అగ్ని మహా పురాణము

270 - అథ విష్ణు పంజరమ్

పుష్కర ఉవాచః

త్రిపురం జఘ్నుషః పూర్వం బ్రహ్మణా విష్ణుపంజరం

 శంకరస్య ద్విజశ్రేష్ఠ రక్షణాయ నిరూపితమ్.

 వాగీశేన చ శ క్రస్య బలం హర్తుం ప్రయాసతః

తస్యస్వరూపం వక్ష్యామి తత్వం శృణు జయాదిమత్

విష్ణు ప్రాచ్యాం స్థితశ్చక్రీ హరిర్ధక్షిణతోగదీ

 ప్రతీచ్యాం శార్గ్జదృగ్విష్ణుర్జిష్ణుః ఖడ్గమమో త్తరే.

హృషీ కేశో వికోణేషు తచ్ఛిద్రేష జనార్దనః

క్రోడరూపీ హరిర్భూమౌ నర సింహోంబ రే మమ.

కురా నమమలం చక్రం భ్రమల్యేతత్సుదర్శనమ్

 అస్యాంశుమాలా దుష్ప్రేక్ష్యా హత్తుం పేత నిశాచరాన్.

గదా చేయం సహస్రార్చిః ప్రదీ పావకోజ్జ్వలా

రక్షోభూత పిశాచానాం డాకినీనాంచ నాశినీ.

శార్జ్గ విస్ఫూర్జితం చైవ వాసుదేవస్య మద్రిపూన్

 తిర్యఙ్మనుష్య కూష్మాండ ప్రేతాదీన్హన్త్వ శేషతః.

 ఖడ్గధారోజ్జ్వలజ్యోత్స్నా నిర్దూతామే సమాహితాః

 తేయాన్తు శామ్యతాం సద్యోగరుడేనేవ పన్న గాః.

పుష్కరుడు పలికెను. పూర్వము త్రిపుర సంహారోద్యుక్తుడగు శివునిరక్షకై బ్రహ్మ విష్ణు పంజరస్తోత్రమును ఉపదేశించేను,

బలాసురుని చంపుటకై వెళ్లుచున్న ఇంద్రునకు బృహస్పతి ఉపదేశించెను. విజయ ప్రదమగు దానిస్వరూపము చెప్పెదను. వినుము. “నాకు తూర్పున చక్రధారియగు విష్ణువు, దక్షిణమున గదాధారియగు విష్ణువు, ఉత్తరమున ఖడ్గ ధారియగు విష్ణువు ప్రకాశించుచున్నాడు. విదిశలందు హృషీ కేశడు, వాటి మధ్యలందు జనార్దనుడు, భూమియందు, వరాహరూపధారియగు హరి, ఆకాశమున నరసింహుడు వుండి నన్ను రక్షించుచున్నారు. చివర క్షరములువున్న నిర్మల మగు ఈ సుదర్శన చక్రను తిరుగుచున్నది. ఇది ప్రేతను రాక్షసులను చంపుచు వెళ్లినపుడు దీనికిరణములవై పు ఎవ్వరును చూడజాలరు సహస్రర్చులు గల ప్రజ్వలించుచున్న అగ్నితో సమానమైన ఈ గదరక్షో, భూత, పిశాచ ములను నశింపచేయును. వాసుదేవుని, శార్ణ ఓంకారధ్వని నా శత్రువులను తిర్యక్, మనుష్య, కూష్మాండ , ప్రేతా దులను, పూర్తిగా నశింపచేయుగాక ! శ్రీ మహావిష్ణువు యొక్క ఖడ్గధార యొక్క, ఉజ్జ్వలమగు వెన్నెలలోస్నానము చేసిన నా శత్రువులు, గరుత్మంతునిచే సర్పములవలె వెంటనేశమింతురుగాక”:

యే కూష్మాండా స్తథా యక్షాయే దై త్యాయే నిశాచరాః

ప్రేతావినాయకాః క్రూరా మనుష్యా జంభ గాఃఖగాః.

 సింహాదయశ్చ పశవో దంద శూకాశ్చ పన్న గాః

సర్వేభవన్తుతే సౌమ్యాః కృష్ణశంఖర వాహతాః.

 చిత్తవృత్తి హరాయేమే యేజనాః స్మృతి హారకాః

బలౌజసాంచ హర్తార శ్చా యావి భ్రంశ కొశ్చయే. 

యే చోపభోగ హర్తారో యేచ లక్షణ నాశ కాః

 కూష్మాండానే ప్రణశ్యన్తు విష్ణుచక్ర రవాహతాః.

 బుద్దిస్వాస్థ్యం మనః స్వాస్థ్వం స్వాస్థ్య మైంద్రియకంతథా

మమాస్తు దేవ దేవస్య వాసుదేవస్య కీర్తనాత్.

పృష్ఠే పురపాన్మమ దక్షిణోత్తరే వికోణతశ్చాస్తు జనార్ధనో హరిః

తమీడ్య మీశాన మనంత మచ్యుతం జనార్ధనం ప్రణిపతితోన సీదతి.

యథా పరం బ్రహ్మ హరి స్తథాపరో జగత్పరూపశ్చ సఏవ కేశవః

సతేన తేనాచ్యుత నామ కీర్తనాత్ప్రాణాశ యేత్తు త్రివిధ మమాశుభమ్.

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే విష్ణుపంజరం నామ సప్తత్యధిక ద్విశతతమోధ్యాయః.

“కూష్మాండ, యశ, రాక్షస, ప్రేత, వినాయక, క్రూరమనుష్య, క్రూరపక్షి, సింహాదులును, సర్పాదు లును, విష్ణువుయొక్క శంఖరవముచేకొట్టబడినవై సౌమ్యత్వమును పొందుగాక! నాచిత్త వృత్తిని స్మరణ శక్తిని ఆప హరించువారును, సౌబల తేజస్సులు నశింపచేయువారును నాకాంతిని తగ్గించువారును, భోగ ములను హరించువారును, శుభ లక్షణములను నశింపచేయువారును అగు కూష్మాండులు విష్ణు చక్రహతులై నశింతురుగాక  దేవదేవుడై న వాసుదేవుని, సంకీర్తనముచే నామనో బుద్ధి, ఇంద్రియములకు, స్వాస్యము లభించుగాక  నా వెనుకను ఎదుటను, యేడమ ప్రక్కను వేదశాఖాది కీర్తనమ్ కోణ దిశలందును అంతటను జనార్ధనుడగు హరి ఉండుగాక ! సర్వ పూజనీయుడును, ఎన్నటికిని చ్యుతుడు. కాని వాడును, అనంతరూపుడును, పరమేశ్వరుడును, అగు జనార్ధనుని పాదములకు నమస్కరించువాడు ఎన్నడును దుఃఖితుడు కాడు. శ్రీ హరి పరమాత్మయై నట్లే ఆ కేశవుడు జగత్స్వరూపుడు కూడ. ఈ సత్యము యొక్క ప్రభావముచేతను, అచ్యుతునినామ సంకీర్తనముచేతను, స్త్రీ విధపాపములు నశించుగాక.!

ఆగ్ని మహాపురాణమునందు విష్ణుపంజరమను రెండువందల డెబ్బదవ అధ్యాయము సమాప్తము.