అగ్ని మహా పురాణము

107 - అథ స్వాయమ్భువసర్గకథనమ్.

ఆగ్ని రువాచః-

వక్ష్యే భువనకోశం చ పృథ్వీద్విపాది లక్షణమ్

అగ్నీధ్రశ్ఛాగ్నిబాహుళ్ళ వపుష్మాన్ ద్యుతిమాం స్తథా.

మేధా మేధాతిథిర్భవ్యః సదనః పుత్ర ఏవ చ

జ్యోతిష్మాన్ దశమ స్తేషాం సత్యనామా సుతోభవత్.

ప్రియవ్రతసుతాః ఖ్యాతాః సప్తద్వీపాన్దదౌ పితా

జమ్బూద్వీపమఠాగ్నీధ్ర ప్లక్షం మేధాతిథేర్ట దౌ.

వపుష్మతే శాల్మలం చ జ్యోతిష్మతే కుకాహ్వయమ్

క్రౌజ్చద్వీపం ద్యుతిమతే శాకం భవ్యాయ దత్తవాన్.

పుష్కరం, సవనాయాదాదగ్నీధ్రదాత్సుతే శతమ్

జమ్బూద్వీపం పితా లక్షం నాభేర్దత్తం హిమాహ్వయమ్.

హేమకూటం కింపురు షే హరివర్షాయ నైషధమ్

ఇలావృతే మేరుమధ్యం రమ్యే నీలాచలాశ్రయమ్.

ఈ హిరణ్వతే శ్వేతవర్షం కురూంస్తు కురవే దదౌ

భద్రాశ్వాయ చ భద్రాళ్వం కేతుమాలాయ పశ్చిమమ్.

మేరోః ప్రియవ్రతః పుత్రానభిషిద్య యయా వనమ్

శాలగ్రామే తప సప్త్వా యయా విష్ణోగ్రయం నృప.

యాని కింపురుషాద్యాని హ్యష్ట వర్షాణి సత్తమ

తేషాం స్వాభావికి సిద్ధిః సుఖప్రాయా ప్యాయత్నత.

జరామృత్యుడయం నాస్తి ధర్మాధర్మౌ యుగాదికమ్

నాధమం మధ్యమం తుల్యా హిమాద్దేశాత్తు.

నాభిత ఋషలో మేరడం చ ఋషభాదృరతోభవత్

ఋషలో దత్తపుత్ర శాలగ్రామే హరిం గత.

భరతాద్భారతం వర్షం భరతాత్సుమతి స్వభూత్

భరతో దత్తలక్ష్మీకః శాలగ్రామే హరిం గతః.

యోగీ యోగప్రస్తావే వత్యే తచ్చరితం పునః

సుమతే స్తేజస స్తస్మా దిౄద్యుమ్నో వ్యజాయత.

పరమేష్టి తత స్తస్మాత్ర్పతీహార సదన్వయః

ప్రతీహారాత్రృతిహర్తాప్రతిహత్తుర్భువ స్తతః.

ఉద్గీథోథ చ ప్రస్తారో, విభుః ప్రస్తారతః సుతః

పృథుశ్చైవ తతో నర్తో నక్తస్యాపి గయః సుత.

నరో గయస్య తనయ స్తత్పుతో భూద్విరాట్ తతః

తస్య పుత్రో మహావీర్యో ధీమాం స్తస్మాదజాయత.

మహా నస్తత్సుతశ్చాధూన్మ స్య స్తస్య చాత్మజః

త్వష్టా త్వష్టుశ్చ విరజారజ స్తస్యాప్యభూత్సుతః.

సత్యజిద్రజన స్తస్య జజ్ఞే పుత్రకతం మునే

విశ్వజ్యోతి ప్రధానాస్తే భారతం తైర్వివర్ణితమ్.

కృతత్రేతాదిసర్గేణ సర్గః స్వాయమ్భువః స్మృత.

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే స్వాయమ్భువసర్గో నామ సప్తాధిక శతతమోధ్యాయః.

