అగ్ని మహా పురాణము

218 - అథ రాజాభిషేక కథనమ్.

అగ్ని రువాచః-

పుష్క రేణ చ రామాయ రాజధర్మంహి పృచ్ఛతే

యథాదౌ కథితం తద్వద్వశిష్ఠ కథయామి తే.

పుష్కర ఉవాచః

రాజధర్మం ప్రవక్ష్యామి సర్వస్మాద్రాజధర్మతః

 రాజా భవేచ్చత్రుహన్తా ప్రజాపాలః సుదణ్డవాన్.

 పాలయిష్యతి వః సర్వాన్దర్మస్థాన్వ్రత మాచరేత్

సంవత్సరం స వృణుయాత్పురోహితమథ ద్విజమ్.

 మన్త్రిణశ్చాఖిలాత్మజ్ఞాన్మహిషీం ధర్మలక్షణామ్

సంవత్సరం నృపః కాలే ససంభారోఽభిషేచనమ్.

 కుర్యాన్మృతే నృపే నాత్ర కాలస్య నియమః స్మృతః

తిలైః సిద్ధార్థకైః స్నానం సాంవత్సర పురోహితౌ.

 మోషయిత్వా జయం రాజ్ఞో రాజా భద్రాసనేస్థితః

ఉభయం ఘోషయేద్దుర్గాన్మోచయేద్రాజ్యపాల కే.

 పురోధసాఽభి షేకాత్ప్రాక్కార్యైన్ద్రీ శాంతి రేవచ

ఉపవాస్యభిషేకాహే వేద్యగ్నౌ జుహుయాన్మనూన్.

 వైష్ణవానైన్ద్రమంత్రాంస్తు సావిత్రాన్ వైశ్వదేవతాన్

సౌమ్యాన్స్వస్త్యయనం శర్మ ఆయుష్యాభయదాత్మనూన్.

అపరాజితాంచ కలశం వహ్నేర్ధక్షిణపార్శ్వగమ్

సమ్పాతవన్తం హైమంచ పూజయేద్గంధపుష్పకైః.

ప్రదక్షిణావర్త శిఖస్తప్త జాంబూనదప్రభః

రథౌఘ మేఘనిర్ఘోషో విధూమశ్చ హుతాశనః.

 అనులోమః సుగంధశ్చ స్వస్తి కాకార సన్నిభః

ప్రసన్నార్చిర్మహోజ్వాలః స్ఫులిఙ్గ రహితో హితః.

అగ్ని దేవుడు చెప్పెను : వసిష్ఠా! పూర్వము పరశురాముడు ప్రశ్నింపగా పుష్కరుడు చెప్పిన రాజధర్మములను చెప్పెదను. పుష్కరుడు పలికెను: రామా! నేనుసకలరాజధర్మములనుండి గ్రహించి రాజుయొక్కధర్మములను చెప్పెదను. రాజుదండమును ఉచితరీతిని ఉపయోగించుచు. శత్రువులనున శింపచేసి, ప్రజలనుర క్షించవలెను. “మీరందరును ధర్మమార్గమును అనుసరించి ఉండుడు. నేను మిమ్మలను రక్షించెదను” ఆని ప్రజలకు చెప్పి తనమాట నిలుపుకొనవలెను. రాజు సంవత్సర ఫలమును చెప్పు ఒక్క జ్యోతిక శాస్త్రవేత్త యగు బ్రాహ్మణుని, పురోహితుని వరణము చేయవలెను. సకలరాజకీయ శాస్త్ర నిపు ణులు, ఆత్మజ్ఞానవంతులు అగు మంత్రులను నియమించి సకలగుణసంపన్నరాలగు దేవిని పట్టమహిషినిగా చేయవలెను. రాజ్యభారము వహించిన రాజు ఒక సంవత్సరముగడచిన పిమ్మట ఆభిషేక సంభారములన్నియు సంపాదించి ఉత్సవ పూర్వకముగా రాజ్యాభిషేకము పొందవలెను. రాజ్యము చేయుచున్న రాజు మరణించిన వెంటనే వారసుడు వెంటనే ముహూర్తాది చింతఏమియు చేయక రాజ్యభారము వహించవలెను. రాజు జ్యోతిష్కపురోతాదులద్వారా తిలపర్షపాది సామగ్రిని ఉపయోగించుచు స్నానము చేసి భద్రాసనము ఆలంక రించి రాజ్యమునందుండును. తన విజయమును ఘోషించవలేను. అభయ ఘోషణ చేసి రాజ్యములో నున్న కై దీలను అందరిని బంధవిముక్తులను చేయవలెను. పురోహితునిచే, ఆభిషేకము పొందుటకు పూర్వము, ఇంద్రాదిదేవతా శాంతి చేయించపలెను. అభిషేక దివసమున ఉపవాసము చేసి వేదిపై స్థాపించబడిన అగ్నియందు మంత్రపాఠపూర్వకముగ హోమములు చేయవలెను. విష్ణు - ఇంద్ర - సవితృ - విశ్వదేవ - సోమ దేవతా ఋక్కులను, స్వస్త్యయన - శాంతి ఆయుష్య - అభయదములగు మంత్రములను పఠించవలెను. అగ్నికి దక్షిణమున అపరాజితాదేవిని, అనేక భద్రములు గల సువర్ణ కలశను స్థాపించి చందనపుష్పాదులతో పూజించవలెను. అగ్ని శిఖ కుడివైపు తిరుగుచు, తప్తసువర్ణ కాంతితో రథ - మేఘ ధ్వనులతో సమానమగు ధ్వనిని కలిగించుచు, ధూమ నహితమై, ఉన్నచో, ఆగ్ని దేవుడు అనుకూలుడై హవిస్సును గ్రహించినచో, హోమాగ్ని నుండి ఉత్తమగంధము బయల్వెడ లినచో, మంటలు స్వస్తికాకారమున పై కేగసినచో, అగ్ని స్వచ్చమై ఎత్తుగా లేచినచో, నిప్పునెలసులు లేవకున్నచో అది శుభప్రదము.

