అగ్ని మహా పురాణము

247 - అథ వాస్తులక్షణమ్

అగ్నిరువాచః

వాస్తులక్ష్మ ప్రవక్ష్యామి విప్రాదీనాం చ భూరిహ

శ్వేతా రక్తా తథా పీతా కృష్ణా చైవ యథాక్రమమ్.

ఘృత రక్తాన్న మద్యానాం గంధాఢ్యా వసతశ్చ భూః

మధురాచ కషాయాచ అమ్లాద్యుపరసాక్రమాత్.

కుశైః శరైస్తథా కాశైర్దూగ్వాభిర్యాచ సంశ్రితా

ప్రార్చ్య విప్రాంశ్చ నిఃశల్యాం బాతపూర్వంతు కల్పయేత్.

చతుష్టష్టిపదం కృత్వామధ్యే బ్రహ్మా చతుష్పదః

ప్రాక్తేషాం వై గృహస్వామీ కథితస్తు తథార్యమా.

దక్షిణేన వివస్వాంశ్చ మిత్రః పశ్చిమతస్తథా

ఉదజ్ మహీధరశ్చైవ ఆపవత్సౌచ వహ్నిగే.

సావిత్రశ్చైవ సవితా జయేన్ద్రౌనైరృతేఽబుధౌ

రుద్రవ్యాధీచ వాయవ్యే పూర్వాదౌ కోణగాద్బహిః.

మహేన్ద్రశ్చ రవిః సత్యో భృశః పూర్వేఽథ దక్షిణే

గృహక్షతోఽత్యమధృతీ గందర్వాశ్చాథ వారుణే.

పుష్పదంతోఽసురాశ్చైవ వరుణో యక్ష్మ ఏవచ

సౌమ్యే భల్లాట సోమౌ చాప్యదితిర్ధనద స్తథా.

నాగః కరగృహశ్చైశ్యాం హ్యష్టౌ దిశిదిశి స్మృతాః

ఆద్యన్తౌతు తయోర్దేవౌ ప్రోక్తావ త గుహేశ్వరౌ.

పర్జన్యః ప్రథమో దేవో ద్వితీయశ్చ కరగ్రహః

మహేంద్ర రవిసత్యాశ్చ భృశోఽథ గగనం తథా.

పవనః పూర్వతశ్చైవ అంతరిక్ష ధనేశ్వరౌ

ఆగ్నేయే చాథ నైరృత్యే మృగసుగ్రీవకౌ సురౌ.

రోగో ముఖ్యశ్చ వాయవ్యే దక్షిణే పుష్ప విత్తదౌ

గృహక్షతో యమభృశౌ గంధర్వో నాగపైతృకః.

ఆప్యే దౌవారిక సుగ్రీవౌ పుష్పదన్తోఽసురో జలమ్

యక్ష్మా రోగశ్చ శోషశ్చ హ్యుత్తరే నాగరాజకః.

ముఖ్యో భల్లాట శశినౌ హ్యదితిశ్చ కుబేరకః

నాగో హుతాశః శ్రేష్ఠో వై శక్రసూర్యౌచ వూర్వతః.

దక్షే గృహక్షతః పుష్ప ఆప్యే సుగ్రీవ ఉత్తమః

పుష్పదంతో హ్యుదగ్ద్వారి భల్లాటః పుష్పదంతకః.

