అగ్ని రువాచః-
ఏవం సంధ్యావిధింకృత్వా గాయత్రీం చ జపేత్స్మ రేత్ ।
గాయత్ర్ఛిష్యాన్యతస్త్రాయేద్భార్యాం ప్రాణాం స్తథైవ చ.
తతః స్మృతేయం గాయత్రీ సావిత్రీయం తతోయతః ।
ప్రకాశ నాత్సా సవితుర్వా గ్రూపత్వాత్సరస్వతీ.
తజ్జ్యోతిః పరమం బ్రహ్మ భర్గస్తేజోయతః స్మృతమ్ ।
భా దీప్తా వితి రూపం హి భ్రస్జ పాకేఽథ తత్స్మృతమ్.
ఓషధ్యాదికం పచతి భ్రాజృ దీప్తౌ తథా భవేత్ ।
భర్గః స్యాద్భ్రాజత ఇతి బహలం ఛంద ఈరితమ్.
వరేణ్యం సర్వతేజోభ్యః శ్రేష్ఠం వై పరమం పదమ్ ।
స్వర్గాపవర్గ కామైర్వా వరణీయం సదైవ హి.
వృణోతేర్వరణార్థత్వాజ్జాగ్రత్స్వప్నా ది వర్జితమ్ ।
నిత్యశుద్ద బుద్దమేకం సత్యం తం ధీమహీశ్వరమ్.
ఆహం బ్రహ్మపరం జ్యోతిర్ద్యాయేమహి విముక్తయే ।
తజ్జ్యోతిర్భగవాన్విష్ణుర్జగజ్జన్మాది కారణమ్.
శివం కేచిత్పఠంతిస్మ శ క్తిరూపం పఠంతి చ ।
కేచిత్సూర్వం కేచిదగ్నిం వేదగా ఆగ్ని హోత్రిణః.
అగ్న్యాదిరూపే విష్ణుర్హి వేదాదౌ బ్రహ్మ గీయతే ।
తత్పదం పరం విష్ణోర్దేవస్య సవితుః స్మృతమ్.
మహదాజ్యం సూయతే హి స్వయం జ్యోతిర్హరిః ప్రభుః ।
పర్జన్యో వాయురాదిత్యః శీతోష్ణాద్యైశ్చ పాచయేత్ .
అగ్నౌ ప్రాస్తాహుతిః సమ్యగాదిత్యముపతిష్ఠతే ।
ఆదిత్యాజ్జాయతే వృష్టిర్ వృష్టేరన్నం తతః ప్రజాః.
దధాతేర్వా ధీమహీతి మనసా ధారయేమహి ।
నోఽస్మాకం యశ్చభర్గశ్ఛ సర్వేషాం ప్రాణినాంధియః.
చోదయాత్ప్రేరయేద్బుద్ధీర్భోక్తౄణాం సర్వకర్మసు ।
దృష్టాదృష్టవిపా కేషు విష్ణు సూర్యాగ్ని రూపవాన్.
ఈశ్వర ప్రేరితో గచ్ఛేత్స్వర్గం వా శ్వభ్రమేవ వా ।
ఈశావాస్యమిదం సర్వం మహదాది జగద్దరిః.
స్వర్గాద్యైః క్రీడతే దేవో యోఽహం స పురుషః ప్రభుః ।
ఆదిత్యా న్తర్గతం యచ్చ భర్గాఖ్యం వై ముముక్షుభిః.
జన్మమృత్యు వినాశాయ దుఃఖస్య త్రివిధస్యచ ।
ధ్యానేన పురుషోఽయంచ ద్రష్టవ్యః సూర్యమండలే.
తత్త్వం సదపి చిద్బ్రహ్మ విష్ణోర్యత్పరమం పదమ్।
దేవస్య సవితుర్భర్గో వరేణ్యం హి తురీయకమ్.
