమేణ తు.
ఉత్తమ మైన సాంగావరణమును ఆసనాది క్రమముచే గంధ పుష్పములతో పూజించి, దేవతా శ్రేష్ఠు డైన ఆ విష్ణువును ధ్యానించి, సమిధను ఉంచి, పిమ్మట ఆగ్నేయ ఈశాన్య దిక్కులందు ఆజ్యాఘారములను, వాయవ్య నైరృత దిక్కులందు ఆజ్యభాగములను క్రమానుసారముగా సమర్పించి, పిమ్మట దక్ష్మితో త్తర చక్షురోమములు చేసి, పిమ్మట అర్చా క్రమానుసారముగా మధ్యయందు, సర్వమంత్రముల తోడను, హోమము చేయవలెను.
ఆజ్యేన తర్పయేన్మూర్తిం దశాం శేనాజ్గహోమకమ్ ।
శతం సహస్రం వాజ్యాద్యైః సమిద్భిర్వా తిలైః సహ.
ఆజ్యముచేత మూర్తినితృప్తిపరచవలెను. వదన అంశము అంగ హోమము చేయవలెను. ఆజ్యము మొదలైనవాటితో లేదా తిలలతో గూడిన సమిధలతో నూరు లేదా వేయి హోమములు చేయవలెను.
సమాప్యార్చాం తు హోమానాం శుచీన్ శిష్యానుపోషితాన్।
ఆహూయా గే నివేశ్యాథ హ్యస్త్రే ణ ప్రోక్షయే శూత్పన్.
హోమము అంతమునందు గల పూజను సమాప్తి చేసి ఉపవాస మున్న పవిత్రు లై న శిష్యులను పిలచి, తన ఎదుట ఉంచుకొని, ఆ పశువులను అశ్రమంత్రముచే ప్రోక్షించవలెను.
శిష్యానాత్మని సంయోజ్య విద్యాకర్మనిబనంద నై ।
లిజ్ఞానువృత్తం చైతన్యం సహ లీజ్గేన పాలితమ్.
ధ్యానమార్గేణ సమోక్ష్య వాయుబీజేన శోషయేత్।
తతో దహనబీజేన సృష్టిం బ్రహ్మాణ్డసంజ్ఞికామ్.
నిర్దగ్ధం సకలాం ధ్యాయేద్భస్మ కూటనీభస్థితామ్।
ఫ్లావయేద్వారిణా భస్మ సంసారం వార్మయం స్మరేత్ .
శిష్యులను విద్యాకర్మ నిబంధనములచే తనలో కలుపుకొని, లింగ శరీరమును అనుసరించి ఉన్నదియు, లింగ శరీరముతో కూడా పాలింపబడినదియు అగు చైతన్యమును ధ్యానమార్గమున సంప్రోక్షించి, వాయుబీజముచే శుష్కింప . చేయవలెను. పిమ్మట బ్రహ్మాండ మను పేరు గల ఈ సృష్టి యంతయు అగ్ని బీజముచే కాల్చివేయబడి భస్మరాశి వలే . ఉన్నట్లుగా ధ్యానము చేయవలెను. ఆ భస్మము నీటితో ముంచెత్తవలెను. ప్రపంచ మంతయు జలమయముగా ఉన్నట్లు స్మరించవలెను.
తత్ర శక్తిం న్య సేత్పశ్చాతార్థివీం బీజసంజ్ఞికామ్।
తన్మాత్రాభిః సమస్తాభిః సంవృత్తం పార్థివం శుభమ్.
అఖడ్గం తద్భవం ధ్యాయేత్త దాధారం తదాత్మకమ్।
తన్మధ్యే చిన యేన్మూర్తిం పౌరుషీం ప్రణవాత్మికామ్.
పిమ్మట దానియందు పృథివీవికార మైనదియు, బీజ మను పేరు గలదియు అగు శక్తిని ఉంచవలెను. సమస్త మైన తన్మాత్రలచే ఏర్పడినది, పృథివీవికారము, శుభమైనదియు, అఖండము, దాని (శక్తి) నుండి పుట్టినది. తత్స రూపమును అగు దాని ఆధారమును ధ్యానించవలెను. దాని మధ్యయందు ప్రణవరూప మైన పురుషమూర్తిని ధ్యానించవలెను.
లిజ్గం సంక్రామయేత్పశ్చాదాత్మస్థం పూర్వసంస్కృతమ్ ।
విభ క్తేంద్రియ సంస్థానం క్రమాద్వృద్ధం విచి నంతయేత్.
పిమ్మట, పూర్వము సంస్కరింపబడిన, తనలో నున్న లింగశరీరమును దానిమీదికి సంక్రమింపచేయవలెను. అది క్రమముగా విభక్త మైన ఇంద్రియముఖ ఆవ్యవస్థితీ కులదై వృద్ధిపొండ నట్లు చింతించవలెను.
తతోణ్డమబ్దమేకం తు స్థిత్వా విశకలీకృతమ్ ।
ద్యావాపృథివ్యా శకలే తయోర్మధ్యే ప్రజాపతిమ్,
జాతం ధ్యాత్వా పునః ప్రేక్ష్య ప్రణవేన తు తం శిశుమ్ ।
మనాత్మకతనుం కృత్వా యథాన్యాసం పురోదితమ్.
విష్ణుహ స్తం తతో మూర్ని దత్త్వా ధ్యాత్వా తు వైష్ణవమ్ ।
ఏవమేకం బహూన్వాపి జపిత్వా ధ్యానయోగతః.
