అగ్ని మహా పురాణము

155 - అథాచారః

పుష్కర ఉవాచః-

బ్రా హ్మీ ముహూర్త ఉత్థాయ విష్ణ్వాదీన్ దేవతాః స్మరేత్

ఉభే మూత్రపురీ షేతు దివా కుర్యాదుదజ్ముఖ:.

రాత్రే చ దక్ష్మితో కుర్యాదుబే సన్ద్యే యథా దివా

న మార్గాదౌ జలే వీథ్యాం సతృణాయాం సదాచరేత్ .

శాచం కృత్వా మృదాచమ్య భక్షయేద్దస్తధావనమ్

నిత్యం నైమిత్తికం కామ్యం క్రియాజ్ఞం మలకర్షణమ్.

క్రియాస్నానం తథా షష్టం షోడా స్నానం ప్రకీర్తితమ్

ఆస్నాతస్యాఫలం కర్మ ప్రాతఃస్నానం చరేత్తతః.

రూమిష్ఠముద్ధృతాత్పుణ్యం తతః ప్రస్రవణోదకమ్

తతోపి సారసం పుణ్యం తస్మాన్నా దేయముచ్యతే.

తీర్ణతోయం తతః పుణ్యం గాబ్దం పుణ్యం తు సర్వతః

సంశోధితమలకి పూర్వం నిమగ్నశ్చ జలాశయే.

ఉపస్పృశ్య తతః కుర్యాదమృసః పరిమార్జనమ్

హిరణ్యవర్ణాస్త్రీసృభిః తన్నో దేవీతి చాప్యథ.

ఆపోహి షైతి తీసృభిరిదమాప స్తథైవ చ

తతో జలాశయే మగ్న, కుర్యాద నర్లలం జపమ్.

తలాఘమర్షణం సూక్తం ద్రుపదం వా తథా జపేత్

యుజ్జతే మన ఇత్యేవం సూక్తం వాప్యథ పౌరుషమ్.

గాయత్రీం తు విశే షేణ అఘమర్షణసూక్త కే

 దేవతా భావవృత్తం తు ఋషి శ్చైవాఘమర్షణః.

ఛన్తశ్చానుష్టుభం తస్య భావవృత్తో హరిః స్మృతః

ఆపీడ్యమాన శాటీం తు దేవతాపితృతర్పణమ్.

పౌరుషేణ తు సూ కేన దదేచ్చే వోదకాజ్ఞులిమ్

తతోగ్ని హవసం కుర్యాద్దానం దత్త్వా తు శ క్తితః.

తతః సమభిగచ్చేత యోగమార్థమీశ్వరమ్

ఆసనం శయనం యానం జాయాపత్యం కమణలుః.

ఆత్మనః శుచిరేతాని పరేషాం న శుచిర్భవేత్.

పుష్కరుడు చెప్పెను : ప్రతిదినము ప్రాతఃకాలమునందు బ్రాహ్మముహూర్తమునందే విష్ణ్వాది దేవతలను స్మరించ వలెను. పగలు మలమూత్రత్యాగి ము ఉత్తరాభిముఖుడై చేయవలెను. రాత్రియందు దక్షిణాభిముఖుడై, సంధ్యలందు పగటి యందు వలె చేయవలెను. మార్గాదులందును, జలములందును, సందులు మొదలగువాటియందును ఎన్నడును మలత్యాగము చేయగూడదు. తృణముచే భూమి కప్పి దాని పై మలబ్యాగము చేయవలెను. మట్టితో హస్తపాదాది శుద్ధి చేయవలెను, స్నానము-నిత్యము, నైమిత్తిక ము, కామ్యము, క్రీయాంగము, మలకర్షణము, క్రియాన్ని నము అని ఆరు విధములు. స్నానముచేయనివాని కర్మ లన్నియునిష్ఫలములు. ఆందుచే ప్రతిదినము ప్రాతఃకాలమున స్నానము చేయవలెను. కూపము నుండి తోడిన జలముకంటె భూమిస్థజలము పవిత్రము, దానికంటే సెలయేటిలోని నీరు, దానికంటె తటాకోడక ము, దాని కంటే నదీజలము, దానికంటే తీర్ధోదకము పవిత్రము. గంగాజలము అన్నిటికంటెను పవిత్రము. నీటిలో మునిగి శరీరము నందలి మలమును కడిగివేసుకొని, ఆచమనము చేసి, “హిరణ్యవర్ణా' ఇత్యాదిఋ క్షయముతోను, “శం నో దేవీర భిష్టయే” అను మంత్రముతోను, “ఆపోహిష్ణా', ఇత్యాదిమంత్రములు మూడింటితోను, “ఇదమామ” ఇత్యాదిమంత్రముతోను మార్జనము చేసికొనవలెను. పిదప జలాశయమునందు మునిగి, లోపలనే, అఘమర్షణసూక్తము గాని ద్రుపదాదివ” అను మంత్రముగాని, 'యుజ్ఞతేమనః' ఇత్యాదిసూక్తమును గాని సహస్రశీర్షా' ఇత్యాది సూక్తమును గాని జపించవలెను. విశేషించి గాయత్రీ జపము ఉచితము. అఘమర్షణసూక్తమునందు దేవత భావవృత్తము, ఋషి ఆమమర్షణుడు. ఛందస్సు అనుష్టుప్. తద్ద్వారా భావవృత్తు డగు హరిని స్మరించవలెను. బట్టలు పిండుచు దేవతాపితృతర్పణము చేయవలెను. పిదప పురుష సూక్తముతో జలాంజలి సమర్పించి, పిదప ఆగ్ని హోత్రము చేసి, యథాశక్తి దానము నిచ్చి, యోగ క్షేమార్థమై పర మేశ్వ రుని శరణమందవలెను. ఆసనము, శయ్య, వాహనము, స్త్రీ, సంతానము, కమండలము ఇవి తన వై నపుడే పవిత్రములు. ఇతరుల వైనచో తనకు ఆది అపవిత్రములు.

