ఆగ్ని రువాచః
పురోనమే జయోఽభూత్ప్రా చీవాన్నామ తత్సుతః ।
ప్రాచీవతోమనస్యుస్తు తస్మాద్వీత మయోనృపః.
శుందుర్యితమయాచ్చి భూచ్ఛుంధోర్బహువిధః సుతః ।
బహువిధాచ్చ సంయాతి రహోవాదీచ తత్సుతః.
తస్యపుత్రోఽథ భద్రాశ్వో భద్రాశ్వస్య దశాత్మజాః ।
ఋక్షేయుశ్చ కృషేయుశ్చ సన్నతేయుస్తథాత్మజః.
మృతేయుశ్చ చితేయుశ్చస్థండిలేయుశ్చ సత్తమః !
ధర్మేయుః సన్నతేయుశ్చ కృతయుర్మ తినారకః.
తంసురోధః ప్రతిరథః పురస్తోమతినారజాః ।
ఆసీత్ప్రతిరథాత్కణ్వః కణ్వాన్మేధా తిథిస్త్వభూత్.
తంసురోధాచ్చ చత్వారో దుష్యంతోఽథ ప్రవీరకః ।
సుమంతశ్చానయోవీరో దుష్యంతాద్భరతోఽభవత్.
శకుంతలాయాంతు బలీయస్యనామ్నాలు భారతాః ।
సుతేషు మాతృకోపేన నష్టేషు భరతస్యచ.
తతోమరుద్బి రానీయపుత్రః సతుబృహస్పతేః ।
సంక్రామితో భరద్వాజః క్రతుభిర్వతథోఽభవత.
నచాపి వితథః పుత్రాఞ్జనయామాస పంచవై ।
సుహోత్రంచ సుహోతారం గయం గర్భంత థైవచ.
కపిలశ్చ మహాత్మానం సుకేతుంచ సుతద్వయమ్ ।
కౌశికంచ గృత్సపతిం తథాగృత్సపతేః సుతాః.
బ్రాహ్మణాః క్షత్రియావైశ్యాః కాశే (శా) దీర్ఘతమాః సుతాః ।
తతోధన్వన్తరిశ్చా సీత్తత్సుతోఽభూచ్చ కేతుమాన్.
కేతుమతో హేమరథో దివోదాసఇతిశ్రుతః ।
ప్రతర్దనో దివోదాసాద్బర్గవత్సౌ ప్రతర్దనాత్.
వత్సాదనర్క ఆసీచ్చహ్యనర్కాత్క్షే మకోఽభవత్ ।
క్షేమకాద్వర్షకేతుశ్చ వర్షకేతోర్విభుః స్మృతః.
విభోరానర్తః పుత్రోఽభూద్విభోశ్చ సుకుమారకః ।
సుకుమారాత్సత్య కేతుర్వత్స భూమిస్తు వత్సకాత్.
సుహోత్రస్య బృహత్పుత్రో బృహతస్తనయాస్త్రయః ।
ఆజమీఢో ద్విమీఢశ్చ పురుమీఢశ్చ పీర్యవాన్.
ఆజమీఢస్య కేశిన్యాం జజైజహ్నుః ప్రతాపవాన్ ।
జహ్నోరభూదజకాశ్వో బలాకాశ్వస్తదాత్మజః.
బలాకాశ్వస్య కుశికః కుశికాద్గాధి రింద్రకః ।
గాధేః నత్యవతీ కన్యా విశ్వామిత్రః సుతోత్తమః.
దేవరాతః కతిముఖా విశ్వామిత్రస్యతే సుతాః ।
శునఃశేపోఽష్టకశ్చన్యోహ్యజ మీఢాత్సుతోఽభవత్.
నీలిన్యాం శాంతిరపరః పురుజాతిః సుశాంతితః ।
పురుజాతేస్తు బాహ్యాశ్వో బాహ్యాశ్వాత్పంచ పార్థివాః
ముకులః సృంజయశ్చైవ రాజా బృహదిషస్తథా ।
యవీనరశ్చ కృమిలః పాంచాలా ఇతి విశ్రుతాః.