న వ్రజేయుశ్చ మధ్యేన మార్జార మృగ పక్షిణః

 పర్వతాగ్రమృదా తావన్మూర్దనం శోధయేన్నృపః.

 వల్మీకా గ్రమృదా కర్ణౌ వదనం కేశవాలయాత్

ఇంద్రాలయ మృదా గ్రీవాం హృదయంతు నృపాజిరాత్.

 కరి దంతోద్ధృతమృదా దక్షిణం తు తథా భుజమ్

వృషశృంగోద్దృత మృదా వామం చైవ తథా భుజమ్.

 సరోమృదా తథా పృష్ఠముదరం సంగమాన్మృదా

నదీతటద్వయ మృదా పార్శ్వే సంశోధయేత్త థా.

 వేశ్యాద్వార మృదా రాజ్ఞః కటిశౌచం విధీయతే

యజ్ఞస్థానాత్త థై వోరు గోస్థానాజ్జానునీ తథా.

 అశ్వస్థానాత్తథా జఙ్ఘే రథచక్రమృదాంఘ్రికే

మూర్ధానం పంచగవ్యేన భద్రాసనగతంనృపమ్.

 అభిషిఞ్చే దమాత్యానాం చతుష్టయ మథో ఘటైః

పూర్వతో హేమకుంభేన మృతపూర్ణేన బ్రాహ్మణః.

 పూర్వకుంభేన యామ్యేచ క్షీర పూర్ణేన క్షత్రియః

దధ్నాచ తామ్ర కుంభేన వైశ్యః పశ్చిమగేన చ.

 మృణ్మయేన జలేనోదక్ శూద్రామాత్యోఽభిషేచయేత్

తతోఽభిషేకం నృపతే ర్బహ్వృచ ప్రవరోద్విజః.

 కుర్వీత మధునా విప్ర శ్చందోగశ్చకుశోదకైః

సంపాతవన్తం కలశం తథాగత్వా పురోహితః.

 విధాయ వహ్నిరక్షాం తు సదస్యేమ యథావిధి

రాజాశ్రియాభిషేకేచ యేమన్త్రాః పరికీర్తితాః.

తైస్తు దద్యాన్మహాభాగ బ్రాహ్మణానాం స్వనై స్తథా

తతః పురోహితో గచ్చేద్వేదిమూలం తదేవతు.

శతచ్చిద్రేణ పాత్రేణ సౌవర్ణేనాభి షేచయేత్

యా ఓషధీత్యోషధీభీరథే యుక్త్వేతి గంధకైః.