భారాక్రా నస్య గుర్విణ్యాః పర్ణా దేయో గురుష్వపి.

 న పశ్యేచ్చారముద్యన్తం నా స్తం యస్తం న చామృసి

నేక్షేన్న గ్నాం శ్రియం కూపం సురాస్థానమమౌఖనమ్.

కార్పాసాస్టి తథా భస్మ నా కామేద్యచ్చ కుత్సితమ్

ఆనఃపురం విత్తగృహం పర దౌత్యం వ్రజేన్నహి.

నారో ద్విషమాం నావం న వృక్షం న చ పర్వతమ్

అర్థాయతనశా శ్రేషు తథైవ స్యాత్ కుతూహలమ్.

లోష్టమర్టీ తృణచ్చేదీ నఖచ్చేది వినశ్యతి

ముఖాదిపాదనం నే హే ద్వినా దీపం న రాత్రిగః.

నాద్వారేణ విద్వేశ్మ న చ వక్రం విరాగయేత్

కథాభజిం న కుర్వీత న చ వాసోవిపర్యయమ్.

భద్రం భద్రమితి బ్రూయాన్నా నిష్టం కీర్తయేత్క్వచిత్

 పాలాశమాసనం వర్జ్యం దేవాదిచ్చాయయా వ్రజేత్.

న మధ్యే పూజ్యయోర్యాయాన్నోచ్ఛిషస్తారకాదిదృక్

నద్యాం నాన్యాం నదీం బ్రూయాన్న కళ్లూయేద్ద్విహ స్తకమ్.

ఆస నర్ప్య పితృన్ దేవాన్ నదీపారం చ న వ్రజేత్

మలాది ప్రక్ష పెన్నాప్సు న నగ్న స్నానమాచరేత్.

తతః సమభిగచ్ఛేత యోగక్షేమార్గమీశ్వరమ్

స్రజం నాత్మ నాపనయేళరాదికరజ స్త్యజేత్.

హీనాన్నా వహ సే డ్గచ్ఛేన్నా దేశే నివ సేచ్చ తై

వైద్యరాజ నదీపీనే మ్లేచ్ఛశ్రీ బహునాయ కే,

రజస్వలాదిపతితై ర్న భాషేత్కేశవం స్మరేత్

నాసంవృతముఖః కుర్యాద్ధాసం జృమాం తథా కుతమ్.

ప్రభోరపక్షవమానం స్వం గోపయేద్వచనం బుధః

ఇన్దియాణాం నానుకూలీ వేగరోధం న కారయేత్:

నా పేక్షితవ్యో వ్యాధికి స్యాద్రిపురలో ఒపి భార్గవ

రథ్యాదిగః సదాచా మేద్బిభృయాన్నాగ్ని వారిణీ.

న హుజుర్యాచ్ఛివం పూజ్యం పాదం పాదేన నాక్ర మేత్

ప్రత్యక్షం వా పరోక్షం వా కస్య చిన్నా ప్రియం వదేత్ .

వేదశాస్త్రనరేన్హర్షిదేవనిన్గాం వివర్జయేత్

స్త్రీణామీర్ష్యా న కర్తవ్యా విశ్వాసం తాను వర్జయేత్.

ధర్మశ్రుతిం దేవరాతిం కుర్యాద్ధర్మాది నిత్యశః

సోమస్య పూజాం జన్మరే విప్రదేవాదిపూజనమ్.

షష్ఠ చతుర్దశ్యష్టమ్యామభ్యంగం వర్జయేత్తథా

దూరాద్గృహాన్మూత్రవిష్ఠే నో మైర్వేరమాచరేత్.

ఇత్యాదిమహాపురాణే ఆగ్నేయే ఆచారవర్ణనం నామ పఞ్చపఞ్చాకదధిక శతతమోధ్యాయః.