ముకులస్యతు మౌకుల్యాః క్షే(క్ష) తోపేతా ద్విజాతయః ।
చంచాశ్వోముకులాజ్జజ్ఞే చంచాశ్వాన్మిథునం హ్యభూత్.
దివోదాసోహ్య హల్యాచ త్వహల్యాయాం శరద్వలాత్ ।
శతానందః శతానందాత్సత్యదృజ్ మిథునం తతః.
కృపః కృపీ దివో దాసాన్మైత్రేయః సోమపస్తతః ।
సృంజయాత్పంచ ధనుషః సోమదత్తశ్చతత్సుతః.
సహదేవః సోమదత్తాత్సహ దేవాత్తు సోమకః ।
ఆసీచ్చ సోమకాజ్జంతుర్జం తోశ్చ పృషతః సుతః.
పృషతాద్ద్రుపదస్తస్మాద్ధృష్టద్యుమ్నోఽథ తత్సుతః ।
ధృష్టకేతుశ్చ ధూమిన్యామృక్షోఽభూదజమీడతః.
ఋక్షాతం వరణ్ జజ్ఞే కురుః సంవరణాత్తతః ।
యః ప్రయాగాద పాక్రమ్య కురుక్షేత్రం చకారహ.
అగ్ని దేవుడు పలికెను. పురపునకు జనమేజయుడు, వానికి ప్రాచీవంతుడు, వానికి మనస్యుడు వానికి వీతమయుడు, వానికి శంధుడు, వానికి బహువిధుడు, వానికి సంయాతి, దానికి రహోవాది, వానికి భద్రాశ్వుడు పుట్టెను. భద్రాశ్వునకు ఋచేయు-కృషేయు-సంనతేయు-ఘృతేయు-చితేయు-స్థండిలేయు-ధర్మేయు-సంనతేయు-కృతేయు మతినారులను పదిమంది పుత్రులు పుట్టిరి. మతినారునకు తంసురోధ-ప్రతిరథ-పురస్తులను ముగ్గురు పుత్రులు పుట్టిరి. ప్రతిరథునకు-దుష్యంత-ప్రవీరక-సుమంత-వీరవరులను నలుగురు పుత్రులుపుట్టిరి. దుష్యంతునకు భరతుడుపుట్టెను. భరతుడ శకుంతలా పుత్రుడు; మహాబలశాలి. ఇతని వంశమున పుట్టిన వారికి భారతులను పేరు వచ్చినది. భరతుని పుత్రులు మాతృక్రోధముచే నశించగా, రాజుయజ్ఞముచేసెను. అపుడు మరుద్గణములు బృహస్పతి పుత్రుడగుభరద్వాజుని తీసుకొనివచ్చి ఆతనిని ఆరాజునకు పుత్రునిగాయిచ్చిరి. ఇతడు వితధుడనే పేరుతో ప్రసిద్ధుడయ్యెను వితథునకు సుహోత్ర సుహోత్రు గయ-గర్భ కపిలులు అను ఐదుగురుపుత్రులు పుట్టిరి. వీరుకాక మహాత్ముడు సుకేతువు అను ఇరువురు పుత్రులు పుట్టిరి పిదప కౌశికుడు గృత్సపతి అను పుత్రులు కూడ బుట్టిరి గ్నత్సపతికి బుట్టిన అనేక కుమారులలో బ్రాహ్మణులు క్షత్రియులు, వైశ్యులు అందరును వుండిరి. కాశ-దీర్ఘతములుగృత్సపతి కుమారులే, దీర్ఘతమునకు ధన్వంతరి వానికి కేతుమంతుడు, వానికి కేతుమంతుడు వానికి దివోదాసుడను ప్రసిద్దిగల హిమరథుడు, వానికి ప్రతర్దనుడు వానికి భర్గ-వతులు. వత్సునకు అనర్కుడు-వానికి క్షేమకుడు-వానికి