అగ్ని దేవుడు పలికెను : ఇపుడు వాస్తులక్షణములు చెప్పెదను. వాస్తుశాస్త్రము ప్రకారము, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులకు, వరుసగా శ్వేత - రక్త - పీత - కృష్ణవర్ణములుగల భూమి నివాసయోగ్యము, ఘృతగంధముగల భూమి వీపులకును, రక్తగంధముకల క్షత్రియులకును, అన్న గంధముగలది వైశ్యుంకును, మద్యగంధముగలది శూద్రులకును నివాసయోగ్యము. ఇట్లే బ్రాహ్మణాదులకు వరుసగా మధుర - కషాయ - ఆమ్లాదిరసములు గల భూమి మంచిది. నాలుగువర్ణముల వారికిని వరుసగా కుశ - సర్పట - కాశ - దూర్వాయుక్తమగు భూమిమంచిది. ముందుగా బ్రాహ్మణ పూజ చేసి శల్యరహితమగు భూమి పై కుండ మేర్పరుపవలెను. పిదప అరువది పదములు గల వాస్తు మండపము నిర్మించి దాని మధ్యనున్న నాలుగు పదములపై బ్రహ్మను స్థాపించవలెను. ఈ నాలుగు పదములకు తూర్పున నున్న గృహస్వామి ఆర్యమ. దక్షిణమున వివస్వంతుని, పశ్చిమమున మిత్రుని, ఉత్తరమున మహీధరుని చిహ్ని తము చేయవలెను. ఈశాన్యమున ఆప - ఆపవతులను, ఆగ్నేయమున సావిత్ర - సవితలను, పశ్చిమమునకు దగ్గరగా ఉన్న నైరృతియందు జయ - ఇంద్రులను, వాయవ్యమున రుద్రవ్యాధులను వ్రాయవలెను. పూర్వాది దిశలందు, విదిక్కు లందున్న దేవతలు కాక, ఈ క్రింది జేవతలను వ్రాయవలెను - పూర్వమున మహేంద్ర - రవి - సత్య - భృశాదులను, దక్షిణమున గృహక్షత - యమ - భృంగ - గంధర్వాదులను, పశ్చిమమున పుష్పదంత - అసుర - వరుణ - పాపయక్ష్మా దులను, ఉత్తరమాన భల్లాట - సోమ - అదితి - ధనదులను, ఈ శాన్యమున నాగ - కరగ్రహములను చిత్రించవలెను. ఒక్కొక్క దిక్కునకు ఎనమండుగురు దేవతలుందురు. వారిలో ప్రథమ - అష్టమదేవతలు వాస్తు మండల గృహస్వాములు. పూర్వ దిక్కునకు ప్రథమదేవత పర్జన్యుడు, రెండవవాడు కరగ్రహుడు మహేంద్ర - రవి - సత్య - భృక-గగన - పవ నులు ఇతర దేవతలు. కొందరు ఆగ్నేయమునందు గగన - పవనులకు బదులు అంతరిక్ష - ఆగ్నులను చెప్పుదురు. నైరృ తియందు మృగ - సుగ్రీవులను, వాయవ్యమున రోగ - ముఖ్యులను, దక్షణమున పూషణ్ - వితథ - గృహక్షత - యము - భృంగ - గంధర్వ - మృగ - పితరులను స్థాపించవలెను. వాస్తుమండలము పశ్చిమమున దౌవారిక - సుగ్రీవ - పుష్పదంత - అసుర - వరుణ - పాపయక్ష్మన్ - శేషుబు ఉందురు. ఉత్తరమన సొగరాజ - ముఖ్య - భల్లాట - సోమ - ఆదితి - కుబేర - నాగ - అగ్నులు ఉండరు. తూర్పున సూర్య - ఇంద్రులు శ్రేష్టులు. దక్షిణమున గృహ క్షత - పుష్పమయులు త్తములు. పశ్చిమమున సుగ్రీవుడు ఉత్తముడు. ఉత్తర ద్వారమున పుష్పదంతుడు కల్యాణ ప్రదుడు, భల్లాటకునే పుష్పదంతుడందురు.

శిలేష్టకాది విన్యాసం మంత్రైః ప్రార్చ్య సురాంశ్చరేత్

నన్దేనందయ వాసిష్ఠే వసుభిః ప్రజయాసహ.

జయే భార్గవ దాయాదే ప్రజానాం జయమావహ

పూర్ణేఽగిరస దాయాదే పూర్ణకామం కురుష్వమామ్.

భద్రే కాశ్యప దాయాదే కురు భద్రాం మతం మమ

సర్వబీజ సమాయుక్తే సర్వరత్నౌష ధైర్యృతే.

రుచిరేనన్దనే నన్దే వాసిష్ఠే రమ్యతామిహ

ప్రజాపతిసుతే దేవి చతురస్రే మహిమయే.

సుభగే సువ్రతే భద్రే గృహే కాశ్యపి రమ్యతామ్

పూజితే పరమా చార్యైర్గంధమాల్యైరలంకృతే.

భవభూతికరే దేవి గృహే భార్గవి రమ్యతామ్

అవ్యంగే చాక్షతే పూర్ణేమునే రంగిరసఃసుతే.

ఇష్టకేత్వం ప్రయచ్ఛేష్టం ప్రతిష్ఠాంకారయామ్యహమ్

దేశస్వామి పురస్వామి గృహస్వామి పరిగ్రహే.

మనుష్యధన హస్త్యశ్వపశు వృద్ధి కరీభవ

ఈ వాస్తు దేవతలనందరిని మంత్రములతో పూజించి పునాదిరాయి వేయవలెను. పిదప ఈ క్రింది మంత్రములతో నందాది దేవులను పూజించవలెను. “వసిష్ఠనందినియైన ఓనందా! నన్ను ధన - పుత్ర - పౌత్రాదిమంతుని చేసి ఆనం దింపచేయుము. భార్గవపుత్రియైన జయా! నీ సంతానమైన మాకు విజయము నిమ్మ. ఆంగిరస తనయయైన ఓ పూర్ణా! నీ కోరికలను పూర్ణము చేయుము. కశ్యపాత్మ జయైన ఓ భద్రా! నాకు మంగళప్రదమగు బుద్ధినిమ్ము. వసిష్ఠ వుత్రియైన నందా! వివిధ బీజయుక్తము, సక లరత్న సంపన్నము ఆగు ఈ మనోహర నందనవనమున విహరింపుము. ప్రజాపతిపుత్రీ! భద్రా! నీవు ఉత్తమమైన లక్షణములు, శ్రీకృష్ణ వ్రతము కలదానవు. ఓ కశ్యపనందనీ! నీవీ భూరూపమగు చతుష్కోణము నందు నివసింపుము. భార్గవతన యా! దేవీ! నీవు సకలప్రపంచమునకును ఐశ్వర్యమిచ్చు దానవు. శ్రేష్ఠులైన ఆచార్యులచే పూజితురాలవై, గంధమాల్యాలంకృతురాలవై నా గృహమునందు నివసింపుము. అంగిరః పుత్రియైన ఓ పూర్ణా! నీవు కూడ సర్వాం సంపన్నురాలవై, క్షతిరహితవై నా యింట విహరింపుము. ఓ ఇష్టకా! నేను గృహప్రతిష్ఠ చేయుచున్నాను. నాకు అభిలషిత భోగముల నిమ్ము. దేశస్వామి-నగరస్వామి-గృహస్వాములకు మనుష్య-ధన-గజ-ఆశ్వ-పశ్వాదులను వృద్ధి పొందింపుము”.