కరౌ సంగృహ్య మూలేన నేత్రే బద్ధ్వా తు వాససా ।
నేత్ర మ శ్రేణ మ శ్రీ తాన్ సద శేనాహతేన తు.
కృతపూజో గురుః సమ్యద్దేవదేవస్య తత్త్వవాన్ ।
శిష్యాన్ పుష్పాజ్ఞవిభృతః ప్రాజ్ము ఖానుపవేశ యేత్.
పిమ్మట ఆండము ఒక సంవత్సరముపాటు ఉండి బద్దలై నట్లును అ ముక్కలు ద్యులోక పృథివీలోకము లేనట్లును, వాటి మధ్య ప్రజాపతి జనించి నట్లును ధ్యానించవలెను. మరల చూచి, ఆ శిశువును ప్రణవముచే, పూర్వము చెప్పినట్లుగా న్యాసములు చేసి మంత్రాత్మక మగు శరీరము కలవానినిగా చేయవలెను. పిమ్మట శిరస్సు పై విష్ణుహ స్తము నుంచి, వైష్ణవమంత్రమును ధ్యానించవలెను. ఈ విధముగా - ధ్యానయోగముతో ఒకటి గాని, అనేకము గాని జపించి, హస్తములను మొదళ్ళయందు పట్టుకొని, మాంత్రికుడు నేత్రమంత్రము చదువుచు అంచుతో (జాలుతో) కూడిన చినగని వస్త్రముచే ఆ శిష్యుల నేత్రములు బంధించవలెను. తత్త్వము నెరిగిన గురువు బాగుగా దేవదేవుని పూజించి, దోసిళ్లలో పుష్పములు ధరించి యున్న ఆ శిష్యులను పూర్వాభిముఖులనుగా కూర్చుండ బెట్టవలెను.
ఆర్చయేయుశ్చ తే పేలవం ప్రసూతా గురుణా హరిమ్।
క్షిప్త్వా పుష్పాజ్జిలిం తత్ర పుష్పాదిభిరన న్తరమ్.
వాసుదేవార్చనం కృత్వా గురోః పాదార్చనం తతః।
విధాయ దక్షిణాం దద్యాత్సర్వస్వం చార్దమేవ వా.
ఆ శిష్యులు కూడ గుర్వనుజ్ఞ పొంది ఆచట పుష్పాంజలిని చల్లి పోరిని పూజింపవలెను. పిమ్మట పుష్పాదులతో వాసుదేవార్చనము చేసి, తరువాత గురుపాదార్చడము చేసి సర్వస్వమును గాని, దానిలో సగము గాని గురుదక్షిణగా ఇవ్వవలెను.
గురుః సంశిక్షయేచ్ఛిష్యాం క్రౌః పూజ్యో నామభిర్హరిః ।
విష్వక్సేనం యజేదీశం శజ్ఖచక్రగదాధరమ్
తర్జయ స్తం చ తర్జన్యా మణ్డలస్థం విసర్జయేత్
విష్ణునిర్మాల్యమఖిలం విష్వక్సేనాయ చార్పయేత్,
గురువు శిష్యులకు బోధించవలేను వారు నామములతో హరిని పూజించవలెను. శంఖచక్రగదాధారియై,తర్జనితో జళిపించుచున్న ప్రభువైన విష్వక్సేనుని పూజించి మండలమునందున్న హరికి ఉద్వాసన చెప్పవలెను. విష్ణునిర్మాల్యము నంతను విష్వక్సేనునకు సమర్పింపవలేను.
ప్రణీతాభి స్తథాత్మానమభిషిద్య చ కుణ్డగమ్.
వహ్ని మాత్మని సంయోజ్య విష్వక్సేనం విసర్జయేత్ ।
బుభువుః సర్వమాప్నోతి ముముక్షుర్లీయతే హరౌ.
ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే కుణ్డనిర్మాణాద్యగ్ని కార్యాదిక థనం నామ చతుర్వింశోధ్యాయః.
ప్రణీతలతో తన పై జలము చల్లుకొని, కుండములో నున్న ఆగ్నిని తనలో చేర్చికొని విష్వక్సేనుని విసర్జన చేయవలెను. ఈ విధముగ చేసినచో భోగములు అనుభవింప కోరిక గలవాడు సకలభోగములను పొందును. మోక్షేచ్చగల వాడు హరియందు లీను డగును.
ఆగ్ని మహాపురాణములో కుండ నిర్మాణాగ్ని కార్యాది కథన రూప మగు ఇరువదినాల్గవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 24 of the Agni Purāṇa is as follows:
This chapter details the Pradoṣa Vrata — a fortnight observance performed on the trayodaśī (thirteenth lunar day) in both bright and dark fortnights, dedicated to Bhagavān Śiva. The observance is especially meritorious at the twilight hour (pradoṣa kāla) when, according to the Purāṇa, Śiva performs his cosmic dance and all the gods, sages, and celestial musicians gather to witness it. The worshipper's preparation — fasting, bathing, application of bhasma — and the pūjā sequence with bilva leaves, white flowers, and milk are prescribed. Specific mantras including the Mahāmṛtyuñjaya and Śivāṣṭaka are to be recited. The chapter narrates how the observance of Pradoṣa grants long life, removal of sins, fulfillment of desires, and ultimately Śivaloka.