దేహాది జాగ్రదాబ్రహ్మ అహం బ్రహ్మేతి ధీమహి ।
యోఽసావాదిత్యపురుషః సోఽసావహమన న్త ఓమ్.
జ్ఞానాని శుభకర్మాదీన్ప్రవర్తయతి యః సదా.
ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే గాయత్రీ నిర్వాణం నామ షోడశాధిక ద్విశతతమోధ్యాయః.
ఆగ్ని దేవుడు చెప్పెను : ఈ విధముగ సంధ్యావందనమాచరించి గాయత్రీధ్యాన జపములు చేయవలెను. తనను గానముచేయు సాధకుని శరీరప్రాణములను రక్షించునదిగాన ‘గాయత్రి’ అను పేరు వచ్చినది. ఆది సవిత (సూర్యుడు) నుండి ఆవిర్భవించినది గాన “సావిత్రి” యైనది. వాక్స్వరూపమగుటచే “సరస్వతి” ఆని ప్రసిద్ది కూడ వచ్చినది. “తత్” అనగా జ్యోతిఃస్వరూపమగు పరబ్రహ్మ. “భర్గః” అనగా తేజస్సు. దీప్తి అను అర్థముగల “భా” ధాతువునుండి “భర్గః” శబ్దము నిష్పన్న మైనది. “భాతీతిభర్గః” అని దీని వ్యుత్పత్యర్ధము. లేదా “భ్రస్జ-పాకే” అను పాకముచేయుట ఆను అర్థముకల భ్రస్థధాతువునుండి కూడ “భర్గః” శబ్దము నిష్పన్నమగును. ఏలనన సూర్యుడు ఓషధ్యాదులను పక్వము చేయునుగదా? “భ్రాజృ” అను ధాతువునకు కూడ ప్రకాశించుట అని అర్థము. కావున “భ్రాజతే ఇతిభర్గః” అను వ్యుత్పత్తి ననుసరించి గ్రాజధాతువునుండి గూడ “భర్గః” శబ్దము విష్పన్నమగును. “బహులం ఛన్దసి” అను వ్యాకరణ సూత్రానుసారము ఈ పదము పైన చెప్పిన ఏ ధాతువునుండి యైనను నిష్పన్నము కావచ్చును. “వరేణ్య” శబ్దమునకు “సంపూర్ణతేజస్సుతో శ్రేష్టమైన పర మపద స్వరూపము” అని అర్థము. లేదా స్వర్గమోక్షములను కోరువారిచే సర్వదా వరింపబడుటచే “వరేణ్యము”. “వృఞ్” ధాతువునకు వరించుట అని అర్థము. “ధీమహి” ఆనుపదమునకు___ “జాగ్రత్స్వప్న సుషుప్త్యాద్యవస్థాతీతము, నిత్యము, శుద్దము, బుద్దము, ఏకమాత్రము, సత్యము, జ్యోతిస్వరూపము అగు పర బ్రహ్మను ముక్తికొరకై ధ్యానించుచున్నాము” అని అర్థము. జగత్సృష్ట్యాది కారణభూతుడగు శ్రీమహావిష్ణువే ఆపర జ్యోతి. అపర జ్యోతి శివుడని కొందరు, శ క్తిని కొందరు, సూర్యుడని కొందరు, ఆగ్నియని వేదజ్ఞులైన ఆగ్ని హోత్రులు చెప్పుదురు. వాస్తవమున ఆఙ్న్యాదిరూపమున నున్న విష్ణువే వేదవేదాంగములందు బ్రహ్మయని చెప్పబడినాడు. అందుచే “దేవస్య సవితుః” అనగా జగ ద్పదకుడగు శ్రీమహావిష్ణవే. అతడే పరమపదము. స్వయంజ్యోతిస్వరూపుడగు శ్రీమహావిష్ణువు మహత్తత్వాడిక ములను సృష్టించుచున్నాడు. పర్జన్య - వాయు - ఆదిత్యులద్వారా, శీతగ్రీష్మాది ఋతువులద్వారా అన్నము పోషించుచున్నాడు. యథావిధిగ అగ్నిలో సమర్పింపబడిన ఆహుతి సూర్యునివలన వర్షము వర్షమువలన అన్నము కలుగును. అన్న