గృహప్రవేశేఽపి తథా శిలాన్యాసం సమాచరేత్.

ఉత్తరేణ శుభః ప్లక్షో వటః ప్రాక్స్యాద్గృహాదితః

ఉదుమ్భరశ్చ యామ్యేన పశ్చిమేఽశ్వత్థ ఉత్తమః.

వామభాగే తథోద్యాసం కుర్యాద్వాసం గృహే శుభమ్

సాయంప్రాతస్తు ఘర్మాప్తౌ శీతకాలే దినాంతరే.

వర్షారాత్రే భువః శోషే సేక్తవ్యా రోపిత ద్రుమాః

విడంగఘృత సంయుక్తాన్సేచయేచ్ఛీతవారిణా.

ఫలనాశేకులత్థైశ్చ మాషైర్ముద్గైస్తిలైర్యవైః

మృతశీతపయః సేకః ఫల పుష్పాయ సర్వదా.

మత్స్యామ్బసా తుసేకేన వృద్ధిర్భపతి శాఖినః

ఆవికాజశకృచ్చూర్ణం యవచూర్ణం తిలానిచ.

గోమాంస ముదకం చేతి సప్తరాత్రం నిరాపయేత్

ఉత్సేకం సర్వవృక్షాణాం ఫలపుష్పాది వృద్ధిదమ్.

మత్స్యోదకేన శీతేన హ్యామ్రాణాంసేక ఇష్యతే

ప్రశస్తం చాప్యశోకానాం కామినీ పాదతాడనమ్.

ఖర్జ్టుర నారి కేలాదెర్లవణాద్భిర్వివర్ధనమ్

విడంగ మత్స్యమాంసాద్భిః సర్వేషాం దోహదం శుభమ్.

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే వాస్త్వాది లక్షణం నామ సప్త చత్వారింశ దధిక ద్విశతతమోఽధ్యాయః.

గృహప్రవేశ సమయమునందుగూడ ఈ విధముగనే శిలాన్యాసము చేయవలెను. ఇంటికి ఉత్తరమున రావిచెట్టు, దక్షిణమున ఉదుంబరము, పశ్చిమమున మట్టిచెట్టు మంచిది. ఇంటికి ఎడమప్రక్కన ఉద్యానము నిర్మింపవలెను. ఇట్టి ఇంటికో నివాసము శుభకరము. పాతిన చెట్లకు, గ్రీష్మ ముందు ప్రాతః సాయంకాఁ:ములందును, శీతకాలమున మధ్యాహ్నమునందును, వర్షాకాలమున నేల ఎండిపోయిన పుకును నీళ్ళు పోయవలెను. చెట్లకు వాయువిడంగము, నెయ్యి కలిపిన చల్లని నీళ్ళు పోయవలెను. కాయుట మానివేసిన చెట్లకు ఉలవలు, మినుములు, పెసలు, తిలలు, యవలు కలిపిన నీళ్లు పోయవలెను. ఘృతముకి కలిపిన శీతల జలము పోసినచో వృక్షము సర్వదా పుష్పఫలములతో నిండియుండును. మత్స్యములు కలిపిన నీళ్లుపోసిన చెట్లు బాగుగా పెరుగును. మేకల గొర్రెల లద్దెల చూర్ణము, యవలపిండి, తిలలు, ఇతరమైన గోమయము మొదలగు ఎరుపులు, నీరు వీటిననన్నింటిని కలిపి ఐదురోజులు కప్పి ఉంచవలెను. ఇది పోసినచో అన్ని వృక్షములను ఫలపుష్పములు అధికముగా వృద్ధి చెందును. మామిడి చెట్లకు కితటీల సేచనము చాలమంచిది. అశోక వృక్షములు వికసించుటకు కామినీ పాద పహారము మంచిది. ఖర్జూరము, కొబ్బరి మొదలగునవి ఉప్పుకలిపిన నీటిలో బాగుగా పెరుగును. వాయువిడంగము కలిపిన నీళ్లు అన్ని చెట్లకును మంచి దోహదము.

ఆగ్ని మహాపురాణమునందు వాస్తులక్షణకథనమను రెండువందల నలుబదియేడవ అధ్యాయము సమాప్తము.