అగ్ని దేవుడు పలికెను. వసిష్ణా! ఇప్పుడు నేను భువనకోశము, పృథివి, ద్వీపములు మొదలగు వాటిని గూర్చి చెప్పెదను. ప్రియవ్రతునకు అగ్ని ర్ర - అగ్ని దాహు - వవుష్మత్ - ద్యుతిమత్ - మేధా - మేధాతిథి - భవ్య - సవనయులను పుత్రులుండిరి. వదవకుమారుడైన జ్యోతిష్మంతుడు యథార్థనామధేయము కలవాడు. ప్రియవ్రతుని కుమారులంద రును - జగద్విఖ్యాతులు. తండ్రి వారికి సప్త ద్వీపము నిచ్చెను. ఆగ్నీధ్రునకు జంబూద్వీపము, మేధాతిథికి ప్లస్ ద్వీపము, వపుష్మంతునకు. లలిద్వీపము, జ్యోతిష్మంతువకు కుశద్వీపము, ద్యుతిమంతునకు క్రౌంచద్వీపమ భవనకు శాక ద్వీపము, సరసునకు పుష్కరద్వీపము ఇచ్చేను. ఆర్నీ ధ్రుడు - లక్షల కొలది యోజనముల విస్తీర్ణము గల జంబూ ద్వీపము తన కుమారులకు ఈ విధముగ విభజించి యిచ్చెను. నాభికి హిమవర్షమును (నేటి భారతవర్ణమును), కింపురువు నకు హేమకూట వర్షమ, హరివర్పునకు నైషధ వర్షము, ఇలావృతులకు మధ్యభాగమున మేరుపర్వతముతో గూడిన ఇలా వృతవర్షమును రమ్యకునకు నీలాచలాక్రితమగు రమ్యకవర్షమును, హిరణ్యవంతునకు శ్వేతవర్షమును, గురువుకు ఉత్తరకురు వర్షమును ఇచ్చెను. భద్రాళ్వునకు భద్రాశ్వవర్షమును, కేతుమయునకు మేరుపర్వతమునకు పశ్చిమముగా నున్న కేతుమాల వర్షమును ఇచ్చెను. ఈ విధముగ తన పుత్రులను ఆయా వర్షములకు అధిపతులుగ చేసి ప్రియవ్రతును వానప్రస్థుడే సాల గ్రామ క్షేత్రమునంద తపస్సు చేసి విష్ణులోకమును పొందెను. ఓ మునిశ్రీష్టా! కింపురుషాదివర్షము లెనిమిదింటియందును సుము అధికము.ఆప్రయత్నముగనే భోగము లన్నియు లభించును. అచట జరామృత్యుభయము గాని. ధర్మాధర్మములు గాని, ఉత్తమ - మధ్యమ - ఆధమాది భేదములుగాని లేవు. అచట యుగ పరివర్తనము కూడ ఉండదు. హిమవర్షాధిపతి యగు నాభికి, మేరుదేవియందు ఋషభదేవుడు పుత్రుడుగా జనించేను. ఋషభుని కుమారుడు భరతుడు. ఋషభదేవుడు భరతునకు రాజ్యలక్ష్మిని ఇచ్చివేసి, శాలగ్రామమేతమున శ్రీహరిని శరణుజొచ్చెను. ఈ భరతుని పేరుతో భరతవర్షము ప్రసిద్ధమైనది. భరతునకు సుమతి యను కుమారుడు జనించెను. ఆతనికి రాజ్యభారము సమర్పించి భరతుడు శాలగ్రామ తేత్రమునందు శ్రీహరిని శరణు జొచ్చెను. ఆ యోగిరాజు యోగాభ్యాసతత్పరుడై ప్రాణములను పరిత్యజించేను. ఈతని ఆ చరిత్రమును నీకు మరల చెప్పెదన. పిదప సుమతి వీర్యమువలన ఇంద్రద్యుమ్నుడు జనించేను. 'ఆతనికి పరమే ఎయు ఇతనికి ప్రతీహారుడును, ఆతనికి ప్రతిహర్తయు. ఆతనికి భవుడు, భవునకు ఉద్దీథుడు, ఆతనికి ప్రస్తారుడు, అతనికి విభుడు, ఆతనికి పృథువు, ఆతనికి నక్తుడు, ఆతనికి గయుడు, గయునకు నరుడు నరునకు విరాట్టు ఆతనికి మహా వీర్యుడు, ఆతనికి శ్రీమంతుడు, అతనికి మహాంతుడు, ఆతనికి మనస్కుడు, ఆతనికి త్వక్ష, ఆతనికి విరజుడు అతనికి రజుడు, జన్మించిరి. మహాము! రజునిపుత్రుడైన శతజిత్తుకు నూరుగురు పుత్రులు జనించింది. వారిలో విశ్వజ్యోతి ముఖ్యుడు. వానివలన భారతవర్షము అభివృద్ధి చెందెను. కృతవ్రేతాది క్రమమున ఇది స్వాయం భువమను వంక ముగా చెప్ప బడినది.

అగ్ని మహాపురాణమునందు స్వాయంభువసర్గమను నూటఏడవ అధ్యాయము సమాప్తము.