అగ్ని మహా పురాణము

283 - అథ నానారోగ హరాణ్యౌషధాని

ధన్వన్తరి రువాచః

సింహీశటీ నిశాయుగ్మం వత్సకం క్వాథ సేవనమ్

శిశోః సర్వాతిసారేషు స్తన్య దో షేషుశ స్యతే.

శృంగీం సకృష్ణాతి విషాం చూర్ణితాం మధురాలి హేత్

ఏకాచాతి విషాకాసచ్ఛర్ధిజ్వరహరీశిశోః.

బాలైః  సేవ్యా వచాసాజ్యా సుదుగ్ధావాథ తైలయుక్

 యష్టికాం శంఖపుష్పింవా బాలః క్షీరాన్వితాం పిబేత్.

వాగ్రూప సంపద్యుక్తాయు ర్మేధా శ్రీర్వర్ధతే శిశోః

వచాహ్యగ్ని శిఖా వాసాశుంఠీ కృష్ణానిశాగదమ్.

సయష్టి సైంధవం బాబః ప్రాతర్మేధాకరం పిబేత్

దేవదారు మహాశిగ్రు ఫలత్రయ పయోము చామ్.

క్వాథః సకృష్ణామృద్వీకా కల్కః సర్వాన్కృమీన్హ రేత్

త్రిఫలాభృంగ విశ్వానాం ర సేషు మధు సర్పిషోః.

మేషీక్షీ రేచ గోమూత్రే సిక్తం రోగే హితంశిశోః

నాసార క్తహరో నస్యాద్దూర్వారస ఇహో త్తమః.

లశునార్ద్రకశి గ్రూణాం రసః కర్ణస్య పూరణమ్

తైలమార్ద్రక జాత్యం వా శూలహా చౌష్ఠ రోగనుత్.

జాతీపత్రం ఫలం వ్యోషం కవలం మూత్రకం నిశా

దుగ్ధా క్వాథేఽభయాక ల్కే సిద్ధం తైలం ద్విజార్తినుత్.

ధాన్యాంబు నారి కేలం గో మూత్రం క్రముక విశ్వయుక్

 క్వాథితం కవలం కార్యం జిహ్వావ్యాధి ప్రశాంతయే.

సాధితంలాంగలీ కల్కే తైలం నిర్గుండి కార సైః

గండమాలా గలగండౌ నాశ యేన్న స్య కర్మణా.

పల్లవై రర్క పూతీక స్ను హీరుగ్ఘాత జాతి కైః

ఉద్వర్తయేత్స గోమూత్రైః సర్వత్వగ్ధోషనాశనైః .

వాకుచీసతిలా భుక్త వత్సరాత్కుష్ఠనాశినీ

పథ్యా భల్లాతకీ తైల గుడ పిండీతు కుష్ఠజిత్.

యూథికా వహ్నిరజనీ త్రిఫలా వ్యోష చూర్ణయుక్

తక్రం గుదాం కురే పేయం భక్ష్యావా సగుడాఽభయా.

ఫలదార్వీ విషాణాంతుక్వాథౌ దాత్రీరసోఽథవా

పాత వ్యో రజనీకల్క! క్షౌద్రాక్షౌద్ర ప్రమేహిణా.

వాసాగర్భోవ్యాధి ఘాతక్వాథ ఏరండ తై లయుక్

వాతశోణి త హృత్పానా త్పిప్పలీస్యాత్ప్లీహా హరీ.  