పుష్త్పెః పుష్పవతీత్యేవ బ్రాహ్మణేతి చ బీజకైః

రత్నైరాశుః శిశానశ్చ యేదేవాశ్చకుశోదకైః.

 యజుర్వేద్యథర్వవేదీ గంధద్వారేతి సంస్పృశేత్

 శిరః కంఠం రోచనయా సర్వతీర్ధోదకై ర్ద్విజాః.

:                  రాజునకు ఆగ్ని కి మధ్యనుండి పిల్లికాని, మృగముకాని, పక్షికాని వెళ్లకూడదు. రాజు మొదట పర్వత శిఖర మృత్తిక తో శిరస్సుకు శుద్ధి చేసుకొనవలెను. పుట్ట మట్టితో చెవులను విష్ణ్వాలయ పరాగముతో ముఖ మును, ఇంద్ర దేవాలయ మృత్తుతో కంఠమును, రాజగృహము వాకిలి యందలి మట్టితో హృదయమును, ఏనుగు దంతములతో త్రవ్విన మట్టితో కుడి చేతిని, ఎద్దు కొమ్ముతో త్రవ్విన మట్టితో ఎడమభుజమును, సరస్సునందలి మృత్తికతో వీపును, నదీద్వయ సంగమ మృత్తికతో ఉదరమును, వది రెండు తటముల మృత్తికతో పార్శ్వములను, వేశ్యాద్వార మృత్తిక తో కటిభాగమును, యజ్ఞశాలా మృత్తికతో తొడలను, గోశాలా మృత్తిక తో మోకాళ్లను, ఆశ్వళలా మృత్తిక తో కళ్లను, రథచక్ర మృత్తికతో పాదములను శుద్ధము చేసికొనవలెను. పిదప పంచగవ్యముతో శిరస్సును శుద్ధి చేసికొనవలెను. పిదప నలుగురు అమాత్యులు భద్రాసనముపై కూర్చున్న రాజునకు కలశోదకముతో అభిషేకము చేయవలెను. బ్రాహ్మణుడైన సచివుడు, తూర్పునుండి మృతపూర్ణ సువర్ణ కలశముతో అభిషేకము ఆరంభింపవలెను. క్షత్రియసచివుడు దక్షిణమున నిలచి క్షీరపూర్ణమగు రజత కలశతోను, వైశ్యామాత్యుడు పశ్చిమమున నిలిచి దధిపూర్ణ రామకలశతోను, శూద్రామాత్యుడు ఉత్తరముననుండి జంపూర్ణ మృతాత్రతోను రాజాభిషేకము చేయవలెను. పిదప ఋగ్వేదులలో ఓ శిష్టుడైన బ్రాహ్మణుడు తేనెతోను, సామవేదియైన విప్రుడు కుశ జలముతోను అభిషేకము చేయవలెను. పిదప పురోహితులు అనేకచ్చిద్రయు కమగు సువర్ణ కలశము వరకు వెళ్లి, సదస్యులమధ్య యథాశాస్త్రమగ ఆగ్నిరక్షాకార్యము నిర్వర్తించి ఆభిషేకమంత్రములు పఠించుచు అభిషేకము చేయ వలెను.  ఆ సమయమున బ్రాహ్మణులు వేదమంత్రములను పఠించవలెను. పిదప పురోహితుడు వేదిని సమీపించి సువర్ణ మయమగు శతచ్చిద్రకలశ తో అభి షేకము ప్రారంభింపవలెను. ‘యా ఓషధీః’ ఇత్యాది మంత్రమును చదువుచు ఓషధుల తోను, “అథోత్యుక్వాః” ఇత్యాది మంత్రము చదువుచు గంధములతోను, “పుష్పవతీః” ఇత్యాదిమంత్రము చదువుచు పుష్ప ములతోను, “బ్రహ్మణః” ఇత్యాదిమంత్రము చదువుచు బీజములతోను, “ఆశుః- శిశానః” ఇత్యాదిమంత్రము చదువుచు రత్నములతోను, “యేదేవాః” ఇత్యాదిమంత్రమును చదువుచు కుళయుక్త జలముతోను అభిషేకము చేయవలెను. యజుర్వేది యగు బ్రాహ్మణుడును, అథర్వవేదియగు బ్రాహ్మణుడును “గన్దద్వారామ్” ఇత్యాదిమంత్రముతో శిరస్సు పైవను, కంఠము నందును గోరోచనముతో తిలకముంచవలెను.