మువలన ప్రజలు ఉత్పన్ను లగుదురు. “ధీమహి” అను పదము “డు-ధాఞ్” అను ధాతువునుండి కూడ నిష్పన్నమగును. అందుచే “మేము ఆతేజస్సును మనస్సుతో ధారణ చేయుచున్నాము” అని కూడ అర్థము చెప్పవచ్చును. యః= పరమాత్ముడైన యే విష్ణువు యొక్క తేజము, వః = మనల అందదియొక్క, ధియః= బుద్ధివృత్తులను, ప్రచోదయాత్ =ప్రేరేపించునో, కర్మఫలములను అనుభవించు సకలప్రాణాల ప్రత్యక్ష - అప్రత్యక్ష పరిణామహేతువులగు సమస్త కర్మలందును విష్ణు - సూర్య - ఆగ్నిరూపమున ఉనాడు. ఈశ్వర పేరణానుసారమే ప్రాణులు శుభాశుభ కర్మలను చేసి స్వర్గనరకములకు పోవుచున్నారు. మహత్తత్త్వాది రూపములతో శ్రీమహావిష్ణువుచే నిర్మిత మగు ఈ జగత్తు ఆంతయు ఈశ్వరుని నివాసస్థానము. సర్వసమర్థుడు, హంసస్వరూపుడు అగు ఆ పరమవుషుడు స్వర్గాదిలోకముల క్రీడించుచుండును గాన “దేవుడు” అని చెప్పబడుచున్నాడు. భర్గమను పేరుతో ప్రసిద్ధమైన ఆదిత్యగత మగు దివ్యతేజమే అతని స్వరూపము. మోక్షము కోరువారు జన్మ మరణములనుండియు, ఆధ్యాత్మిక - ఆధిదైవిక - ఆధిభౌతికములను త్రివిధదుఃఖములనుండి విము విముక్తిపొందుటకై ధ్యానముచే, సూర్యమండలమునందున్న ఈ పర మపురుషునే చూడవలెను. “తత్త్వమసి” మొదలగు మహావాక్యములచే ప్రతిపాదింపబడిన సచ్చిత్స్వరూప పరబ్రహ్మము అదియే. సర్వలోక నిర్మాతయైన సవితృదేవుని సర్వవరణీయ మైన భర్గమే శ్రీమహా విష్ణుపదము. అదియే గాయత్రీయొక్క బ్రహ్మ రూపమగు చతుర్లపాదము. “జాగ్రదావస్థకు సంబంధించిన దేహాదిబ్రహ్మపర్యంతము నేనే” అని ధ్యానింతుము. అదిత్యు నిలో ఉన్న పరమపురుషుడు నేనే. అనంతరూపమగు ఓంకారము నేనే. ఈ ఆదిత్యపురుషుడే జ్ఞానములను శుభకర్మాదులను సర్వదా ప్రవర్తింపచేయుచున్నాడు.
శ్రీమదగ్ని మహాపురాణముండు గాయత్రీనిర్వాణ మను రెండువందలపదునారవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 216 of the Agni Mahā Purana is as follows:
This chapter presents the worship of Sūrya, the visible divinity who sustains all life. The Gāyatrī mantra and its derivation from the Ṛgveda are explained, along with the proper sandhyā-vandana procedure for the three daily twilights. Agni describes the twelve Āditya forms corresponding to the twelve months and their individual mantras. The aṣṭa-dravya arghya — water, sesame, red flowers, red sandal, kuśa grass, akṣata, and dūrvā — offered at sunrise is prescribed as the foremost act of Sūrya worship.