బరువు మోయు చున్న నానికిని, గర్భిణీ స్త్రీకిని, పెద్దలకును మార్గము యవలెను. ఉదయించుచున్న సూర్యుని, అస్తమించుచున్న సూర్యుని చూడరాదు. జలమునందు సూర్యప్రతిబింబమును చూడకూడదు. నగ్న స్త్రీని, కూపములోనికిని హత్యాస్థానమును, పాపాత్ములను చూడకూడదు. దూది, ఎముకలు, భస్మము, జుగుప్సాకరములగు వస్తువులు దాటకూడదు. ఇతరుల అంతఃపురములోనికి, కోశాగారములోనికిని ప్రవేశింపరాదు. ఇతరులకు దూతగా పని చేయరారు. విరిగిన నావ, చెట్టు, పర్వతము ఎక్కరాదు. ధనము, గృహము, శాస్త్రములు వీటి విషయమున కుతూహలముతో నుండవలెను. (ప్రేళ్లతో) మట్టిబెడ్డలు నలగకొట్టువాడు, తృణములు త్రుంచువాడు, గోళ్లు కొరుకువాడు నశింతురు. ముఖాదుల ద్వారా వాద్య శబ్దము పుట్టించరాదు. రాత్రి దీపము లేకుండ ఎచటికి పోరాదు. ద్వారము తప్ప మరొక మార్గమున ఇంట ప్రవేశింపరాదు. ముఖము రంగు మార్చుకొనగూడదు. సంభాషణమున ఎవరికిని బాధ కలిగించరాదు. తన వస్త్రమును ఇతరుల వస్త్రముతో మార్పు చేసికొనరాదు. ఎల్లపుడు భద్రము, భద్రము అని అనుచుండవలెను. ఇతరులకు నష్టము కలిగించు మాట ఎన్నడును పలకరాదు. పలాశాసనమును ఉపయోగించరాదు. దేవతాదుల నీడనుండి దూరముగ ఉండవలెమ. ఇద్దరు పూజ్యు లగువారి మధ్యనుండి వెళ్లకూడదు. ఎంగిలివాడుగా ఉండి నక్షత్రాదులను చూడరాదు. ఒక నదిలో నున్నపుడు మరొక నది పేరుపలుకరాదు. రెండు చేతులతో గోకుకొనరాదు. ఏదైన నదిని సమీపించునపుడు దేవతాపితృతర్పణము చేయకుండ దానిని దాటరాదు. మలాదులను జలములో పడవేయరాదు. నగ్నుడై స్నానము చేయగూడదు. యోగ క్షేమముల కొరకై పరమాత్ముని శరణుపొందవలెను. శరీరము పైనున్న మాలను తన చేతులతో తీసివేయగూడదు. గాడిద దుమ్ము నండి దూరముగా ఉండవలెను. తనకంటే తక్కువ స్థితిలో నున్న వారిని చూచి నవ్వకూడదు. వారితో కలసి ఒక స్టామున నివసింప గూడడు. వైద్యుడు, రాజు, నతి లేని దేశమునందు నివసించగూడదు. ప్లేచ్చులు, స్త్రీలు, ఆనేకులు అతిపరులుగా ఉన్న ఉక ముందు నివసించరాద. రజస్వలలతోను, పతితాతలతోను సంభాషణ చేయకూడదు. సతా విష్ణుస్మరణము చేయవలెను. ముఖమును అచ్చాదించుకొనకుండ సవ్వుట, ఆవలించుట, తుమ్ముట చేయరాదు. తెలివైనవాడు స్వామియొక్క అవమానమును, తన అవమానమును రహస్యముగా ఉంచుకొనవలెను. ఇంద్రియములు చెప్పి నట్లు చేయరాదు. మలమూత్రముల వేగము ఆపుకొనరాదు. పరశూమా! చిన్న రోగమును, చిన్న శత్రువును గూడ ఉపేక్షించరాదు. మార్గము దాటి వచ్చినపిమ్మట తప్పక ఆచమనము చేయవలెను. జలాగ్నులను ఒకేసారి ధరింపదు. కల్యాణమయు డగు పూజ్యుని విషయమున ఎన్నడును కోపముతో హుంకరింపగూడదు. పాదమును పాదముతో నొక్కకూడదు. ప్రత్యక్ష ముగా గాని, పరోక్షముగా గాని ఎవ్వరిని నిందింపరాదు. వేద . శాస్త్ర - రాజ - ఋషి - దేవతలను నిందింపరాదు. శ్రీల:షయమున ఈర్ష్య యుండకూడదు. ఎన్నడ ను వారిని విశ్వసింపగూడదు. ధర్మమును వినవలెను. దేవతల పై భక్తి చూపవలెను. ప్రతిదినము ధర్మాద్యనుష్ఠానము చేయవలెను. జన్మనక్షత్రదివసమున చంద్రుని, బ్రాహ్మణులను, దేవతాదులను పూజించవలెను. షష్టి - ఆష్టమీ చతుర్ధ శిదివసములందు తైలాభ్యంగస్నానము చేయగూడదు. ఇంటినుంచి దూరముగ పోయి మలమూత్రవిసర్జన చేయవలెను ఉత్తమపురుఘలతో ఎన్నడును విరోధము చేయగూడదు.

అగ్ని మహాపురాణము నందు ఆచారవర్ణన మను నూటఏబదియైదవ అధ్యాయము సమాప్తము.