గీత వాద్యాది నిర్ఘోషైశ్చామర వ్యజనాదిభిః

సర్వౌషధిమయం కుంభం ధారయేయుర్నృపాగ్రతః.

 తం పశ్యేద్దర్పణం రాజా ఘృతం వైమఙ్గలాదికమ్

 అభ్యర్చ్య విష్ణుం బ్రహ్మాణమింద్రాదీంశ్చ గ్రహేశ్వరాన్.

వ్యామ్ర చర్మోత్తరాం శయ్యాముపవిష్టః పురోహితః

మధుపర్కాదికం దత్వా పట్టబంధం ప్రకారయేత్.

 రాజ్ఞో ముకుటబంధం చ పంచచర్మోత్తరం దదేత్

ధ్రువాద్యౌరితి చ విశేద్వృషజం వృషదంశజమ్ .

 ద్వీపిజం సింహజం వ్యాఘ్రజాతం చర్మ తదాసనే

ఆమాత్యసచివాదీంశ్చ ప్రతీహారః ప్రదర్శయేత్.

 గోఽజావిగృహదానాద్యైః సాంవత్సర పురోహితౌ

పూజయిత్వా ద్విజాన్ప్రార్చ్య హ్యన్యానూగోఽన్న ముఖ్య కైః.

వహ్నిం ప్రదక్షిణీకృత్య గురుం నత్వాథ పృష్ఠతః

వృషమాలభ్య గాం వత్సాం పూజయిత్వాథ మంత్రితమ్.

అశ్వమారుహ్య నాగం చ పూజయేత్తం సమారు హేత్

 పరిభ్రమేద్రాజమార్గే బలయుక్తః ప్రదక్షిణమ్.

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే రాజాఽభిషేకో నామాష్టాదశాధిక ద్విశతతమోధ్యాయః.

కొందరు గీతవాద్యాది ధ్వనులు బయల్వెడలుచుండగా చామర్యవ్యజనమును గ్రహించి, సర్వౌషధియుక్త కలశముతో రాజు ఎదుట నిలబడవలేను. రాజు ముందుగా ఆకలశమును, పిదప అద్దమును, ఘృతాది మాంగళిక వస్తువులను చూడవలెను. పిదప విష్ణు - బ్రహ్మ - ఇంద్రాది దేవతలను, గ్రహములను పూజించి వ్యాఘ్రచర్మయు క్తాసనముపై కూర్చుం తవలెను. ఆసమయమున పురోహితుడు మధుపర్కాదులిచ్చి రాజు శిరస్సుపై కిరీటముంచవలెను. పంచచర్మాసనముల పై కూర్చుండి రాజుముకుట ధారణము చేయవలెను. “ధ్రువాద్యౌః” ఇత్యాదిమంత్రముతో ఆ ఆసనముపై కూర్చుండవలెను. ఆ సమయమున వృష - వృషదంశ - వృక - వ్యఘ్ర - సింహచర్మాసనములు ఉపయోగింపబడును. అభిషేకా నంతరము ప్రతిహార - అమాత్య - సచివాదులను చూపుచు ప్రజలకు పరిచయము చేయవలెను. పిదప రాజు, గోవు, మేక, గోఱ్ఱె, గృహము మొదలగు వాటిని దానము చేసి జ్యోతిషిక పురోహితులను పూజించవలెను. భూమి - గోవులు, అన్న ము మొదలగునవి ఇచ్చి ఇతర దాహ్మణులను కూడ పూజించవలెను. అగ్ని ప్రదక్షిణ చేసి గురువును పూజించవలెను. పిదప వృషభపీఠమును స్పృశించి, సవత్సయగు గోవును పూజించి, అభిమంత్రితమగు ఆశ్వమును ఎక్కవలెను. దాని నుంచిదిగి గ జమును పూజించి, దానిని అధిరోహించి, సేనాసహితుడై ప్రదక్షిణ క్రమమున మార్గముపై కొంచెము దూరము వెళ్ల వలెను. పిదప దానాదులచే అందరిని సత్కరించి, వీడ్కోలిచ్చి రాజధానిలో ప్రవేశించవలెను.

అగ్ని మహాపురాణమునందు రాజ్యాభిషేక కథనమను రెండువందలపదునెనిమిదవ అధ్యాయము సమాప్తము.