ఆగ్ని రువాచః
ఆలంకరణ మర్థనామర్థాలంకార ఇష్యతే ।
తంవినాశబ్ద సౌందర్యమపి నాస్తి మనోహరమ్.
ఆర్థాలంకార రహితవిధమేవ సరస్వతీ ।
స్వరూపమథ సాదృశ్య ముత్ర్పేక్షాతి శయావపి.
విభావసో విరోధశ్చ హేతుశ్చ సమమష్టధా ।
స్వభావ ఏవభావానో స్వరూప మభిధీయతే.
నిజమాగన్తు కంచేతి ద్వివిధం తదుదాహృతమ్ ।
సాంసిద్దికం నిజం నైమిత్తిక మాగన్తుకం తథా.
సాదృశ్యం ధర్మసామాన్య ముపమారూపకం తథా ।
సహో క్త్యర్ధాంతర న్యాసావిత స్యాత్యు చతుర్విధః.
ఉపమానామ సాయస్యాముపమానోప మేయః ।
సత్తా చాంతర సామాన్యయోగిత్వేఽపి వివక్షితమ్.
కించిదాదాయ సారూప్యం లోకయాత్రా ప్రవర్తతే ।
సమా సేనా సమాసేన సాద్విధా ప్రతియోగినః.
విగ్రహాదభి ధానస్య ససమాసాఽన్య థోత్తరా ।
ఉపమాద్యోతక పదేనోప మేయపదేనచ.
తాభ్యాంచ విగ్రహా త్త్రేధా ససమాసా న్తి మాత్త్రిధా ।
విశిష్యమాణా ఉపమాభవన్త్యష్టాదశ స్ఫుటాః.
యత్రసాధారణో ధర్మః కథ్యతే గమ్యతేఽపివా ।
తేధర్మవస్తు ప్రధాన్యాద్దర్మ వస్తూపమే ఉభే.
తుల్యమేవోప మీయేతే యత్రాన్యోన్యేన ధర్మిణౌ ।
పరస్పరో పమాసాస్యాత్ప్ర సిద్దేరన్యథాద్వయోః.
వివరీతోపమా సా స్యాద్వ్యావృతైర్నియ మోపమా ।
అన్యత్రాప్యును వృత్తేస్తు భవేదనీయమోపమా.
అగ్ని దేవుడు పలికెను. అర్థములను అలంకరించుట అర్ధాలంకారము. ఆది లేనిదే శబ్ద సౌందర్యము కూడ మనో హారముగా నుండదు. ఆర్థాలంకార హీన మగు వాక్కు నాథుడు లేని ఈ వంటిది. స్వరూపము సాదృశ్యము ఉత్ర్పేక్ష, అతిశయము, విభావనా, విరోధము, హేతువు, సమము అని అర్థాలంకారము ఎనిమిది విధములు. పదార్థముల స్వభావము నకు స్వరూప మని పేరు. నిజము ఆ గంతుక మని అది రెండు విధములు. పుట్టుకతో వచ్చినది నిజము, నిమిత్తమును బట్టి వచ్చినది ఆగంతుకము. ధర్మ సామ్యమునకు సాదృశ్యమని పేరు. అది ఉపమా, రూపకము. సహోక్తి ఆర్ధాంతర న్యాసము అని నాలుగు విధములు. భేదము, ఉపమానోపమేయములకు సామాన్య ధర్మ బంధము వున్నచో ఆది ఉపమా. ఏదియో కొంత సాదృశ్యమును ఆధారముగా తీసుకోని లోక యాత్ర నడుచు చున్నది. సమాస, అసమాస యని ఉపమా రెండు విధములు. ఉపమానము సమ సమైనచో ససమాస. అట్లు కానిచో అసమాస. ఉపమాద్యోతక పకములు గాని, ఉప మేయ వాచకములు గాని రెండును గాని లోపించగా ససమాస మూడు విధములగును. అసమాస కూడ మూడు విధము. విశేషణములతో యు క్షమైనపుడు ఉపమా పదునెనిమిది విధములగును. సాధారణ ధర్మమును చెప్పు ఉపమలో ఆధర్మమునకు వున్న ప్రాధాన్యాన్ని బట్టి ధర్మోపమా, వస్తు ధాన్యమును బట్టి వసూమా. ఉపనోపమేయముల ప్రసిద్ధిని బట్టి పరస్పరము సామ్యము చెప్పినచో ఆది పరస్పరోపమా, ప్రసిద్ధిని బట్టి పరస్పరము సామ్యము చెప్పినచో అది పరస్పరోపమా, ప్రసిద్ధికి విరుద్ధముగా ఉపమానోపమేయములలో వైషమ్యమున్న చో విపరీతోపమా. ఒక వస్తువుతో మాత్రమే సామ్యము చెప్పి ఇతరోప మానములను నిషేధించినచో నియమోపమా. ఉపమేయము యొక్క గుణాదులు ఉపమానాంతరము నందు గూడ అనువృత్తము లైనచో ఆనియమోపమా.