వర్షకేతువు-వానికి విభుడు, వానికి అనర్త-సుకుమారులు, సుకుమారనకు సత్యకేతువు పుట్టెను, వత్సరాజునకు వత్సభూమియను పుత్రుడు పుట్టెను. వితథుని కుమారుడగు సుహోత్రునకు బృహత్ అనుపుత్రుడు పుట్టెను. బృహత్తునకు అజమీడ ఎద్విమీడ పురుమీడులను ముగ్గురు పుత్రులు పుట్టిరి. ఆజ మిథునకు కేశినియను భార్యయందు జహ్ను పుపుట్టెను ఆతనికి ఆజకాశ్వుడు ఆతనికిబలాకాశ్వుడు ఆతనికి కుళికుడు, ఆతనికి ఇంద్రత్వమును సంపాదించినగాధి ఆతనికి సత్యవతి యను కుమార్తె యు, విశ్వామిత్రుడను కుమారుడును పుట్టెను దేవ రాతక తిముఖాదులు విశ్వామిత్రుడి పుత్రులు. ఆజమీడునకు శువ శ్శేపుడు, అష్టకులను పేరుగల ఇతర పుత్రులును పిట్టిరి. ఆతనికి నీలినీయను భార్యయందు శాంతియను మరొక పుత్రుడు కూడ పుట్టెను. శాంతికి పురుజాతి-వానికి బాహ్యశ్వుడు, వానికి ముకుల-సృంజయ-బృహదిమ-యమీనర-కృమిలులను ఐదుగురుకుమారులును పుట్టిరి. వీరికి పాంచాలులని ప్రసిద్ధి. ముకుల వంశీయులకు కుల్యులని పేరు. వీరు క్షాత్రధర్మమును అనుసరించు బ్రాహ్మణులు. ముకులునకు చంచాశ్వుడు వానికి ఒక పుత్రుడు పుతి కవలలు పుట్టిరి. పుత్రుని పేరు దివోదాసుకు పుత్రిక పేరు అహల్య, ఆహల్యకు శరద్వంతుని (గౌతముని) వలన శతానందుడు పుట్టెను శకానందునకు సత్యధృక్ అను పుత్రుడు పుట్టెను. వానికి కృపుడు ఆను పుత్రుడు, కృపియను పుత్రిక కవలగా పుట్టిరి. దివోదాసునకు మేతీయుడు దానికి సోమకుడు, పట్టెను. సుబుంజయునకు పంచహనుష్కడు ఆతనికి సోమదత్తుడు, ఆతనికి సహదేవుడు ఆతనికి సోమకుడు, ఆతనికి జంతువు, ఆతనికి పృషత్, వానికి ద్రుపదుడు, వానిధృష్టద్యుమ్నుడు, వానికి దృష్టకేతువు పుట్టెను. అజమీడునునకు ధూమినీయను భార్యయందు ఋక్షుడను పుత్రుడు పుట్టెను ఆతనికి సంవర సుపు, ఆతనికి కురవుపుట్టెను అతడు ప్రయాగ నుంచి కురుక్షేత్ర తీర్థమును స్థాపించెను.
కురోః సుధన్వా సుధమః పరీక్షిచ్చారిమేజయః ।
సుధన్వతః సుహోత్రోఽభూత్సుహోత్రాచ్చ్య వనోహ్యభూత్.
వశిష్ఠపరిచారాభ్యాం సప్తాసన్గిరికాసుతాః ।
బృహద్రథః కుశోవీరో యదుఃప్రత్యగ్రహోబలః.
మత్స్యకాలీ కుశాగ్రోఽతోహ్యాసీద్రాజ్ఞో బృహద్రథాత్ ।
కుశాగ్రా దృషభోజజ్ఞే తస్య సత్య హితః సుతః.