ధన్వంతరి చెప్పెను. సింహి, శటి రెండు విధముల పసుపు వత్సకము వీటి క్వాథము శిశువునకు కలుసు ఆన్ని అతిసారములను స్తన్యదోషములను తొలగించును శృంగి, కృష్ణ, ఆతివిష, వీటి చూర్ణమును తేనెతో నాకించవలెను. లేదా ఒక్క అతివిషనే నాకించవలెను. దీనినే శిశువుల దగ్గువమనము, జ్వరము, నశించును. పిల్లలకు దుగ్ధ ముతో ఘృతము లేదా తైలముతో వచఇవ్వవలెను. లేదా యష్టికను గాని, శంఖపుష్పిని గాని, పాలతో త్రాగించవలెను, ఆట్లు చేయుటచే వారి వాక్శక్తిరూప సంపత్తి ఆయువు బుద్ధి కాంతి వృద్ధిచెందును. వచ ఆగ్ని శిఖ వాస్తా శుంఠి పిప్పలి, పసుపు కూటము, యష్టిక, సైంధవము వీటి చూర్ణము ప్రాతః కాలమున బాలకులకు ఇచ్చినచో మేధావృద్ధి కలుగును. దేవదారు. మహాశిగ్రు త్రిఫలా, పయోముక్కుల క్వాథముగాని, కృష్ణ, మృద్విక లతో చేసిన కలముగానీ, సర్వకృమి రోగము లను అపహరించును. త్రిఫల, భృంగరాజ విశ్వముల రసములందును మధు ఘృతములందును, మేషీ క్షీరమునందు కాని, గోమూత్రము నందుకాని తడిపినచో శిశురోగ ములను తొలగించును. దూర్వార సమును నశ్యముగా ఇచ్చినచో వాసా రక్తము శాంతించును. లడకము (తెల్లఉల్లి) ఆర్ద్రకము, శిగ్రు, వీరి రసమును చెవిలో పోసనను, అల్లము రసముకాని, తైలముగాని పోసినను చెవిపోటును ఓష్ఠ రోగములను నశించును - జాతి పత్రము. త్రిఫల, వ్యోషము గోమూత్రము, పసుపు, గోదుగ్ధము, ఆ భయాకల్కము, తైలము, వీటిని కబలించుటచే దంత బాధ తొలగును. ధాన్యము నారికేళ జలము, గోమూత్రము. పోన్ శొంఠి వీటి క్వాథమును నోటిలో వుంచుకొన్నచో జిహ్వా వ్యాధితోలగును. లాంగలీ కలమునందు నిర్గుండి రసముతో సాధించిన తైలము ఆగండమాల గల గండ దోషములను నశింపచేయును. ఆర్క పూతిక స్ను హీ, రుగ్ఘాత, జాతిక పత్రములమ గోమూత్రముతో నూరి ఒంటికి రాసినచో చర్మరోగము లన్నియు నంచును. వకుచిని తిలలలో ఒక సంవత్సరము తిన్న చో కుష్ఠరోగసంను నశించును. పథ్య భల్లాతకీ గుడము, తైలము, పిండ ఖర్జూరము ఇప్ కుష్టరోగ నాశకములు, యూథిక, చిత్రకము పసుపు, త్రిఫల, వ్యోషముల చూర్ణమును తక్రముతో త్రాగినను గుడముతో ఉసిరికాయ తిన్నను హర్షరోగము నశించును, ప్రమేయరోగము కలవాడు త్రిఫల, దారి విషముల క్వొథమును గాని, ఉసిరికాయ రసమును, పసుపు కలము, తేనె వీటితో కల్పిగానీ సేవించవలెను. వాసాగర్భమును వ్యాధి ఘాత క్వాథమునందు ఆముదము కలిపి త్రాగినచో వాతశోణిత రోగము తగ్గును పిప్పలి ప్లీహరోగమును తొలగించును.

సేవ్యా జఠరిణా కృష్ణాస్రుక్షీర బహు భావితా

పయోవా రచ్యదంత్యాగ్ని విడంగవ్యోష కల్కయుక్.

గ్రంథికోగ్రా భయాకృష్ణా విడంగాక్తా ఘృతేస్థితా

మాసం తక్రం గ్రహణ్యర్శః పాండుగుల్మ కృమీన్హరేత్.

