అగ్ని మహా పురాణము

180 - అథ పఞ్చమీవ్రతాని.

 అగ్నిరువాచః-

పఞ్చమీవ్రతకం వక్ష్యే ఆరోగ్యస్వర్గమోక్షదమ్

ననథస్యాశ్వినే చ కార్తి కే శుక్లపక్ష కే.

వాసుకి సక్షకః పూజ్యః కాలీయో మణిభద్రకః

ఐరావతో ధృతరాష్ట్ర కర్కోటకధనఞ్ఙయౌ.

ఏతే ప్రయచ్ఛన్య భయమాయుర్విద్యాం యశః శ్రియమ్.

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే పఞ్చమీవ్రతాని నామాశీత్యధిక శతతమోధ్యాయః.

అగ్ని పలికెను : ఆరోగ్య - స్వర్గ - మోక్ష ప్రద మగు పంచమీవ్రతమును చెప్పెదను. శ్రావణ - భాద్రపద ఆశ్వయుజ - కార్తీక శుక్ల పక్ష పంచమీతిథులందు వాసుకి - తక్షక - కాలియ - మణిభద్ర - ఐరావత - ధృతరాష్ట్ర - కర్కోటక - ధనంజయు లను నాగులను పూజించవలెను. ఈ నాగము లన్నియు అభయ - ఆయుర్విద్యా - యశో - లక్ష్ములను ఇచ్చెదరు.

అగ్ని మహాపురాణమునందు పంచమీవ్రత వర్ణన మను నూటఎనుబదవ అధ్యాయము సమాప్తము.