సుధన్వాతత్సుతశ్చోర్జ ఊర్జాదాసీచ్చ సంభవః ।
సంభవాచ్చ జరాసంధః సహదేవశ్చతత్సుతః.
నహదేవాదు దాపిశ్చాప్యు దాపేః శ్రుతకర్మకః ।
పరీక్షితస్య దాయాదో ధార్మికో జనమేజయః.
జనమేజయాత్రసద్దస్యుర్జహ్నోస్తు సురథః సుతః ।
శుతసేనోగ్రసేనౌచ భీమసేనశ్చ నామతః.
జనమేజయస్య పుత్రౌతు సురథో మహిమాంస్తథా ।
సురథాద్విదూరథోఽభూదృక్ష ఆసీద్విదూరథాత్.
ఋక్షస్య తు ద్వితీయస్య భీమసేనోఽభవత్సుతః ।
ప్రతీపో భీమసేనాత్తు ప్రతీపస్యతుశన్తనుః.
దేవాపిర్బాహ్లి కశ్చైవ సోమదత్తస్తు శన్తనోః ।
బాహ్లికాత్సో మదత్తోఽభూద్బూరిర్భూరి శ్రవాః శలః.
గంగాయాం శంతనోర్బిష్మః కాల్యాయాం విచిత్ర వీర్యకః ।
కృష్ణద్వైపాయనశ్చైవ క్షేత్ర వైవిచిత్రవీర్యకే.
ధృతరాష్ట్రంచ పాండుంచ విదురం చాప్యజీజనత్ ।
పాండోరుధిష్ఠిరః కున్త్యాం భీమశ్చైవార్జున స్త్రయః.
నకులః సహదేవశ్చ పాండోర్మాద్ర్యాం చ దైవతః ।
అర్జునస్య చ సౌభద్రః పరీక్ష దభి మన్యుతః.
ద్రౌపదీ పాండవానాంచ ప్రియాతస్యాం యుధిష్ఠిరాత్ ।
ప్రతివింధ్యో భీమసేనాచ్ఛుత కీర్తిర్ధనంజయాత్.
సహదేవాచ్ఛ్రుత కర్మాశతానీకస్తునాకులిః ।
భీమసేనాద్ధిడంబాయామన్య ఆసిద్ఘటోత్కచః.
ఏతే భూతా భవిష్యాశ్చ నృపాః సంఖ్యా నవిద్యతే ।
గతాః కాలేన కాలోహి హరిస్తం పూజయేద్ద్విజ.
హోమ మగ్నౌసముద్దిశ్య కురుసర్వ ప్రదం యతః.
ఇత్యాది మహాపురాణే అగ్నేయే పురువంశ వర్ణనం నామాష్ట సప్తత్యధిక ద్విశతతమోఽధ్యాయః.
కురువునకు సుధన్వుడు సుధనుడు, పరీక్షిత్తు, రిపుంజయుడు ఆను నలుగురు పప్రులు పుట్టిరి సుధన్వునకు సుహో తుడు వానికి చ్యవనుడు పుట్టెను. చ్యవనుని భార్యయైన గిరికయందు ఉపరిచరవసువు ఆంశచే-బృహద్రథ-కుశ-వీర-యదు-ప్రతిగ్రహ-బల-మత్స్యకాళి-ఆను ఏడుగురు పుత్రుజపుట్టిరి. బృహద్రథునకు కుళాగ్రుడు వానికి వృషభుడు, వానికి సుధన్వుడు, జానికి ఊర్ణుడు, వానికి సంభవుడు వానికి జరాసంధుడు, వానికి సహదేవుడు వానికి ఉదాపి వానికి శతకర్మ పుట్టెను. కురుసంచనుడైన పరీక్షిత్తువకు జనమేజయుడను పుత్రుడు పుట్టెను ఇతడు పరమధార్మికుడు. ఇతనికి త్రసద్దస్యువు అను పుతడుపుట్టెను. ఆజు మీడుని కుమారుడగు జుహ్న నకు సురథ-శ్రుతసేన-ఉగ్రసేన-భీమ సేనులను నలుగురు పుత్రులు పుట్టిరి. పరీక్షిత్ కుమారుడగు జనమేజయునకు సురథుడు మహిమంతుడు. అను పుతులు పుట్టిరి. సురథునకు విదూరథుడు, వానికి ఋషుడు, పుట్టెను. ఈవంశములో ఇతడు ఋషుడను పేరుతో ప్రసిద్దుడగు