ఫలత్రయామృతా వాసా తిక్త భూనింబజ స్తథా

క్వాథః సమాక్షి కో హన్యా త్పాండురోగం సకామలమ్.

రక్తపిత్తీ పిబేద్వాసా సుర సం సనీతం మధు

 వరీ ద్రాక్షా బలాశుంఠీ సాధితం వాపయః పృథక్.

వరీ విదారీ పథ్యాచ బలాత్రయం సవాసకమ్

శ్వ దంష్ట్రా మధుసర్పిర్బ్యామాలి హేత్క్ష్ణత రోగవాన్.

 పథ్యాశిగ్రు కరంజార్క త్వక్సారం మధుసింధుమత్

సమూత్రం విద్రథిం హన్తి పరిపాకాయ తంత్రజిత్.

త్రివృతా జీవతీ దంతీ మంజిష్ఠా శర్వరీద్వయమ్

 టార్ క్షజం నింబపత్రంచ లేపః శ స్తో భగందరే.

రుగ్ఘాత రజనీలాక్షా చూర్ణాజక్షౌద్ర సంయుతా

వాసోవ ర్తిర్ర్వఱే యోజ్యాశోధినీ గతినాశినీ.

 శ్యామాయష్టి నిశాలోధ్ర పద్మ కోత్పల చందనైః

 సమరీ చైః శృతం తైలం క్షీ రేస్యాద్ర్వణ రోహణమ్.

 శ్రీ కార్పాసదలై ర్భస్మ ఫలోపల వణానిశా

తత్పిండీ స్వేదనం తామ్రే తత్తైలం స్యాత్క్షతౌషడమ్.

కుంభీపారం పయోయు క్తం వహ్ని దగ్ధం వ్రణేలి పేత్

తదేవ నాశయత్సేకాన్నా రి కేల రజోఘృతమ్.

ఉదర రోగము గలవాడు స్నుక్ క్షీరమునందు అనేక పర్యాయములందు భావన చేసిన పిప్పలి సేవించవలెను. చిత్రక విడంగ త్రికటు కలములతో సిద్ధమగు క్షీరము, అరుచి రోగమును తొలగించును గ్రంథికా, ఉగ్ర ఆథయ, కృష్ణ, విడంగములను నేతిలో కల్పం వుంచి గాని కేవలము తక్రముతో గాని, ఒక మాసము సేవించుటచే గ్రహణహర, పాండు గుక్మకోగములు క్రుమి రోగములు వశించును. త్రిఫల, అమృత, వాస, తిక్త భూనింబ, ముల క్వాథమును తేనెతో సేవించినచో పాండురోగము కామలారోగము నశించును. రక్తపిత్తము కలవాడు వాసారసమును పటిక బెల్లము తేనే కలిపి, త్రాగినను శతావరి ద్రాక్ష బరి, శుంఠిలలో సాధించిన పాలు త్రాగినను ఆరోగము నశించును. క్షయరోగి శతావరి, విదారి, పథ్య, బలాతయ, పోసక, శ్వదంష్ట్రాలను చూర్ణము చేసి తేనె, నెయ్యి కలిపినాకవలేను. పథశిగ్రు, కరంజ, అర్క, త్వక్సార మధు సైంధవములను గోమూత్రముతో కలిపి రాసినచో విద్రథిని పక్వముచేసి మాన్పుటకు మంచిది. త్రివృతా, జీవంతీ దంతీ, మంజిష్ణ ద్వివిధ శర్వరీ, తార్షజా, నింబపత్రముల లేపము భగరంద్రమునకు మంచిది. రుద్ఘాత, హరిద్ర, లావా చూర్ణములను గోమృతముతోను తేనెతోను కలిపి వస్త్రముతో వర్తి చేసి ప్రణము నందుంచినచో వ్రణమును శుద్ధముచేసి మాన్పును. శ్యామా, యష్టి హరిద్రా లోధ్ర, పద్మక, ఉత్పలం చందన మరీచములతో క్షీరములో కాచిన తైలము వ్రణములను మాన్పును, శ్రీ కార్పాసదళ భస్మ , త్రిఫల, ఉపల, నిశ లతో గోళములు చేసి అమపాత్రయందు ఉడికించి ఆతైలమును గాయమునందు వ్రాయవలేను. కుంభిసార మును నిప్పు పై మాడ్చి దానిని పాలతో కలిపి వ్రణముపై వ్రాయవలెను. లేదా కొబ్బరి చెట్టు మొదటిలోనున్న నున్న మట్టిలో మృతము కలిపి కాచినచో వ్రణము మానును.