సముచ్చయోపమాతోఽన్యధర్మ బాహల్య కీర్తనాత్ ।
బహుధర్మస్య సామ్యేఽపి వై లక్షణ్యం వివక్షితమ్.
యదుచ్యతేఽతి రిక్తత్వం వ్యతిరేకోప మాతుసా ।
యత్రోపమాస్యాద్బహుభిః సదృశైః సాబహూపమా.
ధర్మాః ప్రత్యుపమానం చేదన్యా మాలోపమైవసా ।
ఉపమాన వికారేణ తులనా విక్రియోపమా.
త్రైలోక్యాసంభవి కిమప్యారోప్య ప్రతియోగిని ।
కవినోప మీయతేయా ప్రథతే సాద్బుతోపమా.
ప్రతియోగిన మారోప్య తదభేదేన కీర్తనమ్ ।
ఉప మేయస్యసా మహోపమాఽసౌ భ్రాన్తిమద్వచః.
ఉభయోర్ధర్మిణీ స్తథ్యా నిశ్చయాత్సంశ యోపమా ।
ఉపమేయస్య సంకయ్య నిశ్చయాన్ని శ్చయోపమా.
వాకార్థేనైవ వాకార్థోపమా స్యాదుపమానతః ।
ఆత్మోప మానాదుపమా సాధారణ్యతిశాయినీ.
ఉపమేయం యదన్యస్య తదన్య సోపమామతా ।
యద్యుత్తరోత్తరం యాతితదాఽసౌగగనోపమా.
పశంసాచైవ నిన్దాచ కల్పితా సదృశీతథా ।
కించిచ్చ సదృశీ జ్ఞేయా ఉపమపంచదా పునః.
ఉపమానేన యత్తత్త్వముప మేయస్య రూప్యతే ।
గుణానాం సమతాం దృష్ట్వా రూపకం నామ తద్విదుః .
ఉపమైవతరో భూత భేదారూప మేవవా ।
సహోక్తిః సహభావేన కథనం తుల్యధర్మిణామ్.
ఒకటికి మించిన ధర్మమును చెప్పినచో సముచ్చయోపమా, అనేక ధర్మములలో సామ్యమును ఉపమానము కంటే ఉపమేయము నందు వై లక్షణ్యమున్నట్లు చెప్పినచో ఆది వ్యతిరేకోపమా. అనేక ఉపమానమాలు చెప్పినచో బహూ పమా. ఆ ఉపమానములలో వేర్వేరు సాధారణ ధర్మమున్నచో మాలోపమా. ఉపమేయమున ఉపమాన వికారముగా చెప్పి పోల్చినచో విక్రియోపమా. ఉపమాన మునందు లోకత్రయమ నందును అసంభావ్యమగు ఒక వైశిష్ట్యమును ఆరోపిచికవి వర్ణించి నచో అది ఆద్భుతోపమా. ఉపమానము వారోపించి ఉపమేయము తదభిన్నమని చెప్పి తద్వారా భ్రమ కల్గినట్లు వర్ణించుట మోహోపమా. రెండు వస్తువుల మధ్య వాటి స్వరూపమును గుర్తించుటకు శక్యము గానిచో సంశయోపమా. మొదట సంశ యము కలిగి పిదప నిశ్చయము కలిగినచో నిశ్చయోపమా. ఒక వాకార్థమును మరొక వాక్యార్థమునకు ఉపమగా వర్ణించినచో వాక్యాల్డోపమా. ఉపమానమును బట్టి సాధారణీ, ఆతిశాయినీ అని ఉపమా రెండు విధములు. ఉపమేయమే ఉపమానమైనచో ఆది అన్యోన్యోపమా. ఈ విధముగా ఉత్తరోత్తరము నడచినచో గమనోపమా. ప్రశస్తమ, నింద, కల్పితము, సదృశ్, కించిత్సదృశి ఆనిమరల ఉపమలో ఐదుభేదము లుండును. గుణసామ్యముచే ఉపమేయ స్వరూపమునకు, ఉపమాన స్వరూపము నకు అభేదమును ప్రతిపాదించినచో రూపకాలంకారము లేదా భేదముతోరోహితమైనపుడు ఉపమయరూపకము. తుల్య ధర్మము లగు రెండు పదార్థములు కలిసి యున్నట్లు వర్ణించి సహోక్తి.