రెండవరాజు. ఇతనికి భీమసేనుడు, వీనికి ప్రతీపుడు వీనికి శంతనుడు, వీనికి దేవాపి-బాహ్లిక-సోమ దత్తులను ముగ్గురు కుమారులు జన్మించెను. బాహ్లికునకు సోమదత్తుడు, వానికి భూరి-భూరిశ్రవస్-శలులు పుట్టిరి. శంతనునకు గంగయందు భీష్ముడు పుట్టెను. కాల్య (సత్యవతి) యను భార్యయందు విచిత్రవీర్యుడు పుట్టెను. విచిత్ర వీర్యుని భార్యయందు శ్రీకృష్ణద్వైపాయనునకు-ధృతరాష్ట్ర పాండు విదురులు పుట్టిరి. పాండువు భార్యయగు కుంతికి యుధిష్ఠిర, భీమ, అర్జునులు, మాడ్రికి నకుల సహదేవులు పుట్టిరి. ఈ ఐదుగురు పాండవులును దేవాంశ సంభూతులు. అర్జునుని పుత్రుని పేరు ఆభిమన్యుడు. సుభద్రక పట్టినవాడు ఆభిమన్యునకు పరీక్షిత్తు అను పుత్రుడు పుట్టెను. ద్రౌపది పంచ పాండవుల భార్య, ఆమెయందు యుధిష్ఠిరువకు ప్రతి వింద్యుడు. భీమసేనునకు శ్రుతసోముడు, అర్జునునకు శ్రుతకీర్తి, సహదేవునకు శతకర్మ, నకులునకు శతానీకుడు పుట్టెను. భీమసేనునకు హిడింబయందు పుట్టిన ఘటోత్కచుడను మరియొక పుత్రుడుండెను. వీరందరును భూతకాలమునకు చెందిన రాజులు - భవిష్యత్తులో రాబోవు రాజుల సంఖ్యను ఎవరు చెప్పజాలరు, వీరందరును కాలగ్రస్తులై గడచిపోయిరి. ఓ వశిష్ఠా ! కాలము విష్ణు స్వరూపము, అందుచేత ఆవిష్ణువునే పూజించవలెను. ఆ విష్ణువునే ఉద్దేశించి అగ్నిలో హోమము చేయుము. ఆతడే సర్వమును ఇచ్చువాడు.
ఆగ్ని మహాపురాణమున కురువంశవర్ణనమను రెండువందల డెబ్బది ఎనిమిదవ ఆధ్యాయము సమాప్తము.
Summary of chapter 278 of the Agni Purāṇa is as follows:
The Puru lineage — from which both the Kauravas and Pāṇḍavas descend — is narrated in full. The line passes through Janmejaya, Prācīnvān, Manasyu, Vītamaya, Śandhu, Bahuvidhā, and Saṃyāti to Duṣyanta, who fathers Bharata upon Śakuntalā. Bharadvāja is given as a son by the Maruts. Ajamīḍha's lineage gives Jahnu → Kuśika → Gādhi → Viśvāmitra. Ṛkṣa → Saṃvaraṇa → Kuru, who establishes the sacred field of Kurukṣetra. Kuru's descendants through Śantanu, Bhīṣma (Gaṅgā's son), Pāṇḍu, and Dhṛtarāṣṭra lead to the full Pāṇḍava genealogy — Yudhiṣṭhira, Bhīma, Arjuna, Nakula, Sahadeva — and their sons including Abhimanyu and Parīkṣit. The Jarāsandha lineage from Bṛhadratha is also traced.