విశ్వాజమోద సింధూత్థ చించాత్వగ్భిః సమాభయా

 తక్రేణోష్ణామ్బునావాథ పీతాతీసార నాశినీ.

వత్సకాతి విషావిశ్వ బిల్వము స్త శృతం జలమ్

సామే పురాణేఽతీ సారే సాసృక్చూలేచ పాయయేత్.

ఆంగారదగ్ధం సుగతం సింధుముష్ణాంభునా పిబేత్

 శూలవానథవా తద్ధి సింధుహింగు కణాభయా.

కటురోహోత్కణా తంకలాజ చూర్ణం మధుప్లుతమ్

 వస్త్రచ్ఛిద్రగతం వక్త్రేన్య స్తం తృష్ణాం వినాశయేత్.

పాఠాదార్వీ జాతిదలం ద్రాక్షా మూలఫలత్రయైః

 సాధీతం సమధుక్వాథం కవలం ముఖపాక హృత్.

కృష్ణాతివిషతి క్తేంద్ర దారుపాఠా పయోము చామ్

 క్వాథో మూత్రేశృతః క్షేధ్రో సర్వకంఠ గదాపహః.

 పథ్యాగోక్షుర దుఃస్పర్శ రాజవృక్ష శిలాభిదమ్

 కషాయః సమధుః పీతో మూత్రకృచ్చ్రం వ్యపోహతి.

వంశత్వగ్వరుణక్వాథః శర్కరాశ్మ విఘాతనః

శాఖోట క్వాథ సక్షౌద్ర క్షీరాశీ శ్లీపదీభవేత్.

మాసార్కత్వత్పయ యస్తైలం మధుసిక్తం చ సైంధవమ్

పాద రోగం హరేత్సర్ఫిర్జాల కుక్కుటజం తథా.

శుంఠీ సౌవర్చలో హింగు చూర్ణం శుంఠీర సైర్ఘృతమ్

రుజంహరే దథ క్వాథో విద్ది బద్ధాగ్ని సాధనమ్.

 సౌవర్చలాగ్ని , హింగూనాం సదీప్యానాం రసైర్యుతమ్

 విడదీప్యక యుక్తం వాతక్రం గుల్మా తురః పిబేత్ .

ధాత్రీ పటోలముద్గానాం క్వాథః సాజ్యో విసర్పహా

శుంఠీ దారు నవాక్షీర క్వాథోమూత్రాన్వితోఽపరః.

సవ్యోషాయోరజః, క్షారః ఫలక్వాథశ్చ శోథహృత్

 గుడశిగ్రుత్రి వృద్భిశ్చ సైంధవానాం రజోయుతః.

త్రివృతాఫలజః క్వాథః సగుడః స్యాద్విరేచనః

వచాఫల కషాయోత్థం పయోవమన కృద్బవేత్.

త్రిఫలాయాః పలశతం పృథగ్భృంగజ భావితమ్

విడంగం లోహ చూర్ణంచ దశ భాగసమన్వితమ్.

శతావరీ గుడూచ్యగ్ని పలానాం శత (పంచ) వింశతిః

మధ్వాజ్య తిల జైర్లిహ్యాద్వలీ పలితవర్జితః.