భవేదర్థాంతరన్యాసః సాదృశ్యేనోత్త రేణసః ।
ఆన్యథోపస్థితా వృత్తిశ్చేతనస్య తరస్యచ.
అన్యథా మన్యతేయత్ర తాము త్ప్రేక్షాం ప్రచక్షతే ।
లోక సీమాని వృత్తస్య వస్తు ధర్మస్య కీర్తనమ్.
భవేదతిశ యోనామ సంభవా నంభవా ద్ద్విధా ।
గుణజాతి క్రియాదీనాం యత్రవైకల్య దర్శనమ్.
విశేష దర్శనాయైవ విశేషోక్తిరుచ్యతే ।
ప్రసిద్ద హేతువ్యావృత్త్యా యత్కించిత్కారణాంతరమ్.
యత్ర స్వాభావికత్వంవా విభావ్యం సా విభావనా ।
సంగతీ కరణం యుక్త్యాయద సంగచ్ఛమానయోః.
విరోధపూర్వకత్వేన తద్విరోధ ఇతి స్మృతమ్ ।
సిసాదయిషితార్థస్య హేతుర్భవతి సాధకాః.
కార్లకో జ్ఞాపక ఇతి ద్విదాసోఽప్యుపజాయతే ।
ప్రవర్తతే కార కాఖ్యః ప్రాక్పశ్చాత్కార్య జన్మ నః.
పూర్వశేష ఇతి ఖ్యాత స్తయోరేవ విశేషయోః ।
కార్యకారణ భావాద్వా స్వభావాద్వినియామకాత్.
జ్ఞాపకాఖ్యస్య భేదోఽస్తి నదీపూరాది దర్శనాత్ ।
అవినాభావనీయమో హ్యవినాభావ దర్శనాత్.
ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే ఆర్థాలంకార నిరూపణంనామ చతుశ్చత్వారింశదధిక త్రిశతతమోఽధ్యాయః.
పూర్వ వర్ణి తమగు వస్తువును సమర్థించుటకై సాధర్మమును కాని వై ధర్మ్యమును గాని పురస్కరించుకొని మరి యొక అర్థమును ఉపన్యసించుట అర్థంతరవ్యాసము. సచేతన మగు పదార్థము లేదా అచేతన పదార్థము ఒక విధముగా నుండుటను, మరొక విధముగా ఊహించినచో ఉత్ప్రేక్షాలంకారమ. లోకాతీతముగా వర్ణించుట, అతిశయాలంకారము సంభ వము అసంభవము అని రెండు విధములు. గుణ, జాతి, క్రియాదుల లోపమును చెప్పుట ద్వారా ఒక వస్తువు యందలి విశేష మును వర్ణించినచో విశేషోక్తి. ప్రసిద్దమైన కారణమును నిరాకరించి మరియొక కారణమును కానీ, స్వాభావిక రూపమున కార్యోత్పత్తిని కొని ఊహించినచో విభావనాలంకారము. పరస్పర విరుద్ధములగు పదార్థములను కలిసి యున్నట్లు యుక్త పూర్వకముగా వర్ణించుట వీరోధాలంకారము. అభిలషితార్థ సాధక నిమిత్త వర్ణనము హేత్వలంకారము, కార కము జ్ఞాపకము యని ఇవి రెండు విధములు. కారక హేతువు కార్య జన్మమునకు పూర్వమునందును. తరువాతను వుండును. దీనికి పూర్వ శేషమన పేగు. ఈ భేదము లందే కార్య కారణ భావముచే గాని, నియామక మగు స్వభావముచే గాని, అవినాభావ దర్శన ముచే గాని, అవినాభావ నియమము వున్న చో అది జ్ఞాపక హేతువు. నదీ పూరాది దర్శనము జ్ఞాపకమునకు ఉదాహరము.
అగ్ని మహా వూణమున అర్థాలంకార వర్ణన మను మూడు వందల నలుబది నాల్గవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 345 of the Agni Purāṇa is as follows:
The six figures that operate simultaneously at the levels of both sound and meaning (ubhayālaṅkāra) are presented: praśasti (panegyric), kānti (charm), aucitya (propriety), saṅkṣepa (compression), yāvadarthatā (semantic adequacy), and abhivyakti (expressiveness). The chapter then treats lakṣaṇā (the secondary or transferred function of a word) under five sub-types and introduces dhvani (suggestion or resonance) — the most celebrated concept in Sanskrit aesthetics — as the soul (ātman) of poetry, through which meaning exceeds what is literally or figuratively stated. Figures such as samāsokti (compressed reference), apahnutti (denial as emphasis), and paryāyokti (circumlocution) are also described.