శతమబ్దం హి జీవేత సర్వరోగ వివర్జితః

 త్రిఫలా సర్వరోగఘ్నీ సమధుః శర్కరాన్వితా.

సీతామధుర్ఘృతైర్యుక్తా సకృష్ణా త్రిఫలాతథా

పథ్యా చిత్రక శుంఠ్యశ్చ గుడూచీముశలీరజః.

స గుడం భక్షితం రోగహరం త్రిశత వర్షకృత్

కించిచ్చూర్ణం జవాపుష్పం పిండితం విసృజేజ్జలే.

 తైలం భవేద్ఘృతాకారం కించిచ్చూర్ణం జలాన్వితమ్

 ధూపార్థం దృశ్యతే చిత్రం వృషదంశ జరాయునా.

పునర్మాక్షిక ధూపేన దృశ్యతే తద్యథాపురా

కర్పూర జల కాభేక తైలం పాటలిమూలయుక్.

పిష్ట్వాలిప్య పదేర్వేద చరేదం గార కెనరః

తృణౌత్థానాదికం వ్యూహ్య దర్శయన్వైక కుతూహలమ్.

విషగ్రహరుజ ద్వంస క్షుద్రనర్మ చ కామికమ్

త త్తేషట్కర్మకం ప్రోక్తం సిద్దిద్వయ సమాశ్రయమ్.

మంత్రధ్యా నౌషధి కథాముద్రేజ్యాం యత్ర మష్టయః

చతుర్వర్గ ఫలం ప్రోక్తం యః పఠేత్ సదివం వ్రజేత్ .

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే నానారోగ హరౌషధ కథనం నామ త్ర్యశీత్యధిక ద్విశతతమోఽధ్యాయః.

విశ్వ, అజమోర సైంధవ చించాత్వక్కుల సమ భాగము గల అభయతో కలిపి తక్రము గాని, ఉష్ణ జలము గాని త్రాగుటచే అతిసారము నశించును. ఇంద్రయవ, అతి విష, విశ్వము సలు వేసి, కాచిన క్యాథము ఆ సహిత మగు జీర్ణాతి సారమును శూలముతో కూడిన రక్తతిసార మును పోగొట్టును. అంగారములపై కాల్చిన సుగతమును సింధువును వేడినీళ్ళతో త్రాగవలెను. పిదప శూల బాధ కల వాడు దానిని వేడి నీళ్ళతో త్రాగ వలెను లేదా సైంధవము, ఇంగువ, పిప్పలి ఆథయ వీటితో వేడి నీళ్ళతో త్రాగి వలెను లేనెలో తడిపిన కటురోహ, కమల, ఆతంక, లాజ చూర్ణములను గుడ్డ చుట్టబెట్టి ముఖము వందుంచుకున్నచో దాహము తగ్గును. పాఠదార్వి జాతీదలములను, ద్రాక్ష, మూల త్రిఫలములతో సాధించి మధుక్వాథముతో కలిపి ముఖము నందుంచి చప్పరించినచో దాహము తగ్గును. కృష్ణ, అతి విష, తిక్త ఇంద్రదారు, పాఠ, ప యో ముక్కుల క్వాథమును గోమూత్రము నందు మరిగించి తేనె కలిపినచో స్వర కంఠ రోగములను పోగొట్టును పథ్యగోక్షుర, దుఃస్పర్శ, రాజ వృక్ష. శిలాజిత్తుల కషాయమును తెనెతో త్రాగినచో మూత్ర కృచ్చ్రము పోవును. వెదురు బెరడు వరుణ వృక్షపు బెరడుతో చేసిన క్వాథమ శర్కరన, ఆత్మరీ రోగమును నశింప చేయును స్లీపద రోగము కలవాడు శాకోటక క్వాథముమ తేనెతో కలిపి తినవలెను. మాష, ఆర్కత్వక్కులను, ఆర్కవృక్షపాలను, తైలమును, మైవమున, సైంధవమును కలిపి ఉపయో గించినచో పాద రోగములు నశించును. శాంతి సౌవర్చము, హింగు చూర్ణము వీటిని శొంఠి రసముతో కాని, నేతితో కాని, లేదా వీటి క్వాథములు కాని, మలబంధ దోషమును పోగొట్టును. గుల్మ రోగము కలవాడు, సౌవర్చల చిత్రక హింగు అజా మోదముల రసముతో కలిపి లేదా విడంగ చిత్రకములతో కలిపి తక్రసానము చేయవలెను. రాత్రి, పటోల, మగధముల క్వాథము, ఆజ్యముతో కలిపి తీసుకున్నచో విసర్ప రోగము తొలగును. శోంఠి దేవదారు, నవాక్షర క్వాథము గోమూత్రముతో కలిపి తీసుకున్న చో విసర్ఫరోగమును పొందును. వ్యోష, ఆరణ, వార శ్రీవల క్వాథమ శోధ రోగ ములు తొలగించును. గుడ శిగ్రు త్రివృత్, సైంధవల వణమాల చూర్ణముతో చేసిన క్వాథము శోధ రోగ మును తొలగించును, విశోధ త్రిఫల, గుడములతో చేసిన క్వాథము విరేచకరము. వచా, నల కషాయము నుండి తీసిన జలము వమనకారి. భృంగ రాజ రసమున ఖావితమైన త్రిఫల నూరు పలములు వాయు విడంగలోహ చూర్ణములు, పదవ భాగము కలవరి, గుడూచి, చిత్ర మూలములను ఇరువది ఐదు పలములు గ్రహించి చూర్ణము చేసి, దానిని మధు, ఘృత, జై లములతో సేవించినచో వళులు పలితములు తొలగిపోవును. అట్లు సేవించిన వాడు సకల రోగ ము కుడి నూరు సంవత్సరములు జీవించును. మధు శర్కరలు కలిపి సేవించి త్రిఫల సర్వరోగ ఎకరము. కృష్ణా సహికమగు త్రిఫలను సితా మధు మృతములతో సేవించినచో అట్టి ఫలమే యిచ్చును. పథ్య, చిత్రక, శొంఠి గుడూచి, ముసలీ చూర్ణములను గుడ ముతో భక్షించినచో రోగములను తొలగించి మూడు పందల సంవత్సరముల ఆయుర్దాయము యిచ్చును. జపా పుష్పమును కొంచెము నలిపి నీటిలో కలిపి ఆ చూర్ణ జల మును కొంచెము తైలములో కల్పినచో ఆ తైలము మృతమువలె యగును. పిల్లి మావితో ధూపము వేసినచో చిత్రము కన బడదు. మరల మైనము ధూపము వేసినచో పేనుక టీ వలెనే కనబడును. కర్పూరము, జలగ, భేక తైలము, వీటిని పాటలి మూలముతో కలిపి నూరి పాదములకు రాసుకొని మనుష్యుడు నిప్పుల మీద నడువగలడు. తృణోత్తాపనాదము చేయుచు, అశ్చర్యకరముగ నడు వగలడు. ఎషములను తొలగించుట, రోగ నాశము, గ్రహణాశము, తుచ్ఛక్రీడలు, కామ నాపరమైనవి, ఇహ లోక పర లోకము లందు సిద్ది నిచ్చు కర్మలను షట్కర్మ సహితముగ నీకు చెప్పితిని మంత్ర, ధ్యాన ఔషధ, కథా, ముద్రా, యజ్ఞములు ఈ ఆరును ఇచట పిడి కళ్ళు ధర్మార్థ కామ మోక్షములను ఇచ్చు దీనిని ఎవడు పఠించునో ఆతడు స్వర్గము నకు వెళ్ళును.

ఆగ్ని మహాపురాణమున నానారోగ హరౌషధ కథ మను రెండు వందల యేనుబది మూడవ అధ్యాయము సమాప్తము.